మా అక్కయ్య అనురాగ కవితా సంపుటి ఆవిష్కరణ సభ
ఆడియో
— ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆదివారం సాయం సంధ్య వేల ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో సరసభారతి ఇరవైఎనిమిదవ సమావేశం లో వందమంది సాహిత్యాభిమానులు ,రచయితలు ,కవులు ,వివిధ పత్రికల అధినేతలు ,హాజరై సభకు నిండుదనం తెచ్చారు .ఆహ్వానించిన అతిధులంతా సమయానికి విచ్చేసి సహకరించారు .వేదిక మీదకు అతిధులను నేను ఆహ్వానించగా ,సరసభారతి సభ్యులు వారిని ఫలాలతో సత్కరించి వేదిక పై ఆసీనులఎట్లు చేశారు .రెండు చారిత్రిక సంఘటనల మధ్య ఈ సమావేశం జరుగుతోందని ఆహ్వానం పలుకుతూ అన్నాను ,అన్నా హజారే గారి పిలుపుతో దేశ ప్రజలంతా ఆయన కు సంపూర్ణ మద్దతు నిచ్చి నిలబడి హజారే కోరిన మార్పులను జన లోక్పాల్ లో పార్లమెంట్ ఆమోదించటం ప్రజావిజయం అనీ ,అది నిన్ననే జరిగిందని ,రేపు అంటే ఇరవైతోమ్మిదవ తేది వ్యావహారిక భాషోద్యమ సారధి గిడుగు రామ మూర్తి గారి జయంతి అని దానిని ”తెలుగుభాషా దినోత్చావం ”గా జరుపుకొంటామని .ఇంకో మూడు రోజుల్లో భారత ప్రజల తొలి పండుగ వినాయక చవితి జరుపుకొ బోతున్నామని
ఈ నేపధ్యం లో ఈ పుస్తకావిష్కరణ జరాటం ఆనందదాయకం గా వుందని అన్నాను .ఆహ్వానించిన వారంతా విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాను .విస్తృతమైన ప్రచారం చేసిన పత్రికల వారికీ ,”వార్తా విపంచి ”ద్వారా దాదాపు ప్రతిరోజూ పుస్తక ఆవిష్కరణను శ్రోతలకు తెలియజేసిన విజయవాడ ఆకాశ వాణి కేంద్రానికి దాని డైరెక్టర్ మాన్యశ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపాను .ఈ వేదికను స్వర్గీయ వేగుంట మోహన ప్రసాద్ (మో) వేదిక గా,నిర్వహిస్తున్నామని ,ఈ సభ వారికి అంకితం అనీ అన్నాను .
”మా అక్కయ్య ”అనురాగ కవితా సంపుటిని శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తున్నందుకు సంతోషం గా వుందని ఇది రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరిస్తున సరసభారతి అయిదవ పుస్తకమని ,సరసభారతి ప్రచురించిన అయిదు పుస్తకాలను ప్రసాద్ అమృత హస్తాలతో ఆవిశారించటం చారిత్రాత్మకమనిఅన్నాను . పుస్తకావిష్కరణ చేసిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనకు సరసభారతి గొప్ప అదృష్టాన్ని కల్గించిందని ,అన్ని పుస్తకాలను తనతో ఆవిష్కరిమ్పజేయటం సరసభారతి విశాల హృదయానికి నిదర్శనమని ,మానవత్వపు విలువలు మరిచి పోతున్న ఈ కాలమ్ లో అనురాగాలు ఆత్మీయతలను దూరం చేసుకొంటున్న తరుణం లో ఉగాది నాడు యాభై మంది కవులతో ”మా అక్కయ్య ”శీర్హికతో కవి సమ్మేళనం నిర్వహించి ,అయిదు నెలల్లోనే పుస్తకం గా ముద్రించి ఆవిష్కరించటం అద్భుత మైన విషయం అనీ ,సరసభారతి ,దాని నిర్వాహకులు అకున్తిత దీక్ష తో చేస్తున్న సాహితీ కార్యక్రమాలకు తరచుగా తనను ఆహ్వానించటం ముదావహం గా వుందనిఅన్నారు ఈ లైబ్రరీ నిర్మాణం లో దుర్గా ప్రసాద్ కృషి ఎంతో వుందని ,దీనికి ఆర్ధిక సాయం చేసిన శ్రీ మైనేని గోపాల క్రిష్నయ్య గారి ఉదారహృదానికి ధన్యవాదాలని చెప్పారు .