దివ్య ధామ సందర్శనం –7

దివ్య ధామ సందర్శనం –7

                                                 కేదార నాద్ దర్శనం
కేదార్ నాద స్వామిని దర్శించి ,పూజించి ఉదయం తొమ్మిదిన్నరకు బయటికి వచ్చాం .అనంత  జన సందోహం .సోమ వారం కావటం  మరీ విశేషం .సోమ వారం సోమేశ్వరుడైన కేదార నాధుని దివ్య దర్శనం చేయటం  మహద్భాగ్యం .పూర్వ జన్మ సుక్రుతమేమో .శాస్త్రీజీ తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు .కొంత ప్రసాదం బయట కొన్నాం .దేవాలయానికి వెనుక శ్రీ శంకర భగవత్పాదులు అవతారం  సమాప్తి చేసు కొన్న  ప్రదేశం చూస్శాం .శంకరులు ఇక్కడే శివైక్యం చెందారు .ఆయనే లేకుంటే ,ఈ మారు మూల ప్రదేశం లో ఇంతటి భగవద్భక్తి ఎలా నిలిచి వుంటుంది ?ఆయనకు యావద్భారత జనం రుణ పడి వున్నారు ఆ మహాను భావునికి హృదయ పూర్వక నమస్కారాలు చేశాం .కేదార్ నాద్ ఆలయం అక్టోబర్ వరకే తెరచి వుంటుంది .ఆ పైన వచ్చే ఆరు నెలలు భక్తులకు ప్రవేశం లేదు .ఇద్దరు పూజారులు మాత్రం వుండి స్వామి కి పూజాదికాలు నిర్వహిస్తారట .మిగిలిన వారంతా కింద గౌరీ కుండ్ దగ్గరే వుంటారు .ధారా పాతం గా మంచు కురుస్తుంది కనుక ఎవరు ఉండలేరు .మొత్తం అంతా మంచు తో కప్పుకు పోతుంది ప్రాణ వాయువూ లభించదు .అయితే కలువలు పూసి మంచుకే అందాన్ని స్తాయట .ఆ దృశ్యం చూసి తీర వలసిందే నట .
ఉదయం ఏడున్నరకే మమ్మల్ని ఎక్కిన్చుకొన్న ”పోనీ పొరలు ”ఆలయం దగ్గర చేరి త్వరగా , వచ్చెయ్య మని చెప్పారు .పది గంటలకు అందరం ”గుర్ర మేక్కాం ”.మళ్ళీ 14 కి.మీ.ప్రయాణం .బావ నడిచే వస్తానన్నాడు .నిన్న ఉన్న వాతావరణ హడావిడి ఇవాళ లేదు .అంతా ప్రశాంతం గా వుంది .వర్ష ఛాయా కూడా లేదు .గుర్రాలను ఎవరివి వారు నడి పిస్తూ ,చాలా వేగం గా పోతున్నారు .వేలాది జనం .వచ్చే వారు ,పోయే వారు .వందలాది గుర్రాలు .మధ్యలో డోలీలు .నలుగురు మనుష్యులు మోస్తూ వుంటారు .ఆరుగురు కూడా మోస్తారు .అందులో శవా కారం గా కూర్చోవాలి .చాలా జాగ్రత్త గా కాళ్ళను కదిలిస్తూ ,బాలన్సు చేసు కుంటూ ,వాళ్ళు దూసుకు పోతుంటారు .వీపుకు కట్టిన ఫేం కుర్చీ లాంటి బుట్టల్లో కొంత మంది యాత్రికుల్ని మోసి తీసుకొని వెళ్తారు .నడిచి వచ్చే వారి సంఖ్యే ఎక్కువ .ఇన్ని వేల జీవాలు ,ఆ ఇరుకు దారిపై ,అనేక శ్రమలకు ఓర్చి ,కేదారేశుని దర్శిస్తున్నారంటే ఆశ్చర్య మేస్తుంది .ఆ విశ్వాసానికీ ,నమ్మకానికీ జోహార్లు .బాగా ”డబ్బు చేసిన వారి”నుంచి ,ఏమీ లేని నిరు పేద ల వరకు అన్ని రకాల వారు వస్తారు .దర్శన మాత్రం చేత మోక్షాన్ని ఇచ్చే భోలా శంకరుడు ఆయన .ఎక్కడా సాదు సంతులు తప్ప భిక్షం అడి గే వారు కనిపించరు .ఇదొక విశేషం ఇక్కడ .
