2002 లో మేము అమెరికామొదటి సారి వెళ్ళినపుడు హూస్టన్ లో ఒక తెలుగమ్మాయి కూచి పూడి నాట్యాన్ని రంగ ప్రవేశం చేసింది .ఆమె గురువు అనసూయ గారి అమ్మాయి ”రత్న పాప ”.ఆమెఅక్కడ చాలా కాలమ్ నుంచి వుంటూ ,నాట్యం నేర్పిస్తోంది .చాలా మంది శిష్యుల్ని తయారు చేసింది .వావిలాల లక్ష్మి గారు మమ్మల్నిద్దర్నీ తన కార్ మీద రైస్ university కి తీసు కోని వెళ్ళింది .అక్కడే అరంగేట్రం .ఆ పిల్ల తలిదండ్రులు నాసా లో ఉద్యోగులు .అందరు చక్కని తెలుగు మాట్లాడారు .బాగా రిసీవ్ చేసుకొన్నారు .చాలా మంది తెలుగు వారు వచ్చారు .అందరికి కాఫీలు టిఫిన్లు ఏర్పాటు చేశారు . .ఆ అమ్మాయి బాగా డాన్సు చేసింది .university లో ఆమె గురువు ఒక ఆఫ్రికన్ లేడీ ఆమె కూడా వచ్చి ఆశీర్వ దించింది .ప్రోగ్రాం కాగానే నేను రత్న పాప గారితో పరిచయం చేసు కున్నాను .ఆమె తన తల్లి అనసూయ అక్కడే వుందని పరిచయం చేసింది రత్న పాప .అనసూయ గారు బాగా మాట్లాడారు .మా అక్కయ్య గాడేపల్లి లోపాముద్ర ,బావ కృపానిధి ఆ యన తండ్రి పండిట్ రావు అందరు అనసూయ గారికిగుర్తే .అందర్నీ అడిగారు .నేను మా శ్రీమతి ఆమె ప్రతిభకు నమస్క్రించాం .జాన పద పాటల్ని పల్లకీ లో పెట్టి ఊరేగించిన విదుషీ మణి అనసూయ.దేవుల పల్లి వారితో నా పరిచయాన్ని ఆమె కు చెప్పాను .చాలా సంతోషించింది .దేవుల పల్లి వారు ఆమె కు మేన మామ .ఆయన పాటలకు ప్రత్యెక విజయం చేకూర్చింది ఆమె .ఆమె సోదరి సీతా దేవి .సీత దేవి ఇండియా లో వుందని చెప్పారు . .అనసూయ గారు ,రత్న పాప తమ ఇంటికి రమ్మని ఫోన్ నంబేరు అడ్రెస్స్ ఇచ్చారు .కాని వెళ్ళటం కుదర లేదు .అంత దూరం లో వున్నా బంధుత్వం అంటే అంత ఆపేక్ష ఆమెకు ,కుమార్తెకు .రత్న పాప గారి భర్త మంచి ఫోటో గ్రాఫేర్ ఆయననూ పరిచయం చేశారు .

రెండో సారి అనసూయ గారిని చిట్టెన్ రాజు గారు హైదరా బాద్ లో ప్రపంచ సభలను నిర్వ హించినపుడు చూశా.ఆవిడ పుస్తకావిష్కరణ కూడా జరిగింది .పరిచయం చేసు కోని మాట్లాదించాను .ఆప్యాయం గా మాట్లాడింది .ఆమె కంటి కాటుక లో గొప్ప మహాత్మ్యం వుంది .భలే ఆకర్షణీయం గా వుంటారామే .చేతు లెత్తి నమస్కరించ బుద్ధి వేస్తుంది.గొప్ప సంస్కారి .ఈ సభ లోనే బాపు రమణ ల ”స్నేహ శాస్తి పూర్తి ”జరిగింది .వారిద్దరిని ఘనం గా సన్మానించారు .
రత్న పాప గారినీ రెండో సారి ఇండియా లోనే కూచి పూడి లో చూశా.సుమారు నాలు గేళ్ళ క్రితం .ఆమె ను పలకరిస్తే బాగా మాట్లాడారు .చిన సత్యం గారు ఏర్పాటు చేసిన సిద్ధేంద్ర జయంతి కి వచ్చారు .ఆయన ఆహ్వానం పై .ఒకే వేదిక మీదా ఆమె ,నేను కూడా మాట్లాడాం .ఆమెది చాలా చిన్న పిల్ల మనస్తత్వం .నేను ”శ్రీ నాధుడు రాసిన పద్యం ”’చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి -నీల కుంతల ఫాల నీల గళుడు ”అన్న పద్యం చదివి దాని భావం చెప్పాను వేదిక మీద అందులో పార్వతీ పరమేశ్వరుల వర్ణన వుంది గొప్ప గా .ఉదాహరణకు –పార్వతి చంద్ర బింబం వంటి ముఖము కలది .శివుడు చంద్ర రేఖ ను తలపై ధరించిన వాడు .ఆమె నల్లటి కురులు కలది ఆతడు నీల కన్తుడు .ఇలా పద్యం అంతా వివరించి చెబితే రత్న పాప చిన్న పిల్ల లా గా నా దగ్గరకు వచ్చ ”ఏమండీ ఆ పద్యం నాకు రాసి ఇవ్వరా ?చాలా బాగుంది .మా పిల్లలకు నాట్యం నేర్పటానికి దీన్ని ఉపయోగించు కొంటాను ”అని అడిగింది .వెంటనే రాసి ఇచ్చాను .దేశాంతరం లో వున్నా జన్మ భూమి పై మమ కారం ఇక్కడి తెలుగు పై శ్రద్ధా ఇక్కడి కళల పై మక్కువా వాటిని అక్కడ వ్యాప్తి చేయటం పై శ్రద్ధా చూసి నేను ఆశ్చర్య పోయాను .ఇవన్నీ ఇవాళ ఆంద్ర జ్యోతి లో ”పాటల తల్లికి పట్టం ”అనే జి.ఎల్ .యెన్ మూర్తి గారి వ్యాసం చదివిన తర్వాతా జ్ఞాపకాల దొంతరల కదలిక .నాతొ మీరూ పంచు కుంటారని అందిస్తున్నాను –మీ దుర్గా ప్రసాద్
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
వింజమూరి అనసూయ
http://endukoemo.blogspot.com/2011/12/telugu-literary-treasure-in-tamil-hands.html
Please follow the above link for exclusive Interview of her.
Thanks
?!
LikeLike