మహా వ్యాఖ్యాత కోలాచలం మల్లి నాద సూరి

మహా వ్యాఖ్యాత   మల్లి నాద సూరి

              ఎవరైనా ఏ పుస్తకం మీద నైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లి నాద సూరి వ్యాఖ్యానం లాగ  వుంది అనటం లోకం లో వుంది .అంటే వ్యాఖ్యానాలకు చక్కని ఒరవడి పెట్టిన వాడు మల్లి నాద సూరి అన్న మాట .ఆయనే లేక పోతే కాళిదాసు మహా కవితో సహా ఎందరో సంస్కృత కవుల గురించి ఆంధ్రులకు తెలిసేదే కాదు .ఆయన అన్నం మెతుకు పెట్టె మెదకు జిల్లా లో జన్మించాడు .సంస్కృతీ మెతుకును ,సంస్కృత సాహిత్యపు ఓగిరాన్ని ఆంధ్రులకు అన్న ప్రాసన గా పెట్టిన మహాను భావుడు .ఆయన గురించి తెలుసు కోక పొతే తెలుగు తల్లి మనల్ని క్ష మించదు .
ఆంధ్రుల కీర్తి ని ఖండంత రాలు దాటించిన వాడు ”కోలాచలం మల్లి నాధ సూరి ”మల్లినాద సూరి అనే మాట వ్యాఖ్యాతకు పర్యాయ పదమై పోయింది.
.ఆయన పద వాక్య ప్రమాణ పారా వార పారాయణుడు ,మహా మహోపాధ్యాయుడు .ఆయన వ్యాఖ్య లో చారిత్రాత్మక ,విశిష్టత వుంటుంది .అందులో తర్కం ,వ్యాకరణం ,న్యాయం కలిసి వుంటాయి ఆయనది హృదయోల్లాస వ్యాఖ్య .మూల గ్రంధానికి పూర్తీ న్యాయం చేసే వ్యాఖ్యానం చేయటం ఆయన ప్రత్యేకత .కాళిదాసు కవిత్వం కొంత మనపైత్యం  కొంత గా వుండదు .కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తాడు .లయకు స్థానం కల్పించాడు .ఆయన ”జ్ఞాన సింధు ”.కాళిదాసు ,మాఘుడు భారవి ,హర్షుడు రాసిన కావ్యాలకు ఆయన వ్యాఖ్యలు లేక పొతే తెలుగు వారెవరు చదివే వారు కాదని అందరి నమ్మకం .ఆయన లేక పోతే ఆంద్ర సంస్కృతి లేదంటారు చాలా మంది .మెదక్ జిల్లా పలుకుబడికి సంస్కృతికి అద్దం పట్టిన వాడు మల్లి నాధుడు .

