దీపావళి టపాసులు

  దీపావళి టపాసులు 
                      మనవళ్ళ కోసం చిచ్చుబుడ్లు   కూరుతున్నాను .మతాబాలు, అవ్వయిలు కట్టటం అయిపొయింది . saample గా కాల్చి చూశాను .బానే కాలాయి .ఇంతలో మా బామ్మర్ది బ్రహ్మం ఆదరాబాదరా రొ ప్పుకుంటూ వచ్చాడు .ఎక్కడి నుంచి రాక ? .ఏమిటా రొప్పుల మోత ?అన్నాను .చొక్కాతో చెమట తుడుచు కొంటు ”నీకేం బావ!! తాపీగా చిచ్చుబుడ్లు కూరుకుంటూ కూర్చున్నావు. అక్కడ  కొంపలంటు కుంటుంటే “”అన్నాడు .”అసలు విషయం చెప్పకుండా ఈ సుత్తేమిటి రా బాబూ ?”అన్నా..”.అదికాదుబావా -నిన్న ఒక చానెల్ లో నారదుడు రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఎవరెవరు దీపావళి నాడు ఏమి కాలుస్తారు ?అని అడిగాడు .ఒక్కొక్కరు భలే తమాషా గా జవాబులు చెప్పారు .నువ్వు చూడ లేదా ?”అన్నాడు .”ఎన్నని చూడను ?దేన్ని చూడను  ?  బోరు కొడుతున్నాయి .నాకా ఓపిక లేదు ”అంటూ ఇంతకీ వాళ్ల సమాధానాలు ఏమి చెప్పారో చెప్పనే లేదు  ”అన్నాను .” ” సరే వినుబావా .ముందుగా కిరణ్ కుమార్ ను అడిగితే –”నేను రచ్చబండ లలో వచ్చిన ఆర్జీలను తీర్చలేక పోతున్నాను .చూసే టైంకూడా   లేదు . అందుకని దీపావళి నాడు వాటినన్నీ కాల్చేసి పండగ చేసుకుంటాను ”అన్నాడు .చంద్రబాబు ను అడిగితే ”విజయమ్మ నా మీద మూడు వేల పేజీల అభియోగాలు మోపింది .హాయిగా వాటిని కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తాను ”అన్నాడు .చిరంజీవిని అడిగితే ”ప్రజా రాజ్యం మాని ఫెస్టోలు,  బానర్లు ,రసీదు పుస్తకాలు ఇక పనికి రావు కనుక వాటిని కాల్చుకొని ఆనందం అనుభవిస్తాను ”అన్నాడు .కే.సి.ఆర్ ను అడిగితే ”ఏముంది అన్నా ! పనికి రాని శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ వున్నది కదా, దాన్ని బొందపెట్టి కాల్చి నుసి చేసి పండగ జేసుకునేది ”అన్నాడట .,
                   ”  ఇంతకీ మనం పండగ యెట్లా చేసుకుందాం బావా ?”అని అడిగాడు బామ్మర్ది బ్రహ్మం ”ఒరే –ఇంకా కాల్చటానికి ఏముందిరా .నలభై రోజులనుంచి పరువు కాల్చారు .ప్రతిష్ట మంటగలిపారు ,నీతి కి నిప్పు పెట్టారు .నిజాయితీని నిలువునా దహనం చేశారు .కుంభకోణాలతో దేశ గౌరవాన్నే తగలేశారు .గనుల్లో అవినీతి ఘనులు దేశ సంపదనే మసి చేసారు .సెజ్ ల పేర రైతుల వెన్నెముకలనే నుసి చేశారు .ఆందోళన పేరుతో ,సమ్మె ల పేరుతో జన జీవితాన్ని ప్రాణాలను కాల్చి బుగ్గి చేశారు .పంటకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ,చాలినంత కరెంట్ ఇవ్వకుండా రైతుల్ని క్రాప్ హాలిడే లోకి నెట్టి ,పంటలను మసి చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్న ప్రభుత్వానికి ,సంజాయిషీ చెప్పుకోలేని కేంద్రానికీ ,తెలంగాణా వస్తుందని ,ఇచ్చేస్తునామని ,వాళ్ళతో ,అబ్బే అదేమీ లేదు అని వీళ్ళతో గోడమీది పిల్లి వాటం గా ఏళ్ళకు ఏళ్ళు గడుపుతూ ప్రాణాల్ని బుగ్గి చేస్తున్నారు .అవును ఇంకా ఏమి మిగిలింది ?కాల్చు కోవటానికి ? సిగ్గు, శరం తప్ప ” ఆన్నాను .మా వాడికి బుర్ర తిరిగింది ‘.”బావా!!  