గురజాడ కన్యాశుల్కం –4
అంపశయ్య నవీన్ అంటే స్ట్రేం of consciousness గుర్తుకు వస్తుంది దీన్నే తెలుగు లో చైతన్య స్రవంతి అంటారని అందరికి తెలుసు .ఆయన కన్యాశుల్కాన్ని estimate చేస్తూ ”ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా టాకు టాకీ అన్యులమనముల్నొప్పించక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ ”లా మనమనస్సుల లో సుప్తచైతన్యం లో దాగిన అనేక ప్రవ్రుత్తుల్ని గిరీశం ద్వారా బహిర్గాతమయాయి .అందుకే గిరీశం అందరి హృదయాలలోనూ పలుకు తాడు .”అన్నారు .గురజాడ లో కూడా ఇలాంటి ప్రవ్రుత్తి తనలో అణచబడి వుండాలి.ఆయానా వ్యక్తిత్వం లో ఒక భాగమే గిరీశం .అన్నాడాయన .ప్రముఖ విమర్శకుడు ఆర్.ఎస్ .సుదర్శనం ”గిరీశం పాత్రలో హాస్య రసానుభూతి పొందాలంటే నీతి అనే కొలబద్దను తాత్కాలికం గా నైనా పక్కకు పెట్టాల్సిందే .అప్పుడే గిరీశం మాటలు ,సమయస్ఫూర్తి ,మనకు ఆహ్లాదం కలిగిస్తాయి ”అని వివరించారు .పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకున్న ఉబలాటం వున్న నాటి యువకులకు అతను ప్రతీక .అతనికి ఆర్ధిక స్తోమత లేదు .ఏది సంపాదిన్చాలన్నా అడ్డదారే గతి అనుకొన్నాడు .ఎదుటి వాడిని మాటలతో బురిడీ కొట్టించే వాక్చాతుర్యం వుంది ..అందుకే ”నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ ”అన్నాడు అంత ధైర్యం గా .అది డబ్బా కొట్టటం కాదు తనకు ఆ శక్తి వుందని చాటి చెప్పటమే .మధురవాణని ”It is that seduces all mankind ”అన్నాడు .బుచ్చమ్మ ను చేసుకోవాలనే కోరిక లో స్వార్ధం తో పాటు పరార్ధం కూడా వుంది .చాందస కుటుంబం లో పుట్టిన గిరీశానికి తన కాలమ్ కంటే ముందు ఆలోచించే శక్తి వుందని తెలిపాడు .ముక్కు పచ్చలారని సుబ్బమ్మకు ,ముసలి లుబ్దావదాన్లతో పెళ్లి జరగబోతోందని తెలిసి ఆపటానికి గట్టి ప్రయత్నమే చేశాడు .బుచ్చమ్మ ను లేవదీసుకొని వెళ్తే సుబ్బి పెళ్లి ఆగిపోతుందని ప్లాన్ వేశాడు .సుబ్బికి లుబ్దునికి పెళ్లి ఆపటం లో తన స్వార్ధం వున్నా దాన్ని తప్పించి తన స్వార్ధం కోసం వాడుకున్నాడు .