కోలాచలం అన్న ఇంటి పేరున్న వారు ఇప్పటికీ మెదక్ జిల్లా లో వున్న్నారు .పటాన్ చెరువు వద్ద ఈ పేరు గల కుటుంబాలున్నాయి .14 వ శతాబ్దం ఉత్తరార్ధం లో వాడు సూరి .కాకతీయ రాజుల ఆదరణ తో ఓరుగల్లు చేరాడు .వీరి పతనం తర్వాతా రాచకొండ రాజుల ఆస్థానానికి వచ్చాడు .వీరిది కాశ్యపస గోత్రం .యజుస్సాఖ .ఆపస్థంభ సూత్రం .వైదికబ్రాహ్మణులు .
తాత పేరు మల్లి నాధుడే .శ్రీ శైల మల్లన్న  వీరి ఇల వేలుపు .తాత కాకతి ప్రతాపరుద్ర మహా రాజు ఆస్థాన కవి .శతావధాని .కనక్కాభి షేకం పొందాడు .సూరి తండ్రి ”కపర్ది ”పండితుడు .శ్రౌత కల్పానికి ”వ్రుత్తి ”రాశాడు .విద్యా సంపన్న మైన కుటుంబం లో పుట్టటం ,రాజ పూజితం వుండటం ,శిష్టాచార వంశం అవటం తో సూరి కి బాగా కలిసి వచ్చింది .మల్లి ఆధుడు సర్వ శాస్త్ర మల్లుడు అయాడు .శాస్త్రాలన్నీ ఆపోశన పట్టి చులికీక్రుత సర్వ శాస్త్ర పాదోదది అని పించు కున్నాడు .తనది సౌజన్య జన్య మైన విదుషీత్వం అని నిగర్వం గా చెప్పు కొన్నాడు .న్యాయ వైశేషిక మీమామ్సాల లోతులు చూశాడు  .ఈయన పెద్ద కొడుకు పెద్దయ్య ,చిన్నకొడుకు కుమారా స్వామి .ఇద్దరు ఉద్దండ పండితులే .పెద్దయ్యనే పెద్ది భట్టు అంటారు .ఇతను రాచకోనాడ రాజు సర్వజన సింగ భూపాలునిచ్త కనకాభి షేకం పొందాడు .అయితే ఇతను రాసినవేవీ లభ్యం కావటం లేదు .
కుమారస్వామి తన అన్న ను గురించి ”ప్రతాప రుద్రీయం ”పై రాసిన వ్యాఖ్యానం లో ఈ విషయాన్ని చెప్పాడు .తమ్ముడికి అన్న గారే గురువు .
మల్లి నాధుడు మంద బుద్ధి ఉన్న  వారికి కూడా సులభం గా అర్ధ మఎట్లు వ్యాఖ్యానం చేస్తాను అన్నాడు .సంస్కృత వాగ్మయాన్ని  ప్రచారం తన విధి అన్నాడు .విశ్వ శ్రేయస్సు తన ఆకాంక్ష అని చెప్పాడు .విపరీత వ్యాఖ్యానాలు కాళిదాసాది మహా కవుల కావ్యాల్ని పాడు చేస్తున్నాయనీ ,విషం తో మూర్చ పోయిన వాటిని ఉజ్జీవింప  జేయ టానికి తాను ”సంజీవిని ”అనే పేర వ్యాఖ్యానం రాస్తున్నట్లు తెలియ జేశాడు .అన్వయం ప్రకారం అర్ధాలు వివరించటం ,ప్రమాణాలుచోపటం  చూపటం  ,అవసర మయినంత వరకే చెప్పటం సూరి వ్యాఖ్యానం   లో విశేషం  .
సూరి మొదట కాళిదాసు రచించిన ”కుమార సంభవం ”కావ్యానికి వ్యాఖ్య రాశాడు .అంతకు ముందు దీనిపై 37 వ్యాఖ్యానాలున్నాయి . ”రఘు వంశ సంజీవిని ”సూరి మొదటి వ్యాఖ్యానం .దీని ముందు అవన్నీ వేల వేల బోయాయి .
ప్రతి సర్గ వ్యాఖ్యానానికి ముందు అద్బుత మైన శ్లోకం రాసి కొత్త దారి తొక్కాడు .కుమార సంభావానికి అంతకు ముందున్న 25 వ్యాఖ్యానాలు సూరి వ్యాఖ్యానం ముందు తల వంచాయి .అయితే ఉన్న పదిహేడు సర్గలలో ఏడు సర్గల వ్యాఖ్యానమే లభిస్తోంది .ఎనిమిదో దానికి సీతా రామ పండితుడు వ్యాఖ్య రాశాడు .అదే పార్వతీ పరమేశ్వరుల సంభోగ శృంగారం . మేఘ దూతానికి 50 వ్యాఖ్యానాలున్నాయి .సూరి వ్యాఖ్య మాత్రమే బహుళ ప్రచారం పొందింది .ఆయనే అన్నాడు ”మాఘే మేఘే ,గతం వయః ”అంటే దీనికి వ్యాఖ్యానం రాయ టానికి చాలా శ్రమ పడ్డాడని తెలుస్తోంది .
భారవి రాసిన ”కిరాతార్జునీయం ”నారికేళ పాకం దాన్ని తాను పగల కొడ్తున్నానని అందులోని రసాన్ని ఆస్వాదిన్చామనీ చెప్పి వ్యాఖ్యానించాడు .ఇందులో కొత్త బాట తొక్కాడు .సూరి వ్యాఖ్యానం లేక పొతే ఈ  కావ్య సౌధం లోకి ప్రవేశం దుర్లభం అంటారు విజ్ఞులు . . .
మాఘ కవి రాసిన ”శిశుపాల వధ ”ను అద్భుతం గా వ్యాఖ్యానించి ,కవి హృదయాన్ని వెలువరించాడు .కాళిదాసు , ,భారవి దండి కలిస్తే మాఘుడు అన్నాడు .మాఘం పై వ్యాఖ్యానం రాసి ఆ కవిత్వ సౌందర్యానికి ముగ్ధుడై పరవశించాడు .సూరి వ్యాఖ్యాన రీతి గురించి ”సంజీవిని లో తూలికగా ,ఘంటా పధం లో శాన శీలా గా ,విలసిల్లిన సూరి లేఖిని ,ఈ సర్వం కష లో సంశయ చ్చేడం లో ”అసిలత ”గా గుణ ప్రకాశం లో విద్యుత్ లతా గా ,రస భావావిష్కరణ లో కల్పలత గా భాసించింది ”అన్నారు సూరి ని సమగ్రం గా ఆవిష్కరించిన మహా పండిత విశ్లేషకులు చలమ చర్ల రంగా చార్యుల వారు .మాఘ వ్యాఖ్యానం రాసి తాను ధన్యుడనయానని ఆనందం గా చెప్పాడు .
విద్వ దౌషధం అని పించుకొన్న ”నైషద ”కావ్యానికి కర్త మహా పండితుడు ,చింతామణి మంత్రో పాసకుడు ,శ్రీ హర్షుడు . .అందులోని రస భావ గుణ అర్ధ దోషాలను ధ్వనిని అలంకారాలను ,రహశ్యాలను వెలికితీసి   రసజ్ఞులకు అందజేస్తున్నట్లు సూరి ప్రకటించి అన్నంత పనీ అద్భుతం గా చేశాడు .
వ్యాకరణ కీకారణ్యం గా వుండే భట్టు కావ్యానికి సులభ వ్యాఖ్యానం చేశాడు మళ్లి నాద సూరి .ప్రౌఢ దేవ రాయల కోరిక పై వైశ్య వంశం వారి గురించి ”వైశ్య వంశ సుధాకరం ”రాశాడు .అమర కోశానికి అమర పద పారిజాతం అనే వ్యాఖ్యానాని ,వైషేశికానికి ”భాష్య నికరం ”ను ,పాణినీయానికి కాశికా వ్రుత్తి అనే ఉద్యోగ టీకా వ్యాఖ్యను విద్యాధరుని , అలంకర శాస్త్రం ఏకావలి కి ”తరళ వ్యాఖ్య ”కావ్యాదర్శానికి కూడా వ్యాఖ్య రాశాడు సూరి .సూరి కొడుకు లిద్దరూ మహా పండితులు .శిష్యులు రత్న మాణిక్యాలు .
దాదాపు తొంభై ఏళ్ళు జీవించాడు  సూరి .కళ్ళు తెరిచే ఓపిక ఏక పోతే కిందిరెప్పకు   తాడుతో రాయి కట్టు కోని ,పై రెప్పకు కూడా తలపై నుంచి రాయి కట్టు కోని దీపం ముందు కూచుని కావ్యాలు చదువుతూ  వ్యాఖ్యానాలు రాశాడని అంటారు .జీవిత మంతా వ్యాఖ్యానాలకే అంకితం చేసిన సూరి సూరి పేరుకు సార్ధకత తెచ్చిన ధన్య జీవి .ఆసూరి  (సూర్యుడు )వెలుగే లేక పోతే మన సంస్కృత కవి సూర్యుల మహా ప్రతిభ మనకు అందేది కాదు .అందుకే ఆయన్ను ”వ్యాఖ్యాత్రు చక్ర వర్తి ”అని సగౌరవం గా ఆంద్ర దేశం పిలుచు కొంటుంది ,.

