గురజాడ కన్యాశుల్కం —–1

గురజాడ కన్యాశుల్కం —–1
                          నవయుగ వైతాళికుడు ,తెలుగు జాతి కి మహోదయాన్ని తెచ్చిన వేగుచుక ,యుగపురుషుడు గురజాడ వెంకట అప్పా రావు కన్యాశుల్క నాటకం గురజాడ అపూర్వ సృష్టి .ఈ నాటకాన్ని 1892 ఆగస్ట్ 13 న   జగ్కన్నాధ విలాసినీ నాటక సమాజం వారు మొట్టమొదటి సారిగా విజయనగరం లో ప్రదర్శించారు .ప్రజలంతా తండోప తండాలుగా వచ్చి చూశారు .చాలా బాగుందని మెచ్చారు .పౌరాణిక నాటకాలతో విసిగి పోయిన వారికి ఒక గొప్ప రిలీఫ్ ను ఈ నాటకం ఇచ్చింది .అందులోని పాత్రలన్నీ నిజజీవితం లోనివి అవటం ,భాష సజీవం గా వుంది విజయనగర మాండలీకాన్ని ఉపయోగించటం జనానికి నచ్చింది .ప్రదర్శన్ అత్యద్భుత విజయం .ఈ నాటక ప్రదర్శన పై విజయనగర ఆంగ్ల పత్రిక ”The telugu harp ”ఆంగ్లం లో ”కన్యాశుల్కం రచనలో ,ఆంద్ర నాటక సాహిత్యం లో ఒక సరికొత్త పద్ధతి,కొత్తమార్గాన్ని ప్రారంభించిందనీ ఇతివృత్తం తో మన కళ్ళ ఎదుట జర్గే సంఘటనల్ని ,మనం రోజూ చూసే మనుషుల్ని గొప్ప గా పాత్రలుగా చిత్రిన్చారానీ సన్నివేశ కల్పన ,హాస్యరస పోషణ తో పాటు చిత్రీకరణ ,characterization  చాలా బాగా వుంది ”అని ప్రశంశించింది
                      ఆ తర్వాత అనేక నాటక బృందాలు కన్యాశుల్కాన్ని ప్రదర్శించాయి .శ్రీ స్థానం నరశింహారావు గారు వంద సార్లు ప్రదర్శించి నట్లు చెపారు .శ్రీకులం నటరాజ సమితి 350 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు .అబ్బూరి రామ కృష్ణా రావు గారు కూడా 100  ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు .ఆయనే ”కన్యాశుల్కం నేడే కాదు రేపతికోడా ఆడదగిందీ ,చూడ దగిందీ ”అన్నారు .నటరాజ కళాసమితి వారు వారు జే.వి.సోమయాజులు రామప్ప పంతులుగా ,ఆయన తమ్ముడు రమణమూర్తి గిరీశం గా నటించి ,నాటకానికి మంచి సౌష్టవం ,పేరు ,ప్రఖ్యాతులు తెచ్చారు .వీరిదరు ఆ తర్వాత సినిమా నటులూ అయారు .అయినా వీలు దొరికి నప్పుడల్లా నాటకాన్ని ప్రదర్శించే వారు .కన్యాశుల్కానికి వందేళ్ళు వచ్చిన సందర్భం గా 1992 జూన్ 27 న విశాఖపట్నం లో గొప్ప ప్రదర్శన ఇచ్చారు .ప్రేక్షకులు విపరీతం గా మెచ్చి మర్నాడు కూడా నాటకం వేయమని కోరితే వేసి ప్రేక్షక దేవుళ్ళ మనోభీష్టాన్ని నెరవేర్చారు సోమయాజులుసోదరులు . . గిరీశం లోని ఆశాధభూతిత్వాన్ని లౌక్యాన్ని రమణమూర్తి రక్తి కట్టించారు .సంహాశానలను చాలా సహజం గా పలికి,modulation  తో జనఃరుదయం గెలిచారు గిరీశం అంటే రామనమూర్తే వేయాలి అనిపించారు .ఆయన హావ ,భావ ప్రకటనకు ముగ్దులయారు జనం .సోమయాజులు రామప్ప పంతులుగా దామ్బికాన్ని ,భేషజాన్ని ,జాకాల్ తత్వాని బహు ప్రశంశనీయం గా నటించి జీవించారు .వీరిద్దరి combination ఆ రోజుల్లో అదుర్స్ అనిపించేది ..
