గురజాడ కన్యాశుల్కం ——6

                               గురజాడ కన్యాశుల్కం ——6
                        ఇంత గొప్ప నాటకం ”కన్యాశుల్కం ”రాసినా గురజాడ ను” కవి కాదు ”అన్నారు కొందరు కుహనా వాదులు .ఇప్పుడు కూడా డా ఈ మధ్యే మళ్ళీ దుమారం లేపుతున్నారట ఒకవార్తా పత్రికలో .ఎవరేమి మొరిగినా ఏనుగుకు ఏమి అవుతుంది ?ముత్యాలసరాలను ఈసడించారు .కన్యాశుల్కాన్ని నాటకమే కాదు పొమ్మన్నారు .అదొక ప్రహసనం అని తేల్చారు .ఆ భాషేమిటి ?అని దేప్పారు .ఆ పాత్ర్లేమిటి >?అని నిలదీశారు .అయినా ప్రజల అభిమానం చిన్తాకైనా తగ్గలేదు సరికదా ,దినదిన ప్రవర్ధమానం అయింది .దానితో తోక జాదించిన వారంతా తోక ముడుచుకు పారి పోయారు .అన్నిటికి ఎదురు నిల్చి నూట ఇరవైయేళ్ళు బతికింది .ఇంకా బతుకు తుంది .నిత్యనూతన నాటకం గా పేరు తెచ్చుకుంది .వన్నె ,వాసి తగ్గ లేదు .ఇప్పటికీ చదువుతూనే వున్నారు .ప్రదర్శిస్తూనే వున్నారు .ఈ నాటకం పై వచ్చినంత విమర్శ ,జరిగిన పరిశోధనా ఏ సాహిత్య మ్ప్రక్రియ మీదా రాలేదు .మొదట దూకుడు గా మాట్లాడిన వారే ,క్రమంగా దగ్గరయారు .అభిప్రాయాలు మార్చుకున్నారు .అదీ సాహిత్య సృష్టి అంటే .అంత గొప్ప సృజన అప్పారావు గారిది .ఆయన మనకు ఒక ”సుబ్రహ్మణ్య భారతి ”వంటి వాడు ,తెలుగుల ”టాగూర్ ”.తన అడుగు జాడలను ఇప్పటికీ భద్రం గా నిల్పుకున్న నూత్న పదగామి .కాని మనప్రభుత్వాలు గుడ్డివి ,మూగావి ,చేవిటివి .వారు దీని గురించి వినరు ,కానరు మూర్కొనారు .ఇంకా చైనా చూపే .సముచిత గౌరవం లేదు .చాసో అన్నట్లు ”గురజాడ ఆంధ్రుడు ,భారతీయుడు,ప్రపంచ పౌరుడు ”అందుకే” మనవాళ్ళు వుట్టివెధవాయిలోయ్” అన్నాడు గురజాడ .అది ఈనాడూ రుజువు చేస్తున్నే వున్నారు మన” చెవలాయిలు ”భమిడి పాటి వారి భాషలో .శ్రీ కేతవరపు రామకోటి శాస్త్రి 1931 లో ”కన్యాశుల్కం నాటకమే కాదు .గురజాడ సరిగ్గా నిర్వహించ లేదు .”అన్నాడు .ఆ తర్వాత గిరీశం లాగా opinyans chenge చేసుకున్నాడు .1992  ఆగస్ట్ 13  తన కొత్త అభిప్రాయాలతో ఒక పుస్తకం రాసి ప్రచురించాలని సంకల్పించారు .అయితే 1991  అక్టోబర్ 28  న రోడ్ ప్రమాదం లో మరణిచారు .ఆయన కుమార్తె ,డాక్టర్ కాత్యాయినీ విద్మహే ఆ పుస్తకాన్ని ప్రచురించారు .గిరీశం నెపోలియన్ లా ఆన్తినాచ్ ఉద్యమానికి ప్రతినిధి అని కితాబు ఇచ్చారు .ఆ పుస్తకం అందరు చదువ తగిన పుస్తకం .లోతైన పరిశీలన .లోగడ తాను ఎక్కడెక్కడ భ్రమ ,ప్రమాదాలకు లోనైన్డీ తెలుపుతూ ,దాన్ని చక్కగా సంతృప్తికరంగా సరిదిద్దుకున్నారు .వసంతసేన కన్న మధురవాణి గొప్పదని మెచ్చారు .