కిందకు ప్రయాణం కనుక గుర్రాలు వేగం గానే కదుల్తున్నాయి .కూర్చోవ టానికి చాలా ఇబ్బంది గానే వుంది .ఒరుసుకు పోతోంది జీను .ఎత్తు నుంచి కిందికి గుర్రం దుమికే టప్పుడు ,అతి జాగ్రత్త గా వుండాలి .లేక పొతే ప్రమాదమే .పడి పోవటమే .వెనకా ముందు పట్టు కొని కూర్చో వాలి .
నిజం గా ,”భగవంతుడు ఆ పోనీల్లో ,వాటిని నడిపే ఆ ఘర్వాల్ మనుష్యుల్లోనే వున్నాడు ”అని పిస్తుంది .డబ్బు కోసం 30 కి.మీ .నడిచి వచ్చి తిరిగి వెళ్లి జీవితం సాగిస్తున్నారు .ఆరు నెలలే ఈ జీవనం .అ తర్వాతా కొండ రాళ్ళు కొట్టు కొంటు జీవిస్తారట .సామాను చేర వెయ టానికీ పోనీలనే  ఉపయోగిస్తారు .వాటి సేవలు అమోఘం .వారి సహనానికి జోహార్లె .హిమాలయాలను నమ్ము కొని జీవించే వీరి జీవితం ,త్యాగ మయమే .నిరంతర కాస్త జీవులు .వాళ్ళల్లో అలసట ఎక్కడా కానీ పించాడు .సరదాగా నవ్వుతు ,హుషారుగా వుంటారు .ముఖాలలో చాలా ప్రశాంతత .ఒక బీడీ దమ్ము లాగుతూ ,దమ్ము తీసు కొంటు ,నిరంతరం పైకీ ,కిందికీ తిరుగు తూ వుంటారు .ఒక్కో గుర్రం ,మనిషీ రోజుకు 56 కి.మీ .అంటే రెండు ట్రిప్పులు తక్కువ కాకుండా అప్ అండ్ డౌన్ తిరుగు తూంటారు .అంతటి శ్రమైక  జీవులు .ప్రేమాస్పదులు .ఈ యాత్ర లో జనాన్ని చేర వెయ టానికి ,చాలా చోట్ల నుంచి ,పోనీలు వస్తాయట .సీజన్లో అయి పోగానే వెళ్లి పోతారు .
కేదార్ నాద నుంచి పది కిలో మీటర్ల వరక్కు పర్వతాలన్ని మంచుతో కప్పి వుంటాయి .మొక్కక్లు చెట్లు అసలు కని పించవు .ఆ తర్వాతా నుంచి గౌరీ కుండ్ వరకు ,ఎత్తైన వృక్షాలు కానీ పించాయి .పై ప్రాంతం ఎత్తు 1150 అడుగులు .ఒక గంటన్నర ప్రయాణం తర్వాతా విశ్రాంతి .పది నిముషాల తర్వాతా మళ్ళీ ప్రయాణం .కాళ్ళు లాగేస్తున్నాయి మెట్లు ,మంచు పొరలు ,నీటి ధారల మధ్య ప్రయాణం .పోనీలు అల్గ్గా దిగి పోతున్నాయి టక టక శబ్దం చేసు కొంటు .వీటి డెక్కల ఏర్పాటు అన్నిటికీ తట్టు కోనేటట్లు వుంటాయి .ఈ పర్వతాలకు తగిన జీవులీ పోనీలు .వాటిని నమ్ముకొని ,అమ్ముకొని జీవిస్తారు ఈ ఘర్వాల్ వాసులు .మధ్యాహ్నం ఒకటిన్నర కు ”గౌరీ కుండ్ ”చేరాం .ప్రభావతి గుర్రంఅందరి కంటే  ముందు చేరింది .దారిలో ఏమీ ఎంగిలి పడ లేదు .నిన్న  ఉదయం ”రుద్ర ప్రయాగ ”లో చేసిన టిఫ్ఫినే ఇప్పటికీ బలాన్నిస్తోంది .కడుపు నిండి నట్లే వుంది కుక్ ఇచ్చిన వన్నీ అరవ వాళ్లకు ఇచ్చేశాం .అక్కయ్య గుర్రం మా తర్వాతా చేరింది .”హిమ గిరి సొగసులు ”కను విందు చేశాయి మళ్ళీ .ఆ ప్రదేశం వదిలి రా బుద్ధి కావటం లేదు .ఫోటో లు తీద్ద మంటే రీల్ లాక్ అయింది .చాలా గొప్ప ఫోటోలను తీయ లేక పోయినదుకు బాగా బాధ పడ్డాం .అయితే మనో ఫలకం మీద అవన్నీ ముద్ర పడ్డాయి .మహదానందం అంటే ఇదేనేమో ?
