ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –2

        ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –2
                                                                   విద్యార్ధి దశ
మేము చేసిన సన్మానం
                శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారు తమ జీవిత చరిత్ర ను ”మహాత్ముల బాట లో ”అన్న పేర రాశారు .  .ఇక్కడే కనపడు తుంది ఆయన ఆదర్శం ఏమిటో ,వినయ భంగిమ ఏమిటో .ఈ పుస్తకం ఆధారం గానే నా రచన సాగుతుంది .విద్యార్ధిగా ,యువకునిగా ,ఉపాధ్యాయునిగా ,అధ్యాపకునిగా ,విశ్రాంత జీవిగా ,ఆయన జీవించిన ,జీవిస్తున్న ,విధానం ,ఆ యా దశల్లో చేసిన సాహిత్య సేవ ,నడిపిన పత్రికలు ,సమాజ సేవ అన్నీ వివరంగా విన్న విస్తాను .                                             కృష్ణా జిల్లా ముదునూరు లో జన్మించిన వెంకటేశ్వర రావు గారు ,చిన్న  తనం లోనే ,వాళ్ల స్వగ్రామం లో మహాత్మా గాంధి జీ ని చూచే మహద్భాగ్యం పొందారు .ఆయన ప్రభావం బాగా పని చేసింది .అప్పటినుంచే అస్పృశ్యతను ఏవగించుకున్నారు .హరిజనోద్ధరణ చేయాలని సంకల్పించారు .ప్రైవేటు స్కూల్ లోనే ప్రాధమిక విద్య పూర్తి చేసి,బందరు లో శ్రీ రామా హై స్కూల్ లో చేరారు .ఆనాటి ఉపాధ్యాయులంతా క్రమ శిక్షణకు మారు పేరు గా వుండే వారు .స్కూల్ లోనే విద్యార్ధులకు పాఠాలన్నీ వచ్చే టట్లు బోధించే వారు .ఇంటి వద్ద విద్యార్ధికి ఇంకా ఏమి పని వుండేది కాదు .ఆ విధానం రావు గారిని బాగా  ఆకర్షించింది .మునిమాణిక్యం నరసింహా రావు హిస్టరీ మేష్టారు .1937 లో శ్రీమతి సరోజినీ నాయుడు బందరు విచ్చేశారు .ఆమె ఉపన్యాసం విని ఉప్పొంగి పోయి గొప్ప ప్రేరణ పొందారు .ఆమె వాగ్దోరని ,ప్రసన్న హృదయం నచ్చింది .
                  రావు గారి తల్లి గారు చేసే రామ నామం ఆయనకు చాలా ఇష్టం .తండ్రి  గారు ఆదిత్య హృదయం నేర్పారు .మొదటిది ముక్తికి ,రెండోది ఆరోగ్యానికి అవసర మైనవి .చిన్నప్పటి నుంచి జేబు లో పాకెట్ నోట్ బుక్ వుండేది .గమనించిన ముఖ్య విషయాలు అందులోవెంటనే   రాసు కొనే వారు అది వారికి ఎన్నో రచనలు చేయటానికి దోహదం చేసింది ..మునిపల్లె రామా రావు గారి ద్వారా కమ్యునిస్ట్ పార్టి కి దగ్గరయారు .పార్టి వీరికి కొన్ని కార్య క్రమాలు అప్పగించింది .పోలీసులు వెంట బడితే కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకొనే వారు .మినర్వా టాకీస్ లో ఒక సారి కర పత్రాలను పంచి ,అందకుండా పారి పోయారు ..poleesula     పోలీsula   interogation  ఇన్  లో ఆకుకు అందాకా ,పోకకు పొందక సమాధానాలు చెప్పి ,హెడ్ మాస్టర్ గారి అభిమానం తో బయట పడ్డారు .క్రమం గా పార్టీ కార్య క్రమాలకు దూరమై ,చాడువుమ్మీద శ్రద్ధ పెట్టి ,సాంస్కృతిక కార్య క్రమాలకే పరిమితమయారు .
                ప్రముఖ నాస్తిక ప్రచారకులు గోపరాజు రామ చంద్ర రావు (గోరా)గారు ముదునూరు లో ”వయోజన పాథ   శాల” స్థాపించారు .ఆయనే ప్రిన్సిపాల్ .అయ్యదేవర కాలేశ్వర రావు పంతులు ,త్రిపురనేని రామస్వామి చౌదరి ,దుర్గాబాయి దేశముఖ్ ,టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన హేమా హేమీలంత వచ్చి అక్కడజాతీయ ,అంతర్జాతీయ ,సాంఘిక విషయాలపై ప్రసంగిస్తూ అభిరుచి కలిగించే వారు .మేజిక్ లాంటేర్న్ తో slide  లు  వేస్తూమాగంటి బాపినీడు  పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించే వారు .ఇవన్నీ రావు గారు దగ్గరుండి క్షుణ్ణం గా గమనించేవారు .మనసు లో ఏవేవో ఊహలు మేదిలేవి మెట్రిక్ పరీక్షలకు శిక్షణ కూడా ఇచ్చే వారు .