స్వర్గీయ ఏం.ఎస్ సుబ్బు లక్ష్మి కి ”స్మృతి గీతం ”
———————————————————-
తన గానాన్ని భగవదర్పితం చేసి ,స్వర రాగ రంజితం తో ప్రపంచాన్ని పరవశింప జేసి ,మధుర ,మంజుల గాత్రం తో సమ్మోహన పరచి ,భారత దేశానికి సాంస్కృతిక రాయ బారి గా నిలిచి భారత రత్నమైన సంగీత రత్నం స్వర్గీయ ఏం.ఎస్ .సుబ్బు లక్ష్మి .ఆమె పరమ పదించినా ఆ పద మంజీరాలు వినిపిస్తూనే వున్నాయి .సంగీత రసజ్ఞుల హృదయాలలో శాశ్వతం గా నిలచిన ఆ సంగీత మహా సామ్రాజ్ఞి మరణించటం జీర్ణించు కో లేని అభిమానులు ,ఆమె స్వంత రాష్ట్రం లో కూడా చేయ లేని అపూర్వ స్మృతి గీతం ను ప్రచురించి ,సహృదయ స్పందనను ,అభిమానులకు అందించారు .ఇందులో ముఖ్య పాత్ర దారి ,కృష్ణా జిల్లా విస్సన్న పేట వాస్తవుడు ,ఆకునూరు వారి అల్లుడు ,నాగార్జున సాగర్ లో ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో ఆఫీసు superintendent శ్రీ లకుమా అని పిలువ బడే బూదేస్వర రావు .నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చి ఆ పుస్త కాన్ని నాకు ఇచ్చారు .ఆయన మంచి కవి ,”రజనీ- కుందుర్తి అవార్డు ”గ్రహీత .సుబ్బు లక్ష్మి ఫౌండేషన్ స్థాపకులు కూడా .ఆమె 95 వ జయంతి జూలై లో వస్తోంది .ఆ నాడు సమగ్ర మైన సుబ్బు లక్ష్మి జీవిత చరిత్రను వెలువరించే పనిలో వున్నట్లు చెప్పారు లకుమ ను .హార్ధికం గా అభినందించాను .అంతే కాదు షహనాయి మాస్ట్రో ,భారత రత్న బిస్మిల్లా ఖాన్ స్మృతి గీతం కూడా త్వరలో రాబోతోందని మంచి కబురు తెలియ జేశారు .వారి అకుమ్తిట దీక్షకు ,కార్య దక్షతకు అభినందన శతం .
ఇప్పుడు ”స్మృతి గీతం ”;;లోని విశేషాలను తెలియ జేస్తాను .భారతీయ మూర్తి మత్వాన్ని తన నడకలో ,ఆహార్యం లో ,స్వర ,రాగ గానం లో మేలవించుకొని చూడం గానే రెండు చేతులు ఎత్తి మనసార నమస్కరించాలనే భావన కలుగుతుంది .భారతేయ మహిళా స్వరూపానికి ఆమె నిలు వెత్తు అద్దం ‘.ఈ భావాన్ని ప్రతిబింబించే చక్కని చిత్రాలు ఈ పుస్తకం లో పొందు పరిచి అందరికే ఆనందం కల్గించారు .ఆమె మరణానికి బాష్పాంజలి ఘటించిన వారి కవితలు మనో భావాలు ఇందులో పొందు పరిచారు .ముందున్న ముఖ చిత్రం లో ఆమె తన్మయ స్థితి లో పాడుతున్న అద్భుత రంగుల ఫోటో చిరస్మరణీయం గా వుంది .చివరి ముఖ చిత్రం రెండు చేతులు కలిపి నమస్కరిస్తున్న ఫోటో” గానానికి, లోకానికి ఇంక సెలవు ”,అన్న భావన కలిగించి కన్ను చెమరిస్తుంది .లకుమ గారి ఎడిటింగ్ కు అభినందనలు .
మాజీ రాష్ట్ర పతి ,యువజన స్ఫూర్తి దాత భారత రత్న అబ్దుల్ కలాం సుబ్బు లక్ష్మి ని స్మరిస్తూ ఆమె వషంత యామిని అనీ ,అలనాటి తాన్సేన్ ను స్ఫురణకు తెచ్చిందని అంటారు .ఆమె కాల పురుషుడు బహూకరించిన కమనీయ బహుమతి అని కీర్తించారు .సర్వేశ్వరున్నే సంగీతం తో విభ్రం చెందించిన విదుషి అని మన సార ”గీతాంజలి ”గేయం లో అభి వర్ణించి ,నివాళు లర్పించారు .
