ఆలోచనా లోచనం
అతిధి సంరక్షణ
స్నేహం చాలా విలువైనది .అవసరానికి ఆదుకొనే వాడు మిత్రుడు .అందరు వదిలేసినా స్నేహితుడే మనల్ని కంటికి రెప్ప లాగ కాపాడుతాడు .ఇంటికి వచ్చిన అతిధి మంచి చెడ్డలు విచారించి ,ఆదరించటం లోక రీతి .అనుకోని అతిదికే అలాంటి మర్యాదలూ చేస్తున్నాప్పుడు ,ఇంటికి అతిధి గా వచ్చి స్నేహం గా యజమాని తో ఉంటూ ,అతని సంరక్షణ లో తన పిల్లలు క్షేమంగా ఉంటారని భావించటం సహజం .కాని దీనికి విరుద్ధం గా జరిగితే ,ఆ స్నేహమే పగ తీర్చుకుంటుందని తెలియ జెప్పే ”పక్షిని ”కధ హరివంశం లో వుంది
ఒకప్పుడు బ్రహ్మ దత్తుడు అనే రాజుండే వాడు .ఒక రోజు అనుకోకుండా ఒక ఆడ పక్షి ఆంటే పక్షిని రాజగృహం చేరింది .డాని చూపులు ,చలాకి తనం చూసి రాజు ముచ్చట పడ్డాడు .క్రమంగా పక్షికి ,రాజుకు స్నేహం పెరిగింది .ఆ పిట్ట ఆకారం వింతగా వుండేది .డాని రెక్కలు ,వీపు పొట్ట నల్లగా ,తలమాత్రం ఎర్రగావుండేది .రోజూ ఉదయమే అది రాజభవనం నుంచి యెగిరి పోతుంది .నదీ నదాలు .పర్వతాలు ,సముద్రాల మీదుగా యెగిరి ఆహారం సంపాదిస్తూ ,లోకం లోని వింతలను గమనిస్తూ ,సాయంకాలానికి బ్రహ్మ దత్తు డుండే కామ్పిల్య నగరం చేరేది .తాను చూసిన వింతలూ ,విశేషాలు రాజుకు చక్కగా వివరించేది .రాజు ఆనందంగ్గా వినేవాడు .రాజుకు వార్తాహరుని గా పనిచేసేది అన్నమాట .రాత్రి పూట రాజభవనం లోనే వుండేది .రాజుకు కొడుకు పుట్టాడు .ఈ పక్షికి ఒక పిల్ల పుట్టింది .దానికి తల్లి పోలికలన్నీ వచ్చాయి .పక్షిని రాజకుమారున్ని ,తన పిల్లను సమాన ప్రేమతో చూసుకొనేది .ప్రతిరోజూ బయటి నుంచి రెండు పళ్ళు తెచ్చి ఒకటి రాజకుమారిడికి రెండోది తన పిల్లకు ఇచ్చేది i వారిద్దరి సంతోషం చూసి పొంగిపోయేది
పగటిపూట ఆహారం కోసం పక్షి బయటికి వెళ్ళినపుడు ,దాది వచ్చి రాజ పుత్రుణ్ణి ఆపక్షి పిల్లతో ఆడించేది .ఒక రోజు రాజకొడుకు ఆ పక్షి పిల్ల కంఠం పిసికి చంపేశాడు .రాజుకు ఈ సంగతి తెలిసి బాధ పడ్డాడు .పక్షికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతునాడు .దాదిని నిందించాడు .పక్షి గర్భ శోకం మాంచటం తన వల్ల కాదని దుఃఖించాడు .సాయంత్రమయింది రోజు లానే రెండు పళ్ళు తెచ్చింది పక్షిని .చని పోయి వున్న తన పిల్లను చూసి హృదయ విదారకం గా ఏడ్చింది .సోమ్మసిల్లింది తేరుకొని తన పిల్ల ఆట పాట గుర్తు చేసుకొని పొగిడింది విధిరాత అని భావించి దిగులు పడింది .కాసేపటికి తేరుకొని రాజును ”రాజా !నీవు క్షత్రియుడివి .నీపాలన లో జీవులను రక్షించే బాధ్యత నేది హాయిగా గూటిలో ఆదుకొనే నా పిల్లను దాది చేత బయటకు లాగించి,నీకొడుకుతో చంపించావు .క్రుతఘ్నుడివి .నీతో స్నేహం చేసినందుకు ,నీ అతిదినయినందుకు ,నాకు నా పిల్లకు గొప్ప బహుమానమే ఇచ్చావు .ప్రాణాలను రక్షించే వారే భక్షిస్తే ,లోకం లోశుఖం ,శాంతి ఎలావస్తాయిస్తే ?కంచే చేను మేసినట్లింది .నీ కొడుకును నా పిల్ల తో సమానం గా చూశాను .ఇంత ఘోరం లోకంలో వుండదు .నమ్మక ద్రోహం చేశావు .నీకు సనాతన ధర్మ తెలియదా ?చిర కాలమ్ తన ఇంట్లో వున్న వారిని రక్షించాలి .రక్షించక పొతే కుంభీపాక నరకం లో పడతారు అప్పుడు అతనికిచ్చే ఆహారాన్ని దేవతలు ,పితరులు ముట్టుకోనే ముట్టుకోరు ”అని శోకం తో వివేకం కోల్పోయి ,రాజుకొడుకు రెండు కళ్ళను తన ముక్కుతో పీకేసింది .రాజు కూడా జరిగిన దానికి తనకు తగిన శాస్తే జరిగిందని భావించాడు .దుఖం తగ్గిన తర్వాత పక్షి వచ్చి మళ్ళీ తనతో స్నేహం చేస్తే సంతోషిస్తానన్నాడు .అప్పుడు పక్షిని ”నేను పుత్ర శోకం తో వున్నాను .నువ్వు గుడ్డి వాడైనా నీ కొడుకు ను చూసి దుఃఖ పడుతున్నావు .నేనిక్కడ వుంటే నీకు ఏదో రోజు నామీద ఆగ్రహం కలిగి నాకు అపకారం చేయచ్చు .చెడు మిత్రుని ,,నీచుడైన రాజునూ నమ్మ కూడదు వాళ్ళను వదిలి పెట్టేయాలి .నిన్ను ఇక నమ్మటం న్యాయం కాదు .”అని హితవు చెప్పి యెగిరి పోయింది ,
గబ్బిట దుర్గా ప్రసాద్
రచనా కాలం 31 -01 -11 .
