ఆరుద్ర మరో పార్స్వ్యం
సినీ వాలి
ఆరుద్ర వచన కావ్యాలలో పేరు పొందింది ”సినీ వాలి ”ఆంటే అమావాశ్య ముందు కన్పించే ”చంద్ర రేఖ ”.పార్వతీ దేవికి కూడా ఆ పేరుంది .ఎంత కటిక చీకటి ముందు వున్నా ,ఆశా కిరణం తోడు వుంటుంది ,నిరాశ పనికి రాదనీ ఇందులోని ధ్వని .ఈ పేరు ఈ కావ్యానికి పెట్టి సార్ధకం చేసిన వారు ప్రముఖ కవి కాటూరి వెంకటేశ్వర రావు గారు .ఆధునిక కవిత్వానికి మూల వస్తువూ ,స్ఫూర్తీ ఆర్తీ అన్ని తనే అయిన వాడు ,మనిషిని ,అతని వ్యధను యుగయుగాల పీడనను ,వచ్చే యుగం పట్ల ఆశను ,ఆకాంక్షను ,తన కవితా దృష్టి లో ప్రతిఫలింప జేయటం ఆరుద్ర ఆనవాయితీ .అందుకే ప్రయోజన వాది గా గుర్తింపబడ్డాడు .అభ్యుదయం అతని వాదం .మనిషే అతని నాయకుడు .అనుభూతి తో పాటు ,ఆలోచన వైపు మనిషినీ ,patha కుడినీ నడిపించిన మహా కవి . ..సినీ వాలి నగర జీవితం పై వ్రాసిన గేయ కావ్యం ..విలక్షణ హీరో జగ్గయ్యకు అంకితమిచ్చి మామ అయాడు .మధ్య తరగతి క్లార్కు సూర్యారావు జీవిత చిత్రమే ఇది .కాంక్రీటు అరణ్యాలు అయిన నగర ఘోష ..
ప్రక్రియా వైవిధ్యం
——————–
” ఇంటింటి పద్యాలు ”రాసి ప్రతి ఇంట్లో పాడుకోనేట్లు చేశాడు ఆరుద్ర .”గాయాలు -గేయాలు ”రాసి మనసు లోని బాధను వెళ్ళ గక్కాడు ..”విశ్వ నాద నాయకుడు ”చరిత్రను నాటకం గా మలిచాడు .అందరు స్త్రీ పాత్రలే వుండే నాటికలు రాశాడు .”ఆరుద్ర నాటికలు ”పరమ ప్రయోజనం కోసమే రాశాడు .అవి కాలక్షేపం బఠానీలు కావు .”సర్రియలిస్ట్ ”కవిగా రాణ పొందాడు కధకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు .”నేను చెప్పానుగా ”అనే కదా సంపుటి తెచ్చాడు .దేశీయ ఛందస్సు లో ‘కూనలమ్మ పదాలు ” ”రాసి అందర్నీ కొరడాతో ఝళిపించాడు .”పైలా పచ్చీసులు ”తో పరవళ్ళు తొక్కాడు .”వెన్నెల -వేసవి-”లతో చల్లదనం ,చంద్ర గాడ్పులు విసిరాడు .”అచ్చు తప్పులు ”రాసి కొత్త వరవడి సృష్టించాడు .ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి .”కొండంత మనిషి చ (క) నుమరుగైనాడు ”
”anthropology ”, ప్రీ హిస్టరీ వ్రాసి పాత చరిత్రను తవ్వి తలకెత్తాడు .”ఆరుద్ర గళ్ళ నుడికట్టు ”సాహితీ ప్రియులకు గొప్ప కని కట్టు గా వుండేది .”స్థల నామాలు ”పై తీవ్ర పరిశోధన చేశాడు .”వ్యాస పీఠం ”రాసి ఆధునిక వ్యాసుడే అయాడు .”detective ”సాహిత్యం సృస్తించి ,నేర పరిశోధన లో కొత్త దనం ప్రవేశ పెట్టాడు .జర్నలిస్ట్ గా పత్రికా సేవ కూడా చేశాడు .”సమగ్రాంధ్ర చరిత్ర ”తో ఆరుద్ర సాహితీ విశ్వ రూపం మనకు దర్శన మిస్తుంది .అంతకు ముందే ”త్వమే వాహం ”కావ్యాన్ని తెలంగాణ నేపధ్యం లో రాశాడు .ఇది symbolic రచన .చదరంగం మీద ప్రత్యెక అభిమానం వుంది దాని లోతులు తరిచి పుస్తకం రాశాడు .’ఇంత విస్త్రు తం గా వైవిధ్యం గా తన సాహితీ జేవితాన్ని పండించు కొన్నాడు భాగవతుల సదా శివ శంకర శాస్త్రి అయిన ఆరుద్ర ..సిని పాటల మాటల రచయిత గా శ్రీ శ్రీ తో పాటు నిలబడ్డాడు .డబ్బింగ్ రచయిత గా మామకు తగ్గ అల్లుడని పించు కున్నాడు . తాను చే బట్టిన ప్రతి ప్రక్రియను సర్వాంగ సుందరం చేసి భళా అనిపించుకున్న ఆరుద్రను గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే వుంటుంది ..మరిన్ని విశేషాలు మరోసారి .
మీ
దుర్గా ప్రసాద్

