శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లోఅద్వైతా మృతం —4 క్రిష్ణామృతం

    శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లోఅద్వైతా మృతం  —4
                                                                              క్రిష్ణామృతం
శ్రీ సదాశివ బ్రహ్మేన్డ్రుల కీర్తన లలో రామ రసాయన పానం ఇంతవరకు చేశాం .ఇక ఇప్పుడు క్రిష్ణామ్రుతాన్ని అందుకుందాం .
                 ఇందులో మొదటిది ”స్మర వారం వారం ”పూర్తిగా వివరిస్తాను
 01 -పల్లవి —–స్మర  వారం వారం మానస —స్మర నంద కుమారం ||
       చరణాలు —01 -ఘోష కుటీర   పయోఘ్రుత చోరం –గోకుల బృందావన సంచారం ||
                       02 -వేణు రవామ్రుత పాన కథోరం –విశ్వ స్థితి లయ హేతు విహారం ||
                       03 –పరమ హంస హృత్ పంజర కీరం —పటు తర ధేనుక బక సంహారం||
            భావం —ఓమనసా !నందకుమారుడైన శ్రీ కృష్ణుని నిరంతరం స్మరించు .గోళ్ళ వాళ్ల ఇళ్ళల్లో పాలు ,పెరుగు ,వెన్న ,నెయ్యి దొంగిలిస్తూ ,బృందావనం లో సంచరిస్తూ ,వేణు గాన లోలుడై ప్రపంచం యొక్క సృష్టి ,స్థితి ,లయాలకు కారకుడై ,పరమ హంస లైన యోగుల హృదయం అనే పంజరం లో చిలుక గా వున్న వాడు,ధేనుక ,బకాసురాది రాక్షసులను వధించిన వాడు ,అయిన ఆ నందకుమారుడిని ఆనందం గా పదే పదే స్మరించు .అని సదాశివులు      ఉపదేశం చేస్తున్నారు .
            విశేషం —-ప్రపంచం అంటే అనేకం .పరమాత్మ ఒక్కడే .కనుక అనేకాన్ని వదిలి ఏకమైన పరమాత్మను ధ్యానించాలి .అప్పుడే సుఖం ,శాంతి లభిస్తాయి .భగవత్  ధ్యానానికి ,ఆయన లీలా స్మరణకు మంచి మార్గం ఇదే .నంద శిశువు (కిశోరం )చేసిన చిలిపి పనులు అమాయకులకు ఆనంద ప్రసాదం .అవే మహా యోగులకు అద్భుత భావ దర్శనాలు .”ఘోష కుటీర పయోఘ్రుత చోరం –గోకుల బృందావన సంచారం ”ఇందులో వేదాంత పరమైన అర్ధాన్ని విచారిద్దాం .గోవులు అంటే ఇంద్రియాలు అనే అర్ధం వుంది .వాటి వల్ల కలిగే విషయ జ్ఞానమే పాలు .పాలను చిలికితే వచ్చే వెన్న -లోకానుభవం .వెన్న కరిగితే వచ్చే నెయ్యి –సూక్ష్మవిచక్షణా జ్ఞానం . తనను అనుక్షణం స్మరించే గోపికల విషయ జ్ఞానాన్ని ,విచక్షణా జ్ఞాఆన్ని స్వీకరించి ,శ్రీ కృష్ణుడు వారికి ఆత్మానందం కలిగిస్తాడు ..
               ”వేణు రవామ్రుత పాన కథోరం –విశ్వ స్థితి లయ హేతు విహారం ”లోని పరమార్ధమేమిటో తెలుసు కోవాలి .వెదురు ముక్కను ఎండ బెట్టి ,లోపల అంతా కాళీ చేసి ,ఏడు రంధ్రాలు చేస్తే ,వేణువు తయారవు తుంది .దాన్ని పెదవుల తో గాలి పూరించి పలికిస్తే ,మధుర సంగీతం వచ్చి హృదయానికి ఆహ్లాదం కలిగిస్తుంది .ఇది మనుషులకూ వర్తిస్తుంది .మనిషి లోని లౌకిక వ్యక్తిత్వాలను భగ్నం చేసుకొని ,దర్పం ,అహంకారం లను తొలిచి ,డొల్ల గా( ఖాళీ )చేస్తే అయిదు జ్ఞానేంద్రియాలు ,మనసు ,బుద్ధి అనే ఎదింటినీ ఖాళీ కన్నాలుగా అర్పణ చేస్తే ,ఆంటి మహాత్ములను భగ వంతుడు తన మధుర సంగీతం ,సందేశం విని పించాతానికి తగిన పరికరం గా గ్రహిస్తాడు .ఇంతటి గహన విషయాన్ని మధు మధుర పదాల మురళీ రవం గా మార్చి మనకు ,ఆ మోహన మురళీ కృష్ణుని దివ్య దర్శనం చేయించారు బ్రహ్మేన్ద్రులు .కృష్ణ అంటే సర్వం కరోతి ఇతి కృష్ణః .అని వుంది .అంటే అన్నీ చేయించేవాడు అని అర్ధం .కృష్ణ అంటే ఆకర్షించే వాడు అనీ అర్ధం ..సర్వజీవ్లులను ఆకర్షించే వాడు ,అందరితో పని చేయించే వాడు ,ఆ శ్రీ కృష్ణ పర బ్రహ్మమే .అందుకే వారం వారం అంటే ప్రతి క్షణం ,నిరంతరం ఆ గోపాల కృష్ణుని నే స్మరించాలి అని బోధ ఇందులో వుంది
