కర్నాటక తీర్ధయాత్ర – 3
కటిల్ అందరికి బాగా నచ్చింది. హోటల్ , నిన్న పెద్దగా ఘాట్ లేకపోవటం, ఎండ ఉన్న తీవ్రము గా లేకపోవటం, బీచ్ లో విహారం అందరూ బాగానే ఎంజాయ్ చేసారు. సాధారణం గా దేవాలయం లో కొబ్బరి కాయలు కొడతారు. ఇక్కడ కటిల్ లో కొబ్బరి బొండాలు అమ్మవారికి సమర్పించడం చూసాము.. అందరూ హాయిగా నిద్ర పోయారు. నా షిఫ్ట్ ఉదయం ఏడు గంటల వరకూ ఉంది.ఉదయం 4:30 కే వేకప్ కాల్ వచ్చింది.. అందరం రెడీ అయ్యాము. మళ్ళి హాయిగా వేడినీళ్ళ స్నానం. 5:30 కి అందరూ కిందకు వచ్చారు. సామాను బస్సు లో పెట్టారు. లాస్ట్ గా నేను వచ్చాను. బస్సు స్టార్ట్ అయ్యింది. ముందుగా కొంత మంది అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. బస్సు అక్కడ ఆగింది మళ్ళి దర్సనా నికి దిగారు. కొట్టిన బొండాల తీర్థం బాటిల్ లో తీసుకు వచ్చి అందరికి పంచారు.
మంగళూరు ఎయిర్ పోర్ట్ కొండ మీద పక్కనే వచ్చింది. గైడ్ దుబాయ్ విమానం కూలిన ప్రదేశం చూపించాడు. కొండ మీద ఎయిర్ పోర్ట్. రన్వే.నుంచుని చూస్తె లైట్స్ తో కనపడింది. ఇంకా పూర్తిగా తెలవారలేదు..గైడ్ మేము చేప్పిన ప్రకారం ముందు మంగుళూర్ గోకర్ణ క్షేత్రం వైపు ప్రయాణం సాగింది. మంగుళూర్ సిటీ మధ్య లో ఉంది. ఇది రాజివ్ గాంధి చేత ప్రారంబింప పడినది. 1991. లో. తరువాత దాని చుట్టూతా మిగతా దేవాలయాలు వచ్చాయి.ట. జనార్ధన్ పూజారి కర్నాటక మాజీ కేంద్ర మంత్రి దీన్ని బాగా డెవలప్ చేసారుట.

7 am : షిఫ్ట్ క్లోజ్ చేసాను. బస్సు గోకర్ణ క్షేత్రం చేరింది దేవాలయం చాలా నీట్ గా క్లీన్ గా ప్రశాంతం గా ఉంది.. ఎదురుగా శివాలయం.. ఆలయం ప్రాంగణ గోడల పైకప్పు మీద విచిత్రం గా నవగ్రహాలు చెక్కి ఉన్నాయి . అల్లాగే అష్ట లక్ష్మి విగ్రహాలు చెక్కి ఉన్నాయి.. ఆలయం కుడి వైపు హనుమాన్ టెంపుల్. ఎడమ వైపు గీతా మందిర్. ఆలయం లో అందరు దేవుళ్ళు ఒకే చోట కనిపించారు.. గ్రానైట్, మార్బుల్ తో తీర్చి దిద్ది ఉంది. ఆలయం మాసి పోకుండా ప్లాస్టిక్ కవర్స్ కూడా కప్పారు.. ఒక వైపు చెట్ల మద్యన ఏర్పరిచిన శివుని ఫామిలీ , శివుడు , పార్వతి, గణేష్, కుమార స్వామీ తో క్రింద మా ఫామిలీ 
8.00 am అక్కడినుండి కద్రి హిల్స్ వైపు ప్రయాణం. మంగళూర్ పెద్ద టౌన్.. అన్ని వాణిజ్య సముదాయాలు కనబడ్డాయి. కద్రి మంజునాద్ కద్రి మహర్షి స్థాపించినది. అక్కడ 6 వాటర్ పాండ్స్ లో స్నానం చేస్తే చాల పవిత్రం అని గైడ్ చెప్పాడు. అవి ఎప్పుడు ఎందలేదుట (వేసవి/ వర్షా కాలం లో ) వాటర్ లెవెల్ ఎప్పుడూ సమం గానే ఉంటుదిట.

