మా నాన్న గారి ప్రీరణ తో నేను కూడ ఇటివల చేసిన కర్ణాటక తీర్థ యాత్ర మీకోసం
కర్ణాటక తీర్థ యాత్ర
మేము కర్నాటక లోని దేవాలయాలను దర్శించాలని చాలా రోజుల నుంచి అనుకోవటం అది కుదరక పోవటం. ఈసారి ఎలాగైనా వెళ్ళాలని డిసెంబర్ మొదటి వారం లో KSTDC temple trip కి ట్రై చేసాము. డిసెంబర్ చివరి వారం లో ఫుల్ అయ్యాయి స్పెషల్ బస్సు డిసెంబర్ 21st కి బుధవారం సీట్స్ విడి విడిగా ఉన్నాయి. 7 టికెట్స్ బుక్ చేసాము. Rs 2690/- బెంగలూరు నుంచి
ట్రిప్ వివరాలు ఇలా ఉన్నాయి బుధవారం రాత్రి కి బయలు దేరి గురువారం హొరనాడు , కలస , శ్రింగేరి , రాత్రికి కొల్లూరు అక్కడే బస.శుక్రవారం మురుడేశ్వర , ఉడిపి , కటిల్ రాత్రి బసశనివారం కద్రి , ధర్మస్థల , కుక్కే సుబ్రహ్మణ్యం , రాత్రి బెంగళూర్ తిరుగు ప్రయాణం
నేను (gln sarma ) , indira (మా ఆవిడ), హర్ష (son) , హర్షిత(daughter) , kr sastry( మామ గారు) భువనేశ్వరి (అత్తగారు) , హరిత (అత్తగారి చెల్లెలు)మేము బుధవారం రాత్రి 7గంటలకు మున్నేకోలల నుంచి మర్తహళ్లి వెళ్లి కార్పొరేషన్ సర్కిల్ వరకు బస్సు లో వెళ్ళాము. అక్కడికి దగ్గిర గా బాదామి హౌస్ నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతుంది మేము 8:30 కి చేరాము. అక్కడ హోటల్ లో కాఫీ తగి మళ్ళి బాదామి హౌస్ కి వచ్చాము. అప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు. బస్సు అంతా ముందే ఫుల్ అయ్యింది.
రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరింది. బస్సు కొంచెం పథ గా ,సీట్స్ చిన్నవి గా అనిపించాయి. ఘాట్ రోడ్స్ మూలం గా కావచ్చు. రాత్రి భక్తీ గీతాలు పెట్టారు బస్సు యశ్వంత్ పూర్ మీదుగా మైసూరు రోడ్ చేరింది. అందరు నిద్ర పోయారు.
రాత్రి 12 గంటలకు టీ కోసం బ్రేక్. KSRTC బస్స్టాండ్. టీ చాల బాగుంది , చలి బాగా ఉంది . అందరు స్వేట్టేర్స్ , దుప్పట్లలో మునిగిపోయారు., నేను హర్ష , ఇందిర, మామ గారు టీ తగాము. మళ్ళి బయలుదేరింది బస్సు. రాత్రి 2 గంటలకు మళ్ళి బ్రేక్. చూస్తె అంత ఘాట్ రోడ్. విపరీతమైన చలి హొరనాడు కి 90 KM దూరం లో ఉన్నాము.అన్ని చెట్లు , ఘాట్ రోడ్. దాదాపు 385 km బెంగళూర్ నుంచిగురువారం ఉదయం 4:30 కి హొరనాడు అన్నపూర్ణ గెస్ట్ హౌస్ కి చేరింది అందరం దిగా ము మాకు 2 రూమ్స్ ఇచ్చారు. హాట్ వాటర్ వచ్చింది హాయి గా చాల సేపు స్నానం చేసారు. 6 గంటల కు అందరం రూమ్స్ వెకేట్ చేసి సామాను మళ్ళి బస్సు లోకి ఎక్కిన్చాము.బస్సు లో ముందు వరస మేము ఉన్నాము , తరువాత తమిళ్ ఫామిలీ , ఆ తరువాత కన్నాడ టీచర్స్ , ఆ తరువాత మళ్ళి తమిళ్ ఫ్యామిలి , చివరగా మళ్ళి తెలుగు ఫ్యామిలి , అందరూ దాదాపు పెద్దవాళ్ళు. ఒక్క జంట మాత్రం లాస్ట్ లో ఉన్నారు . బస్సు మొత్తం పిల్లలు హర్ష , హర్షితానే. గైడ్ కృష్ణన్ , అన్ని భాషలు మాట్లాడుతున్నాడు ఒక్కడే డ్రైవర్ , ఒక క్లీనేర్.
