ఎల్లలు
నా దేశానికి ఉత్తరాన మహోన్నత హిమ నగం
దక్షిణాన అగాధ హిందూ మహా సాగరం
పశ్చిమాన అరేబియా ,తూర్పున బంగాళా ఖాతం
సహజ ఎల్లలు గా ఇప్పటిదాకా చెప్పుకొని
పరవశించి మురిసి పోయే వాణ్ని
కానీ ,నా దేశానికి కాపలా కాస్తున్నది
ఉత్తరాన మిలిటేన్ట్లనీ ,దేశాద్రోహులనీ ,infiltrators అనీ
దక్షిణాన తమిళపులులనీ ,తస్కర ముష్కరులనీ
పడమట మామియాన్లనీ ,దావూద్ లనీ శివుని ప్రధమ గణాలనీ
తూర్పున బోడోలనీ ,బడాబాబులనీ ,,జార్ఖండ్ ఉగ్రవాడులనీ
తెలిసి అదిరి పడ్డాను –ఆవేశం తో వూగిపోయాను
ఈ నాలుగు హడ్డులనుంచి అరాచకం సృష్టించి
ఆటవికం గా ,పాశవికంగా ,సామాన్యులపై
విదేశీ శక్తుల క్రూర పద ఘట్టనలతో
నలుగుతూన్న భారతం నాది
నిత్యం రగులుతున్న మహా భారతం నాది
ఇది చాలదన్నట్లు మతం మత్తుతో
ఇజం ఈగో తో హజం కైపులో ,
అన్నదమ్ములు అనునిత్యం నరుక్కుంటున్న నరక భూమి నాది
విదేశీ రుణ భారం తో నడ్డి విరిగిన దేశం నాది
నేతల మాటకీ ,చేతకీ పొంతన లేని దేశం నాది
ఇలా ,ఇలా దిగాజారాల్సిన్దేనా? ?ఇంకా ఎంతకాలం ?
అందుకే మళ్ళీ కొత్త సరిహద్దులు కావాలంటాను నేను
ప్రగతికీ ,అభ్యుదయానికీ ,సంక్షేమానికీ ,సౌభాగ్యానికీ
ఉత్తరాన సహనం ,దక్షిణాన సంయమనం
పడమట సఖ్యం ,తూర్పునసామరస్యం
సహజ ఎల్లలు గా రక్షక , కవచాలుగా రూపొందిన నాడు
నా మాత్రు భూమి భారతికి నిజం గా మంగళ హారతి ..
రచన— గబ్బిట దుర్గా ప్రసాద్ ——17 -06 -11
రచనా కాలమ్ —21 -03 -93 ..