8:30 కి బ్రేక్ ఫాస్ట్ ‘అభిమన్యు హోటల్ : మేము అడిగినవి ఇడ్లి, వడ ఏమి లేవు. దోసె, పూరి తప్పించి. అంత బాగా లేవు కాని తప్పలేదు. తిని కాఫీ త్రాగి మళ్ళి బస్సు ఎక్కాము. గైడ్ ని తిట్టి అక్కడ ఆపినందుకు.
9am : మంగళాదేవి దేవాలయం .మంగళూరు మధ్యలో ఉంది. ఈదేవత పేరు మీదే మంగళూర్ వచ్చింది. దర్శనం చేసుకొని బస్సు ఎక్కాము.
అక్కడి నుండి ధర్మశాల ప్రయాణం 70kmనిన్న ఆపిన 3idiots మళ్ళి ప్రారంభం. 2 గంటలు ప్రయాణం. మళ్ళి ఘాట్ రోడ్, అందరు ప్రయనకి అలవాటు పడటం మూలం గా పెద్దగా ప్రయాణ భారం అనిపించలేదు. బస్సు లో అందరూ పక్క వాళ్ళ తో మాటలు కలిపారు. మా వెనుక ఒక తెలుగు జంట. అబ్బాయి తెలుగు, అమ్మాయి కన్నడ. కాని అమ్మాయి నెల్లూరు అబ్బాయి బెంగుళూరు. లాస్ట్ వరుస లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ మరదలు, వాళ్లతో ఎవరితో నూ మాట్లాడని ఒక పెద్దాయన హైదరాబాద్ నుంచి వచ్చారు. మా అత్త గారు ఆయన్ని బావ గారని వాళ్ళని వాళ్ళ ఆక్కలలాగా ఉన్నారని మా తో అన్నారు.కన్నడ టీచర్స్ అందరితో 20 rs మనిషికి కాంట్రిబ్యూట్ చేసి దాదాపు Rs 600/- డ్రైవర్ కి rs 400/- క్లీనర్ కి Rs 200/- ఇద్దాము అని నిర్ణయించారు. మేము మా కాంట్రిబ్యూషన్ Rs/-150/- ఇచ్చాము. కుక్కే సుబ్రహ్మణ్యం లో ఇద్దాము అని ప్రకటించారు
.ధర్మస్థల ప్రయాణం మధ్యలో ఇస్కాన్ వాళ్ళు నిర్మంచిన రామాలయం వద్ద ఆపారు. ఇది కూడా మేము కోరినదే. ఆలయం లోపల మార్బుల్ తో చెక్కినది. బయట వేడిగా ఉంది. లోపల చల్లగా ఉంది. 15 మినిట్స్ లో కంప్లేటే.నేత్రావతి నది దగ్గిర 30 మినిట్స్ ఆపాడు. ప్రవాహం లేకపోటం, చెత్త చెదారం ఎక్కువ. మేము దిగ లేదు
12 గంటల కు ధర్మస్తలి చేరాము. స్పెషల్ దర్శనం 200 Rs/.- నార్మల్ దర్శనం కోసం లైన్ లో నుంచున్నాము. దాదాపు 25 లైన్స్ తో కూడిన కాంప్లెక్స్ . ప్రతి లైన్ 50 మీటర్స్ పొడుగు. ధర్మస్తలి: దేవుళ్ళు కొలువైన ప్రదేశం.
కాశి నుంచి తెచ్చిన మంజునాధ శివలింగం ప్రతిష్టించారు. కర్నాటక శ్రీశైలం గా ప్రస్సిద్ది. కాని తీరు చూస్తె తిరుపతి లాగా ఉంది. విపరీతమైన జనం. స్కూల్ పిల్లలు దానికి తోడు అయ్యప్ప భక్తులు. దాదాపు 2hrs పట్టింది కాంప్లెక్స్ దాటటానికి. మళ్ళి గుడి చుట్టూ.అందరికి ఆకలి , పరుగెత్తటం , లైన్ లో , సిరిగ్గా మేనేజ్ చెయ్యటం లేదు. మేము తిరిగిన అన్నిటి కి ఇది భిన్నం గా ఉంది.
