మరక మంచిదే
రోడ్డు వెయ్యకుండా డబ్బు నోక్కావని మరక పడిందా –పర్లేదు నువ్వు సర్పంచికి అర్హుడివే
స్మశానం కబ్జా చేశా వని నింద పడిందా –మరక మంచిదే బడా కంట్రాక్టర్ ఖాయం
బడి లో పేకాట,,వ్యభిచారం చేస్తున్నావన్న ఆరోపనా ?మండలాద్యక్షుడు గారెంటీ
కోటా బియ్యం నోక్కేశావని చెవులు కోరుక్కున్టున్నారా ? నువ్వు సివిల్ సప్ప్లై కి అధిపతివే
నల్లదనమ్ కూడ బెట్టావని ఆరోపనా ?వెంటనే ఏం ఎల్.ఏ చాన్సు ఉందనే మరక మంచిదే
ఔటర్ రింగ్ రోడ్ ,కారిడార్లు ,సెజ్ లలో అపార ధనం దోచావన్నారా ?సి.ఏం .ఖాయం .
దేశాన్ని తాకట్టు పెట్టావని మరక పడిందా ఇంకేం పీ.ఏం .నువ్వే .
అవినీతి కుంభకోణం బయట పడిందా నువ్వే కేంద్ర మంత్రివి .
నువ్వు పాలించిన కాలమ్ లో ని అవినీతి బట్ట బయలయిందా నువ్వు ప్రతిపక్ష నేతవే
అధికారి గా వుండి ,అన్నీ నోక్కేశావా ఇంకేం నువ్వే అవినీతి శాఖ మంత్రి –సారీ అవినీతి నిరోధక శాఖా మంత్రి ,
వీధి రౌడీవని సెట్టిల్మెంట్లు చేస్తావని మరక పడిందా ?నగర మేయరువే–మేసే వాడు -మేయరు అని సామెత
కులగజ్జి ,మతపిచ్చి ,మూర్ఖత్వం అని ముద్ర పడిందా —నువ్వు బురిడీ బాబావే \
దేవాలయం నీ ధనాలయం అనుకున్నావని నిన్నన్నారా ?నువ్వే ఏడుకొండల వాడి విధి రాత రాసే ఆఫీసర్ వి —
చూశావా బ్రదర్ –మరక అంటితే ఎంత మేలో ఎంత గా ఎదిగి పోతావో
అక్షరం రాదనీ ఆంటే నువ్వే విశ్వ విద్యాలయాన్ని గిర్రున తిప్పే అధికారివి
నటన వాచకం రాదనీమరక అంటించార ?నువ్వే సూపర్ డూపర్ హీరో
అన్గాన్గంప్రదర్శించిందని ఆరోపణ ఉందా ?ఆమె బిజీ హీరోయిన్గా ఎదిగేది
ఎన్నని ఇలా చెప్పను ? ఏది రాక పోయినా కాకా పట్టావని చెవులు కోరుక్కున్నారా -భేష్ నీకు అడ్డులేదు -తిరుగు లేదు
కనక బ్రదరూ ,మరక అంటించు కొండి .అడ్డం గా ,నిలువుగా ఎదిగి పొండి –అందుకే అన్నిటికీ మరక ముఖ్యం
మరక అన్తిండా ,తేనే తుట్టెపట్టినట్లే రొట్టెనేతిలో పడ్డట్టే —-
అందుకే మరక మంచిది -మంచిది -మంచిది .
ఒళ్ళంతా అంటించుకోండి అడ్డు ,ఆపు లేకుండా ఎదిగి పొండి
మరక కడిగే వాడు లేదు ,తుడిచే వాడు లేదు .
మరకనీకు వరంమాకు శాపం …
గబ్బిట దుర్గా ప్రసాద్ —15 -06 -11