ఇలాంటి సభలు హాయిగా జరుపు కోవటానికి దీని పైన సభా మందిరం నిర్మించాలన్న కోరిక చాలా కాలమ్ గా దుర్గా ప్రసాద్ మాస్టారు కోరుతున్నారని ఆ కోరిక కొద్ది కాలమ్ లో తీరబోతోందని చెప్పారు .పై అంతస్తుకు నాలుగు లక్షల రూపాయలు జిల్లా గ్రంధాలయ సంస్థ మంజూరు చేసిందని ,అన్ని సౌకర్యాలతో పై అంతస్తు నిర్మించి సాహిత్య సంగీత కళా సాంస్కృతిక వేదిక గా దాన్ని తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు .డబ్బు సాంక్షన్ చేసిన జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీ రొంది కృష్ణ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు …సమాజ హితం తో ,విస్తృత ప్రయోజనాలకోసం కవులు రాయాలని ,సమాజ హితం ముఖ్యమని తెలుగు భాషను అందరం కలిసి రక్శీన్చు కోవాలని అన్నారు ..
ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ యెన్ .వి ఎస్ .చలపతిరావు గారు తమ పత్రిక సాహిత్యాన్ని పోషించటానికి యువకులకు ,బాలలకు ప్రత్యెక స్శీర్శికలు నిర్వహిస్తున్నామని ,వాటికి రచనలు పంపమని కోరారు .తర్వాత శ్రీ చలపతిరావు గారికి సరసభారతి ఘనం గా ,శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేతులమీదుగా దుర్గా ప్రసాద్ దంపతులు సత్కారం జరిపించారు .పత్రికా విలేఖరులు కూడా రావు గారిని చాలా ఆత్మీయం గా సన్మానించారు .పూలహారాలతో ,శాలువాలతో ముంచెత్తారు .రావు గారు కృతజ్ఞతలు తెలియ జేశారు
నెల్లూరు లోని సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ vice చైర్మన్ ,”స్టేట్ లీడర్ ”జాతీయ పక్ష పత్రిక సంపాదకులు శ్రీ సర్వేపల్లి రామ మూర్తి గారు ఆత్మీయ అతిధి గా ప్రసంగిస్తూ ,ఇక్కడి ఈ సాహితీ వాతావరణం తనను ముగ్ధుణ్ణి చేసిందని ,ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు ,ప్రచురిస్తున పుస్తకాలు ఎందరికో ప్రేరణ కల్గిస్తాయని ,ఇంకా అభివృద్ధి లోకి సరసభారతి రావాలని యువతకు ప్రత్యెక కార్య క్రమాలనూ నిర్వహించాలని హితవు పలికారు .
కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య కార్య దర్శి డాక్టర్ శ్రీ జి .వి .పూర్ణచంద్ తమ అభిభాషణలో ఉయ్యూరు లో మాస్టారు ఆధ్వర్యం లో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమాలకు తాను ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు హాజరవుతూన్తామని ,చాలా నిష్టతో ,సమయపాలనతో ,ప్రయోజనంతో సరసభారతి కార్యక్రమాలునిర్వహిస్తోందని ,అయిదు పుస్తకాలు ప్రచురించటం ఆశా మాషీ కాదని ,కృష్ణా జిల్లా రచయితల సంఘం చేసే ప్రతి కార్యక్రమానికీ మాస్టారు తప్పక హాజరవుతారని తమలో ఆయన ఒకరనీ ,తాము ప్రచురించిన పుస్తకాలన్నితిలో మాస్త్త్రి విలువైన రచనలున్నాయని ,తాము ఇటీవల నిర్వహించిన ప్రపంచ సభలు గొప్ప స్పూర్తిని కలిగించి ఆధునిక సాంకేతికత తెలుగు భాష కు ఎలా ఉపయోగ పడుతోందో ,భాషా వ్యాప్తికి దోహదపడుతోందో అందరికి తెలుసుకొనే అవకాశం కల్గిందని అన్నారు .
