ఆముక్త మాల్యద లో రాయల గ్రీష్మ వర్ష రుతు వర్ణన
—————————————————-
ఆముక్త మాల్యద లో గ్రీష్మ రుతువును ముందు ప్రవేశ పెట్టాడు కృష్ణ దేవ రాయలు .అదే ఆయన ప్రత్యేకత ,.కారణం లేకుండా చేసిన పని కాదిది .గ్రేష్మ ప్రతాపాన్ని అంత ప్రతిభావంతం గా వర్ణించి కధకు కావలసిన నేపధ్యాన్ని సృస్తిమ్చటం రాయల మార్గం రాజ మార్గం .తాను చెప్ప దలచు కొన్న కధకు జీవితాన్ని ప్రసాదిస్తాడు ఇదే ప్రకరణ వక్రత..
ఆ వేసవిలో పుష్ప బాణుని విల్లు చేయి జారి పడిపోయిందట .చేతులు చేమరిస్తున్నాయి .రతి ప్రేరణకు అవకాసం లేదన్న మాట .జీవుల్లో అలసత్వం పెరిగింది .దంపతుల పొందు ”అనార్యుల పొందు ”గా ఉందట .రతి కి విమఖత చెమట అలసత్వం వల్ల కల్గింది .దీన్ని ”వాక్య వక్రత ”అన్నారు ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారు .వేసవి తాపానికి సోమ్మ సిల్లిన యువతీ ముఖ చంద్రుడు తన ఓషధ ధర్మాన్ని వుపయోగించి మన్మదునితో కలిసి ,పాతాళానికి పారి పోతున్నా ,కమ్మని పిల్ల తెమ్మెరను ,శీరాపు తాటి విసన కర్ర తో బలవంతం గా తెప్పించుకొని అనుభావిస్తున్నాడట .మలయ పావనమ్ లేదు కనుక మరుని బాధలే లేవు .మంట గాలిని మోయ లేక సూర్య రధ పగ్గాలైన పాములు ముడులు వదిలేశాయత .నీటి తో నిండి ఉండాల్సిన బావులు నీరు లేక చక్రాకారం లో ఆకాశానికి యెగిరి పోతున్నాయి .జల దేవతలు చలువ పందిళ్ళు కు చేరారు .కా ళ్ళు పడిపోయిన మన్మధుడు ,అక్కడే కుక్కి మంచం ఎక్కాడట .మల్లె మొగ్గలు అగ్గి బొబ్బల్లగా వున్నాయట .చరకు పానకాలు,సేద తీరుస్తున్నాయత ..
మన్మధ రంగాస్తలమైన మధుర నగరం లో వుంది ఈ గ్రీష్మం అంతా .ఆంటే శ్రుంగారం తగ్గి పోతోందని భావం .దంపతులు దగ్గరలో వున్నా పొందు సుఖం లేదు .ఇంతటి దారుణ గ్రీష్మం లలో రాజు మాత్య ద్వజుడు వేశ్య పొందు కోసం వెళ్తున్నాడు .వో పరదేశి బ్రాహ్మణుడి ప్ర్రబోధం విని ,మనసు మార్చుకున్నాడు .అదేవసంతం అయితే అలా జరిగేది కాదు .కామోద్దీపన పెరిగేది .ఇలా గ్రీష్మం తో రాజు మనసు మార్చిన ఘనత రాయలది .”వక్రోక్తి స్వభావాన్ని అద్భుతం గా వుపయోగించి తాను చెప్ప బోయే కధకు బలాన్ని అందజేశాడు రాయలు ”అన్న ఆచార్యుల వారి విశ్లేషణ అమోఘం అని పిస్తుంది
తరువాత యమునా చార్యుల వారి వివాహం జరుగు తుంది .అక్కడ వర్ష రుతువును అద్భుతం గా వర్ణిస్తాడు రాయలు గార్హస్త ధర్మ పోషణకువర్శర్తు బాగా దోహదం చేస్తుంది .ఇక్కడ రాయల ప్రకృతి పరిశీలనకు ముక్కు మీద వేలు వేసు కోని ఆశ్చర్య పోతాము .వేసవి లో అతిగా సుద్రపు నీరు తాగిన సూర్యుని కడుపు లో ఉప్పు ద్రవం గా మారి దాన్ని వుముస్తుమ్తే ఫెళ ఫేలార్భాటులు విన్పిస్తు న్నాయట .పుట్తాల్లో వున్న కట్ల జెర్రి పాములు ఆకాశం లో నడుస్తున్నట్లు వర్ష మేఘాలున్నాయట .ఆ జెర్రుల వేయి కాళ్ళ లాగ వర్ష ధారలు పడుతున్నాయి .గాలితో కూడిన ధారలు వుట్టి త్రాళ్ళ లాగా గోగు పుల్లల్లా జనపనార లా తళ తళ లాడు తున్నాయట .ఆకాశం ,భూమి ,తెల్లని తాళ్ళతో ముడి వేసి నట్లుందట .ఇదంతా ఎంతో సహజ సుందర వర్ణన .ఇంతకు ముందు ఏ కవీ ఇలా వర్ణించ లేదు .