                    ప్రముఖ రంగస్థల నటుడు ,ఆంద్ర విశ్వ విద్యాలి నాటక రంగ దర్శకులు స్వర్గీయ కత్తుల వెంకటేశ్వర రావు radio  లో కన్యాశుల్కాన్ని ఆకర్షణీయం గా వేసి మెప్పించాడు .తాను గిరీశం పాత్రధారణ చేశాడు .విజయనగారమాన్దలికాన్ని అర్ధవంతం గా పలికే నేర్పు ఆయనకు బాగా వుండేది .నటనలోగొప్ప ease  వుండేది  .
                 ఆ కాలమ్ లో కన్యాశుల్కాన్ని మూడు గంటల పాటు ప్రదర్శించేవారు .నాటకాన్ని కుదించటం వల్ల ప్రయోజనం దెబ్బతింటోంది అనే భావన కలిగింది చాలా మందిలో .అందుకనే నూరేళ్ళ పండుగ నాడు 1992  నవంబర్ లో నాటకాన్ని 49 మంది కళాకారులతో ,తొమ్మిది గంటల పాటు ప్రదర్శన్ జరిపారు .అది ఒక గొప్ప అనుభూతి గా మిగిలి పోయింది .కన్యాశుల్కాన్ని ఒకే వేదిక మీద కంటే ,వేదికల సముదాయలపై ప్రదర్శిస్తే ఇంకా గొప్ప గా ఉంటుందనే ఆలోచన వచ్చింది .డ్రామా అండ్ సౌండ్ విభాగం వారు ”రూప వాణి ”(లైట్ అండ్ సౌండ్ )ద్వారా ప్రదర్శిస్తే అనుభూతి గొప్పగా ఉంటుందని భావించి ప్రఖ్యాత నటులు ,పత్రికా రచయిత శ్రీ ఏ.ఆర్ .కృష్ణ నాటకం గా మలిచి ప్రదర్శించి మంచి ఫలితం సాధించారు .అప్పుడే నాటకం చోశామన్న సంతృప్తి కలిగింది అందరికి .కన్యాశుల్కం సినిమా గా కూడా వచ్చింది యెన్.టి .రామా రావు గిరీశం గా ,సావిత్రి మధురవానిగా ,సి.ఎస్ ఆర్ .రామప్పపంతులుగా ,నాటక రంగస్థల ,నటుడు రామప్పపంతులు నులక అగ్నిహోత్రావధానులు గా ,గోవిందరాజుల సుబ్బా రావు లుబ్దావదానులుగా ,జానకి బుచ్చెమ్మ గా నటించిన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించి అందరినుంచి మంచి నటన రాబట్టారు .”చిటారు కొమ్మన మిథాయి పొట్లం ”పాట ,శ్రీ శ్రీ రాసిన ”ఆనందం అ అర్ణవమైతే అనురాగం అంబరమైతే ఆనందపు అంచులు చోద్దాం అనురాగపు లోతులు చూద్దాం ”పాట మంచి హిట్టు .గుమ్మడి సౌజన్యారావు పంతులు గా సహజనటన ప్రదర్శించాడు .ఘంటసాల సంగీతం వన్నె తెచ్చింది .సావిత్రి నటన అమోఘం ..అప్పా రావు గారు రాసి నట్లే చేసి అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది .అయితే రామా రావు కష్ట పడ్డాడు కాని నటన లో సహజత్వం కనిపించలేదు .ప్రేక్షకులకు నచ్చలేదు .ఫ్లాప్ సినిమా లో చేరింది .గొప్ప విషయం ఏమిటంటే సినిమా గా తీయటం .అందరు అత్యద్భుతం గా నటించటం .ఆ పాత్రలకు వారు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని పించటం .మా తరం వారు బాగా ఆరాధించిన సినిమా అది .సావిత్రి నటన కోసం అందరు చూడాల్సిందే .
                                                        నాటక రచన
                       కన్యాశుల్కం నాటకాన్ని మొదటిసారి 1892 లో ప్రదర్శిస్తే 1897 లో మాత్రమే అది అక్షర రూపం దాల్చి అచ్చు అయింది .మొదటి కూర్పులో అయిదు అంకాలు ,ముప్ఫై రెండు రంగాలు ఉనాయి .మళ్ళీ దాన్ని పోర్తిగా మార్చి ఏడు అన్కాలతో ,ముప్ఫిమూడు రంగాలతో తీర్చి దిద్దాడు గురజాడ .దీనితో నాటక స్వరూపమే మారిపోయింది .పాత్రల తీరు ,తెన్ను పోర్తిగా మారిపోయాయి .రంగాలు మారాయి .మరింత జాగ్రత్త తీసుకుని అప్పారావు గారు నాటకాన్ని ఇప్పుడున ఈ రూపం లోకి తెచ్చారు .మొదటి కూర్పులో మధురవాణి ఒకవేష్య మాత్రమే .రెండవ దానిలో ఆమె ఒక సజీవ పాత్ర ,అందరికి బుద్ధి చెప్పే పాత్ర ,సంఘం లో తానూ మంచి చేయగలను అని  రుజువు చేసిన పాత్ర .
