మధుర మైన కొన్ని రాజా రాం కధలు
స —————————————————————————————–
మధురాంతకం రాజా రాం కధల్లో మానవత్వానికి ఎంత ప్రాధాన్యత వుంటుందో తెలియ జేసే కొన్ని కధలు టూకీ గా మీకు తెలియ జేస్తున్నాను
”పిచ్చి వెంకట్రావు ”కధలో తన తోటి ఉపాధ్యాయుడికి ఆక్సిడెంట్ అయి చికిత్చ చేయించ టానికి వెంకట రావు మేష్టారు రైల్ ను ఆపాల్సి వస్తుంది పట్టాలమీద నిలబడి . చొక్కా విప్పి దాన్ని ఊపుతూ ,రైలును ఆపాడు వెంకట రావు మేష్టారు .ఆనుకోకుండా ఇంజెన్ డ్రైవర్ ఆయన శిష్యుడే అయాడు .గురువు గారి త్యాగానికి ముగ్దుడైనాడు .చికిత్చ జరిగి ఆ ఉపాధ్యాయుడు కోలు కున్నాడు .అప్పుడు మేష్టారు ”బోడి రూల్స్ నాకు చెప్పద్దు .మొదట మనిషి ,ఆ తర్వాతే రూల్స్ ”అన్నాడు అదీ ఆయన కధ .అయితే చెప్ప టానికి ,వినటానికి ఈ కధలు బానే వుంటాయి .యెక్క డైనా నిజ జీవితం లో అలాంటి మేస్టార్లు ఉంటారా ?అని మీకు ,నాకు సందేహం కలగటం సహజం .వున్నారు శ్రీ రాయసం వెంకట శివుడు ,కపిథలం కృష్ణ మా చార్యులు వంటి వారికి వ్రుత్తి ఏ దైవం .మనిషే దేవుడు .అలాంటి వారు జనం ద్రుష్టి లో పిచ్చ వారే .అందుకే దీన్ని ”పిచ్చి వెంకట్రావు”కధ అన్నాడు .
ఇంకో మంచి కధ ”రాతిలో తేమ ”భర్త అహంకారి .ఎన్ని చెప్పినా వినడు ,పంధా మార్చు కోడు మరి భార్య కర్తవ్య హీనం గా వున్దాల్సిన్దేనా ?కాదు ఆమె కర్త వ్యం ఆమె చేసి భర్త మనసు మార్చిన మరో మానవతా మూర్తి అయిన మహిళ కధ ఇది .భర్త రెడ్డి గారి తో వచ్చిన భూమి తగాదా తో నిరాశ్రయులైన వూరి జనం రెడ్డి గారిన్టికే వచ్చారు .ఆయన పనులకు ఎప్పుడు అడ్డు చెప్పని భార్య సహజ కరుణామయి .నోరు లేని ఆ పాటక జనాన్ని బంధువులు గా భావించింది .వంటామెను పిలిచి వంట చేయించింది ఆమె ”అమ్మ గారూ !చుట్టా లెవరైనా వస్తున్నారా ”అంది అమాయకంగా .”ఇంకా రావటం ఏమిటి? .ఎప్పుడో వచ్చారు .వీరంత్తా నా చుట్టాలే ”అంది ఆప్యాయత కురిపిస్తూ .రెడ్డి గారి మనసూ మారింది .ఆయనా తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాడు .వేరొక చోట వారందరికి పాకలు వేయించాడు .”యుద్ధాలు మనుష్యుల మెదళ్ల లోనే పుడతాయి ”అనేది ఐక్య రాజ్య సమితి నివేదిక .నిజానికి శాంతి ,సహజీవనం కూడా మనసు లోనే ఉదయిస్తాయి .అని అనితర సాధ్యం గా రాజా రాం ఈ కధను ముగిస్తారు .
మరో మంచి కధ ”నరసప్ప మేష్టారు ”ఆయన స్థావర జగత్తు లో సాహిత్య జగత్తును చూసే ”రాయవరం నరసప్ప మేష్టారు ”నరసప్పగారు ”మిరప మొక్కలలో వేమన పద్యాల్ని ,మామిడి తోట లో రామాయణాన్ని ,బిల్వ(మారేడు )వృక్షం లో హరవిలాసాన్ని ,పనస చెట్టు లో ఆముక్త మాల్యదను ,ఏడాకుల అరటి చెట్టు లో భాగవతాన్ని” ,చూసు కుంటాడు .పోయిన బడి పంతుల వుద్యోగం లో రావలసిన జీత భత్యాల గురించి కించిత్తైనా చింతలేదు ఆయనకు. బహుశా ఆ నరసప్ప మేష్టారు మన దామల చెరువు మాస్టారు రాజా రాం గారేనేమో .
ఈ కధలు ”కూన లమ్మ కోన ”అనే రాజా రాం కదా సంపుటి లోవి .”అవక తవకలు అరికట్టే శక్తి మనకు లేక పోవచ్చు .అయినా మన చిన్న గొంతు తో అసమ్మతి తెలియ జేయాలి ..”అనేది మాస్టారిసిద్ధాంతం. .ప్రజలే ఆయన పుస్తకాలు .దేవుని పట్ల ఎంత ఆరాధనా భావం వుంటుందో ,మానవ జీవితం పట్ల కూడా అంతే ఆరాధనా భావం ఆయనకు .జీవితం పట్ల ఆసక్తినీ ,అనురక్తినీ ,భక్తినీ కలిగివుంటేనే కదా వస్తువులకు కొదవ వుండదు అంటారాయన .ఉపాధ్యాయ వ్రుత్తి లో వుండటం వల్ల అద్భుత మైన లోక పరిశీలనా శక్తి కలిగింది .దానితో మాన వత్వం మూర్తీభావించే గొప్ప కధలు రాశారు .ఆంద్ర దేశం లోని అన్ని వృత్తుల వారి మనో విశ్లేషణను ఆయన తన కధల్లో చూపించారు .ఆయన శైలి నిర్మల ,పవిత్ర గంగా ప్రవాహమే .ఏ మాత్రం తెలుగు వచ్చిన వాడైనా హాయిగా చదువుకో గలడు .”మానవులంతా మాధవులు కాలేక పోవచ్చు కాని కనీసం సామాన్య మానవులు గా నైనా వుండాలి ”అన్నది మధురాంతకం గారి మనో భీస్తం .ఎప్పటి కైనా అది నెరవేరాలని ఆశిద్దాం .ఆ దిశ లో అడుగులు వేద్దాం .వీలైనప్పుడల్లా రాజా రాం కధలు చదువుదాం .మనసు లో మాన వత్వం నింపుకుందాం . .జీవితాన్ని అమ్రుతోపమానం చేసు కుందాం
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ —09 -06 -11 .

