పాహియాన్ సఫల యాత్ర –3
— ఇది సింధు నదీ ,స్వాట్టు దేశాల మధ్య వుంది .దీన్నే ”స్వాస్తిని ”అంటారు .ఇంద్రుడు బోధి సత్వున్ని అగ్ని పరీక్ష చేసింది ఇక్కడే .ఇక్కడి స్తూపానికి వెండి ,బంగారు పూత వుంది .అక్కడి నుంచి అయిదు రోజులు ప్రయాణించి ”గాంధారం ”చేరారు .ఇప్పుడు దీని పేరు ”ధేరీ”.అశోకుని కుమారుడు ”ధర్మ వివర్ధనుడు ”రాజ్యం చేస్తున్నాడు అప్పుడు .బోధి సత్వ్వుడు ఒక మనుష్యునికి తన ”కళ్ళు ”తీసి ఇచ్చిన ప్రదేశమిది .అక్కడే స్తూపం కట్టారు .హీన యానం ఉందిక్కడ .

తక్ష శిల
తూర్పుకు ఏడు రోజులు ప్రయాణం చేసి ”తక్షశిల ”రాజ్యం చేరారు .చైనా భాష లో తక్ష శిల అంటే ”ఎగిరిన తల ”.బుద్ధుడు బోధి సత్వుడైనప్పుడు ,తన శిరస్సును ,కోసి ఇచ్చిన ప్రదేశం కనుక ఆ పేరు వచ్చింది .ఇక్కడే ఆయన శరీరాన్ని పులికి ఆహారం చేశాడు కూడా .సప్త మణులతో ,నిర్మించిన స్తూపం వుంది .రాజు ,ప్రజలు తండోప తండాలుగా వచ్చి దర్శించే పుణ్య స్థలం .అనేక కానుకలు సమర్పిస్తారు .పుష్పాలు చల్లటం ,దీపాలు వెలిగించటం ఇక్కడి విశేషం .ఇక్కడే గొప్ప విశ్వ విద్యాలయం వుండేది .జనం ఇసుక వేస్తె రాలనంత గా రోజూ వస్తారు .దీన్నే స్తూప చతుష్టయం అంటారు .
పురుష పురం
దక్షిణం గా ప్రయాణం చేసి ,నాలుగు రోజుల్లో పెషావర్ చేరారు .ఇదే పురుష పురం .బుద్ధుడు తన అన్న కుమారుడు ”ఆనందుని ”తో ,భవిష్యత్తు లో ”కనిష్కుడు ”ఈ ప్రాంత రాజు అవుతాడని ఒక స్తూపం నిర్మిస్తాడని ఒకజాతక కధ తెలియ జేస్తుంది .అలాగే కనిష్క రాజ్యం ఇక్కడ ఏర్పడింది.స్తూపమూ కట్టించాడు .400 అడుగుల ఎత్తు ,రత్నాలు ,మణులతో నిర్మించాడు .నేత్రానందం గా వుంటుంది .దీన్ని మించిన స్తూపం ఇంకెక్కడా తాను చూడ లేదని పాహియాన్ రాశాడు .దీని సౌందర్యము దేనికీ లేదు అన్నాడు .భారత దేశం లో రమణీయ స్తూపం ఇదే .ఒకప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇక్కడ చిన్న స్తూపం కడుతుండ గా కనిష్కుడు చూశాడు .కనిష్కుడు ముచ్చట పడి దానిపై పెద్ద స్తూపం కట్టించాడు .ఇప్పుడు పెద్ద స్తూపాన్ని చీల్చుకొంటూ ఆ బాలుని అస్తూపం ప్రక్కగా కని పిస్తుంది .ఇక్కడే బుద్ధుని ”కక్ష పాల ”వుంది .ఇది నల్ల గా వుంటుంది .అద్దం లో మెరుస్తూ వుంటుంది .దానికి నాలుగు పొరలు .అంగుళం మన్దమ్ లో వుంటుంది .దీనికో తమాషా వుంది .నిరుపేదలు ,కొద్దిగా పుష్పాలు వేసినా నిండి పోతుంది .ధన వంతులు ఎన్ని పోసినా నిండదు .పాహియాన్ తో వచ్చిన ”పాయూను ,సాం కింగ్ ”లు పూజ చేసి చైనా వెళ్లి పోయారు .హ్యుయంగ్ కు వ్యాధి సోకింది .ఇక్కడే కక్ష పాల సంఘారామం లో మరణించాడు .పాహియాన్ ఏకాకి గా బయల్దేరి ”నాగారా ”చేరాడు .”హేలో ”దాని ముఖ్య పట్నం .ఇదే నేటి ”హిడ్డా నగరం ”దీన్నే ”హీరో ”అంటారు .అంటే ”ఎముక ”అని అర్ధం .