కారణం మహిళాభ్యుదయానికి ఆమె చేయూత నీయతమే నంటారు .ఆమె అప్పారావు గారి ”సృజన ప్రతిభ ”గా అభివర్ణించారు వేశ్యల్ని బహిష్కరించాలి అని వీరేశలింగం గారు అంటే వారిని సంస్కరించాలి అని గురజాడ అన్నారు .ఇష్టా నిష్టాలతో ప్రమేయం లేకుండా విధవా వివాహాలు చేయాలని వీరేశలింగం అంటే వాళ్ల చైతన్య స్థాయిని పెంచాలని అప్పా రావు భావించారు .”బ్రాహ్మణులలో కూడా మహాత్ములుంటారు ”అనే దానిని వివరిస్తూ ”ఆ నాటి సమాజం నిండా  వున్నదిబ్రాహ్మనేతరులు  సమాజాన్ని నడిపిస్తున్నది బ్రాహ్మణులు .నైతికం గా పతనమైన బ్రాహ్మణులు నడిపిస్తున్న సమాజాన్ని సంస్కరించటం అంటే బ్రాహ్మల నైతిక పతనాన్ని సంఘం ముందు ప్రదర్శించటమే ”అంటారు .ఈ పనిని అప్పా రావు గారు గొప్పగా ,ప్రతిభావంతంగా చూపారు .అందుకే అది నాటికీ నేటికీ అపూర్వ సృష్టి అయింది .ఆదర్శం అయింది ,ఆదరమూ అయింది .
                   ప్రఖ్యాత విమర్శకులు కే.వి.రమణా రెడ్డి ”నిర్దిష్టమైన ఒకానొక జీవిత పార్శ్వాన్ని సాకల్యం గా ,గాదం గా చిత్రించడం వలెనే ఈ నాటకానికి సర్వకాలీనత సిద్ధించింది ”అని మహత్తరమైన ఆవిష్కరణ చేశారు .అవును కన్యాశుల్కం స్థానే ”కన్యే శుల్కం ”అనే భావం రావాలని ,ఆశించారు గురజాడ .ఆడురాచారం నేడు ”వరకట్నం ”గా మారింది .అయినా స్త్రీ బాధ తప్ప లేదు .”వరుడే కట్నం ‘అనే భావన బలపడి ఆ వైపు యువత నడిస్తే మహిళాభ్యుదయం జరగటానికి ఆస్కారం అవుతుంది .ఆ మహాకవి ఆత్మ శాంతిస్తుంది ”     ‘.
       దేవుదేచాతో దాగే నంటూ –కొండ కోణాల వెతుకు లాడే వేలా ?–కన్ను తెరచిన కనబడదో ?—మనిషిమాత్రుని యందు లేడో ?? అంటాడు గురజాడ ఇంతకంటే మానవుని ఉత్కృష్ట స్థితిని గురించి ఏ వామ పార్టీ చెప్పింది ?అలాగీ ఆయన రాసిన ”దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా -దేశమంటే మట్టికాదోయ్ -దేశమంటే మనుషులోయ్ ”–అన్న ప్రబోధ గీతం నిజం గా ”విశ్వ గీతమే ”దీనికి సాటి ఇంకేదీ లేదు .జనతాజనార్దానుడిని చూడమని హెచ్చరించాడు .మనిషికోసం ,మానవత్వం కోసం ,ప్రపంచ పౌరసత్వం కోసం తపన పడ్డా ఆ మహా మనీషి కి ఆంద్ర దేశం ఎంతో రుణ పది వుంది .ఆ ఋణం తీరిస్తే తీరేది కాదు .ఆచరించి ఋణం తీర్చుకోవాలి
                      ”నరుల నోళ్లను నలిగి వుండిన –నానేమైన పదాల లోపల –ఆడుచుండును ప్రకృతి యంతా యని —అందరికి తెలిపితివి గదరా “‘అని ప్రస్తుతించారు స్వాతంత్రోజ్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ .నవయుగ వైతాలుడైన గురజాడ స్ఫూర్తి మనలో నిత్యం జాగ్రుతమవాలి .