అయితే వీటి మీద కంటే నాస్తిక ప్రచారానికి గోరా ఎక్కువ ప్రాముఖ్యత నివ్వటం తో క్రమంగా ఆకర్షణ తగ్గి పోయింది .ఆవు మాంసం పంది   మాంసం లతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసే వారు గోరా .ఇవి జనానికి రోత పుట్టించాయి .ప్రజలు నాస్తిక కేంద్రం అంటే మండి  పడే వారు .అ వూరి రైతు పెద్ద ,కాంగ్రెస్ నాయకుడు సశ్రీ అనే అంజయ్య గారు కూడా అసహ్యించుకొనే స్థితిని తెచ్చుకోనారు గోరా .ఇక” గో–రా ”అని పించికోకుండా నెమ్మదిగా ఆ వూరు వదిలేశారు .
రావు గారు ఆ కేంద్రం లో వున్న లైబ్రరీ పుస్తకాలు చదివి విజ్ఞానం పొందారు .గోరాతో సరదాగా మాట్లాడే వారు .”దారి తప్పిన ప్రయాణీకుడు గోరా ”అంటారు రావు గారు గోరాను .ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధ పడే వారు .అందుకని చాల సున్నితం గా కన పడే వారు .దీని వల్ల ఉపాధ్యాయులు ఆయన్ను” జపాన్ toy ”అని  పిలిచే  వారు ఆనాటిహెడ్మాస్టర్   పోక్కునూరి వెంకట రత్నం ,ఇంగ్లీష్ మేస్టారు చంద్ర శేఖర రావు లు ఆయనపై గాఢ ముద్ర వేశారు .వారి బోధన ప్రభావమే రావు గారిని ”హై స్కూల్ గ్రామర్ ”రాయటానికి కారణం అయింది . ” .
                                           రచనా జీవిత ప్రారంభం
                బందరు నోబుల్ హై స్కూల్ లో రా గారు ఎస్ .ఎస్ .ఎల్ .సి .లో చేరారు .ఇంగ్లీష్ లో చిన్న వ్యాసాలు రాసి ”అర్బుదం ”మేస్టారి తో దిద్దిన్చుకొనే వారు .1941 లోవిశ్వ కవి  రవీంద్ర నాద్ టాగూర్ మరణించారు .వారిపై ఇంగ్లీష్ లో మంచి వ్యాసం రాశారు .తరువాత రాసిన ”The teacher I like ,the teacher I wish to be ”వ్యాసం కాలేజి మాగజైన్ ”The noble comrade ”ప్రచురిత మైంది .ఈ వ్యాసం రాయటం లో రావు గారికి ఉపాధ్యాయ వ్రుత్తి పట్ల వున్న గౌరవం ,సంఘం లో ఉపాధ్యాయుని పాత్ర అర్ధమవుతాయి .
                                                       కళాశాల జీవితం
                   1943 లో గుంటూరు హిందూ కాలేజి లో రావు గారు ఇంటర్ లో చేరిఅర్త్స్ సబ్జెక్ట్ తీసుకొన్నారు .పిల్లలమర్రివెంకట హనుమంత రావు గారు తెలుగులెక్చరర్  .వారి ప్రభావం బాగాపడింది  .ఆనాడు గుంటూరు ను” కల్చరల్ కాపిటల్ ఆఫ్ ఆంద్ర ”అనే వారు .ఆ కాలమ్ లో ”నవ్య    సాహిత్య పరిషత్ ”మంచి ఊపులో వుండేది.వాళ్ళు ”ప్రతిభ ”అనే మాస పత్రిక నడిపేవాళ్ళు ..ఆంద్ర దేశం లోని సుప్రసిద్ధ రచయితలకు అది వేదిక . .దాని ప్రబావం రావు గారి మీద వుంది .ఏదో సాహితీ సేవ చేయాలనే ఆలోచనలు సుళ్ళు తిరిగాయి .”సరస సారస్వత సమితి ”అనే సంస్థ రావు గారికి కలిగింది .”’శోభ ”అనే వార పత్రికా కూడా వారి ఊహల్లో వుంది,కార్యరూపం  దాల్చింది ఆయనే ఎడిటర్ .గోళ్ళ మూడి   రాధాకృష్ణ మూర్తి అనే చిత్రకారుడు ,హాష్య రచయిత ,సినీ నటుడు కొంగర జగ్గయ్య కళాదర్శకుడు వి.సూరన్న సుభద్రా దేవి సహకారం తో ;;శోభ ”శోభాయమానం గా వెలువడేది .జగ్గయ్య చక్కని దస్తూరి తో తీర్చి దిద్దే వాడు .కుందుర్తి ,కరుణశ్రీ ,మాచిరాజు దేవీ ప్రసాద్ ,బొడ్డు పల్లి పురుషోత్తం లాంటి ఉద్దండులు శోభకు రచనలు పంపే వారు .ఆంద్రవిశ్వ విద్యాలయ registraar    శ్రీ కూర్మా వేణుగోపాల స్వామి నాయుడు నుంచి మంచి సహకారం అందేది .సర్వశ్రీ కొండావెంకట  ప్పయ్య ,ఉన్నవ లక్ష్మి    నారాయణ ,మల్లం పల్లి సోమ శేఖర శర్మ ,అడివి బాపిరాజు ,సలహా సంఘ సభ్యులు .సంఘం తరఫున ఉచిత చిత్ర కళా శిక్షణ తరగతులు శ్రీ రాజా సింహ ఆధ్వర్యం లో జరిగేవి .ధర్మ వరం రామ కృష్ణ మాచార్యులు ,గురజాడ అప్పా రావు గార్ల వర్దంతులు జరిపే వారు .ప్రముఖులను ఆహ్వానించి ఉపన్యాసాలను ఏర్పాటు చేసే వారు .నాటికలు వేయించే వారు .ఫోటోగ్రఫి నేర్పేవారు .విహార  యాత్రలకు వెళ్ళే వారు .ఇవన్నీ రావు గారి ఆలోచనలే మంచి కార్యక్రమాలకు రూప కల్పన అమలు , .అందరు వారి మాటకు విలువ నిచ్చే వారు .
