జ్ఞాపక శకలాలు ———–02
శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి
కధక చక్రవర్తి ,ప్రపంచ కధా రచయితల్లో ఒకరుగా పేరొందిన వారు శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .ఆయన కధల్లో ”వడ్లగింజలు ”చాల ప్రాచుర్యం పొందింది .కధ ఎత్తుకోవటం ,ముక్తాయింపు ఇవ్వటం లో సిద్ధ హస్తులు .ఆయన స్పృశించని వస్తువు లేదు ,స్పృశించి బంగారం గా మార్చని కధ లేదు .ప్రతి వాక్యం ఒక పేరా గా రాయటం ఆయన శైలి .ఏం .వి,.ఎల్ .నరసింహారావు అన్నట్లు ఒక వేలూరి శివ రామ శాస్త్రి ,ఒక శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి ,ఒక విశ్వ నాద సత్యనారాయణ ప్రపంచ కధానికా రచయితల స్థాయి లోని వారు .శ్రీ పాద వారి తెలుగు నుడికారం గోదారిఒయ్యారాలు పోతుంది భావం గాఢ౦ గా హృదయానికి తాకుతుంది మాటకు సొగసులు చెక్కే మర్మం ఆయనది .భాషకు సువాసన అందించటం ఆయన నేర్పు .ఆయన తీరు ,నడక ,వేషం ,భాష ,అంతా కళాత్మకం గా వుంటుంది .అగ్ర కులం లో జన్మించినా అన్త్యజులను అక్కున చేర్చుకొన్నా మనీషి .సంస్కారం ఆయన ప్రత్యేకత .పురోగామిత్వం ఆయన నైజం .ఆయన రాసిన ”అనుభవాలు-జ్ఞాపకాలూను ”అనే పుస్తకం లో ఆనాటి పల్లె టూరి అగ్రహారాల జీవితకళ్ళకుకడుతుంది. అందరు చదివి తీరాల్సిన పుస్తకం .ఆయుర్వేద మందులు తయారు చేశారు ,పుస్తకాలు అచ్చు వేశారు .ముక్కుకు సూటిగా నడిచి కొంత ఇబ్బందీ పడ్డారు .హిందీని వ్యతిరేకించారు .చెప్పింది చేశారు ,రాశారు ,చేసేదే చెప్పారు .తెలుగు కధా శ్రీపాదులు శాస్త్రి గారు .
చెకోవ్
కాలాన్ని అధిగమించిన క్రాంత దర్శి ,ప్రపంచ కదానికారచయితల్లో అగ్రేసరుడు చెకోవ్ ..ఆయన జయంతి ఏప్రిల్ 30 సుమారు నూట యాభై సంవత్చరాల క్రితం వాడు .సమకాలీనుల మెప్పు పొంద లేక పోయాడు .అంతమాత్రాన ఆయన గొప్పదనం ఆగిపోలేదు .సుమారు 130 ఏళ్ళక్రితం రాసిన ”గూస్ బెర్రీస్ ”కధ చాల మంచిపేరు తెచ్చింది .ఆయన తన కాల౦ కన్నా ఎన్నో దశాబ్దాలు ముందుండే ఆలోచనా పరుడు .వంచన హింస ,అవమానాలను ఎదిరించాటమే ఆయన వ్యక్తిత్వం .”మాన్ ,sixthnumber వార్డ్ ,విండో మొదలైన కధలు విశ్వ విఖ్యాతి చెందాయి .వ్యంగ్యం గా కరుణ రసార్ద్రం గా రాయటం ఆయనకే చెల్లింది ఆయనకు ఘన నివాళిగా unesco చెకోవ్ నామ సంవత్స రాన్ని జరిపింది .ఇలాంటి సంస్మరనాలను ఆయన ”దిన వారాలు ‘అని ఎగతాళి చేసే వాడు .(rituals )రష్యా కు చెందిన ఈ మహారచయిత గురించి రష్యా సాహిత్య పితామహుడు leo tolstoi ”చెకోవ్ అసమాన ప్రతిభ కల వాడు .ఆయనకు పోలిక ఎవరు లేరు .జీవితాన్ని చిత్రించిన మహా రచయిత .ప్రతి ఒక్కరికీ అర్ధమయేట్లు రాయటమే ఆయన ప్రత్యేకత ”ఇంగ్లాండ్ కు చెందిన బెర్నార్డ్ షా ”సంపూర్ణ నాటక కళా చైతన్యాన్ని పొందుతున్న రచయిత చెకోవ్ .ఆయన్ను చూస్తె నేను ఇప్పుడిప్పుడే తప్పటడుగులు ప్రారంభించిన వాడినేమోనని పిస్తోంది ”అని ఘన నివాళి అందించాడు .ఆయన నాటకాలు జన హృదయాలను ఆవిష్కరించాయి అందుకే ఆయను నాటక రంగ ప్రస్తానం లో ముందుకు దూసుకు పోతున్న విజయ ధ్వజం చెకోవ్ ‘అన్నారు .