మాచిలి పట్నం బోధన కళాశాల రెతిరెద్ ప్రిన్సిపాల్ ,మరియు ,మినీ కవితోద్యమ సారధి ,వందలాది సభాలోఅను నిర్వహించిన వారు ,యువకవులకు ప్రేరణ ,ఎన్నో పుస్తకాలను ప్రచురించిన రావి రంగా రావు గారు ప్రసంగిస్తూ ,తాను అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఎప్పుడో కవితలు రాసానని కవులు యెంత రాశామని కాక యెంత బాగా రాశామో ఆలోచించి రాయాలని సంక్షిప్తత చాలా ముఖ్యమని ,కవిత హృదయానికిచేరువ కావాలని రాసి కంటే వాసి ముఖ్యం అని ,అక్కయ్య మీద కవిసంమేలనానికి తాను హాజరయానని ,పుస్తకావిష్కరణకు తనను పిలవటం తన పట్ల నిర్వాహకులకున్న సహృదయతే నని ,మానవీయ సంబంధాలు శిదిలమైతే మనుష్యులుగా మన గలగలేమని వాటిని కాపాడుకోవాలని సూచించారు .
సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి శ్రావ్యమైన కంఠం తో తెలుగు భాషతియ్యదనంపై మంచి పాట పాడి జన రంజనం చేశారు .ప్రసిద్ధ కవులు రచయితలు ,సాహితీ సభా నిర్వాహకులు అయిన శ్రీ వేలూరి కౌండిన్య ,శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,శ్రీమతి వి ;శ్రీ ఉమామహేశ్వరి గార్లు సహృదయ స్పందన తెలుపుతూ వుయురుకు ఎప్పుడు పిలిచినా వస్తున్నామని ఇక్కడి వారి పిలుపు లో ఆత్మీయత ,అనురాగం ఉంటాయని అందుకే తప్పకుండా వస్తున్తామని అన్నారు .ఆంద్ర ఉపన్యాసకురాలు డాక్టర్ శ్రీ లత సరసభారతి లో తాను ఒకరుగా వుండటం గర్వ కారణం గా వుందని మంచి కార్యక్రాలను నిర్వహించటం ,అందరికి సమాన మైన ప్రాతినిధ్యాన్నీవ్వతమ్ ఇక్కడి వారి ప్రత్యేకత యారు .కోస్తా ప్రభ సంపాదకులు శ్రీ శ్రీరాం యాదవ్ ,చిన్నయ సూరి విజ్ఞాన పరిషత్ కార్యదర్శి శ్రీ టి .శోభనాద్రి గార్లు మానవీయతకు పట్టం కట్టే ఇలాంటి కార్యక్రమాలు తరుచు జరగాలని కోరారు .అతిదులందరికి జ్ఞాపికలు సరసభారతి అంద జేసింది .
తరువాత ”మా అక్కయ్య కవితా సంపుటిపై సమీక్షను ఆంధ్రా బాంక్ ఆఫీసర్ ,మినీ కవితా సారధి శ్రీ వసుధ బసవేశ్వర రావు నిర్వహించారు .పద్యకవిత్వం పై సమీక్షను గుడివాడ ఆంద్ర బాంక్ సీనియర్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ జి.వి .బి. శర్మ చేశారు .కవుల కవిత్వం లోని లోతు పాట్లను తెలియజేశారు .గుండెకు తాకినా కవితలను ఉదాహరించారు .కైకలూర్ లోని సాహితీ మిత్రులు సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ చింతపల్లి వెంకట నారాయణ కవిత్వాన్ని విశ్లేషించారు .మంచి కవితా హృదయం తో ఆలోచనాత్మకం గా ,గుండెలను పిందేన్టగాకవితలున్నాయని,అందరు ఫీల్ అయి రాశారని మంచితరుణం లో మంచి పుస్తకం వచ్చిందని అందరు అభినంద నీయులే నన్నారు .
