గురజాడ కన్యాశుల్కం — 5 —స్త్రీ పాత్రలు

గురజాడ కన్యాశుల్కం — 5  —స్త్రీ పాత్రలు
                        అగ్నిహోత్రావధానులు పెద్ద కూతురు బుచ్చమ్మ .తల చెడింది .”మంచం మీంచి దిన్చేయ్యతానికి సిద్ధం గా ఉన్న వాడికి 1500 రూపాయలు కు ”వధువు ”పేరుతొ అమ్మబడిన పిల్ల .గిరీశం బొట్లేరు ఇంగ్లీష్ కు మురిసి ,అతనొక సంస్కారి అనినమ్మిన పల్లెటూరి పిల్ల .విధివంచిత .మధురవాణి ,సౌజన్యారావు ల సౌజన్యం తో బయట పడింది .తనకు జరిగిన అన్యాయం తన చెల్లెలికి జరుగ రాదనీ ప్రయత్నించిన సహృదయ .చెల్లెలి బలిని ఆపటానికి గిరీశం మాటలు నమ్మింది పాపం .లేచిపోవటానికి సిద్ధపడిన అమాయిక .
                       వీళ్ళిద్దరి తల్లి వెంకమ్మ .కూతురికి మొగుడు చస్తే ఎంత ఆస్తి వస్తుంది అని లేక్కలేసే అగ్నిహోత్రావధాన్ల పెళ్ళాం .పెద్ద కూతురు బతుకు బుగ్గి అయింది -అలా చిన్న కూతురుకు కాకూఅదని భావించి ఎదిరించే ధైర్యం లేక నుయ్యో గొయ్యో చూసుకుంటానని ,నిజంగానే దూకేసిన ఆనాటి వెర్రి  తల్లులకు ప్రతీక .చండ కోపిష్టి ,అపర దూర్వాసుడు నిజంగానే అగ్నిహోత్రుడు అయిన మొగుడు కొట్టినా ,తిట్టినా ,ఏ చెడ్డ నిర్ణయం ఆయన తీసుకున్నా ,నోరెత్తని ,సాహసం లేనిబానిస   బతుకు బతికింది
                   మీనాక్షి లుబ్దావధాన్ల కూతురు .విధవ .ఆమె ప్రవర్తన మంచిది కాదనిరామప్ప పంతులు మధుర వాణికి ,గిరీశం బుచ్చమ్మ కు చెప్తారు .బాలవితంతువు పక్క మార్గం పట్టటానికి కారణం బాల వైధవ్యమే .విధవా వివాహాలు ఆనాడు లేవు వయస్సులో వుంది ,శారీరక సుఖాలు తీరని యవ్వన స్త్రీ.కట్టు దాటటం సహజమే .అది వయసు చేసే పొరపాటు .అక్రమ సంబంధం ఆమెతో  పెట్టుకోవటానికి
రామప్ప పంతులికి ఇష్టమే .వివాహం మాత్రం చేసుకోడు .పైగా ఆమెను ”చెడిన ఆడది ‘అనే ముద్ర వేష్తాడు ఇంకెవరు ఆమె దగ్గరికి రాకుండా ఉండాలనే ఉపాయం తో ..
                 పూతకూల్లమ్మడీ ఇదే తంతు .వీరంతా విధి వంచితలు గా కనిపిస్తారు .ఒక్క వెంకమ్మ మాత్రం డబ్బు కాపీనం ,దుష్టపన్నాగం వున్న భర్తకు లొంగి పోయింది పైవాళ్ళు సంఘం లోని దురాచారాలకు ,కాపత్యానికి ,దుష్ట శక్తులకు బలి పోయారు .మనకు వీరందరి మీద సానుభూతి కలిగిస్తాడు గురజాడ .వాళ్ళు ఏ పరిస్థితుల్లో దారి తప్పారో ఆలోచింప జేస్తారు వారి అంతరంగాలలో పరకాయ ప్రవేశం చేసి సజీవ పాత్రలుగా మనముందు నిలబెడతాడు .అవి మట్టి బొమ్మలు కాదు .ఉప్పూ ,కారం తింటున్న మనుషులు .మనకున్నట్లే వాలకూ కోరికలుంటాయి .అవి తీరక తీర్చుకోలేక నలిగే విధి వంచితలు .బాధా సర్ప దష్టులు .
                                                                         మద్ధుర వాణి
