కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8
కన్యా శుల్కం లో కరటక శాస్త్రి —8
మధురవాణి తల్లిని జ్ఞాపకం చేసుకొంటూ ,ఆమె చెప్పిన మాటలు శాస్త్రికి చెబుతోంది ”నా తల్లి ధర్మవా అని నా చెవిలో గూడు కట్టుకొని చెప్ప బట్టి కాని ,లేకుంటే మీ లాంటి విద్వాంసుల ఇచ్చ కాలకి మై మరచి ఈ పాటికి వూళ్ళో సానుల వలె చెడి ఉండనా ?అంటుంది .తాను ఎంత ఎత్తు లో వుందో గుర్తించమని హెచ్చరిక .ఎంత నీచపు ఆలోచన లో కరటకం ఉన్నాడో ఆలోచించుకోమని ఆవేదన .తనను మళ్ళీ ఏదైనా పావుగా వాడు కొంటాడేమోనని అనుమానం కూడా ..ఆమె చెప్పినవి అక్షర సత్యాలు .కుహనా ఆదర్శాల పాలిటి చెంప దెబ్బలు .సంఘం చేసిన కులటల్లో తన స్థానం ఎలా పెంచుకొని ,దిగ జారక ,వ్రుత్తి రీత్యా అందులో వున్నా ఎంత ఎదిగానో చూడమని అతనికే కాదు మనందరికీ కళ్ళు తేరి పించింది .కాదు తెరిపించాడు గురజాడ .
చావు దెబ్బ తిన్నా ఇంకా ఆశ చావ లేదు గుంటూరు శాస్త్రికి .పొగడ్తల ధూపం వేస్తూనే ,తన మనసు లోని మాటను బయట పెట్ట టానికి ఎత్తులు ఎత్తుతున్నాడు .”మధుర వాణి అనే వేశ్య శిఖామణి ఈ కళింగ రాజ్యం లో ఉండక పొతే ,భగవంతుడి సృష్టికి యెంత, యెంత లోపం వచ్చి ఉండును ?”అంటాడు .ఈ పొగడ్తలకు లొంగే స్థితి దాటి పోయింది .తనను సౌజన్యా రావు గారి దగ్గరకు తీసుకొని వెళ్ళమని కోరింది .అతను బాధ తో అంటాడు ”ఆయన కోపిష్టి కాదు .అందుకే భయం .చెడ్డ వారి వల్ల చెప్పు దెబ్బలు తినవచ్చు కాని ,మంచి వారి వాళ్ళ మాట కాయటం కష్టం .”అదీ అతని రీడింగ్ .సౌజన్యం దగ్గరకు కరటకుడు వెళ్ళ లేని పరిస్థితి .”డిప్టీ కలెక్టరు కుక్కనాయుడు చేత రాయ బారాలు నడుపు తునాదని చెబుతుంది . ఎగిరి గంతేస్తాడు శాస్త్రి .కాగల కార్యం గంధర్వులు తీర్చి నట్లుంది .ఈమె వాని పట్టిందా తన కొంగు బంగారమే .
”వెళ్ళు ,వెళ్ళు -ఇంకా ఆలశ్యం చేస్తావేం ?నీ అదృష్టం ,నా అదృష్టం యేమనిచెప్పను” ? అని పొంగి పోతాడు .పొమ్మని బలవంత పెడతాడు .దాని వాళ్ళ కలిగే లాభాల బేరీజు వేస్తాడు .తన నిజాన్ని ,సిగ్గు మాలిన తనాన్ని మళ్ళీ బయట పడేసుకొంటాడు .ఆమె లోని ఔన్నత్యాన్ని ఇంకా అర్ధం చేసు కో లేని మూర్ఖత్వమే అది .’అయన ఒక్కడే మమల్ని కాపాడ గల వాడు ”అని ముక్తా యిస్తాడు .దివి నుండి భువికి దిగి రాను దిగి రాను అన్నట్లు ఆమె వీటి నన్నిటినీ అదిగా మించింది .ఈ రొంపిలో పద్మం లా వుంది ,రోమ్పిని ,కంపును పునీతం చేయాలనే కలలో వుంది .అది నిజం చేసుకోవాలనే ఆలోచనా ,ఆత్మ స్థైర్యం ,ధైర్యం వుంది .ఇంకెవరు తన్ను కిందికి లాగ లేరు వెయ్యి మంది డిప్టీ లైనా ,కర్కటు లైనా ..ఆ బంధాలన్నీ విచ్చేడా లైనాయి .ఒక దివ్య కాంతి ఆమెలో ఆవరించింది .దివ్య జ్యోతి కానీ పించింది .ఆ జ్యోతిని కరటక శాస్త్రి దర్శించ లేడు ..చూడ లేడు చూసినా తట్టు కో లేడు .