                 గురజాడ పూర్వీకులు కృష్ణా జిల్లా వుయ్యురుకు దగ్గరలో వున్న గురజాడ గ్రామం లో వుండే వారట .ఆయన పూర్వీకుడైన పట్టాభిరామయ్య 200  ఏళ్ళ క్రితమే వేరొక శాఖకు చెందిన స్త్రీని వివాహం ఆడారట .అప్పారావు గారు తన తల్లికి ఏడవనేలలో జన్మించారట .అందుకే ల్పాయుష్కులయారట.ఆయాసం కూడా దాని ఫలితం గా వచ్చిందట .గురజాడ నుండి ఆకుటుంబం మచిలీపట్నానికి ,ఆ తర్వాత విజయనగారానికీ వలస పోయారట .అప్పారావు గారు ”రీస్ అండ్ రయ్యత్ ”అనే పత్రిక లో ఎబ్గ్లిష్ లో వ్యాసాలు రాసే వాడు .ఆ పత్రికా సంపాదకుడు శంభు చంద్ర ముఖర్జీ సలహాతో తెలుగులో రచన ప్రారంభించాడు .గురజాడ లో ఒక స్రష్ట ,ద్రష్ట వునాడు .కన్యాశుల్కం ”మహోత్కృష్ట గ్రంధం ””(క్లాసిక్ ),మాత్రమే కాదు ”ఆధునిక ఇతిహాసం  (ఎపిక్ ).అది ఒక అక్షర తూణీరం .తరగని పంట .In between lines ”చాలా వుంది అన్నాడు పత్రికా సంపాదకుడు కవి ,రచయిత నవలా కారుడు ,విమర్శకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ .”ఆంద్ర దేశానికి మహోదయం తెచ్చిన వేగు చుక్క గురజాడ ”అన్నారు ప్రసిద్ధ హాస్యరచయిత హాస్యబ్రహ్మ భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు ..”మానవుడు మహ్హకవి అయినపుడు అతీంద్రియ జ్ఞానం తో పని చేస్తాడు .అప్పుడతని వాక్కు ఆదిమధ్యాంత రహితం అవుతుంది ”అంటాడు శ్రీ శ్రీ కన్యాశుల్కాన్ని గురించి .Though art is my maaster ,I have a duty to society ”అని బాధ్యత గుర్తెరిగి అలానే ప్రయాణించిన మార్గ దర్శి గురజాడ .”లోన్గాదీయలేని అలెక్షాన్దెర్ గుర్రం -కన్యాశుల్కం ”అంటాడు ప్రఖ్యాత నటుడు ,ప్రయోక్త ,కన్యాశుల్కం లో గిరీశం పాత్రధారి శ్రీ జే.వి .రమణమూర్తి . .
                  ”Gurajada was a genius.He produced a very great drama that caught the imaaginations of English educated youth of his times and it came to stay .He heralded a new era in telugu literature .The era of colloquilism ”అని కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ కూడా మనసారా మెచ్చిన మహాకవి గురజాడ .
                       దీని తర్వాత కన్యాశుల్కం లోని జనం నోట నానిన” oft quoted lines ” మీ ముందుంచుతాను .అందుకని ఇప్పటికి ఇంకా సశేషమే
                                         మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ -24 -10 -1

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.