నిత్య హరిత శ్రీ శ్రీ —–02

 నిత్య హరిత శ్రీ శ్రీ —–02
                         అభ్యదయ కవిత్వానికి ఖండ కావ్య ప్రక్రియే ఉత్తమ  మైనదని నిరూపించిన వాడు శ్రీ శ్రీ .రచన శస్త్రం లాంటిది .దాన్ని ఉపయోగించేపద్ధతిని   బట్టి ఫలితం వుంటుంది .అన్నాడు శ్రీ శ్రీ .ఉద్యమ భావ జాలాన్ని స్వయం గా నమ్మి ,ఆచరిస్తూ ,వాటిలో జీవిస్తూ ,కవి రాస్తే చరితార్ధమవుతుందని అంటాడు .ఆంటే marxist భావం ,మనసా ,వాచా ,క్రియా రూపం లో వుండాలని అతని భావం .నిబద్ధత లేని కవిత నిలవదు .1970  లో విప్లవ కవితా శంఖాన్ని పూరిస్తూ ,”సాయుధ విప్లవ భీభత్చ రధ సారధి నై ,భారత కురుక్షేత్రం లో నవయుగ భగవద్గీత ఝంఝాను వినిపిస్తా ”అన్నాడు .
                         ”ఈ శతాబ్దం నాది ”అని గర్వంగా చెప్పుకొన్నాడు శ్రీ శ్రీ .”అందుకే ”అభ్యుదయాంధ్ర యుగ కర్త”శ్రీ శ్రీ ఏ నని అందరి భావం .అతను నిజం గా ప్రజా కవి .వాళ్ల బాధలు ,కన్నీళ్లు ,అన్నీ తనవిగా భావించి స్పందించాడు .”నిజం గానే నేను ప్రజాకవినేను–ఎంచేతంటేను -వాళ్ళను చదివేను -చదివిందే రాసేను ”అంటాడు .ప్రజలను చదివి ,చదివింది రాసిన వాడే కదా ప్రజా కవి !
           హాస్య రస గులికల్లాంటి ”సిరిసిరి మువ్వ ”,ప్ప్రాసక్రీడలు ”,”లిమరిక్కులు ‘వగైరా రాశాడు .ఈ మూడిటిని కలిపి ‘సిప్రాలి ”అన్నాడు .దేన్నే విదూషక కవిత్వం అని తనే చెప్పుకొన్నాడు .కార్టూన్ కవిత్వమన్న  మాట. ”రామాయణాలే మళ్ళీ మళ్ళీ తెచ్చి ,మ్రుచ్చలించే కన్నా -ఆ మోస్తరు రచనల్లో క్షేమం కదా రామకోటి –సిరిసిరి మువ్వా ”అంటాడు సరదాగా .”గోల్డ్ వ్యామోహం చెడ్డది ,మైల్డ్ వ్యాపారం శరీర మాద్యం ఖలుడా –చైల్డ్ వ్యాపారం కూడదు –ఓల్డ్ వ్యూ లను హోల్డ్ చేయకోయి సిరిసిరి మువ్వా ”అని మణి ప్రవాళ సంకరం గానూ ప్రతిభావంతం గ చెప్ప గలడు .లిమరిక్కులు లో ”సమకాలిక జీవితమే సత్కవితా వస్తువు .అనృషీ ,కుకవీ చచ్చిన వంటే -పడి చస్తురు -నవ రసాల నాయకుణ్ణి -కవనం నా ఆయుధం -ఈ శతాబ్దం నేనేలు తుంటి ”అన్నాడు .”కరుణ రసం ,శృంగారం ,వాడిన పూరేకులు –వీర రసం ,భీభత్చం ఈ నాటి తుపాకులు ”శ్రీ నాధుని చాటువులకు ,శృంగార నైషధానికి యెంత తేడా వుందో శ్రీ శ్రీ విదూషక కవిత్వానికి ,మహా ప్రస్థానానికి అంత తేడా కనిపిస్తుంది ,.”వెలుగు నీడలు n”లో తన్ను ఆవిష్కరించుకొంటు ”విదుషకుని temperamentu  ,ఏదో ఒక discontentu  ,బ్రతుకులో experimentu ,పదాలు పేటెంట్ ,రసాలు torrent ,,సదసత్షమస్యకి solvent  శ్రీ శ్రీ gaint  ” అని తన రహస్యాన్ని బయలు పెట్టుకొన్నాడు .