ఇంద్రుడు అడవి నెమిల్లను ఆడిమ్చతానికి .మేఘాలలు అనే మద్దేల్లను రెండు వైపులా మొగిస్తున్నాదట .వర్షుడు సముద్రాలన్నీ తాగేసి ,ఆ నేరంతా ఒక్క సారి కక్కితే భూమి వరదల్లో మునిగి పోతుందని జాలి పడి బ్రహ్మ సూర్యుని చుట్టూ ,గూడు కట్టాడట .కోకిల పంచమ స్వరం తో ,నెమలి షడ్జమం తో ,పాడుతున్నాయి .ఆ రెండు కలిసి పాడి నపుడు సముద్రుడనే భర్త దగ్గరకు నదులనే భార్యల్ని సాగనంపుతున్న చెలి కత్తెల పాటల్లా వున్నాయట .
వర్షా కాలమ్ రచ్చ సావిల్లలో చేరిన జనం కాలక్షేపం కోసం పులి ,మేక ఆటలు ఆడుతున్నారు .కాయ గూరలు దొరక్క జనం ఆకు కూరలను ,చింత చిగురుతో కలిపి వండుకున్తున్నారు .రెడ్డి దంపతులు పొలం గుడిసె లో మంచం కింద కుంపటి పెట్టు కోని ,దూరం గా కట్టివేయబడ్డ దూడలు తమ శరీరాల్ని నాకు తునా పట్టించు కోకుండా కామ కేళి జరుపు తున్నారు .రాజులు మాత్రం నెమల్లు కూసే దాక నిద్ర లేవటం లేదు .ఆంటే క వారి భోగాలకు ఏమీ కొరత లేదు అని ఒక చురక అంటించాడు రాజైన రాయలు .వాళ్లకు ఎన్ని సుఖాలైనా అమరుతాయి కదా అంటాడు .
ఆంటే వర్షా కలం లో ఎంత ముసురు పట్టినా ఇబ్బందు లేదురైనా ,అన్నంతినటం తొనే తృప్తి పడ కుండా మన్మధుని మరచి పోలేని వారుగా జన జీవితం సాగుతోంది గ్రీష్మానికి వర్హ్ర్టు కు ఎంత తేడా ? ఇలాంటి పజల మనో ధర్మ వ్రుత్తి ద్వారా రాజు గారి ప్రవర్తన కూడా వుంది అని ధ్వని గర్భితం గా రాయలు తెలియ జేస్తున్నాడు .యామునా చార్యులు రాజుగా హాయిగా వర్షా కాలమ్ లో దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు .ఇదంతా అతని జైత్ర యాత్ర కు ముందు చేసిన వర్ణన ..దీని తర్వాత శరదృతు వర్ణన చేసి కదా గమనాన్ని మార్చి వేశాడు అది మీకు ఇదివరకే తెలియ జేశాను
ఇంకో సారి వసంత ఋతు వర్ణన తిలకిద్దాం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —-08 -06 -11


Thanks for the post. I am searching for – seasons described in telugu – I read it in college,.. I do not remember the author. It was about rainy season ( I think) with a cow-herd boy sitting on a cow and going on a muddy road etc;. IF you know, sir, please e-mail the details. Thanks
LikeLike