కులపతి
బందరులో పుట్టి ,ఎందరో మహా మహులకు గురువై కులపతిగా కీర్తిపొంది అభినవ కణ్వ మహర్షిగా పేరొంది న వాడు రఘుపతి వెంకట రత్నం నాయుడు ..పట్టాభి ,చలం ,కృష్ణ శాస్త్రి లకు ఆదర్శ ప్రాయుడు .అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చిన మేటి అధ్యాపకుడు .బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ఆంద్ర రాజా రామ మోహన రాయ్ అనిపించుకోనాడు .మద్రాస్ విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులై అంతర్ముఖుడైన బ్రహర్షి నాయుడు గారు .
మహా కవి కాళిదాస్
దివికి భువికి మనోజ్న మైన అనుసంధానాన్ని కల్గించి ,ప్రపంచ నాటక కర్తలలో అతి గొప్పవాడని జర్మన్ మహా పండితుడు ”గోథె”చే ప్రశంశించ బడిన వాడు ,శ్లోక చతుష్టయం తో మానవ మనోధర్మాన్ని ఆవిష్కరించిన వాడు ,మత్తేభాన్ని దూతగా దూత మత్తేభం ఆంటే మేఘసందేశం వ్రాసి అందులో భారత దేశపు భౌగోళిక స్వరూపాన్ని అత్యద్భుతం గా వర్ణించిన వాడు ,”అస్చుత్తరశ్యాం డిసి దేవ తాత్మా హిమాలయో నాభి నగాధి రాజా ”అని హిమవంతుని సౌందర్యాన్ని పరవశించి వర్ణించి ,రఘువంశ కుమార సంభావాలలో గొప్ప కావ్య గౌరవాన్ని సంతరించిన కవికుల గురువు కాళిదాస మహా కవి కి ప్రతియేటా మే నెల 23 న మధ్య ప్రదేశ్ లోని ఉజ్జైన్ లో ”కాళిదాస సమారొహ్ ”ఆంటే కాళిదాస ఉత్చవం జరుపు తారు .దేశం లో కళా ,సాహిత్య ,సంగీతాలలో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి ”కాళిదాస్ సమ్మాన్ ”పురస్కారాన్ని అందించి ఆ మహా కవిని స్మరించి తరిస్తారు .ఉపమా కాళిదాసస్య అని పెరుపొందాడాయన ,వాక్కుకు అర్ధానికి విడదీయ రాని బంధం వుందని నిరూపించాడు .
హరీన్ చట్తో
” ఒకరికిచెప్పగల మనుకోవటం అహంభావం -ఒకరికి చెప్పాలనే కోర్కె మనోదుర్బలం ”అని మానవ స్వభావాన్ని అద్దం చెప్పినట్లుగా చెప్పిన వాడు ప్రముఖ పార్లమెంటేరియన్ ,కవి ,నటుడు ,గాయకుడు విమర్శకుడు అందరిచే ఆప్యాయంగా ”హరీన్ చట్తో”అనిపిలిపించుకొనే హరీంద్రనాథ చట్టోపాధ్యాయ .93 సంవత్చరాలసుదీర్ఘజీవితాన్ని రుచిచూసిన వాడు .21 యొక్క ఏళ్ళ క్రితం 23 -06 -1990lo మరణించాడు
.బెజవాడ పార్లమెంటరీ నియోజక వర్గానికి మొదటి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన వాడు .ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు .మహాకవి .సౌ౦దర్యారాధకుడు .ఆధ్యాత్మిక వాది .అభ్యుదయ పద గామి .ఆయన ధర్మ పత్ని కమలా దేవి చట్టోపాధ్యాయ .ఆయనే ఆమెకు స్ఫూర్తి .ఆయన సోదరే సరోజినీ నాయుడు .రవీంద్రనాథ టాగూర్ ”నా వారసుడు హరీన్ ”అన్నాడంటే ఆయన గొప్పతనమేమిటో మనకు తెలుస్తోంది
పై మహానుభావుల గురించిసూక్ష్మ పరిచయం చేశాను .వారి స్ఫూర్తి పొందాలంటే ఇంకా విస్తృతం గా అధ్యయనం చేయాలి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -06 -11

