ఎవరు తల్లీ !
అన్న దమ్ముల పంపకాల్లో రెండు చేతులు తెగినా
నిబ్బరం గా నిలిచావు ఇంతకాలం
నీ ముఖం లో తేజస్సు ,ఓజస్సు నిండి వుండేది
మిగిలిన నీ సర్వాన్గాలు బలోపేతం గా చలిస్తూన్దేవి
నీ ముఖం కాంతి చూసి ,క్రాన్తిదిశలో పరుగు మొదలు పెట్టాం
ఛీ చిరు నవ్వుల వెన్నెల్లో ఆనందపు అంచులు చూశాం
అభ్యుదయ పధం లో అడుగేస్తున్నామని భావించాం
అయితె ఒక్కసారిగా ఏమిటీ మార్పు నీలో ?
మండల మంటల్లో ,నీ చీర కాలిపోయినట్లుందే
పంజాబ్ మారణ కాండతోగాయమై రక్త సిక్తమై నట్లుంది నీ కాయం
ఒళ్ళంతా తూట్లు పడ్డట్లుంది మానలేని గాయాలతో
మహారాష్ట్ర మహా దానవ కాండలో నీకళ్ళు ,కాళ్ళు తెగి .
బాంబే బాంబులతో సర్వం కూలిపోయి సోలిపోయి
కలకత్తా విస్ఫోటనం తో నాలిక తెగిన కాళిలా
ఏనాడు ఏవైపు ఏం జరుగుతుందో తెలీని స్థితి లో
అపస్మారకం గా ,నిస్తేజం గా ,నిస్సత్తువగా మూల్గుతున్నావా
ఎవరు తల్లీ నీవు ?
పోల్చుకున్నాములే నిన్ను
భారత భాగ్య విదాయినివి గా
ఆర్ష ధర్మాన్ని విశ్వ మంతా నినదించిన విపంచి వనీ
మురళీ రవాన్నీ ,గీతామృతాన్ని ఎల్లలు దాటించి
పరవశించిన మహోన్నత మూర్తి వనీ
సత్యాహింసల సర్వోత్క్రుస్త భావ రాగాలాల పించిన మాతవనీ
మాతృత్వానికి మహోన్నత స్థానం కల్పించిన ఔదార్య మూర్తివనీ
పరమ పావని వనీ ,మాతవనీ ,భారత మాతవనీ
తెలిసి తల దిన్చుకున్నాము
వినమ్రులమై ,సిగ్గుతో ,చితికిన ఆశలతో
అణగారిన అహంకారం తో
మ్లానం గా దీనం గా అవమానం గా ..
రచన —గబ్బిట దుర్గా ప్రసాద్ —17 -06 -11 .
రచనా కాలమ్ —-22 -03 -1993