ఆ మూలాగ్రం బంగారంతో ,సప్త మణులతో అలంకరించ బడిన బుద్ధుని కపాల ఆస్తిక ,దానిపై స్తూపం వుంది .రోజూ ,రాజు వచ్చి భక్తీ శ్రద్ధ లతో పూజించి వెళతాడు .సూర్యాస్తమయం కాగానే ద్వారం మూసేసి రాజముద్ర లు వేస్తారు .ప్రతి వారి వద్ద ముద్రిక వుంటుంది .ఉదయమే సీళ్ళను పరిశీలిస్తారు .పన్నీటి తో చేయి కడుగు కోని ,కపాల అస్తికను భక్తీ తో బయటకు తెస్తారు .ఉన్నత వేదిక పై మణి సింహాసనము పై అస్తికను ఉంచుతారు .దీనిపై వైడూర్యాలతో చేసిన ఘంటా కారం గల డోలిక ను మూత వేస్తారు .ఈ ఎముక పసుపు రంగు కలిగి అర్ధ చంద్రా కారం గా వుంది .ప్రతి దినం ఇదే పధ్ధతి పాటిస్తారు .శంఖ ,తాళ ,మృదంగ ధ్వనులు చేస్తారు .రాజు పూజించి ,దాన్ని పైకెత్తి శిరస్సు పై వుంచుకొని ,తిరిగి యధా స్తానం లో వుంచుతాడు .ఈ ఆరాధన అయిన తర్వాతే దిన వారీ పరిపాలనా కార్యక్రమం .దీన్ని ఉంచటానికి”విమోక్ష ”అనే స్తూపం వుంది .
ఈ పట్టణానికి ఈశాన్యం లో లోయలో బుద్ధుని ”యోగ దండం ”వుంది .అక్కడ ఒక విహారం వుంది .బౌద్ధ యాత్రికులు దర్శించి కానుకలు సమర్పిస్తారు .పశ్చిమం లో బుద్ధుడు ధరించిన ”అంగరఖా ”(చొక్కా ) వుంది .దీని పై స్తూపం వుంది .అణా వృష్టి వస్తే దీన్ని బయటకు తెచ్చి ప్రదక్షిణాలు చేసి ,మొక్కుతారు .వెంటనే కుంభ వృష్టి కురుస్తుంది .ఈ పర్వతానికి దక్షిణం లో వున్న పర్వతం లో శిలా గుహ వుంది .బుద్ధుడు తన ”ఛాయా ”ను అక్కడే వదిలి వెళ్ళాడని ప్రతీతి .పడి బారల దూరం నుంచి చూస్తె బుద్ధుని నిజంగానే చూస్తున్నామా ?అన్న భావం కలుగు తుంది .ఆయన శరీర కాంతి,సహజ సౌందర్యం ,పుట్టు మచ్చలు ,(112 )స్పష్టం గా అందులో కన్పిస్తాయి .దగ్గరకు వెళ్ళిన కొద్దీ ,స్వప్న దృశ్యం లా వుంటుంది .దీని ఛాయా చిత్రం రాయాలని చాలా మంది ప్రయత్నం చేశారు కాని దుస్సాధ్యమైంది .సహస్ర బుద్ధులు కూడా ఇలాగే శరీర చాయలను వదిలి వెళ్ళారని ప్రతీతి .
దీనికి పశ్చిమంగా ,బుద్ధుడు కేశ ఖండన ,నఖ చ్చేదం చేసుకొన్నా ప్రదేశం వుంది దీని పైనా స్తూపం కట్టారు .ఎత్తు 80 అడుగులు ఇప్పటికీ వుంది .అర్హతులకు ౧౦౦౦ స్తూపాలు కట్టారు . .
లోయి ,పోహన రాజ్యాలు
శీతా కాలమ్ అక్కడే గడిపి ,దక్షిణ దిశ గా ప్రయాణించి ,”క్షుద్ర హిమ శైలం ”చేరాడు .దీన్నే ”సఫీదు కో పర్వతం ”అంటారు .మంచు కప్పేసి వుంటుంది .హ్యుకింగు కు చలి గాలి పడ లేదు .నోటి నుంచి నురుగులు కక్కు కున్నాడు .”నేను చని పోతున్నాను .మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్లి పొండి ”అని పాహియాన్ ను వేడుకొన్నాడు .అక్కడి నుంచి ”పోహన ”రాజ్యం చేరాడు .”ఫలానా జిల్లా ”అని ఇప్పుడు దాని పేరు .తర్వాత సింధు నది దాటి ,”పేటూ”రాజ్యం చేరారు .ఇదే ”పాంచాలం ”హీన యాన ,మహాయానాలు బాగా వ్యాపించిన ప్రదేశం .బౌద్ధ సన్యాసులు వచ్చారని తెలుసు కోని ప్రజలు చాలా సంతోషించారు .”అన్య దేశీయులై వుండి ,సంసారాన్ని త్యజించి ,భిక్షువులై ,భారత దేశాన్ని సందర్శించారంటే ఆశ్చర్యం ”అను కొన్నారట ప్రజలు .
