నిత్య హరిత శ్రీ శ్రీ

                 నిత్య హరిత శ్రీ శ్రీ 
”అగ్ని సరస్సున వికసించిన వజ్రం ”అన్నారు   శ్రీ శ్రీ ని  శ్రీ అద్దేపల్లి రామ మోహన రావు .శ్రీ ఒక వండర్ ,థందర్ ,.మహా ప్రస్థానానికీ ,మరో ప్రస్థానానికి తన మాటల మంత్రం తో తనతో పాటు మనల్ని ,తీసుకొని వెళ్లి న మాటల మాయ గాడు .ఆయన ఒక word finder  .
                        సామ్య వాద వ్యవస్థను సమాజం లో స్థాపించే ధ్యేయం గల ఉద్యమ కవిత్వం అభ్యుదయ కవిత్వం .బాగా స్థిర పడ్డ వ్యవస్థ నిర్మూలన ,సామ్య వాదఅవగాహన కల్పించటం   ,దానికి తగ్గ భావ జాలం తయారుచేయటం ,దీనికి అనుగుణ మైన నవ్య కవితా రూపాని ప్రక్రియా స్వరూపాన్ని కల్పించటం ఈ ఉద్యమం లక్ష్యం .శ్రీ శ్రీ రాసిన ”సుప్తాస్తికలు ”తో అభ్యుదయ కవిత్వం ప్రారంభమైంది .ఛందస్సుని చేదించారు .పూర్వ కవులు కావ్య వస్తు వు గా తీసికొని అంశాలను ,ఎన్నుకొని ,కవిత్వం చెప్పారు .కొత్తదనం కోసం ప్రయోగాలు చేశారు .దీన్ని ప్రయోగ దశ అన్నారు .ఈ కోవకు చెందిన వారే శ్రీ శ్రీ ,శిష్ట్లా ,నారాయణ బాబు ,ముద్దుకృష్ణ ,పట్టాభి వగైరా కవులు .
                    ఛందస్సును ఫేదేల్ మని తన్నిన తర్వాత కవిత్వం ఏ రూపం లో ,ఏ ప్రయోగం కోసం ,ఎలా నిర్మించాలో తెలిసిన వాడు ,దర్శించిన వాడు శ్రీ శ్రీ మాత్రమే .ప్రతిభ తో గొప్పప్రయోగాలు చేశాడు .పరిణత ప్రజ్న కన పరిచాడు .అందుకే ప్రయోగ వాదుల్లో అతనే నాయకుడైనాడు .యూరప్ లో కవితా పరంగా వచ్చిన మార్పులనితికి ఇక్కడ రూప కల్పన చేశాడు .
             ఉద్యమాన్ని సమాజానికి అందించాడు శ్రీ శ్రీ .ఉద్యమ కవితకు ”మహా  ప్రస్తానం ”,కవితావోకవితా  ””జగన్నాధ రధ చక్రాలు” ఉదాహరణలు అభ్య్దయోద్యమ . కవితకు ఆదర్శ వంత మైన ప్రయోగాలు చేసి ,ఉద్యమానికి కావలసిన ఇంధనం అంతా సమకూర్చాడు .కవితా రూప శిల్పం కూడా కూడా బాగా వుంది .”రుక్కులు ”,”జయభేరి ”, ఇ ”దేశ చరిత్రలు ”లో ఆలోచనతో కూడిన భావ జాలాన్ని ,కవితను కళా ఖండం గా మార్చే స్థితినీ కల్పించాడు .ఆవేశం ,ఆలోచన అన్న జోడుగుర్రాల స్వారి చేశాడు .”హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనాలను మాటలుగా రూపొందించటం అతన్కే చేతనవుననిందరి చేత భేష్ అనిపించుకొన్నాడు .అతని మాటలు అక్షరాలూ కావు .ఉద్రేకాలు ,బాధలు ,యుద్దాలుహృదయం లోంచి డైరెక్ట్ గా పంపిన ఉత్చాహాలు ,నెత్తురు కాలువలు ,”అన్న చలం ఇంట్రో లోని మాటలు అక్షర సాక్ష్యాలు .ఉద్యమ ప్రారంభానికి కావలసిన ఆవేశం ,స్థిర పడటానికి ఆలోచనా ముఖ్యం .ఆ రెండు శ్రీ శ్రీ లో మెండు .గా వున్నాయి .కనుకనే శ్రీ శ్రీ ”కవిత్వ తత్వ విజయోజ్వలుడు ”,;;ఉభయ కవి మిత్రుడు ”అని ఆచార్య జి .వి.సుబ్రహ్మణ్యం  అన్నారు
                                                                           రెండో భాగం తర్వాత
                                                                                     మీ
                                                                                గబ్బిట దుర్గా ప్రసాద్ —–16 -06 -11 .

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.