ఆలోచనా లోచనం
అతిధి సంరక్షణ
స్నేహం విలువైనది ఆపదలో ఆడుకొనే వాడు స్నేహితుడు .అతిద్హిని ఆదరించటం లోక రీతి .ఇంటికి వచ్చిన అతిధి స్నేహితుడైతే అతని సంరక్షణ లో తన వారు క్షేమమ్ గా ఉంటారని భావిస్తారు .దీనికి విరుద్ధం గా జరిగితే ఆ స్నేహమే పగ తీర్చుకొంటుందని చెప్పే ”పక్షిని ”కధ హరివంశం లో వుంది
బ్రహ్మదత్తుడనే రాజు గృహం లోకి అనుకోక్కుండా ఒక పక్షిని ఆంటే ఆడ పక్షి వచ్చింది డాని ఆకారం వింతగావుంది రాజు కు అది నచ్చింది దాని రెక్కలు ,వీపు ,పొట్ట నల్లగాను తలమాత్రం యెర్ర గాను వుంది చలాకీ పిట్ట అది.. రాజుకు దానికి స్నేహం కలిసింది .రోజు ఉదయమే అది బయటికి యెగిరి పోయేది నదీ నదాలు పర్వతాలు ,సముద్రాలు చూసుకుంటూ ఆహారం సేకరిస్తూ లోకం లోని వింతలన్నీ గమనించి రాత్రికి రాజ గృహం చేరేది .ఒక వార్తాహరునిలా తాను చూసినవన్నీ రాజుకు వివరించి చెప్పేది ఆయన శ్రద్ధగా వినేవాడు .రాత్రిఅక్కడే వుండేది .కొంత కాలానికి రాజుకు కొడుకు పుట్టాడు .పక్షికీ పిల్ల పుట్టి అచ్చంగా తల్లి పోలికలతో ఆకర్షణీయం గా వుండేది అది రాకుమారున్నీ ,తన పిల్లను సమాన ప్రేమతో చూసేది .రోజు ఇంటికి తిరిగి వచ్చేప్పుడు రెండు పళ్ళు తెచ్చి ఒకటి రాజుకోడుక్కి రెండోది తన పిల్లకు ఇస్తూండేది .
పక్షి బయటకు వెళ్ళినప్పుడు దాది రాజ కుమారున్ని పక్షి పిల్లతో ఆడించేది .ఒక రోజు వాడు డాని పీక పిసికి చంపేశాడు .రాజుకు తెలిసి వుసూరుమన్నాడు .పక్షికి ఏమి సమాధానం చెప్పి వోదార్చాలో తెలియలేదు .దాదినీ కొడుకునీ తిట్టాడు .విపరీతం గా దుఃఖించాడు .ఇంతలో పక్షి మామూలుగా రెండు పండ్లతో వచ్చింది .చనిపోయిన తన పిల్లను చూసి తల బాదుకుంది డాని ముద్దులు ,మురిపాలు చిలిపి చేష్టలు గుర్తుకు తెచ్చుకొని విపరీతంగా దుఖించింది .చివరికి మనసు కుదుట పరచుకొని ”రాజా! నువ్వు క్షత్రియుడివి .నీ సంరక్షణ లో అంతా క్షేమం గా ఉంటారని నా పిల్లను ఇక్కడే వదిలి రోజూ,నేను హాయిగా బయటకు వెళ్లి వస్తున్నాను రక్షించే బాధ్యతనుంచి నువ్వు తప్పుకోన్నావు .హాయిగా గూట్లో ఆడుకొనే నాపిల్లను బయటకు తెప్పించి నీ కొడుకు తో చంపించావు .రక్షకులే భక్షకులైనట్లుంది .నీ కొడుకుని నా పిల్లతో సమానం గ ప్రేమించానే .నమ్మక ద్రోహం చేశావు .నీకు సనాతన ధర్మం తెలుసా ?చిర కాలమ్ తన ఇంట్లో వున్న వారిని రక్షించాలి.లేక పొతే కుంభీ పాక నరకం లో పడిపోతారు .అప్పుడు ఇచ్చే ఆహారాన్ని దేవతలు .పితృదేవతలు ముట్టుకోనే ముట్టు కోరు .”అని శోకం తో వివేకం నశించి ,రాజు కొడకు కళ్ళను తన ముక్కు తో పీకేసింది .రాజు తనకు తగిన శాస్తే జరిగిందని భావించాడు .పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు .చివరగా పక్షితో డాని కోపం శోకం తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే ఉండమని తమ స్నేహం మామూలుగా కోన సాగించాలని కోరాడు /.దానికి ఆ పక్షిని ”నేను పుత్రశోకం లో వున్నాను .నువ్వు గుడ్డి వాడైన నీ కొడుకుని చూసి బాధ పడుతున్నావు .నేనిక్కడ ఉండ కూడదు .నీ వల్ల అపకారం నాకు జరగ వచ్చు .చెడ్డ మిత్రుణ్ణి ,నీచుడైన రాజును విడిచి పెట్టాలనిపెద్దలంటారు . నిన్ను ఇక నమ్మ టం న్యాయం కాదు ”అని చెప్పి ఎగిరి పోయింది పక్షిని .
—
—