బుద్ధి గడ్డి తిని నీ దగ్గర కొచ్చినందుకు చె౦పలేసుకొంటున్నాను . ఏదో సరదాగా నవ్వించి పండగ పూటా కాలక్షేపం చేద్దామని వస్తే ,నీ అక్కస్సంతా తీర్చుకున్నావు ””ఇక చాలు బాబూ .”అంటూ అసలు ఏం కాల్చుకు౦దామంటే సమాధానం చెప్పలేదు ”అన్నాడు .”మనం ఇప్పటికే ఒళ్లంతా కాల్చుకున్నాం రాష్ట్రం పేరుతో ”ఇంకేమీ కాల్చుకో నక్కర లేదు ”అన్నాను .బావా topik మారుద్దాం ఆనాడు వాడు .సరే అన్నా.  బజారులో కొత్త టపాసులు ఏమి ఉన్నాయిరా ”అని అడిగాను .బావా చెబితే నమ్మవు కాని చాలా వారైటీ లు వచ్చాయి ”అన్నాడు ”పేర్లు చెప్పి ఏడు ”అంటే మొదలు పెట్టాడు ”హర్షద్ ఔట్లు !!   రాజా  బా౦బులు !!  కని అవ్వాయిలు ,గాలి తూటాలు ,జగ్గు fighterlu ,ఎడ్డి కడ్డీలు ,అమర్ నోట్ల అవుట్లు ,గడాఫీ బంగారు బిస్కట్లు ,మరాండీ మతాబాలు ,లాడెన్ లౌడ్ బ్రేకర్స్ ”అన్నాడు .”హాయిగా అవి కోనికాల్చు కొక   పొద్దున్నే ఈ కూరుడేమిటి బావా .నీ చాదస్తం తో అందర్నీ బాదిస్తున్నావ్ ”అని సలహా పారేశాడు .”ఒరే .-కొనటానికి వెళ్ళా .కాని అవ్వాయి రేట్లు ఆకాశాన్ని చూస్తున్నాయి మతాబాలు తబలా దెబ్బల్ల ఉన్నాయి .చిచ్చు బుడ్ల రేట్లు చెలరేగుతున్నాయి ..నేలటపాకాయలు నేలలోనే వున్నాయి బయటికి రావటం లేదు చాలా కాలంగా .జిల్లీలు జెల్లీ చేపల రేట్లను తలపిస్తున్నాయి .పాము  బిళ్ళల రేట్లు అందకుండా పారి పోతున్నాయి .కాకర పువ్వొత్తులు కోర కోరా చూస్తున్నాయి .రోలు రోకలి మందు లేనేలేదు .దివిటీలు లేవు .భూచక్రాల రేట్లు కళ్ళు తిరిగే లా వున్నాయి .విష్ణు చక్రాలు తల తిరిగే రేట్లలో  వున్నాయి ”అ౦దుకే  కొన కుండా తిరిగి వచ్చి ఈ పనిలో పడ్డా .”అన్నాను” బ్రహ్మం !అవేవో హస్బండ్ వాలాలు ట ఏమిటిరా అవి !! “?అని అడిగాను .వాడు మతాబా నవ్వు నవ్వి ”అవి థౌసంద్ వాలా బావా హస్బండ్ వాలా కాదు ”అన్నాడు .”ఇదివరకు టెలిఫోన్ లని వచ్చేవి ఇప్పుడు లేవా ?”అడిగాను .”ఇంకేం ఫోన్ లు బావా అంతా సెల్ లేగా -కొన్ని సెల్లులు పేలుతున్నాయిగా ఇంకా  బా౦బు లె౦దుకు “‘అన్నాడు .”ఏరా !! తెలంగాణా   ,ఆంధ్రా ,విశాలాంధ్ర ,సమైక్యాంధ్ర ,సీమాంధ్ర,రాయల  తెలంగాణా   బాంబులు రాలేదా “‘?అని అడిగితే వాడు ‘అవి రోజూ పెలుస్తూనే ఉన్నారుగా బావా!! పేపర్ వాళ్ళు, చాన్నేల్ వాళ్ళు, రాజకీయులు అన్నాడు .ఒరే నీకూ జోకుల డోకులు  బానే వస్తున్నాయిరా ”అన్నాను .నవ్వాడు వాడు .”సరే బావా వెళ్ళొస్త.ఇంటి దగ్గర మీ చెల్లెలు ఎదురు చూస్తు౦టుంది.ఆలస్యమైతే మాటల బాంబులు పేలుస్తుంది ”అంటూ జారుకున్నాడు .
                        దీపావళి శుభా కాంక్షలతో —మీ –దుర్గా   ప్రసాద్  —25 -10 -11 .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

2 Responses to దీపావళి టపాసులు

  1. padmarpita's avatar padmarpita says:

    దీపావళి శుభాకాంక్షలు!!

    Like

  2. చూస్తుంటే, అన్ని దీపావళీ మందుగుండు సామాను చాలా పిరింగానే ఉన్నాయి 😦

    Like

Leave a reply to పానీపూరీ123 Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.