ప్రతి భార్య వెనక ఒక భర్త ఉంటాడని ,ఆమె అభ్యుదయానికి సకల సహకారాలు అందించిన ఆమె భర్త” కల్కి ”అనే సదాశివం గారిని ప్రస్తుతించారు లకుమ
.”ఆమె పాడక పోతే దేవుళ్ళకు కూడా తెల్ల వారదు ”అన్న గీతం లో ఈ భావాన్ని అత్యద్భుతం గా పలికించారు .ఆమెను” మెలోడి సబ్ lime ”అన్నారు .తనకి తనే కాదు మనలోకీ తొంగి చూడ గల కమనీయ స్వరం అని .సంగీతాని ఊగించి ,శాసించి పాలించగల అసామాన్య ప్రావీణ్యం వున్న మహా విద్వాంశు రాలని మెచ్చారు .”బతుకు డొల్లను పూరించే స’జీవ’స్వరం అనటం ఆయనకే చెల్లింది ”నేను సుబ్బు లక్ష్మి సమకాలికున్ని ”అనే ఒకే ఒక్క వాక్యం తో దేవుణ్ణి గెలిచాను అని లకుమ మినీ కవితలో మెగా భావాన్ని పోదిగాడు .
డాక్టర్ భూసుర పల్లి వెంకటేశ్వర్లు ”friend of pleasure ”కవితలో ఏం.ఎస్ ను రాధ చేతి లోంచి ద్వాపరం లో జారి పోయిన వేణువు అని ,ఆమె లేని ప్రపంచం పక్షు లేగిరి పోయిన గూడు లా వుందని ,ఆమె ఆధునిక మీరా అని భక్తి భావంతో అంజలి ఘటించారు .నన్నపనేని రాజకుమారి ఆమెను ”సంప్రదాయ మూర్తి నీవు ,సంగీత సామ్రాజ్య కీర్తి నీవు ”అని చెమ్మగిల్లిన కన్నులతోఅంటారు ”.గళ దేవత ” కవితలో చిల్లర భవానీ దేవి ”ఉదాత్త మృదు మధుర భక్తీ సంకేతాన్ని –నాద మయం గా దర్శనం చేయిన్చిందనీ ,ప్రతి ఇంటి సుప్రభాతం గా వెలిగిందనీ , మానవతా సంగీతాన్ని విన్పించిన మనస్విని అని హృదయ పూర్వక నివాళు లందించి భవానీ మాత గా ఈ జాతి అంతా ఆమెకు రునగ్రస్త శ్రోతలే నని మన రుణాన్ని గుర్తు చేయటం తో పాటు శిరసు వంచి జోతలర్పించారు .
”జ్ఞాన రస సంగీత కర్మిని ”అని లలిత సంగీత మధుర వాణి అని ,శ్రవణ పేయ అమేయ రసధుని అని ధ్వని తరంగాల రస రాణి అంటూ ఆమె మరణ వార్తకు సంగీత వల్లి తల్లడిల్లిందని కలత చెందారు కానూరి వెంకటేశ్వర రావు .నటుడు ఏ .వి ఎస్ ”సదా వెంకటేశం స్వరామి స్వరామి ”వచన రచనలో ”నా దేశం సంగెత భారత ప్రధానిని కోల్పోయింది .ఏం అనే మాధుర్యాన్ని ,ఎస్ అనే సుస్వరాన్ని ఆమె ఇంటి పేరు గా మార్చుకొంది .మా కోసం మళ్ళీ రా అమ్మా . నువ్వొస్తే దేవతలంతా వస్తారు .నువ్వు కావాలి నీ పాట కావాలి .అందుకోసం మా మనో శ్వేత పత్రాలపై నూరు కోట్ల చే వ్రాల్లతో దేవతలకు దరఖాస్తు చేసు కుంటాం .నా దేశం లో వో కాశ్మీరం ,వో స్వర్ణ దేవాలయం ,వో తిరుపతి క్షేత్రం ,వో సుబ్బు లక్ష్మి గాత్రం ”మాత్రమే వున్నాయని ఆమెకు భారతీయులకు వున్న సంగీత స్మరణీయ వైభవ సత్ సంబంధాన్ని స్పష్టంగా తన శైలి లో చెప్పారు ఏ ,వి ఎస్ .