ప్రతి పరిస్థితినీ తనకు అనుకూలం గా మలుచుకున్న నేర్పు అతనిది .అయితేనేమి చివరి సీన్ లో కధ అద్దం గా తిరిగింది .దామిట్ అన్నాడు దాన్ని .సౌజన్యా రావు పంతులు దగ్గర తనను ”నెపోలియన్ ఆఫ్ అంటి నాచ్ ”అని డబ్బా కొట్టుకున్నాడు .అక్కడే పప్పులోనూ ,తప్పులోను కాలు వేశాడు .అతి తెలివి తేటలతో బొక్క బోర్లా పడ్డాడు .తాను వేశ్య మధుర వాణిని ఉంచుకున్న సంగతి పంతులు గారికి తెలీదనుకున్నాడు పాపం .బయటపడటానికి ,ఆయన్ను ప్రసన్నం చేసుకోవటానికీ చివరి ప్రయత్నం చేశాడు ”కొంత కాలమ్ కింద గిరీశం అనేఫూలిష్యంగ్యంగ్ మ్యానోకడు ఉండేవాడు .మధురవాణి అనే బ్యూటిఫుల్ యంగ్ నాచ్ డెవిల్ ఒకటి వుండేది .వాడి దురదృష్టం వల్ల దాని వలలో చిక్కి ,మైమరచి ,అంధకారం లో పడిపోయిన మాట వాస్తవం .గురువుల ఉపదేశం కొంతకాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని ,ఆ అంధకారం లోంచి వెలువడి ,గురువుల పాదములు చేరుకొని ,గతం కళగా భావించి మంచి తోవలో పడ్డాడు .ఆ గిరీశమే ఈ గిరీశం ,ఆ మధుర వానే ఈ మధుర వాణి ”అంటూ పశ్చాత్తాపం తో చెంపలు వేసుకోన్నట్లు నటించి బయటపడాలని పాచిక వేశాడు .తనను క్షమించి ఉచ్చమ్మ తో పెళ్లి చేయించమని కోరాడు .మంచిగా బతకటానికి అవకాశం ఇవ్వమని కోరుతాడు .”నా వంటి sinners కు సాయం చేసి సహాయం చేసిమంచ్చ్చచ్చ్చ్చి వాళ్ళను చేయటంతమకు బిరుదు కాని బతుకు చేరచటం న్యాయం కాదు ”అని ములగచెట్టు ఎక్కిన్చాలనుకొన్నాడు .ఆవులిస్తే పేగులే కాదు అన్నీ లెక్కించే నేర్పున్న ఆడు సౌజన్యా రావు పంతులు గారు .”ఎంనేల్లయిన్దేమిటి చీకటి లోంచి వెలుగు లోకి వురికి ?”అని అడిగితే చెప్పలేక తబ్బిబ్బయి ”ఎన్నాల్లయితే నేమండీ ట్రూ రిపెంటేన్స్ కు త్వేంటి ఫర్ అవర్స్ చాలదా ”అని బుకాయించాడు .ఆయన క్ష్మించలేదు ఈ ఆషాఢ భూతిని .బుచ్చమ్మనుపూనా లో విడోస్ హోం లో చేర్పిస్తాడు .ఆమె చదువుకు ఏర్పాట్లు చేస్తాడు .చదువు అయింతర్వాత ఆమె ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకొంటుంది అని వివరం గా చెప్పాడు .గిరీశాన్ని కూడా కాలేజి లో చదివి పైకి రమ్మని సలహా ఇచ్చాడు .ఇకనుంచైనా మంచి బుద్ధితో మెలగమని ఆదేశిస్తూ ”తక్షణం ఇంట్లోంచి ఫో ‘అని అని గెంటేశాడు .అప్పుడే famous quotation ”కధ అడ్డం తిరిగింది ‘ ‘అంటూ గిరీశం వెళ్ళిపోతాడు .విధవా వివాహాలను ప్రోత్చాహించాల్సిందే .కాని గిరీశం లాంటి కపటులకు వారిని దూరం చేయాలి .వీరి కుహనా సంస్కరణ లనుంచి వాళ్ళను కాపాడాలి .అందుకే పంతులు గారు ”త్వేంటి ఫౌర్ హౌర్స్ లో వచ్చిన రేపెంతెన్సు ట్రూ రేపెంతెన్సు కాదు .అది నిలబడాలి .అతని కాలమీద అతను నిలబడాలి .బుచ్చమ్మ కూడా ఈ లోపల ప్రపంచాన్ని అర్ధం చేసుకుంటుంది .కావాలంటే అప్పుడే పెళ్లి చేసుకో వచ్చు .ఇలా ఒక అర్ధవంతమైన ముగింపు ఇస్తాడు గురజాడ .గిరీశం మాట్లాడిన మాటల వెనుక గురజాడ హృదయం వుంది అంటారు నవీన్ .
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -10 -11