                                                   కన్యాశుల్కానికి నేపధ్యం
                      గ్గురజాడ జాతీయ పునరుజ్జీవన( Renaissance period )కు చెందిన కవి .ఇంగ్లీష్ లో దిట్ట హేతువాదం ,వైజ్ఞానిక దృక్పధం వన్న వాడు .ఆధునిక ఆలోచన కలవాడు .సామాజిక స్పృహ వుంది .రీస్ అండ్ రయ్యత్ అనే పత్రికలో ఇంగ్లీష్ లో వ్యాసాలు రాస్తూందే వాడు .దాని సంపాదకుడు శంభుచంద్ర ముఖేర్జీ తెలుగులో రచనలు చేయమని గురాడకు సలహా నిచ్చాడు .దానితో తెలుగులో రాయటం ప్రారంభించాడు .ఆ సమయం లో తెలుగు సాహిత్యాన్ని పాథశాల పండితులు ,కవులే రాస్తుండేవారు .భాష పరమ గ్రాంధికం గా వుండేది .కొత్తదనం అసలు మచ్చుకు కూడా కనిపించేది కాదు .ఆ నాడు విజయనగరం ప్రాంతాల్లో డబ్బుకు పిలను అమ్ముకోవటం అనే దురాచారం వుండేది దీన్నే కన్యాశుల్కం అంటారు .ఇది ఉన్నత కుటుంబాలలో ముఖ్యం గా బ్రాహ్మణ కుటుంబాలలో జాస్తి .దీనికి తోడు అతిబాల్య వివాహాలు జరిపే వారు .ఆ నాటి విజయనగర రాజు పోసపాటి ఆనంద గజపతి రాజు సర్వే చేయిస్తే సంవత్చారానికి 344 కన్యాశుల్క వివాహాలు జరుగుతున్నట్లు తెలిసింది .అందులో ఒకటి నుంచి అయిదేళ్ళ కన్యాలకే 188   మందికి వివాహాలు జరిగాయట .శుల్కం దాదాపు నాలుగు వందల రూపాయిలు ఆనాడే .ఇప్పటి లెక్క లో ఎంతుంటుందో ఆలోచించండి .పొత్తిళ్ళ లోని పసి కందుల్ని కూడా బేరం చేసే వారు .ఉత్తరాంధ్ర ,కాలింగ ,సర్కారు జిల్లాల్లో ఈ వివాహాలు బాగా ఎక్కువ .బానిసలను అమ్మినట్లు కనేలను అమ్మటం ,కొనటం జరిగేది .ముసలి వరులకు ఆస్తికోసం పసిపిల్లలను బలి పెట్టె వారు .చావు సమీపిస్తున్నా వాడికి పిల్లను కట్టబెట్టి ఆస్తి దక్కించుకోవాలన్న అత్యాశ తండ్రులకు బాగా వుండేది .ఇదో దురాచారం గా మారింది .వీటిని మహారాజు ”రాక్షస వివాహాలు ”అని ఈసడించుకున్నాడు .the kanyasulka act 1889 ప్రవేశపెట్టాడు .ప్రభుత్వం ఇద్దరు అనధికారుల అభిప్రాయం కోరితే వారిద్దరూ బిల్లును వ్యతిరేకిన్చారుట .బాల్య వివాహాల వల్లనే కన్యాశుల్కం ఎక్కువ అవుతోందని ,దీన్ని తొలగిస్తే అదికూడా పోతుందని సలహా ఇచ్చారు .దేనికి ప్రత్యెక శాసనం అక్కరలేదన్నారు  ప్రభ్త్వ . జోక్యం వద్దన్నారు .గజపతి నిరుత్చాహపడ లేదు .దివాన్ అయిన గురజాడ ను ఈ దురాచారాన్ని రూపు మాపటానికి ఒక మంచి నాటకం రాయమని సూచించారు .”ప్రజాబాహుళ్యానికి పుస్తకపథానం అలవాటయ్యేంతవరకు ,అలాంటి ఆరోగ్య కరమైన భావ వ్యాప్తికి నాటకరంగాని ఆశ్రయించాల్సి వుంటుంది .కన్యాశుల్క నాటక రచనకు నన్ను ప్రోత్చాహించింది అదే ”అన్నాడు గురజాడ
                                            సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —23 -10 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.