                           ఇప్పుడు రెండవ కీర్తన లోకి వెళ్దాం
2——-పల్లవి  — గాయతి వన మాలీ మధురం –గాయతి వన మాలీ ||
         చరణాలు —1–పుష్ప సుగంధ సుమలయ సమీరే —ముని జన సేవిత యమునా తీరే ||
                         2—కూజిత శుక పిక ముఖ ఖగ కుంజే —కుటిలాలక బహు నీరద పుంజే ||
                         3—తులసీ దామ విభూషణ హారీ –జలజ భవస్తుత సద్గుణ శౌరీ ||
                         4– పరమ హంస హ్రుదయోత్చావ కారీ –పరి పూరిత మురళీ రవ దారీ ||
          భావం —-వన మాలీ అంటే పుష్ప హారాలు  ధరించిన శ్రీ కృష్ణుడు మధుర గానం చేస్తున్నాడు .పూల గంధాలతో వస్తున్నచల్లని గాలితో ,ముని జన సమూహం తో ,యమునా తీరం లో సేవింప బడుతు ,చిలుకలు ,గోరు వంకలు మొదలైన పక్షుల కిల కిలారవాలు విని పిస్తుంటే ,వంకీలు తిరిగిన ముంగురులు లాగా వ్రేలాడేనల్లని   మేఘాలతో ,వనమాలీ ,యదువంశ విభుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ ,మధుర మనోహరంగా వేణు గానం చేస్తూ ,ఉల్లానికి ఉల్లాసం కలిగిస్తున్నాడు .
    విశేషం ——యమునా తీరం లో వేణు గానామృతం చేసే ఆ శ్రీ కృష్ణుని దివ్య దర్శాన్ని చిత్రం లో వ్హూపించి నట్లు మన ముందు నిల బెట్టారు బ్రహ్మేన్ద్రులు .”జలజ భవ స్తుత సద్గుణ షోరి ‘ఆయన .అంటే బ్రహ్మ చేత స్తుతింప బడే శ్రీ కృష్ణుడు అని అర్ధం .”యమునా ”అనే మాటలో కూడా విశేషార్ధం వుంది .యం అంటే నిగ్రహం .మునులు అందరు ఆత్మ నిగరం కలవాళ్ళు .అందుకే వారు యమునా తీరం లో విహరించటానికి ఇష్ట పడతారు .”జలజ భవ స్తుత ”లో ఒక చిన్న కధ దాగి వుంది .పూర్వం ఒక సారి బ్రహ్మ దేవుడికి బాల కృష్ణుని మీద ,యాదవుల మీద కోపం వచ్చింది .ఆయన బారి నుంచి వీళ్ళందర్నీ రక్షించటానికి బ్రహ్మకు కనపడ కుండా ఒక ఏడాది పాటు ఒక గుహలో గోవులను ,గోపాలురను దాచి రక్షించాడు బాల కృష్ణుడు .చివరికి బ్రహ్మ దేవుడే తప్పు తెలుసుకొని వచ్చి శ్రీ కృష్ణుని పాదాల పై పడి క్షమించమని వేడుతూ సంస్తుతించాడు ఆ బ్రహ్మ ఈ శ్రీ కృష్ణ పర బ్రహ్మాన్ని .ఈ సంఘటనను అంతాఒకే   పదం లో ఫ్లాష్-బాక్  గా మన ముందుంచారు సదా శివేన్ద్రులు .శ్రీ కృష్ణుడు ఎవరో కాదు ”పరమ హంస హ్రుదయోత్చవ విహారి ”.కృష్ణ అనే పేరు వింటేనే పరవశం వస్తుంది .అవ్యక్త మాధుర్యం ఆవహిస్తుంది .అలౌకిక సౌందర్య దర్శనం లభిస్తుంది .అలాంటి పరమ విభూతిని మనకు అందించారు సదాశివులు
                                                             సశేషం
                                                                               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -10 -11
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

1 Response to శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ల లోఅద్వైతా మృతం —4 క్రిష్ణామృతం

  1. ennela's avatar ennela says:

    నాకు చాలా ఇష్టమయిన పాటలు పెట్టారండీ…కృతజ్ఞతలు మీకు.

    Like

Leave a reply to ennela Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.