మల్లాది వారి ”కృష్ణా తీరం ”నవలలో అన్నప్ప అన్న వైభోగం
————————————————————-
మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి నవల ”కృష్ణా తీరం ”అందరు తప్పక చదవాల్సినది .ఒకరకమైన చిలిపితనం ,పాండిత్యం ,లాలిత్యం కలగలిసిన వ్యక్తిత్వం మల్లాది వారిది .ఒకవైపు ఆధునిక శ్రీ నాధుని లా ,మరోవైపు ఆత్మీయ తాతయ్య లా కన్పిస్తారు .కధల్లో వర్ణనలు ,ముచ్చట్లు ఆయన ప్రత్యేకత .సంభాషణా చాతుర్యం అద్భుతం .నవలలు గోలుసుల్లా సాగుతాయి .చంద్ర హారం లో బిల్లల్లాగా పాత్రలు ఒకదానిలోనుంచి ఇంకోదానిలోకి సాగి పోతాయి .ఆయన శైలి ముత్యాల ముగ్గు .దస్తూరి ముత్యాల కోవ .కృష్ణా తీరం నవల లో అన్నప్ప ప్రత్యెక పాత్ర .ఒక విధం గా అది మల్లాది వారే అని పిస్తారు .సహృదయత ,సౌమ్యత ,నిరాడంబరత ,సమన్వయము ,హాశ్యం ,వ్యంగ్యం ,పాండిత్యం భోజన ప్రియత్వం ,సంభాషణా చాతుర్యం ,అన్యోన్య దాంపత్యం పట్ల ఆరాధన ,స్త్రీ స్వాభిమానం పట్ల గౌరవం ,కులమత విచక్షణా రాహిత్యం ,అభ్యుదయ ధోరణి ,ఆచరణ శీలత శ్లాఘనీయాలు .చెయ్యి ఎత్తి నమస్కరించా బుద్ధి కలుగు తుంది .అన్నప్ప అందరికి ప్రీతి పాత్రుడు .సంసారాల్లోని కలతల్ని ,సామరస్యం గా పరిష్క రిస్తాడు .అన్ని వయస్సుల వారితోను సమానం గా మెలిగే నేపుఆయనది ,మల్లాది వారి కృష్ణా తీరం ఒక వచన కావ్యం అనిపిస్తుంది .ఆంధ్రుల వేదం .నిత్య పథనీయం .ఈ నవల శైలి కోసమే రాసింది కాదు .మానవ సంబంధాల్ని మెరుగు పరచటం కోసం ,మూఢ విశ్వాసాలను విసర్జించటం కోసం అందరు అన్యోన్యం గా మెలగటం కోసం ప్రేమతో వారధులు కట్టుకోవటం కోసం రాశారు .శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గోదావరీ తీర వ్యావహారిక భాష లోని నుడికారాలను ,ఉచ్చారణా వైచిత్రిని ప్రదర్శిస్తే ,మల్లాది వారు కృష్ణా తీరపు వ్యావహారిక భాష లోని వైవిధ్యాన్ని ,విలక్షణతను ,జోడించారు అందుకు ఈ నవల వో ప్రత్యేకత అని ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయా దేవి అన్న మాటలు అక్షర సత్యాలు .
అన్నప్ప ఒక సత్కార్యం కోసం ఒక వూరు వస్తాడు ,.లచ్చి ఇంటికి చేరాడు .ఆ ఇల్లు కడగొట్టు వారిది అవధాని గారి కొడుకు వీళ్ళ అమ్మాయిని వలచి పెళ్లి చేసుకున్నాడు .ఆయన అగ్గి మీద గుగ్గిలం అయాడు కొడుకు ఇక్కడే ఉంటున్నాడు .ఈ రెండు కుటుంబాల్ని కలిపే బాధ్యత తీసుకున్నాడు అన్నప్ప అందుకే వీల్లిన్తికే వచ్చాడు .తన భోజనమూ వీల్లిన్ట్లోనే తనకు వంటలో ఏమి చేసి పెట్టాలో పురమాయిస్తున్నాడు చూడండి ”నా కోసం నవ కాయ పిండి వంటలేమీ చెయ్యద్దు .మరి ,వంకాయ నాలుగు పచ్చాలు చేసి పోపులో వేసి ,ఆనపకాయల (సొరకాయ )మీద ఇఇంత నువ్వు పప్పు జల్లి ,అరటి దూత (ఊచ )ముఖాన ఇంత ఆవేట్టి ,తోటకూర కాడల్లో ఇంత పిండి బెల్లంపారెయ్యి .కొబ్బరీ,మామిడీ అల్లం పచ్చళ్ళు చాల్లే .పెరుగు లో తిరగ బొత పెట్టి ,దాన్లో పది గారెలు పడీ .రవంత శనగ పిండి కలిపి ,మిరప కాయలు ముంచి ,చమురు లో వెయ.సరేక్షీరాన్నం (పరవాన్నం )అంటావా ! అదోవంటా? ?ములక్కాడలు మరి కాసిని వేసి పులుసు ఒక పొయ్యి మీద పడీ .ఈ పూటకు ఇలా లఘువు (తేలిగ్గా )పోనీయ్ .ఇదిగో నేను స్నానం చేసి వస్తున్నా గానీ వో అరతవ్వేడు గోదుం పిండి తడిప్పెట్టు .రత్తమ్మ .వస్తే నాలుగు వత్తి ,అలా పడేస్తుంది .మధ్యానం పంటికిన్డకు ఉంటాయ్.”ఈ మాటలకు అవధాని గారి కోడలు ముచ్చటపడి నవ్వేసింది
ఇంతలో రత్తమ్మ వచ్చింది బచ్చల ,వామన గాయలతో .”రాత్తమ్మప్పా !నాకుబచ్చలి కూరంటే ప్రాణం .నాలుగు వెల్లుల్లి రెబ్బలండులో వేసి దిమ్మ తిరిగెట్లు తిరగ బోతేడితే ఆహా !ఇంకా పంచ భక్ష్య పరవాన్నలేందుకు ?ముఖ్యం గా బొబ్బట్లలో నంజుకునేందుకు మా మంచి వనరు .అలా నున్చున్తావెం మడి కట్టుకో .నీవు కూడా చేయి చేసు కో పోతే మా ఇదరి వల్లా యెట్లు లేదు .”అని రాత్తమ్మకూ పురమాయిన్చిఅప్పుడే ఆ ఇంటిలో ఒకడై పోయాడు అన్నప్ప శాస్త్రి .పెద్ద వైదిక బ్రాహ్మణుడు .అనుస్టాన పరుడు .అయినా కుల విచక్షణ చూపనిఉపనిషత్ ,వేదాంత విధానం .ఇక అన్నప్ప మాట వినకుండా ఎవరు వుంటారు .?అతను ఏది చెప్పిన పర హితం కోసమే ఏది చేసినా ఇతరులు బాగు పడాలనే .చివరికి అందరిలో మార్పు తెప్పించి ఆత్మ పరిశోదన చేయించి కర్తవ్యోన్ముఖులను చేస్తాడు అన్నప్ప ..ఇదీ అన్నప్ప పాత్ర ..వీలును బట్టి మరి కొన్ని కృష్ణా తీరం విశేషాలు తరువాత తెలుసు కొందాం
మీ —దుర్గా ప్రసాద్ 09 -06 -11 .

