ఆలోచనా లోచనం
అపాయం తప్పించే ఉపాయం
కొన్ని సమయాలలో కొడుకు కఠోర ప్రతిజ్ఞలు చేస్తాడు .అవి వాడికి ఆనందం కలిగిస్తాయి .సంతృప్తినిస్తాయి .కాని వారిని నమ్ముకొని జీవించే వారికి ఇబ్బంది కలుగుతుంది .ప్రతిజ్న చేసే వారి మనసు మార్చటానికి శత విధాల ప్రయత్నిస్తారు .వాళ్ళు ఒప్పుకోరు .ఈ ఆపద గడవ బెట్టతానికి ఉపాయం ఆలోచిస్తారు .అది చక్కగా పని చేసి అందర్నీ ఒడ్డున పడేస్తుంది .సావిత్రి సత్యవంతుని ప్రాణాలను యముని నుంచి పొందటానికి ఒక్క మాటే పనిచేసింది .ఇలాగే కరంధముడు అనే రాజు తన కొడుకు అవీక్షిత్తు బ్రహ్మ చర్య వ్రతం చేస్తుంటే ఉపాయం తో ఆ దీక్షను విరమింప జేసి సంతాన వంతుని చేసిన కధ మార్కండేయ పురాణం లో వుంది వివరాలలోకి వెళ్దాం .
రంభుడు అనే రాజు కుమారుడు ఖనీ నేత్రుడు .ఇతని పెద్దకోదుకే కరందముడు .తండ్రి ప్రజావ్యతిరక పాలనను సహించ లేక అతన్ని రాజ్య భ్రస్తున్ని చేసి కరంధమునికి పట్టాభిషేకం చేశారు మంత్రులు .అతను చాలా జాగ్రత్తగా పాలిస్తున్నాడు .ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ,వారికి తన కున్న దంతా పంచి పెట్టి ధన హీనుడిగా బ్రతుకు తున్నాడు .అతిమంచి కూడా అనర్ధమే .ధనా గారం ఖాళీ అయింది .శత్రురాజు దండెత్తి ఓడించి ,రాజ్యం ఆక్రమించుకొన్నాడు .అరణ్యాలకు చేరిన కర్దముడు తీవ్ర తపస్సు చేసి ,దివ్య విభూతులు పొందాడు .తిరిగి రాజ్యం సంపాదించే కోరిక బలీయం అయింది .తన చేతిని మధించాడు .అందులోంచి గుర్రాలు ,ఏనుగులు సైన్యం పుట్టాయి .కరం ఆంటే చేయి దాన్ని మధించాడు కనుక కరంధముదని పేరు వచ్చింది .ధనవంతుడై సైన్యాన్ని సమకూర్చుకొని ,శత్రువును వోడించి రాజ్యం సంపాదించి మళ్ళీ రాజు అయాడు
కరంధముడు వీర అనే రాకుమారిని వివాహం చేసుకొన్నాడు .పుత్రుడు కల్గాడు .వాడి గ్రహయోగం ఎలావుందో జ్యోతిష్యుల చాత చూపించాడు .గ్రహ వీక్షణ చేయ బట్టి అవీక్షితుడు అని పేరు పెట్టాడు .విద్య లన్ని నేర్చాడు .వివాహ వయసు వచ్చింది .విశాల దేశ రాజు తన కుమార్తె స్వయం వరం ప్రకటించాడు .తాను అసహాయ శూరుడను అనే గర్వం తో ఒంటరిగా స్వయం వరానికి వెళ్ళాడు .అక్కడ రాజకుమారులంతా ఏకమై ఇతన్ని బంధించారు .తండ్రి కరంధముడికి విషయం తెలిసి సైన్యం తో వెళ్లి వారందరినీ ఎదుర్కొని కొడుకు అవీక్షితున్ని చెర నుండి విడిపించాడు .అవీక్షితుని అవమానం కల్గి ఇంక పెళ్లి చేసు కొనని భీషణ ప్రతిజ్న చేశాడు .బ్రహ్మ చర్య దీక్ష కొనసాగించాడు .రాజ దంపతులకు బాధ గా వుంది .రాజ్యానికి వారసులు లేరు .అప్పుడు రాజుకు ఒక ఉపాయం తట్టింది
రాజు భార్య చేత ”కిమిచ్చక ”వ్రతం చేయించి కొడుక్కి కబురు చేశాడు అతను వచ్చి దగ్గరుండి అన్నీ స్వయంగా పర్యవేక్షించాడు .కోరికలు తీర్చే వ్రతం అది .తల్లి వ్రతం చేసే రోజుల్లో ఎవరు ఏమి కోరినా తీరుస్తానని శపథం చేశాడు .తండ్రి కొడుకుతో ”నాయనా !గొప్ప వాగ్దానం చేసి నందుకు సంతోషం .మాకు ఇంకేమి కావాలి ?మాకు మనవడిని ఇవ్వు .అంతకంటే మాకేమి కోరికా లేదు ”అన్నాడు రాజు …వాగ్దాన భంగం పాపం కనుక వెంటనే ఒప్పెసుకొన్నాడు .తండ్రికిచ్చిన మాట కోసం విశాల దేశపు రాకుమారిని ,వివాహం చేసు కొని,బ్రహ్మ చర్యం వదిలి దాంపత్య జీవితమ్ సాగించి వంశాంకురం గా రాజ్యానికి వారసునిగా మరుత్తు అనే కుమారుని కన్నాడు .మాటల్లో చక్కగా అవతలి వారిని మురిపించి కార్య సాధన చేయ వచ్చునని కరంధముని కధ మనకు తెలుపు తోంది .
రచన ———-గబ్బిట దుర్గా ప్రసాద్ —-రచనా కాలమ్ —31 -౦౧-11