                            కన్యాశుల్కం మణిపూస మధురవాణి .మృదు మధుర వాణి .అప్పారావు గారి తలలోంచి ఊడిపడిన గడుసు పిండం అన్నారామెను .ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలిసిన సరసురాలు .వేశ్య .ఆ వృత్తిలోనే జీవించాల్సి వచ్చిన పరిస్థితి ఆమెది ”తనను తాను రకరకాలైన మగవాల్లకీ ,విభిన్న వయసున్న వారికీ అమ్ముకుంటే తప్ప బతుకు గడవని దైన్యం ఆమెది .అందం ,తెలివి తేటలు ,సమయస్ఫూర్తి ,విద్య ,  మాటకారి తనం అన్నీ   వున్నా చెడిపోయిన ఆడది .ఆర్ధిక ,సాంఘిక ,సామాజిక భద్రత లేని ,వాటికి నోచుకోని  అభాగిని .,పతిత .గిరీశం వలలో పడిందీ ,రామపకు చిక్కిందీ డబ్బు ,గౌరవం కోసమే ..”అని ఆ పాత్రను విశ్లేషించారు
                    ఒకసారి రామప్ప పంతులుతో ”నేను డబ్బు ఇక్కడ దాచుకుంటే ,అక్కడ మాతలి కాలక్షేపం చేయటం ఎలా ?”అంటుంది .తల్లి పోషణకు ఈ వృత్తే ఆమెకు ఆధారం .ద్రవ్యాకర్షణ వున్నా సుబ్బమ్మ ,లుబ్దావధాన్ల పెళ్లి ఆపటానికి ప్రయత్నం చేసే సందర్భం లో కరటక శాస్త్రి తో ”మధుర వాణికి దయా దాక్షిణ్యాలు సున్నా అని మీరు తలచారో?మీ తోడబుట్టిన దానికి ప్రమాదం వచ్చినపుడు నేను డబ్బుకు ఆశిస్తానా ?అని చెప్పిన సంస్కారం ఆమెది .
                లుబ్దావధాన్లు చేయని నేరానికి శిక్ష పడకుండా కాపాడటానికి మగవేశం లో aantinaach అయిన సౌజన్యారావు ను కలిసింది .శిక్ష పడకుండా కాపాడింది .బుచ్చమ్మ ను గిరీశం బారి నుండి రక్షించింది .లుబ్దున్ని కాపాడటానికి తన ఫీజు గా” చిన్న ముద్దు ”ఇవ్వాలని చిలిపితనంతో షరతు మ్పెట్టింది .అయినా సౌజన్యారావు వంటి పెద్దమనుష్యులకు ”వ్రతభంగం ”చేయరాదని భావించి ”చెడని వారిని చెడగొట్టవద్దని మా అమ్మ చెప్పింది ”అని అతన్ని వరిస్తుంది .తన లిమిట్ ఏమో బాగా తెలిసిన జాణ .
                     కరటక శాస్త్రిఆమె విద్యా,సౌందర్యాలను వర్ణిస్తే ”కాపు మనిషిని పుట్టి ,మొగుడి పొలం లో వంగాలకు మేరపలకు దోహదం చేస్తే ,యావజ్జీవితం కాపాడే తన వాల్లన వాళ్ళు వుండే వారేమో ?అని చెప్పి తన వ్రుత్తి తనకు కల్పించని భద్రతకు బాధ ,విచారం పడుతుంది .ఆనాటి సమాజం లో పరస్త్రీ సంపర్కం ,సరసం ,రసికత్వం గా చెలామణీ గా వుండేది .వేశ్యను వుంచుకోవటం సమాజం లో స్టేటస్ .సింబల్ .కాని స్త్రీ తన జీవనోపాధికి శరీరాన్ని అమ్ముకోవటం ,చనువు గా వుండటం జరిగితే పతిత గా ముద్ర వేసే వారు .చీడ పురుగ్గా చూసే వారు .సౌజన్యారావు లాంటి సహృదయులు కోడా వేశ్యలను పెళ్లి చేసుకోవటానికి జంకారు .