”నిద్ర లేచిన దేవుడు సైతం –తలచుకొనే తొలి నామం ఏం .ఎస్ అని ,ఇప్పుడు కచ్చేరీలలో ”కల్యాణి ”విన్పించటం లేదని ,హృదయ లిపి లో ఒక గీతం శోక మూర్చనలు పోతూ తాళం వేస్తోందని ”తొలి నామం ”లో ఈత కోట సుబ్బా రావు బాధా తప్త హృదయం తో ఆవేదన చెందారు .మొహమ్మద్ ఖాదర్ ఖాన్ ”పునరపి జననం పునరపి మరణం –పదే పదే పాడే నీ పాట కోసం నువ్వు మళ్ళీ వెంటనే రావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శోకిస్తున్నాం తల్లీ ”అని ఆమెను పునః జన్మించమని వేడు కొన్నారు .స్వరాలమ్మ అని ఎల్ కే సుధాకర్ ఆంటే అమరగాన సరస్వతి అని ఏం వి అప్పారావు అన్నారు యి రఘు ”మల్లె పూలు ,మట్టి గాజులు ”కవితలో ఆమెకు అవే ఇష్టమని ,అసలైన మట్టి మనిషని మెచ్చారు ,.కవి ,రచయిత నట దర్శకుడు భరణి ”ఆమె భారత ధాత్రి గౌరవ పతాకాన్ని –భూగోళం మీద పాతిన త్రివర్ణ గాత్రి –ఆమె సాక్షాత్తు వర వీణా మృదు పాణి ” అని సంగీత స్వరార్చనతో ఘన నివాళు లిచ్చారు . ”ఆమె పాటలపూదోట లో పూచిన ముకుందమాల -నిత్య నూతనం గా గుబాలిస్తుందని భక్తి కుముద మాల వేసారు . ”పాటల పాల వెల్లి ” లో ప్రముఖ కవి శిఖామణి . .”సాధన చేసి చేసి -పరమపద సోపానానికి –చివరికి —గొంతునే సాధనం గా మలచుకున్దామే ” అంటూ ఆమె పాట ఆపాత మధురం -అజరామరం -వెన్నెల కోయిల మల్లె పూవు పసిపిల్లల నవ్వు ఉన్నంత కాలమ్ అని మురిసి పోయారు అక్షర మణి నీరాజనమందించారు శిఖా మణి .ప్రఖ్యాత సితార్ విద్వాంశుడు రవి శంకర్ తనకు తెలిసిన ఆమెను స్మరిస్తూ అహంభావం లేనిదని ,వినయ విధేయతలు ఆమె ఆభారణాలని .సంగీతాన్ని ఆమె లాగా ఆధ్యాత్మిక స్థితి కి తీసుకు వెళ్ళ గలిగిన సంగీతజ్ఞుడు తనకు ఇంత వరకు తారస పడ లేదని ,ఆమె దైవత్వం మూర్తీభవించిన సంగీత విద్వన్మని అన్నారు .భర్త చేసే దాన ధర్మాలను చూసి ఆయన్ను సదా” గివం” –ఆంటే ఎప్పుడూ ఏదో ఒకటి అవతలి వారికి ఇచ్చే వాడు అనే వారట సరదాగా . .అమెది అన్ని శైలుల కంటే అతీత మైనదని గళం నిజంగా అద్వితీయమిందని ,చాలా లోతు గా పరిశుద్ధమైన భావోద్వేగం తో నిండి ఉంటుందని నిండు మనసుతో స్మృత్యంజలి ఘటించారు రవిశంకర్ నిజం గానే ఆయన సంగీత పండిట్ కదా .

ఇవి కాక బాల మురళి ,జేసుదాస్ ,పట్టమ్మాళ్ ,సుశీల ,వైజయంతి మాల మున్నగు వారంతా ”ఆ గానం మధురామృతం ” అని మనస్ఫూర్తి గా జే జే లంద జేశారు .చివరలో ఆమె జీవితం లోని వివిధ ఘట్టాలను ”మైలు రాళ్ళు ” గా నిలిపారు .. ఏం .ఎస్ అంత అందంగా ఆమె గాత్రమంత పరిశుద్ధం గా ,ఆమె గానం అంత పవిత్రం గా ,,,ఈ స్మృతి గీతాలను ఆంటే elegy , లను ఘన నివాళిగా ఆమెకు అందజేసిన ”లకుమ ;;గారిని మన సార అభినందిస్తున్నాను . .మన జాతి మణి దీపాలై ,మనల్ని సంస్కృతీ సుసంపంనులను చేసిన మహాను భావు లందరికి ఇలాంటి నీరాజనాలు మనం అందించాలి ..లకుమకు సహకరించిన వారందరినీఅభినందిస్తున్నాను ఇది నిజం గా అందరు గళం కలిపిన’ ‘ స్మృతి స్వరమే ” .
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్

telugu
sangetam
m.s subbalaxmigagu
getam]
nani sarma
LikeLike