6-30 దేవాలయమ ప్రారంభం అవుతుంది. అన్నపూర్ణేశ్వరి దేవాలయం. అప్పటికే చాల మంది స్నానానికి వెడుతూ స్కూల్ పిల్లలు కనబడ్డారు. దర్సనం కోసం మేము నడుచుకొంటూ బయలుదేరాము.చుట్టూ కొండలు. మధ్యలో ఆలయం . అప్పుడే సూర్యడు కొండల మధ్యలో వచ్చాడు.మేము లైన్ లో నుంచున్న తరువాత దర్సనం ప్రారంభం అయ్యంది. చొక్కాలు , మగవారు దర్సనం చేసుకోవాలి. (దాదాపు అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది )
7:15 కి దర్సనం అయ్యింది. . హర్షిత, హర్ష అన్నపూర్ణే , సద పూర్ణే … చదువుతూ ఉన్నారు.
7-30 కి బ్రేక్ఫాస్ట్ లైన్ లో నుంచున్నాము . మొబైల్ సిగ్నల్ లేదు. పెద్ద క్యు దాదాపు 7:45 కి ఓపెన్ చేసారు. అటుకులు పంచదార కలిపిన్ ప్రసాదం పెట్టారు. పిల్లలు తినలేదు , నేను అది ప్యాక్ చేసాను. కాఫీ ఇచ్చారు అది తగాము. కాఫీ బాగుంది. బయటకు రాగానే గైడ్ మాకోసం వెతుకుతున్నాడు. మళ్ళి బస్సు ఏక్కాము .మేము తెచ్చిన ప్రసాదం బస్సు లో అందరికి పెట్టాము. అందరు తిన్నారు. ప్రసాదం వేస్ట్ చెయ్యకుండా పంచి పెట్టాము.బస్సు కలస (కల్సేశ్వర స్వామి) దేవాలయం వెడుతోంది. అక్కడి కి 10km. చాల పాత దేవాలయం , ఆడ మగ ఎనుగుల దేవాలయం లు ఉన్నాయి.కొండ మీద కలసేస్వర స్వామి దేవాలయం. ఖాళి గా నే ఉంది. మళ్ళి చొక్కాలు తీసి దర్సనం. అక్కడ కొన్ని ఫొటోస్ తీసాము. దేవాలయం బయట ఫొటోస్ తీసుకోవచ్చు .
9-30 కి అక్కడినుండి శ్రింగేరి కి బయలుదీరాము. అన్ని కొండలు , పూర్తీ ఘాట్ రోడ్. 75 km 2గంటల ప్రయాణం, హర్షిత కి బస్సు పడటం లేదు. అన్ని వంకరలు. బస్సు కూడా స్పీడ్, సీట్స్ చిన్నవి అవటం. జారిపోవటం. మళ్ళి సర్దుకొని కూర్చోవటం.శ్రుంగ మహర్షి తపసు చేసిన ప్రదేశం కనుక శ్రింగేరి పేరు.
11:30 కి చేరాము. ముందుగా స్వామి వారి దర్సనం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది అందుకని నది దాటి ఆశ్రమా నికి చేరాము. అప్పటికే చల్ల పెద్ద క్యు ఉంది. మేము లైన్ లో నుంచున్నాము. శంకరాచార్యులు ఉన్న ప్రదేశం. కప్పెస్వర స్వామి దేవాలయం నది ఒడ్డున ఉంది. పెద్ద పెద్ద చేపలు నదిలో ఉన్నాయి బ్రిడ్జి నుంచి కనబడుతున్నాయి. ఏనుగులు , గుర్రాలు ఆశ్రమానికి దగ్గరలో తిరుగున్నాయి. భారతీ తీర్ధ స్వామి తెల్లటి గడ్డం తో కోర్చోని అందరిని అశీర్వదిస్తున్నారు. చల్ల మంది తమిళులు ఉన్నారు. పళ్ళెం లో పళ్ళు సమర్పిస్తునారు. అప్పుడే ఒక వి ఐ పే వచ్చారు. మేము నూరి సోమయాజుల వారి ఫామిలీ అని చెప్పాము. అయన వెంటనే గుర్తుపట్టి పుస్తకాల గురించి చెప్పారు. తెలుగు మాట్లాడారు. దర్సనం అయ్యిన తరువాత హరి హర రాయలు, బుక్క రాయలు నిర్మిచిన దేవాలయం ,గోడల మీద చెక్కిన శిల్పాలు ఆ ప్రక్కనే శివాలయం , శారదా పీఠం. శంకరాచార్యుల జీవిత చరిత్ర ఆధారం గా వేసిన బొమ్మలు. బాగా రాష్ లేకపోయినా స్కూల్ పిల్లలు బాగా ఉన్నారు. చాలా బస్సు లు వస్తున్నాయి . కాసేపు కూర్చొని డైనింగ్ హాల్ వైపు క్యు లో కి చేరాము. పెద్ద హాల్ , అందరు కూర్చొని తినటం. ప్లేట్స్ , గ్లాసెస్ పెట్టారు. స్వీట్ పాయసం లాంటిది పోసారు. రైస్ ,వేసారు , చారు, మళ్ళి రైస్ , సం బారు , మళ్ళి రైస్ , మజ్జిగ అన్ని 15 నిమిషాలో , పిల్లలు ఏమి తినలేదు. హర్షిత కాస్త బెటర్.