              అనంత వచన సాహిత్యాన్ని వండి ,వడ్డించాడు .”అనంతం ”లో తనను తాను పూర్తిగా అవిష్కరించుకొన్నాడు .కధ నాటిక వ్యాసం ,ఉపన్యాసం ,సమీక్ష ,పీఠిక ,గళ్ళ నుడి కట్లు ,లేఖలు ఇలా ఎన్నిటినో పరిపుష్టం చేశాడు .”ప్రక్రియ ”ఆయన కలానికి ఓడిగిందే కాని ఆయన మీద ప్రభుత్వం చేయలేదు ..ఆయన మాటల్లోనే ”పద్యం ఎక్కువా గద్యం ఎక్కువ అనే సమస్య అభేద్యం .అయినా ఘంటా వాద్యంగా నేనంటా –నీ రెండు నాకే నైవేద్యం ”.ఖడ్గ సృష్టి చేస్తూ ”కాలం తో సృష్టిస్తున్న ఖడ్గం ఇది -కుళ్ళి పోతున్న సమాజ వృక్ష మూల చ్చేడం చెయ్యటం డాని ధ్యేయం ””అర్ధాన్ని అధ్వాన్నపు అడవిలో వదిలి-గద్యానికీ పద్యానికి –పెళ్లి చేదాం ”అని సర్రియలిజం ధోరణిలో శ్రీ శ్రీ దూసుకు పోయాడు .”జీబ్రాకి ,ఆల్జీబ్రా చిహ్నం ,లామ్కోటు ,పామ్కోళ్ళు తొడిగి ,సాహిత్య పౌరోహిత్యం యిస్తే –వెర్రికాదు –సర్రియలిజం సోదరా ”అనేస్తాడు తేలిగ్గా .
              ”  శ్రీ శ్రీ దృష్టిలో ప్రతి వస్తువు ,అపూర్వ వ్యక్తీ స్వేచ్చలోంచి పుట్టిన అంతర్ వ్యక్తీ .భాషలో భావన లో ,ఛందస్సు లో ,పద బంధం లో ఉక్తి చమత్కారం లో కొత్త పోకడలు పోయి తనదైన రస జగత్తును సృస్తిన్చుకోనాడు .కవిత్వం  లో స్వేచ్చకు శ్రీ శ్రీ పట్టం కట్టాడు .”భావ లయ”కు ప్రాధాన్యం ఇచ్చ్చాడు .అంతర్లయకు ప్రాణం పోశాడు .చెవికిమ్పైన శబ్ద ప్రయోగం చేశాడు .వచన కవిత్వం లో నడక వైవిధ్యానికి స్థానం కల్పించాడు .తిరుగు బాటుకు స్వేచ్చను ఊతకర్రను చేశాడు .”సంస్కృతం ,ఆంధ్రం ,పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయాల త్రివేణీ సంగమమే శ్రీ శ్రీ ప్రతిభా పరివాహక క్షేత్రం ”అన్న పెద్దల మాట చద్ది మూటే .
              ” నేనేదో రచిస్తాననీ -నా రచనలలో -లోకం ప్రతిఫలించి ,నా తపస్సు ఫలించి –నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ –నా జాతి జనులు పాడుకొనే మంత్రం లా మొగించాలనీ –నా ఆకాశాలను లోకానికి చేరువగా -నా ఆదర్శాలను సోదరులంతా పంచుకొనే వెలుగు రవ్వల జడిగా –అందీ అందక పోయే –నీ చేలాన్చాలముల -కొసగాలులతో నిర్మించిన —నా నుడి నీ గుడిగా –నా గీతం నైవేద్యం గా –హృద్యం గా అర్పిస్తానో -నా విసరిన రస విసృమర కుసుమ పరాగం —వోహో –రసదునీ –మనిఖనీ –జననీ వో కవితా కవితా వో కవితా వో కవితా ”ఈ గీతం సభలో శ్రీ శ్రీ చదువుతున్నప్పుడు అధ్యక్ష స్థానం లో వున్న కవి సమ్రాట్ విశ్వ నాద సత్య నారాయణ గారు చెమ్మగిల్లిన కళ్ళతోకోగిలించుకొని  కాగిత  గౌరవిన్చారట .అదీ ఆకవితకు ,కవితా నిర్వచనానికి ,శ్రీ శ్రీ కవితా ప్రాభవానికి లభించిన సరస్వతీ పురస్కారం .
                                                                                   ముగింపు తర్వాత
                                                                                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —-17 -06 -11 ..

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.