”ఇటు పై ఊర కుక్కలకు ,సీమ కుక్కలకు దూరంగా ఉండ దలిచాను .”అద్భత మైన మాటలు .కొరడాలు .రక్త మాంసాల్ని పీల్చి, పిప్పి చేసి ,సమాజ బాహ్యులను చేసే వీరంతా ,అంట కంటే గొప్ప పదాలకు అర్హులు కాదు .అందుకే కరటకుడు ఒక జాతి కుక్క సందేహం లెదు .ఆ మొహం లో పడ్డ వాడే .మళ్ళీ అదే ఆలోచన లో ఉన్న వాడే .అందుకే అంత గట్టి గా తన నిర్ణ యాన్ని చెప్పింది .శాస్త్రి కి ఇంకా ఆమె అర్ధం కాలేదు .”ఆయన చేతికి ఎముక లెదు .హెడ్ కాని స్టేబుల్ కు తీసి పోడా ?” అని సూటి పోటి మాటలతో రెచ్చ గొట్టాలని చూశాడు .ఇంకా దింపుడు కళ్ళం ఆశలో వున్నాడు .విని తట్టు కోవటం కష్టం .నిజం నిష్టురం గానే వుంటుంది .”హెడ్డు ను నౌకరు లాగా తిప్పుకోన్నాను .ఆ నాల్గురోజులు సర్కారు కొలువు మాని ,నా కొలువు చేశాడు .అతడి సాయం లేక పొతే మీరు ఆ వూరి పోలి మేర దాటే వారా ?లోకం అంతా ఏమి స్వప్రయోజన పరులు ?”అని బాధ పడింది .శాస్త్రిని ఇంత బాగా కాపాడినందుకు అతనిచ్చిన కితాబుకు రోత వేసింది .అర్ధం చేసుకోనందుకు బాధ ,ఈ సమాజం లో నిస్వార్ధ పరుల యెడ తూష్ణీ భావం .వ్యక్తమైంది .అదీ పాత్ర చిత్రణ అంటే .అదే అప్ప రావు గారి అంతః పరిశీలన .
శాస్త్రికి తల వాచీ ,తిరిగి పోయింది .చెంపలు వేసుకోన్నంత పని చేశాడు .”అపరాధ శతం ”చెప్పు కొన్నాడు .క్షమించామంనంత పని చేశాడు .డిప్టీ కలెక్టర్ను చూడను అనటం అతనిమనసు చివుక్కు మందట .ఈ విషయం సౌజన్యా రావు గారు ఏమంటారో అంది .”పీక కత్తరిస్తారు ”అంటాడు శాస్త్రి. అదేదో చూస్తాను అంది ఆమె .”బ్రహ్మ హత్యా పాతకం కట్టు కుంటావా “?అని తెగ బాధ పడతాడు .ఎక్కడ ఈమె సౌజన్యా రావు తో చెప్పి ,నిజం బైట పడుతుందోననే ఆందోళన శాస్త్రి లో తగ్గలేదు .”ఆహా ఏమి బ్రాహ్మలు ? పోలి శెట్టి చెప్పి నట్లు ఎంత చెడ్డా బ్రాహ్మలు కదా ”అని కంటే ఇస్తూ ,”తిలోదకాలేనా ?”‘అంటుంది .పువ్వుల్లో పెట్టి తిరిగి ఇస్తానంటాడుశాస్త్రి కృతజ్ఞత తో .”నీ లాంటి మనిషి లేదు .కించిత్ తిక్క లేకుంటే నా “”అని ఉబ్బెస్తాడు .”ఆ తిక్కే మిమ్మల్ని కాపాడింది ‘అదే నా భూషణం,అన్నంత ధీమాతో .అదే విశ్వనాధ ”దిశానా హన్కారం ”లోకానికి లొంగని అంతః సౌందర్యం .ఆ శక్తి దేనికీ లొంగదు .బ్రాహ్మణీకం లో తప్ప పుట్టావు అని శాస్త్రికి వెక్కి రింపు . .
కరక టానికి ఆశ ఇంకా చావలేదు డొంక తిరుగుడు మాన లేదు .నిజం ఒప్పుకుంటే కొంప మునుగుతుందనే తప్ప ,ఒప్పుకొని నిటారుగా నిలబడ లేని వాడు .కరటక బుద్ధి శల్య గతం కదా .ప్రాదేయకం గా ,చివరి అస్త్రం గా ”ఆ డిప్టీ కలెక్తర్ని ఒక సారి చూసి ఈ బీద ప్రాణినికాపాడితే ? అని సన్నాయి నొక్కులు నొక్కాడు .ఆమెకు అసహ్యం వేసింది .ఇక అతడు అక్కడ వుంటే ఆమె తట్టుకోలేదు .ఉద్ధరిస్తారని అనుకుంటే దిగజార్చాలని ప్రయత్నిస్తునాడు .తక్షణం వెళ్లి పొమ్మంది శాస్త్రి ని .
సశేషం
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