స్వస్త్యస్తు వాగ్మయోద్యానే మహసే భూయసే సదా –యశసే మల్లి నాధష్య కల్ప వల్లీ సుమత్విశే ”
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -12 -11 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు. Bookmark the permalink.

3 Responses to మహా వ్యాఖ్యాత కోలాచలం మల్లి నాద సూరి

  1. బాగా వ్రాసారు.విశ్వనాథవారు ‘వేయిపడగలు ‘లో ఒకచోట మల్లినాథసూరి ,కాళిదాసు పై ఆయన వ్యాఖ్యానాల గురించి ప్రస్తావన తెచ్చారు.మల్లినాధుని గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయి?

    Like

  2. వేణు says:

    దుర్గాప్రసాద్ గారూ! మల్లినాథ సూరి ప్రతిభా విశేషాలను మీరు చాలా బాగా వివరించారు. మన తెలుగువారైన విద్యా నాథుడు, జగన్నాథ పండితరాయలు గురించి కూడా మీరు టపాలు రాస్తే బాగుంటుంది.

    @ MV Ramanarao: మల్లినాథ సూరి వ్యాఖ్యానాలతో ఉన్న కాళిదాసు కావ్యాలను వావిళ్ళ వారు ప్రచురించారు. కొంచెం ఓపిగ్గా వెతికితే దొరకొచ్చు. పాతపుస్తకాల దుకాణాల్లో కూడా ప్రయత్నించొచ్చు.

    Like

  3. muthevi ravindranath says:

    excellent.it may not be out of context to mention here the following lines from ‘the practical sanskrit-english dictionary ‘ of vaman shivaram apte (page 36 of appendix B):-

    ‘ Mallinaatha-A great and much esteemed Commentator of famous Sanskrit works of Kalidasa,Magha,Bharavi,Vidyadhara, Varadaraja etc.He was of kolachala family in Andhra country and was a Telugu Brahmana.He belonged probably to the 14th Century.’
    Let us all pay rich tributes to this erudite scholar, only because of whose commentaries we could know about the value of great Sanskrit works as well as of those great writers.
    —Muthevi Ravindranath, Tenali.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.