మానజిమేంట్ సరిగ్గా లేదేమో. లైన్స్ నీట్ గా లేవు. 3:15 కి దర్శనం అయ్యింది. 3:30 కి మళ్ళి లైన్ భోజనానికి , కూర వేసారు , రసం, సాంబార్ మాములే. అందరం అయ్యంది అనిపించి బస్సు ఎక్కాము. అక్కడి నుండి లాస్ట్ ప్లేస్ కుక్కుటే సుబ్రహ్మణ్యం. ఇక్కడి నుండి 40km. మధ్యలో టీ బ్రేక్. కాఫీ త్రాగాము బెటర్. 5pm కుక్క్కుటే సుబ్రహ్మణ్యం చేరాము. ఇక్కడి నుండి బెంగుళూరు 290 km. ఇక్కడినుండే రిటర్న్. రాత్రి 9 గంటలకు మళ్ళి రిటర్న్ జర్నీ.
2 ప్రధాన దేవాలయాలు అది సుబ్రహ్మణ్యం వాసుకి అనే పాము తన సంతానం తో పాటు అది సుబ్రహ్మణ్యం దేవాలయం లో ఉందిట.. గరుడుడు దాన్ని తినటానికి వచ్చాడని. వాసుకి కి అభయం లభించిది అని గైడ్ ద్వారా తెలిసింది. ఇప్పటికి అక్కడ ఒక 5 తలల పాము ఉందిట. ఆది సుబ్రహ్మణ్యం దేవాలయం 6:15కి మూసేస్తారు. అందుకని ముందు అక్కడికి వెళ్ళాము. అక్కడికి దగ్గర లో వాసుకి ఉండేదట. దర్శనం అయ్యని తర్వాత పక్కన పార్క్ లో కూర్చోన్నాము. ఈలోపల చీకటి పడింది. పిల్లలు షాప్పింగ్ కి దిగారు.. అప్పుడే హర్ష కాలి దగ్గరగా ఒక పాము చాలా చిన్నది పాకుకొంటూ వెళ్ళింది.
అక్కడినుండి మేము కుక్కుటే సుబ్రహ్మణ్యం దేవాలయం కి చేరాము. మేము ఎక్కడికి వెళ్ళినా స్కూల్ పిల్లలు మాత్రం వస్తూఉన్నారు. .
8pm కి సాగర్ హోటల్ ఫుల్ బిజీ, మొత్తం మీద టిఫిన్ తిని కాసేపు బయట కూర్చొని 8:45 pm కి బస్సు దగ్గరకు చేరాము. రాత్రి తొమ్మిది గంటలకు బస్సు బయలుదేరింది.
బెంగుళూరు రిటర్న్ లో లగాన్ సినిమా వేసారు. హర్ష తప్పించి ఎవ్వరూ చూసి ఉండరు. బెంగళూర్ ముందుగానే వచ్చింది కాని 5:30 am కి మజేస్టిక్ దిగి వెంటనే మర్తహళ్లి బస్సు ఎక్కి ఇంటికి చేరాం.
దాదాపు 1200lm 80 గంటల ప్రయాణం. ఎక్కడా ఎక్కువ సేపు ఆగక పోవటం. 2 డేస్ విశ్రాంతి. మొదటి రోజు కాస్త ఎక్కువ ప్రయాణం. చేఇవారి రెండు రోజులు ప్రయాణానికి అలవాటు పడటం.
గైడ్ గురించి : బస్సు లో కొందరి కామెంట్ : ఎక్కడకు వెళ్ళినా ముందు తోటాయిలెట్ గురించి , తరువాత చెప్పుల స్టాండ్ గురించి ఆ తరువాత మాత్రమే దేవాలయం గురించి మాత్రమె చెప్పాడు అని కన్నడ టీచర్స్



BALE VUNDANDI
MEE INTREST KI MECHUKOVALI
CHALA BAGA TAYARU CHESARU
DOCUMENTROY LAGA VUNDI
NENU NERCH KOVALANI VUNDI
LikeLike