                   కరటక శాస్త్రి ని ఆడుకోవటం లో ,మీనాక్షిని పెళ్ళిచేసుకోమని రామప్ప పంతులుకు చెప్పటం లో మధురవాణి మంచి మనసున్న ఆడది అనిపిస్తుంది .మృచ్చకటికం నాటకం లోని ”వసంతసేన’సరి జోడు అనిపిస్తుంది .రామప్ప ను నిజమైన భర్త గానే చూసింది మకాం విశాఖపట్నానికి మార్చింది .తన వ్రుత్తి లో హైన్యాన్ని ,దైన్యాన్ని,మాలిన్యాన్ని క్రమంగా గుర్తించింది .మహిళా జీవన వికాసానికి ధనసంపాదన –హేయమైన వ్రుత్తి ,అతిభోగం మార్గాలు కావు అని గ్రహించింది .
                     కరటక శాస్త్రి తన స్వార్ధం కోసం మధురవాణి ని డిప్యూటి కలెక్టర్ కు అంతగాత్తతానికి ప్రయత్నిస్తే అప్పుడామే ఎంతో నిజాయితీగా చెప్పిన మాటలు చెన్నా కోలు దేబ్బల్లాగావున్నాయి చూడండి  .”నేను వేల్లదలచుకో లేదు .ఇటుపైన ఊర కుక్కలకు ,సీమ కుక్కలకు దూరం గా ఉండ టానికి ఆలోచిస్తునాను ”ఆమె లో ఆత్మ గౌరవం ఏ స్థాయిలోకి పెరిగిందో ,చదువుకున్న శాస్త్రి బతుకు ఎంత బస్టాండ్ అయిందో తెలుస్తుంది .
            మధుర వాణి సుభాషిని ,సుమధుర భాషిని .చతుర సంభాషిని ,చమత్కార వాహిని .వేశ్యాల్లో కూడా ఉన్నత లక్షణాలు ,లక్ష్యాలు ,లాలిత్యం ,గాంభీర్యం ,కరుణ,మానవత్వం ఉంటాయని నిరూపించిన వేశ్య శిఖామణి మధుర వాణి .ఆమె ను వేశ్యగా చూసినందుకు మనం సిగ్గు తో తల vanchukovaalemo >సంజీవదేవ్ ”మధురవాణి ఆస్థి ,చర్మ ,రక్త మాంస శరీరం లో మేఘాలమీది ఇంద్రధనుస్సును ప్రత్యక్ష పరచాడు గురజాడ ”అన్న మాట అక్షర సత్యం .
” కన్యాశుల్కం లో పాత్రలన్నీ మానస శిఖరాలే వాటిలో మధురవాణి మహోన్నత శిఖరం .ఈనాడు మనం ఎంత అభివృద్ధి సాధించినా ఆకాశం కాంతితో వున్నా భూమిమీద శాంతి కరువైంది .మధురవాణి పదును గల మేధావి గా సరళమైన రసజీవిగా మలిచారు నిపుణ సాహితీ శిల్పి గురజాడ .సున్నిత వైవిధ్యాలకు ,చురుకైన వైరుధ్యాలకు ఆమె నికేతనం -వ్యక్త జీవితం లోని గుప్త జేవితం మధుర వాణి ”
అన్న రసరేఖల సంజీవ దేవ్ రసహృదయం మధుర వాణి సరసహృదయాన్ని రసమయం గా ఆవిష్కరించారు
                                                  సశేషం
                                                              మీ  — గబ్బిట దుర్గా ప్రసాద్ -24 -10 -11

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

1 Response to గురజాడ కన్యాశుల్కం — 5 —స్త్రీ పాత్రలు

  1. nrahamthulla says:

    కన్యాశుల్కం లో పూర్ణమ్మ “తల్లిదండ్రులు పెట్టిన ఉరితాడు విప్పటానికి వశమా?తప్పడానికి వశమా? అని గొల్లు గొల్లున ఏడ్చింది,గుండెరాయి జేసుకు ఓర్చింది”.ఈనాటి పుత్తడిబొమ్మల అదృష్టం”బాల్యవివాహాల నిషేధం”, “ఆస్థిలోసమానహక్కు”.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.