బావ వచ్చే దాకా అక్కయ్య ఆగుతానంది .మేమిద్దరం నడుచు కొంటు ,ఒక హోటల్ కెళ్ళి పరోటా తిన్నాం .ఇదే రెండు రోజుల తర్వాతా తిన్న ఆహారం .మేనల్లుడు అశోక్ ఇచ్చిన విటమిన్ టాబ్లెట్లు కూడా కేదార్ లో వేసు కోవటం మర్చి పోయాం .పుచ్చ కాయ ముక్కలు కొని తిన్నాం .అరటి పళ్ళు కొనితిన్నాం .  .సాయంత్రం నాలుగింటికి బస్ వచ్చింది .బావ ఇంకా రాలేదు .వచ్చిన వారందర్నీ ఎక్కించు కొని బస్ రెండు కిలో మీటర్ల అవతల ఆగి నది .బావా వాళ్ళు అయిదున్నరకు ఇంత దూరం నడిచి బస్ దగ్గరక్కు చేరారు .రాగానే మాపై ”ధూమ్-ధం    ”అంటూ లేచాడు .మేమిచ్చిన పుచ్చ కాయ ముక్కలు అరటి పళ్ళు తిన లేదు .అలిసి పోయాడు .కోపం రావటం సహజమే .ఎవరైనా అంతే .ఆయన నడక మానేయాల్సింది .ఈ నడక తర్వాత ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది .అంత దూరం నడిచే వయసు కాదు ఆయనది .చెబితే వినడు గురుడు .అయిదున్నరకు బస్ బయలు దేరింది .శాస్త్రీజీ కూడా మాతోనే ఎక్కారు .ఏడున్నరకు గుప్త కాశీ చేరాం .కరెంట్ లేదు .శాస్త్రి గారు ఇంటి పైన రూములు కట్టించాడు యాత్రికుల కోసం .మంచాలు ,పరుపులు ఏర్పాటు చేశాడు .సామాను సర్దేశాం .ఈ లోగా కాఫీ ఇచ్చారు .భోజనం తయారు చేశారు .బంగాళా దుంప కూర ,పప్పు ,సాంబారుఅప్పడం  వగైరాలతో భోజనం .అంతగా తిన బుద్ధి కాలేదు .ఏదో ఇంత గతికాం .
నేను ప్రయాణం లో అవసర మైన హోమియో మందుల్ని తెచ్చాను .మాకు ,మా తోటి ప్రయాణీకులకు అవసరాన్ని బట్టి వాడాను .చాలా బాగా పని చేశాయి .విరేచనాలు కట్ట టానికి ,వికారం పోవ టానికీ ,కాళ్ళ నేప్పులకు ,వడ దెబ్బకు అద్భుతం గా పని చేశాయి హోమియో మందులు .చాలా త్వరలో రిలీఫ్ ఇచ్చాయి వేసుకొన్న వారికి .ఇలా వైద్య సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఆనందం గా వుంది .రాత్రి పది గంటలకుమంచాలపై వాలాము .ఎదురు గా హిమాలయాలు కన్పిస్తూనే వున్నాయి .వాటిని మనసు లో నింపు కొని ,నిద్రకు ఉపక్ర మించాం .పండిత్జీ డాబా హిమాలయ సౌందర్యాన్ని చవి చూపించింది .
ఇవాల్టి తో నాలుగు రోజుల యాత్ర పూర్తి అయింది .రేపు ”బద్రీ నాద ”యాత్ర ప్రారంభిద్దాం .అంత వరకు సెలవ్
సశేషం —మీ — గబ్బిట .దుర్గా ప్రసాద్ –23 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

1 Response to దివ్య ధామ సందర్శనం –7

  1. సోమ వారం సోమేశ్వరుడైన కేదార నాధుని దివ్య దర్శనం చేయటం మహద్భాగ్యం .పూర్వ జన్మ సుక్రుతమేమో !

    No doubt About it
    Absolutely Right

    Thanks
    ?!

    Like

Leave a reply to ఎందుకో ‽? ఏమో ! Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.