యువకుడు ,ఉత్చాహవంతుడు ,రమ్యభారతి త్రైమాస పత్రిక సంపాదకుడు కవి ,కధారచయిత ,అనేక బహుమతుల గ్రహీత మంచి నిర్వాహక సామర్ధ్యం వున్న వారు అయిన శ్రీ చలపాక ప్రకాష్ సభాధ్యక్షత వహించారు .ఇందరు పెద్దలుండగా సభాధ్యక్షతను యువకుడైన తనను చేయటం సరసభారతి నిర్వాహకుల వినూత్న ద్రుష్టి అని ,యువతకు యెంత ప్రాధాన్యత ఇక్కడ లభిస్తోందో దీన్ని బట్టే అర్ధమవుతోందని ,తాను ఇక్కడి కార్యక్రమాలకు ఈ మధ్య తరచుగా వస్తున్నానని వీరి సభానిర్వహణ నిర్దుష్టం గావ్ ఉంటుందని మెచ్చారు .చాలా హుందాగా ,అర్ధవంతం గా ప్రకాష్ సభను నిర్వహించి అందరి ప్రశంసలు అందుకొన్నారు .బాంధవ్యాలను మరిచి పోతున్న తరుణం లో అక్కయ్యకు పెద్ద పీత వేశారని అలాగే పిన్ని ,బాబాయ్ ,తాతయ్య నానమ్మ ,అమ్మమ్మల పై కూడా కవిసంమేలనాలు నిర్వహించి యువకులను భాగ స్వామ్యులను చేయాలని కోరారు .
చివరగా నేను మాట్లాడాను .ఈ పుసకం ఇంత సర్వాంగ సుందరం గా తయారవటానికి కారకులు శ్రీ వసుధ ,మరియు శ్రీ వెంకట నారాయణ గారలె.వారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ఒక్క కృతజ్ఞత చెప్పటం తప్ప అన్నాను .సాధారణం గా కవి సమ్మేళనం అంటే కవులు తమ కవిత్వం చదివి వినిపించావచ్చని ఆశ తో వస్తారు .కాని ఈ రోజూ కవిసంమీలనానికి మించి కవులు ,సాహిత్యాభిమానులు ఇంతమంది విచ్చేయటం ఉయ్యూరు మీద సరసభారతి మీద వున్న గొప్ప నమ్మకం మాత్రమే నని తెలిసింది .ముఖ్యం గా మహిలామతల్లులు అంతంత దూరం నుంచి రావటం ఎంతో మహదానందం గా వుంది నాకు ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు ,వదినలు పిన్నులు ,అమ్మక్కయ్యలు ,మాత్రుమూర్తులున్నారని తెలిసి మురిసి పోతున్నాను .మీ ఋణం నేను తీర్చుకోలేను .చేతులెత్తి అందరికి నమస్కరించి నా అశక్తతను సవినయం గా తెలుపుకొంటున్నాను .అని నా కృతజ్ఞతలు తెలియ జేశాను .నాకు సహకరించి ఈ కార్య క్రమం ఇంత వేడుక గా నిర్వహించటానికి తోడ్పడిన నా కుటుంబ సభ్యులకు ,నాకు చేదోడు వాదోడుగా నిలిచిన కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శిఉవలక్శ్మికి టెక్నికల్ ,సలహాదారు ,ప్రచార సారధి శ్రీ బాల గంగాధర రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశాను
చివరగా శ్రీమతి శివలక్ష్మి వందన సమర్పణ చేశారు .జనగణ మన తో సభ పూర్తి అయింది .మూడు గంటల పాటు మహదానందం గా ,క్రికిరిసిన సాహిత్యాభిమానులతోఆవిష్కరణ సభ చిరస్మరణీయం అయింది .సహకరించిన లైబ్రరీ యాజమాన్యం అభినందనీయులు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -08 -11.