మధుర
అక్కడ నుంచి ఆగ్నేయం గా ”మధుర ”చేరారు .ఇదే శ్రీ కృష్ణుని జన్మ స్తానం .”మయూర నగరం ;”అనే పేరుంది .అ కాలమ్ లో ఉత్తర భారతం లో ,ఎడారికి పశ్చిమాన వున్న రాజులంతా బౌద్ధమే అవలంబించారు .శ్రమణకు లను బాగా ఆద రించారు వారికి కానుకలు అందించే టప్పుడు కిరీటాలు తీసి భక్తిగా ఇచ్చే వారు .శూన్య మస్తకం తో చేయాలని వారి నయమం .మ్రుస్తాన్నాలతో సంతృప్తి పరచే వారు .వారి ముందు ఉన్నత ఆసనాల మీద కూర్చునే వారు కాదు .వారి ముందు రత్న కంబలం పరచి దాని పై కూర్చొని మర్యాద గా మాట్లాడే వారు .ఈ మర్యాద లన్నీ బుద్ధుడు సజీవుడు గా ఉన్నప్పుడే ప్రారంభ మయాయి .తర తరాలుగా వచ్చిన సంప్రదాయమే .మధురకు దక్షిణం గా ఉన్నదంతా ,”మధ్యభారతం ”’.మంచు లేదిక్కడ .ప్రజలు ఐశ్వర్య వంతులు .సుఖమైన పరి పాలన.ప్రజా పీడన లేదు .ప్రజా స్వాతంత్రాన్ని అడ్డుకొనే శాశనాలూజీవ హింస లేదు ..

ఇళ్ళ ను ఒక అధికారి దగ్గర నమోదు చేసుకోవాలి .వ్యవసాయం చేసే వారు పంటలో కొంత భాగం రాజుకివ్వాలి .ఇష్టమైతే రాజు గారి వ్యవసాయమూ చేయ వచ్చు .కొట్టటం ,శిరచ్చేదనం లేవు .తప్పుల్ని బట్టి జరిమానా వేసే వారు .రాజా ద్రోహి కి కూడా మరణ దండన లేదు .వారి కుడి చేయి మాత్రం తీసే వారు .అంగ రక్ష కులకు కూడా నిర్ణీత మైన జీతాలు ఉండేవి ..జీవ హింస లేదు .మద్యం ,వెల్లుల్లి ,నేరుల్లి వాడే వారు ఆడ్డు .పశు వధ చేసే వారిని ”చందాలురు ”అనే వారు .వీరు కర్ర లతో కొట్టు కుంటు వస్తారు .ఆ ధ్వనికి ప్రజలు దూరం గా పోయే వారు .కుక్కల్ని ,పందుల్ని జనం పెంచే వారు కాదు .మాంసం అమ్మే దుకాణాలు లేవు .”గవ్వలు” ణానాలుగా చెలామణి లో ఉండేవి .బుద్ధుని మరణం తర్వాత రాజులు బౌద్ధ సన్యాసులకు విహారాలు కటించారు .మాన్య క్షేత్రాలు ఏర్పాటు చేశారు .సేద్యానికి దుక్కిటెద్దులు ఇచ్చారు .ఆ చంద్ర తారార్కం అనుభవించ వచ్చు అని శాసనాలు చేశారు ..
బౌద్ధ భిక్షువులు కూడా సత్కార్యాలు చేసే వారు .సూత్ర పథనం ధ్యాన నిష్ట సల్పే వారు దూర దేశాల నుంచి వచ్చే వారికి విడిది ఇచ్చే వారు .ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి ఆహ్వానించే వారు .పాదాలు కడుక్కో వటానికి నీళ్ళు ,పాద లేపన తైలం ఇచ్చే వారు .ద్రవ రూప ఆహారం అందించే వారు .పూజ్యత ,పూజ్యతను బట్టి అర్హమైన పడక ఏర్పాట్లు ఉండేవి .ఇక్కడ బుద్ధుని శిష్యులకి కట్టిన స్తూపాలు చాలా వున్నాయి .వర్షా కాలమ్ ఆవ గానే కానుకలిచ్చే వారు .బుద్ధుని ముఖ్య శిష్యుడైన ”సారి పుత్ర ”స్తూపం బాగా పూజలు అందు కొనేది పూల దండలు ,అగరు వత్తులు ,వాడకం లో వున్నాయి .దీపాలంకరణ వుండేది .గాయకులూ కమ్మని పాటలతో అలరించే వారు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -11 -11 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


Please continue. very nice reading this.
LikeLike