అస్పృశ్యత పై సమరం – మహాత్ముని కంటే ముండు మొదలైంది

    అస్పృశ్యత  పై సమరం 
                                                                         ————————–
భారత దేశం లో అస్పృశ్యత ఒక అంటూ వ్యాధి లాగా దేశాన్ని తార తరాలు గా పట్టి పీడిస్తోంది .వారికి సంఘం లో గౌరవం లేదు .పక్కన కూర్చొనే యోగ్యత నివ్వ లేదు .దేవాలయ ప్రవేశం లేదు .అందరు దీన్ని రూపు మాపాలని అనుకుంటున్నా ముందుకు వచ్చిన వారు బహు కొద్ది మంది మాత్రమే .గాంధిజీ ఏ దీన్ని గురించి ముందు ఆలోచించారు అని అంతా అనుకుంటారు . .కాదు అని తెలుస్తోంది ఆయన వల్ల ఆ ఉద్యమం ఊపు అందుకొంది ,అంతకు ముందే కవులు సంస్కర్తలు  గళం విప్పారు .కొంత కృషి చేశారు  ఆ వివరాలు తెలియ జేస్తాను
                 1906  వ సంవత్చరం లోనే దేశోద్ధారక కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులు గారు కృష్ణా జిల్లా లో వారి స్వగ్రామ మైన ఎలకుర్రు లో హరిజనులకు స్వంత డబ్బులు ఖర్చు పెట్టి హరిజనులకు ప్రత్యెక మైన కాలనీ నిర్మించారు .హరిజనులకు ప్రత్యేల మైన ప్రాధమికస్కూల్ నిర్మించారు ..ఇంతే కాదు ఆ వూరి వారి స్వంత శివాలయం లోకి హరిజనులకు ప్రవేశం కల్పించి దైవ దర్శనం చేయించి గాంధి గారి కంటే ఆదర్శం లో ముందున్నారు .అప్పటికి ఇంకా గాంధి భారత రాజ కీయాలలో పూర్తి గ ప్రవేశించ లేదు .ఈ విషయాలన్నీ  ఈ నెల నాల్గవ తేది న మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి అధ్యక్షులు ,కవి కదా రచయిత నవలా కారుడు అయిన శ్రీ కొట్టి రామా రావు గారికి స్వర్గీయ కాశీ నాధుని నాగేశ్వర రావు గారి ”విశ్వ దాత ”పురస్కారాన్ని వారి మనుమడు శ్రీ కాశీ నాధుని నాగేశ్వర రావు గారు అందజేసిన సందర్భం గా ,బందరు లో వివిధ సంస్థలు  ఏర్పాటు చేసిన అభినందించినా సభ లో . .కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి ,విశ్లేషకుడు డాక్టర్ జి .వి .పూర్ణ చంద్ తెలియ జేశారు .అంతే కాదు పంతులు గారు ఆంధ్ర దేశం లో జన్మించటం వల్ల ఆయనకు రావాల్సినంత కీర్తి రాలేదని అదే బెంగాల్ లో జన్మించి ఉన్నట్లయితే గాంధీ గారికి బదులు పంతులు గారికే ”మహాత్మా ”బిరుదు లభించేది అని అన్నారు .ఇది కాదన లేని సత్యమే నని పిస్తుంది
                                  ఇంకో విషయం మీ దృష్టికి తెస్తాను .1909 లో నే స్వర్గీయ మంగి పూడి వెంకటేశ్వర శర్మ గాంధిజీ కంటే ముందు గా అస్పృశ్యుల పై స్పందించి కవిత రాశారు .అప్పటికి ఇంకా హరిజనులు అన్న పేరు వారికి రాలేదు .
        ”అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి –అందారు ఒక్కటై వుండాలి సక్కంగా –కష్టమ్ములోచ్చినా- ,నిష్టూర మొచ్చినా –ఇష్టమ్ము గా నుండి కట్టూగా నుమ్దాము అందారూ –తమ్మూల మణి మీరు మామ్మూల జూడండి –అమ్మోరు దీవించి –ఐశ్వర్య మిచ్చేను ”అని గొప్ప సామాజిక స్పృహతో సంస్కరణాభి లాష తో శర్మ గారు ముందే స్పందించారు .
              శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారు అస్ప్రుష్యులకు ఆలయప్రవేశం లేనందుకు బాధ పడుతూ గొప్ప కవిత రాశారు
                   ”కుక్కలు చూడ వచ్చునట -కోతులు చేతులు సాచి –భక్తి మై మ్రొక్కగా వచ్చు ,–చీమలు ముంగిట సాగిల బార వచ్చు ,–నల్ప్రక్కల నీగలున్ ముసర వచ్చును గాని –మనుష్య కోటిలో నేనొక్కడ నయ్య నేనిచట నుండగ రాదు గదా శివా ”అంటూ అస్ప్రుష్యుని ఆవేదనను తన వేదన గా వెలి బుచ్చారు .
               1943 లో చదల వాడ నరశింహం గారు ”మూడు కొట్లామ్ద్రులను తోడును గల్గి –దీనుడఅరుంధతి కుమారుండు –అస్పృశ్యతా దోష మంట గట్టి అది –పక్ష పాత సమేత భారత మాత ”అని ఆ తప్పు అంతా తల్లి భారత మాత దే నని ఆమెకే  దోషాన్ని  అంట గట్టారు   .
   రాష్ట్ర కవి, ప్రబోధకులు రాయ ప్రోలు సుబ్బా రావు గారు ”ప్రేమ వృత్తికి జగడాల భేద మేల —బ్రాహ్మణాగ్ర హారము నందు పవలు రేయి –విసరు పవనుమ్డు –కడ జాతి వీటి యందు –తాక లేక వీచునే -పక్ష తంత్ర జడిమ ?”అని ప్రశ్నించారు .వాయుదేవుడికి పక్ష పాతం లేదు అగ్రహారం లోను ,అస్ప్రుశులున్న చోట ఒకటిగానే వీస్తాడు మనుష్యులకే ఈ మాయ దారి భేద భావం అని దెప్పి పొడిచారు .
  బసవ రాజు అప్పా రావు గారు ”డబ్బు గలోడు దారికి రానీరు —ఈ గోరా మేమి ,ఈ నేర మేమి –మాల మాదిగలం –మనుషులం గామా ?”అని అస్పృశ్యుల తరఫున వకాల్తా పుచ్చుకొని వాదించారు ..
                   దేశం లోని ప్రష్టుత పరిస్థితిని చూసి ఆచార్య కొలక లూరి ఇనాక్ గొప్ప కవితలోతనభావాన్ని ఆవిష్కరిస్తూ దేశానికి ఎలాటి వాడు ప్రధాని అయి ఎలా పాలించి ఎలా దిగి పోవాలి అనేది  అద్భతం గా వర్ణించారు
    ”పైసా లేని వాడు –పైగా హరిజనుడు –ప్రధాన మంత్రి కా గలిగి  —అయిదేళ్ళు వుండి  -ఆపైన వదిలి –పైసా లేకుండా పాత మనిషి గా –బ్రతగ్గలిగిన నాడు -భారత దేశం బాగు పడ్డట్టు .”ఇది భారతీయులందరి ఆకాంక్ష .అది తీరు తుందని ఆశిద్దాం .
                                                                          మీ
                                                                         గబ్బిట దుర్గా ప్రసాద్ —–08 -06 -11
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

