ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” —————————————————————–
కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73 మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .౭+౩=10 సంఖ్యా శాస్త్రం లో. వందా పూర్తి అయినట్లే . శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ నామం .శంకర శాస్త్రి శివ నామం ..మేన మామ ,మేనల్లుడు విష్ణు ,శివ రూపాలుగా వెలిగి ,”త్వమే వాహం”ఆంటే నువ్వే నేను అనిపించుకున్నారు .బాంధవ్యం ,స్నేహం ,అపూర్వం .శ్రీ శ్రీ తర్వాతా పేర్కొనదగిన స్థాయి సంపాదించి ఆరుద్ర మామకుతగ్గ అల్లుడైనాడు .మహా ప్రస్తానం తర్వాత పేర్కొన దగిన రచన ”త్వమేవాహం ”.ఆధునిక మహా కావ్య త్రయం లో త్వమేవాహం ఒకటి .మొదట్లో శ్రీ రంగం నారాయణ బాబు ,శ్రీ శ్రీ పురిపండా ,పఠాభి ల ప్రభావం బాగా వున్నా ,క్రమం గా అందులోంచి జారి ,స్వంత గొంతుక తో ,స్వీయ వ్యక్తిత్వం తో ,మహాకవుల స్థాయికి ఎదిగిన వాడు ఆరుద్ర తెలంగాణా నేపధ్యం గా ”త్వమేవాహం ”రాశాడు ఆరుద్ర . యే నాటి తెలం గాణా కాదు .పొరపడ కండి .నిజాం నిరంకుశత్వాన్ని నిర్భయం గా ప్రత్యక్షర శిల్పం గా మలిచాడు .పొట్టి వాడినా గట్టివాడైన దాశారదికి తోడై ,గట్టిగా గళం విప్పాడు .ఇదొక సింబాలిక్ రచన .టి ఎస్ .ఇలియట్ రాసిన వేస్ట్ లాండ్ లోని లక్షణాలన్నీ నిక్షిప్తం చేసి ”,ఆంద్ర ఇలియట్ ”అనిపించు కున్నాడు .అయితే దీనికి టీకా ,టిప్పణి ఉంటేనే బోధ పడుతుంది .అందుకే మొదటి ప్రచురణ జన రంజకం కాలేదు .తర్వాత దాశరధి తో చక్కని ఉపోద్ఘాతం రాయించి ప్రచురించాడు .అతడు నిజం గా ఆరుద్ర హృదయాన్ని అద్భుతం గా ఆవిష్కా రించాడు .readability కలిగించాడు .అప్పటి నుంచే త్వమేవాహం పాథక హస్తాలను ,మస్తకాలను అలంకర్న్చింది .oft quoted lines కు జీవం పోసింది .హరీన్డ్ర్స నాథ చట్టోపాధ్యాయ రాసిన ”తెలంగాణా విప్లవ గాధలు ” ఆరుద్ర త్వమేవాహం కు ప్రేరణ .దీన్ని ఆరు కధలుగా కూర్చి కదా కావ్యం చేశాడు .ఈ ప్రక్రియ లో ఇదే మొదటిది ఆరుద్ర మౌలికం గా ప్రయోగ వాది .ఆవేశం కంటే ఆలోచనతో కవిత్వం రాస్తాడు .చమత్కారం ,శబ్దాలంకారం ,భావ వ్యక్తీకరణకు తోడ్పడేతట్లు రాయటం ఆయన ప్రత్యేకత .ఖండ కావ్యాన్ని కదా సూత్రం తో బంధించి ,పెద్ద కావ్యం గా ప్రయోగం గా రాశాడు .అభ్యుదయ కవితా చైతన్యాన్ని మరో మలుపు తిప్పాడు .”technic లేని కవిత్వాన్ని నేను ఊహించలేను ”అంటాడు .అయితే ”ఆరుద్ర కవిత్వం టెక్నిక్ లో కూరుకు పోయింది ”అన్న వాళ్ళూ వున్నారు . ”ట్రెయిన్ లో స్టీన్ గన్ .లా చెట్లు ,చిట్టెలుకలు —-చేయిన్సులో మగాళ్ళు -చెరచ బడ్డ ఆడాళ్ళు —చెడ పురుగులు –మదమెక్కిన సోల్జర్లు ”అనటం ఆరుద్ర మార్కు కవిత్వం . పైథాగరస్ సిద్ధాంతాన్ని చక్కగా కవిత్వీకరించాడు ”.చిన్ని చీమలు వగైరా అడుగు భుజం అనుకోండి —బలవంత మైన సర్పం -గట్రా ఎట్ సేటేరా -లంబం అవదా మరి ?–రెండు విభిన భుజాలపై గల చతురశ్రాలలోని తమిశ్రం –థీసీస్ ,యాంటి థీసీస్ సుల మిశ్రమ -రెండు భిన్న పక్ష సంజ్ఞల పోరాటం –అనగా ఒక నూతన వ్యవస్థ ” ఆరుద్ర కవిత్వం చదివి ”ఇంకా నేను కవిత్వం మానేసినా ఫర్వాలేదు ”అని కితాబు ఇచ్చాడు శ్రీ శ్రీ తన ముద్దుల మేనల్లుడికి .ఆంగ్లం లోని క్రియ ను తెలుగు లో కూడా వెర్బ్ గా చేసి ప్రయోగించాడు . చెరిష్+ఇంచు=చరిషించు అనీ రన్ +అండి ==రనండి ,అలాగే ఆమెన్ -ఆమెన్ ఒక చోట మెన్ అనీ ఇంకోచోట ఆమె అనీ శ్లేష . గతం లోని మంచి ద్వారా వర్త మానం తీర్చి దిద్ది ,భవిష్యత్తు పై ద్రుష్టి కేంద్రీకరించిన ప్రతిభా మూర్తి ఆరుద్ర అందుకే శ్రీ శ్రీ అంటాడు సాహిత్యోపనిషత్ లో ” చూశావా ఆరుద్రా !సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా –మూడ్హాచారాలు మారుతూన్తున్నాయి నిజం -కాని –సంప్రదాయం తాత ముత్తాతల ధనం -జాతికి జీవ నాళిక —జాన పద గీతిక ” .ఇదే మహా కవుల జంట ద్రుష్టి తెలుగు సాహిత్యాకాశం లో శ్రీ శ్రీ ,ఆరుద్రలు సూర్య చంద్రులు . .. ఈ వరుసలో చివరి భాగం రేపు మీ దుర్గా ప్రసాద్


చాలా బావుంది. త్వమేవాహం చాలా ఎంజాయ్ చేశాను.
LikeLike