ఒక పుచ్చకాయ కొని అందరం తిన్నాము. అక్కడ నుండి కొల్లూర్ 140 km దూరం. కేరళ బోర్డర్ దాదాపు. పూర్తీ ఘాట్ రోడ్. Dvd లో శంకరాభరణం సినిమా , ఆ ఘాట రోడ్ నింద్ర పట్టలేదు ఎవరికీ. సినిమా dvd ప్రాబ్లం ప్రతి నిమిషానికి ఆగిపోవటం మళ్ళి రావటం. అందరూ చూసారు. ఘాట్ రోడ్ కి హర్షిత అవుట్. మా దగ్గిర ఉన్న కవేర్స్ అన్ని కంప్లేట్. మళ్ళి కొన్నాము. మధ్యలో 50 km దూరమ్ లో బ్రేక్ టీ త్రాగి మళ్ళి ప్రయాణం.
బస్సు లో అందరికి ఘాట్ రోడ్ పడలేదు. వాతా వరణం వేడిగానే ఉంది. అందరూ అలసి పోయారు.కల్లూర్ ముకంబికా దేవాలయమ చాలా గొప్పది. రామాయణ నాటిది. లక్ష్మణుడు మూర్చపోతే , ఆంజనేయుడు తీసుకువచ్చిన సంజీవని పర్వ్సతం లోని కొంత పార్ట్ పడమటి కనుమలో లో పడినది. అక్కడ ఋషులు ఏర్పాటు చేసిన ఆశ్రమం. దానిని శుక్రాచార్యుని శిష్యులు , రాక్షసులు నాశనం చెయ్యటం. దేవతలు రక్షించటానికి మూకాంబిక రూపంలో వచ్చి సంహరించటం జరిగింది.
హోటల్ లో రూమ్స్ ఇచ్చారు. అందరం రూమ్స్ లో పడ్డారు. సెల్ పని చెయ్యలేదు. వేడి నీళ్ళు స్నానం తర్వాత కాస్త అందరికి శక్తి వచ్చింది.గుడి 200 మీటర్స్ దూరం. చాలా పెద్ద క్యు. చాల మంది కేరళ వాసులు ఉన్నారు. చాలా మంది వచ్చారు ముఖ్యం స్కూల్ పిల్లలు.మా దర్సనం అయ్యిన తరవాత హారతి ఆని దెప్పలు వెలిగించి ఉంచారు. దొవలో టిఫిన్ చేసి దోసలు, చపాతి, కాఫీ, తాగటానికి వేడి నీళ్ళు. అరటి పళ్ళు కేజీ 30rs కొని తిని హోటల కి చేరాము. మళ్ళి పొద్దున్న 5-30 కి ప్రయాణం.
దాదాపు 650 km కూర్చొని ప్రయాణం అందరు నిద్ర లోకి జారి పోయారు.



sukraachaaryulu,naasenamu lo melika sae vaadithe baagundedemo?
LikeLike
సచిత్రంగా కళ్ళకు కట్టినట్టుగా వ్రాశారు మీ యాత్రను. నేను కూడా మీతో ఈ యాత్రలో సూక్ష్మరూపంలో పాల్గొంటూ, ఆనందిస్తాను. పదండి ముందుకు.
LikeLike
so nice like live teli cast. keep going on..
LikeLike