1 Response to అస్పృశ్యత పై సమరం – మహాత్ముని కంటే ముండు మొదలైంది

  1. satya's avatar satya says:

    దాదాపు వెయ్యి సంవత్సరాల పూర్వమే , అస్పృశ్యతపై ఉద్యమం జరిగింది, శూదృల ఆలయప్రవేశం, కేవలం బ్రాహ్మణులకే కాకుండా అన్ని కులాలవారికి సమాశ్రయణం (మంత్రోపదేశం), స్త్రీలకి వేదాద్యయనం, వేదాలయొక్క, ఆలాయాలయొక్క జీర్ణోద్దరణ-సరళీకరణ, అన్ని కులాలవారికి ఏక స్థానంలో ప్రసాదవితరణ మొదలైన ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి ….
    వీటన్నింటికి మూల కారకులు శ్రీ భగవద్రామానుజులు. వీరి శ్రీవైష్ణవ-ఉద్యమంలో వెళ్ళిన ప్రతీచోట ఏకకాలంలో లక్షలమంది ఉద్దరింప బడేవారు. వీరిపై ఎన్నో నిందలు, దాడులు, హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి. కాని వారి వైభవాన్ని ఏమాత్రం ఆపలేకపోయారు….. కేవలం సమాచారమ్ కోసం చెబుతున్నాను.

    -satya

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.