ఆలోచనా లోచనం
ధన తృష్ణ అనర్ధం
కోరికలుండటం మానవ సహజం .అవి తీర్చుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము .దేనికైనా ధనం కావాలి ధనమూలమిదం జగత్ .అన్నారు .దాన్ని సక్రమ మార్గం లోనే సంపాదించాలి .అంతు లేని ధనాశ అనర్ధం అని చెప్పే ”మంకి ”అనే వాడి కధ మహా భారతం లో శాంతిపర్వం లో వుంది .
మంకి ఒక బ్రాహ్మణుడు .ధనాశ ఎక్కువ .భగవధ్యానం కంటే ధనం మీడే ధ్యాస .ధన సంపాదనకు వ్యవసాయం ఎన్నుకొన్నాడు .పొలం దున్ని విత్తు నాటి నీరు పెట్టి ఎరువు వేస్తేనే కదా మంచి ఫల సాయం వచ్చేది ?తాను కూడా బెట్టిన ధనం తో రెండు కోడె దూడలను కొన్నాడు .అవి అప్పటికింకా కాడికిన్డకు రాలేదు .ఆంటే వాటికి దున్నటం తెలీదు .ఆ విషయం ఇతనికే తెలీదు .నెమ్మది గా వాటికి దున్నటం అలవాటు చేయాలని భావించాడు .వాటి సత్తా ఏమిటో తెలుసుకోలేదు .ఒక రోజు ఆ రెండు కొడెల్ని బంతి కట్టి పొలానికి తోలుకు పోతున్నాడు .మధ్యలో అవి తమ కున్న యవ్వన మదం చేత ,వయసు చేత ,పొగరు చేత ఆ బ్రాహ్మణ యజ మానికి అంద కుండా పరుగు లంకిన్చుకోన్నై .వాటిని ఆపటానికి పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .అతని వల్ల కాలేదు .అతనికీ కొత్తె ,వాటికీ కొత్తె .పరిగెత్తి ,పరిగెత్తి అవి దారి మధ్యలో పడుకొని వున్నాఒక పెద్ద ఒంటె మీద పడ్డాయి .ఆ పడటం తో ఒంటెకు రెండు వైపులా కోడె దూడలు ,మధ్య లో ఒంటె గా ఉనాయి .బంతి కట్టు తెగకుండా అట్లాగే వుంది పోయింది .ఒంటె బెదిరి పోయి ఒక్క సారిగా లేచి పరిగెత్తింది .బంతి కట్టు ఒంటె మూపురంకు చిక్కుకు పోయింది గిత్తలు కాలు నేల మీద ఆనిన్హకుండా విపరీతం గా దౌడుతీస్తున్నాయి .బంతి తాడు ఒంటె మూపురం మీద బిగించి వుండటం తో అదే ఆ గిట్టలకు ఉరితాడు గా మారి వాటి ఊపిరితీసేసింది తన్నుకొని ,తన్నుకొని అవి బ్రాహ్మణుడు నిసచేస్తుడై చూస్తుండగానే చచ్చిపోయాయి .ఒక్క సారిగాఅతనికికి జ్ఞానోదయం కలిగింది .విరక్తి పుట్టి,తన మీద తనకే అసహ్యం కల్గింది .తన ధన ఆశ వల్ల బంగారం లాంటి కోడె దూడలు మరణించాయని రోదించాడు .కామం మీద మమ కారం పోయింది కామాన్ని త్యజించి జితెన్ద్రియుడయాడు .
కామం ఆంటే తృష్ణ .అంతశ్శత్రువుల్లో కామామికి గొప్ప ప్రభావం వుంది తన్ను ఎవరు . చేరపలేరని కామానికి అహంకారం అని అశ్వ మేధ పర్వం లో ధర్మ రాజుకు శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తాడు .కోరిక సంకల్పం వల్ల కలుగుతుంది దానికి కష్టం ,నష్టం తో పని లేదు .సాధ్యాసాధ్యాల జోలికి పోదు .కోరిక నేరవేరాలి అంతే .డాని వల్ల వచ్చే బాధలు దానికి పట్టవు .స్వర్గం లో వున్న వాడిని కోరిక అధః పాతాళానికి నేటేస్తుంది .ప్రశాంతం గా వున్న వాణ్ని అశాంతికి గురి చేస్తుంది .బంధాలలో పెద్ద బంధం కోరిక .కోరికనువిసర్జిస్తే ఆత్మ అమ్రుతానందం పొందుతుంది .ధన విషయమైన కోరికమరీ m పతనాన్ని తెస్తుందని ”మంకి ;;అనే బ్రాహ్మణుని కధవల్ల మనకు అవగతమైన విషయం .మనకు అచ్చిరాని ,చేతకాని విషయాలలో చేతులు పెట్టి కాల్చుకోరాడు .ఏ పని చేసి డబ్బు సంపాదించాలన్న ,దాని ఆనుపానులు గురించి అన్నీ తెలుసు కోని మొదలు పెట్టాలి .లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రవర్తిస్తే ఆ కోడె దూడల గతే అవుతుంది మంకి కి పట్టిన దుర్గతే పడ్తుంది
గబ్బిట దుర్గా ప్రసాద్
రచనా కాలమ్ –29 -01 -11 .