                   1945  లో జరిగిన గురజాడ వర్ధంతి సభలో రావు గారు మొదటి ఉపన్యాసం చేశారు .అది ఆంద్ర ప్రభలో ప్రచురితమైంది .ఇలా రెండేళ్ళు వివిధ సాహిత్య ,సాంస్కృతిక కార్య క్రమాలు దిగ్విజం గా నిర్వహించి సమాజానికి కొత్తఆలోచనలను   పరిచయం చేశారు విద్యార్ధి దశ లోనే ఇంకా ఇంటర్ విద్యార్హి గా ఉండ గానే .1944 -45 -ల మధ్య ”జ్ఞాన ”అనే మాస పత్రిక నిర్వహించటానికి అనుమతి పొందినా ఆర్ధిక కారణాల వల్ల నిర్వహించ లేక వదిలేశారు .ఆ పత్రిక పేరు లోనే వారి జిజ్ఞాస ,అందించాల్సిన భావ ఔన్నత్యాలు మనకు అర్దమవుతున్నాయి అది కార్యరూపం  దాల్చక పోవటం మన దురదృష్టం .
                         1945 -బాపిరాజు ముదునూరు వారిని తాను సంపాదకుడు గా వుంటూ హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న ”మీజాన్ ”పత్రికకు సబ్ ఎడిటర్ ని చేశారు .ఒకరకం గా ఆయన పెన్మన్ ఈయన .కోణంగి ,నరుడు నవలలను అలవోకగా బాపిరాజు గారు చెబుతుంటే రావు గారు రాసే వారు .అవి పత్రిక లో ధారా వాహికం గా వచ్చేవి .బాపిరాజు గారింట్లోనే వీరి మకాం .ఆయనకు పెళ్లీడు ఆడ పిల్ల లున్నారు .అందుకని ఈయన్ని ”బాపిరాజు గారి అల్లుడు ”అని సరదాగా అనే వాళ్ళు .ఈయనకు అసలలాంటి అభిప్రాయమే లేదు .ఆయన్ను తండ్రి లాగా చూశారు .ఆయింట్లో ఒకడు అంతే .బాపి బావ తో గడపటం ఒక గ్రందాగ్రందాలయం లో గడిపిన అనుభూతి అంటారు రావు గారు .రాజు గారిది చాలా విశాల దృక్పధం .బహుభాషా పండితుడు ,నిగర్వి ,సహృదయుడు ,.”ప్రాచీనులలో నవీనుడు -నవీనులలు ప్రాచీనుడు బాపి రాజు గారు ”అంటారు ముదునూరు వారు .శ్రీ శ్రీనివాస చక్ర వర్తి ,తిరుమల రామ చంద్ర ,రాంభొట్ల కృష్ణ మూర్తి వీరి తో పాటు మీజాన్ కు సబ్ ఎడిటర్లు .అంతా హేమ హేమీలే .వారి సాహచర్యం బంగారానికి తావి అబ్బినట్లు అయింది రావు గారికి ‘1946  లో వెంకటేశ్వర రావు గారి వివాహం పెదముత్తేవికి  చెందిన శాంత గారితో జరిగింది .ఆ వివాహ వేడుకలలో పెదముత్తేవి ఆశ్రమ యతీంద్రులు ,ముముక్షు పీథ అధిపతి  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు ”బుర్ర కధ ”చెప్పటం గొప్ప హై లైట్ .
                                              సశేషం
                                                                        మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -11 -11 .
సెప్టెంబర్ 27 న జరిగిన సన్మానం
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

3 Responses to ముదిమి లోను యవ్వనోత్చాహి శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు –2

  1. i had a chance to be his student. he used to teach “english” subject in our first year engineering at Sri Sarathi Institute of Engineering and Technology, Nuzvid. Grate Teacher. I think he was in the list of “most influential people of the 20th century” by a magazine (sorry to say that i forgot the magazine name).

    Like

  2. kastephale's avatar kastephale says:

    మహానుభావులు వేంకటేశ్వరరావు గారికి వందనాలు.

    Like

Leave a reply to gdurgaprasad Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.