విశ్వకవి రవీంద్ర, మహాకవి గురజాడ (150) వ జయంతి ఉత్సవ సభలు ఉయ్యూరు లో 22.10.2011 AG & SG కాలేజీ లో జరిగాయి
సాహితీ బంధువులకు –దీపావళి శుభా కాంక్షలు .ఇవాళ సరసభారతి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ,ఉయ్యూరు డిగ్రీ కాలేజి సంయుక్తం గా నిర్వహించిన టాగూర్ ,గురజాడ ల 150 జయంతి ఉత్చావ సభలు అద్భుతం గా జరిగాయి .విద్యార్ధులు బాగా స్పందించారు .ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు మధ్యలో ఒక గంట విరామం తో జరిగాయి అందరు బాగా మాట్లాడి విద్యార్ధులను ఆకర్షించారు .ఇద్దరు విద్యార్ధులతో రవీంద్రుని ,గురజాడ వేషాలు వేయించి స్టేజి మీద మీటింగ్ అయేవరకు కూర్చో పెట్టాం .అంటే వారిద్దరి సమక్షం లో సభ జరిగిన అనుభూతి కల్గిన్చాము .ఆలోచన నాది ఆచరణ ఫ్లోరా హై స్చ్ల్ ప్రిన్సిపాల్ అయిన శ్యామలా దేవి గారికిది .చాలా అద్భుతం అని అందరు అభినందించారు .ఇలా ఇద్దరి జయంతి ఒకే వేదిక మీద ఎవరు ఇంతవరకు చెయ్యలేదు .ఈ వేషాలు అదనపు ఆకర్షణ .వారిద్దరికీ మండలి బుధ ప్రసాద్ గారి తో జ్ఞాపికలు అంద జేయిన్చాము .చాలాగొప్పగా జరిపించినందుకు అందరు మమ్మల్ని అభినందించారు .అతిదులందరికి ,వచ్చిన సాహితీ ప్రియులకు ఉదయం టిఫిన్ ,మధ్యాహ్నం భోజనం ,సాఉయన్త్రమ్ టిఫిన్ టీ ,మధ్యాహ్నం పదకొండు గంటలకు టీ ఇచ్చారు clollege వాళ్ళు .ఆ సభలో రచయితల సంఘం సరసభారతి కలిసి ప్రిన్సిపాల్ శ్రీ రాయుడు గారికి surprise గా సన్మానం చేశాం .ఆనందం తో ఆయనకు నోట మాట రాలేదు .విద్యార్ధులతో వారి స్పందనను తెలియజేయిన్చాము .ఉదయం ఇద్దరు శ్రీ మాదిరాజు రామలింగేస్వర రావు గారు ,ద్వా.నా. శాస్త్రి ,గారు సాయంత్రం శ్రీ ఎస్.వి రావు ,శ్రీమతి కే.లావణ్య ,శ్రీ గుమ్మా సాంబశివ రావు లు వరుసగా గీతాంజలి ,కన్యాశుల్కం ,టాగూర్ జీవితం ,టాగూర్ ఇతర రచనలు ,గురజాడ ,రచనలు జీవితం పై అద్భుత ప్రసంగాలు చేశారు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిధి గా విచ్చేసి స్ఫోర్తి కలగే టట్లు మాట్లాడారు .కే సి పీ .జెనెరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర రావు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షా కార్యదర్శులు శ్రీ సుబ్బా రావు .శ్రీ పూర్ణచంద్ సభాధ్యక్షత ,లక్ష్య ప్రస్తావన చేశారు .విద్యార్ధులకు గురజాడ టాగూర్ లపై వ్యాస రచన ,వక్తృత్వం లో పోటీలు నిర్వైంచి విజేతలకు బుద్ధ ప్రసాద్ గారిచే బహుమతులు అంద జేశాము .అందరికి గొప్ప సంతృప్తిని కల్గించిన సభ గా మన్ననలు అందుకొన్నాము .—మీ దుర్గా ప్రసాద్




