మరిన్ని నటరాజు జ్ఞాపకాలు
స్వర్గీయ నటరాజ రామ కృష్ణను మొన్న నేను ”నవీన భరత ముని ”అని రాశాను .ఆ మాటను ప్రఖ్యాత రచయిత ,పరిశోధకులు శ్రీ వకుళాభరణం రామ కృష్ణ గారు కూడా తమ వ్యాసం లో పేర్కొన్నారు . అందు లోని మరి కొన్ని విశేషాలు వివరిస్తాను .కృష్ణా జిల్లా దివి తాలూకా లో జన్మించి ,కాకతీయ సామ్రాజ్య ములో సేనా నాయకత్వం వహించిన జాయప సేనాని రచించిన ”నృత్త రత్నావళి ”ని అధ్యయనం చేసి రామప్ప గుడి లోని శిల్ప రీతులను పరిశీలించి ,”పేరిణి ”నృత్యాన్ని అందించిన మరో భరత ముని రామ కృష్ణ అప్పటికే అనేక నృత్య రీతుల్ని అధ్యయనం చేసిన అనుభవం సంపాదించారు .దేవదాసీల నృత్యం అంతరిస్తున్న సమయం లో ,తన సర్వస్వాన్ని ,ఆనృత్యాన్ని కాపాడ టానికి వినియోగించి ,సంఘం విధించినా ఆంక్షలను ఎదిరించి కాళహస్తి రాజమ్మ ను తన గురువు గా స్వీకరించారు .నవజనార్దన పారిజాతం అభినయించే ప్రసిద్ధ కళాకారిణి పెండేల సత్య భామను ,బొబ్బిలి జీవ రత్నమ్మ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు గానంచేసి అభినయించే సరిదే మాణిక్యమ్మ ,మొదలయిన వారి వద్ద నెలల తరబడి విద్య నేర్చి ”ఆంద్ర నాట్యాన్ని ”పునరుద్ధరించారు నటరాజు .పైన పేర్కొన్న వారందరికీ ఆంద్ర దేశం రుణ పడి వుంది .ఈ నాట్యానికి ఒక రూపం కల్పించి ,పాఠ్య ప్రణాలికను తయారు చేసి ,నృత్య కళాశాలలో పాత్యాంశం గా ప్రవేశ పెట్టించే వరకు విశ్రాంతి తీసుకో లేదు .నాట్యాన్ని అన్ని కులాల వారు నేర్చుకో వచ్చని ప్రకటించి అందరికి నేర్పారు .భారత నాట్యం ,కదక్ ,మణిపురి నాట్యాలు ఆయనకు అప్పటికే కరతలామలకాలు .కూచి పూడి సంప్రదాయంలో దిట్ట అయిన వేదాంతం లక్ష్మి నారాయణ గారి శిష్యరికం చేసి అదీ అభ్యశించిన నిత్య విద్యార్ధి నట రాజు .దానిలో తన ముద్రను ప్రవేశ పెట్టి వన్నె తెచ్చారు .దీనితో ఒక నూతన అభినయ ప్రక్రియ ను రామ కృష్ణ ఏర్పరచి నట్లయింది .కూచిపూడి నాట్య కళకు జాతీయ హోదా సాధించటానికి ,శాస్త్రీయ కళగా గుర్తింపు పొందటానికి 1959 లో హైదరాబాద్ లో ఒక జాతీయ సదస్సును తన ఆధ్వర్యం లో నిర్వహించారు .ఆ సభల్లో ప్రఖ్యాత కళాకారిణులు మారం పల్లి వైదేహి ,ఇందువదన లచేత రెండు గంటల పాటు అభినయం చేయించారు .తెలుగు వారి లాస్య నర్త నానికి అందరు ఆశ్చర్య పోయారట .
హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయానికి నృత్య విభాగానికి పెద్ద గా ఉండమని vice chancellor ఆచార్య భద్రి రాజు కృష్ణ మూర్తి కోరగా అంగీకరించి పనిచేశారు .విశ్వ విద్యాలయంలో post graduate స్త్హాయిలో నృత్యాన్ని అధ్యయన అంశం గాచ్ర్చటం ఇదే మొదలు .ఆరుద్ర ,,ఆచార్య పోణంగి శ్రీరామ అప్పారావు గార్లతో చర్చించి నాట్య కళ నేర్చుకోవటానికి కావలసిన వాటిని పాఠ్య ప్రణాళిక లో చేర్చారు .సమాజానికి ,కళకు వున్న సంబంధాన్ని సోదాహరణం గా వివరిస్తూ ,కళలన్నీ సమాజం నుండే వస్తాయని అవి ప్రజల వుమ్మడి కృషి అని వివరిస్తూ విద్యార్ధులలో ఆసక్తి కల్పించి నేర్పించే వారు .కలపి సామాజిక స్పృహ కల్గించారు .భారతేయ నృత్య రేతులతో పాటు ,ప్రపంచ వ్యాప్తం గా వున్న నాట్య సంప్రదాయాలను మిళితం చేసి నాట్య విద్యకు ఒక సమగ్ర ఆకృతిని కల్పించిన నాట్య విరించి ,నటరాజు .అనేక నాట్య రీతుల మూలాలలోకి వెళ్లి పరిశోధించిశాశ్త్రీయ , దృక్పధాన్ని జోడించి ,డాక్టరేట్ పట్టాల కోసం పరిశోధనలకు ప్రోత్చాహించిన విశాల హృదయుడు .నాట్య వ్యాప్తికోసం అభినయ సదస్సులు నిర్వహించారు .కళాకారులకు ఆర్ధికం గా సాయం అందించారు .దొమ్మరి ఆట ,వీధి నాటకం ,తోలు బొమ్మ లాట ,తూర్పు భాగవతమ్ ,చిందు భాగవతం ,వంటిగ్రామీణ కలలనుకూడా పరిశోధించి వాటి వ్యాప్తికి సహాయ పడ్డారు .ముస్లిం ,క్రైస్తవ ,బంజారా గిరిజన దళిత విద్యార్ధులకు కులమత భేదం లేకుండా నాట్యం నేర్పి న మనీషి ఒక దళిత యువతికి నాట్యం నేర్పి విదేశాలకు కూడా పంపిన నిజ మైన కర్మ యోగి నాట్య యోగి .. నాట్యాచార్యుడు ,,. ,నాట్య శాస్త్ర వ్యాఖ్యాత ఒకరే గా వుండటం అరుదైన విషయం .ఈ రెండింటి సమగ్ర స్వరూపమే మన నట రాజు .ఆంద్ర దేశం లోని కూచిపూడి వారి బాణీ ,కాకర పర్రు వారి బాణీ ,మైనం పాటి వారి బాణీ ఈ మూడు బాణీలాను అర్ధం చేసు కోన్నా” త్రిబాణీ త్రివేణీ సంగమం నటరాజ రామ కృష్ణ” .ఆయన వార సత్వ సంపద అనంతం గా కోన సాగాలాన్నదే అందరి వాంచితం .
ఆధారం –”-అభినవ భరతుడు ” –రచన — వకుళాభరణం లలిత ,రామ కృష్ణ
సేకరణ ,కూర్పు ——-గబ్బిట దుర్గా ప్రసాద్ ——–13 -06 -11

