శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గారి గీత ప్రతిభ
లలిత సంగీతం ఆంటే తెలుగు లో ముందు గుర్తొచ్చే వారు బాలాంత్రపు రజనీ కాంత రావు గారు .గీత రచయిత ,సంగీత కర్తగా ప్రయోక్తగా radio డైరెక్టర్ గాసినీ నేపధ్య గాయకునిగా వాగ్గేయ కారునిగా బహుముఖ ప్రతిభ వారిది .భానుమతి తో ఆయన పాడిన పాటలు మనసులను ఉయ్యాల లూగించాయి .ఆంద్ర వాగ్గేయ కార చరిత్ర రాసి న ఘనుడాయన ఎన్నో మధుర గీతాలను పాడి రసమయం చేశారు .ఎన్నిటికో బాణీల వోణీలు కట్టారు .రామాయణ ఆవిర్భావాన్ని మహోన్నతం గా radio లో ప్రదర్శించి ఆకాశ వాణి విజయ వాడ కేంద్రానికి బహుమతిని సంపాదించారు .ప్రయోగా లెన్నో చేసి ప్రయోక్త గా గణన పొందారు .స్వయం గ కవి అయిన ఆయన కలం లోంచి జాలు వారిన కొన్ని పాటలను మీకు పరిచయం చేస్తాను .ఈ తరం వారికి చాలా మందికి అవి తెలియవు ..”చల్లగాలిలో ”అని వినపడంగానే అది రజని పాట అని చెవులు రిక్కించి వినే వాళ్ళం .”స్వైరిణి అన్నారు నన్ను శ్యామ సుందరా ”అని వింపిస్తే చాలు పరవశమే .”మాదీ స్వతంత్ర దేశం ,మాదీ స్వతంత్ర జాతి ”వినిపిస్తే దేశ భక్తి వుప్పొంగేది అదీ ఆయన రచన స్వర ,రాగ ప్రతిభ .ఆది వారం నాడు ”శ్రీ సూర్య నారాయణా వెద పారాయనా ”అన్నది వింటే మనసు గగన తలం లో భక్తి తో విహరిన్చాల్సిందే .”ఓహో పావురమా ఒహోహో పావురమా ”అని భానుమతి పాడే పాటకురాగపు పయ్యెద వేసింది రజనీయే ..ఇప్పుడు రజని పాటలను అనుభవించండి .
01 – చల్ల గాలిలో యమునా తటి పై శ్యామసుందరునీ మురళి —–ఉల్లము కొల్ల గోనే మధు గీతాలు –మెల్ల మెల్ల చెవి సోకు నవే –తూలి రాలు వటపత్రమ్ముల పయి -తేలి తేలి పడు నడుగులవే —పూల తీవ పొదరిండ్ల మాటుగా —పొంచి చూచు శిఖిపించమదే –తరువు తరువు కడ డాగి డాగిన –న్నర యు కన్నుగవ మురుపులవే —మురిసి మురిసి నావెనుక దరసి– కను మూయు చివురు కేంగేలులివే —
02 -”స్వైరిణి అన్నారు నన్ను శ్యామ సుందరా =–నీరవ నిశి వెన్నెలలో –నీదు మధు మురళీ రవము —ద్వారములను తెరచి ప్రతి హృదయము పిలుచు –నిలువ నీదే –
స్నాన సమయమున యమునా సరిత్తటిని సఖీ జనులు
నిన్ను జూచి మైమరచిన నన్ను జూచి నవ్వి నారు —-స్వైరిణి అన్నారు —
బంధువులను ,పతిని ,సకల బంధములను ,వదలి వైచి
బృందావని నీదు రాగ బంధ మొదవ తరలితి నని –స్వైరిణి అన్నారు –
03 -”మాదీ స్వతంత్ర దేశం–మాదే స్వతంత్ర జాతీ
భరత దేశమే మాదేశం–భారతీయులం మా ప్రజలం
ఆలయంముల శిల్ప విలాసం –ఆరామంముల కళా ప్రకాశం
మొఘల్ సమాధుల రస దరహాసం –మాకు నిత్యనూతనేతి హాసం
అహింసా పరమోధర్మః –సత్యం వద ధర్మం చర
ఆది ఋషుల వెద వాక్కులు –మా గాంధి ,గౌతమ సువాక్కులు
స్వతంత్ర భ్రాత్రుత్వాలూ –సమతా మా సదాశాయాలు
జననీ — స్వతంత్ర దేవీ —
కొనుమా -నివాళులు మావి మాదీ స్వతంత్ర దేశం-
సేకరణ —–గబ్బిట దుర్గా ప్రసాద్ –11 -06 -11

