పోతన లో తాను –3
— ”ఆంద్ర వాగ్మయ ప్రపంచం లో విష్ణు భక్తీ మార్గాన్ని మొట్ట మొదట భాగవతం మూలం గా ”ఈ పోత రాజు ”సుప్రతిస్తం చేశాడు ”అని అన్నారు .అది లోకోత్తర కృషి అన్నారు .వంగ దేశం లో ఆంద్ర మహా భాగవతం తరువాతే శ్రీ కృష్ణ భక్తీ ప్రారంభామ అయినదట ..శ్రీ చైతన్య ప్రభువుల ”రాదా వల్లభ మతం ”,శ్రీ వల్లభాచార్యుల వారి ”శుద్దాద్వైతం లేక పుష్టి మార్గం ”లకు మన తెలుగు భాగవతం లోని దశమ స్కంధమే ప్రామాణికం అట .శ్రీ చైతన్యులు ఆంద్ర దేశమున పర్యటించి ,మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించి .నారట .అక్కడ ఇప్పటికీ శ్రీ వారి పాద పద్మాలు వున్నాయట .అసలు శ్రీ వల్లభాచార్యులు తెలుగు వారెనాట .వీరు గుజరాత్ ,రాజస్థాన్ రాష్ట్రాలలో ,పుష్టి మార్గాన్ని ప్రవర్తింప జేశారట .అక్కడ ఇప్పటికీ తెలుగు వారు ”తలాంగులు ”అనే పేరా ఉన్నారట.వారందరూ మన ఆంద్ర మహా భాగవతాన్ని నేటికీ భక్తీ తో పథనం చేస్తున్నారట .కనుక శ్రీ కృష్ణ భక్తినీ ,మధుర భక్తినీ సాహిత్యం లో అందించిన ఘనత ఈ దాసాను దాసుడు పోతన దే అని చెబుతుంటే విని నా మనసు పులకరిస్తోంది .బహుశా ,ఆయా భాషలలోని భాగవతాను వాదానికి తగిన మహాకవులు జన్మించ లేదేమో .?ఆ మహా పుణ్యం నాకు దక్కింది .కాదు కాదు ,కల్గించారు నాకు- నాకు ముందున్న కవి శ్రేష్ఠులు ఈ ఉత్క్రుస్టత నాకు కాదు ,నా భాగవతానికే దక్కుతుంది .”నానా రాసాభ్యుదయోల్లాసి యైన భారతము కన్నా ,రాసోల్లసితమగు రామాయణము కన్నా ,భక్తి రసం భాగవతం లో ప్రధానం గా ప్రపంచితమైంది అన్నారు . , .
”లలిత స్కంధము కృష్ణ మూలము ,శుకాలాపాభి రామంబు ,మం
జులతా శోభితమున్ సువర్ణ ,సుమనస్సుజ్ఞానమున్ ,సుందరో
జ్వాల వృత్తంబు ,మహా ఫలంబు ,విమల వ్యాసాల వాలంబు నై
వెలయున్ ,భాగవతాఖ్య కల్ప తరువుర్విన్ ,సద్విజ ప్రాయమై .”
ఇలాంటి దివ్య భక్తీ ప్రతి పాదక మైన భాగవతాన్ని ,తెలుగు చేసినందుకు నాకు జన్మ రాహిత్యమే కల్గింది .”ఈ జన్మ రాహిత్యం ,సర్వాంధ్ర జనానికీ కల్గింది ”అని ఒక మహాశయుడు సెలవిచ్చారు .అంటే నా పూర్వజన్మానికీ ,నేను రచించిన భాగవత ఆంధ్రీ కరణానికీ నట ”అంటే ఏకవీ ఇంత రసవత్తరం గా నేటి వరకు భాగవతాన్ని తెనిగించ లేదట .దీని లోతుల తో సరి తూగే రచన ”న భూతో న భవిష్యతి ”అట.”జయంతి తే సుకృతినో రస సిద్ధః కవీశ్వరాః ”.ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు .ఇదంతా ఆ అమృత భాన్డాన్ని సంస్కృతం లో నిక్షిప్తం చేసి ,మనకు అందించిన ఆ వ్యాస భగవానునికే చెందుతుంది .తపో ధన్యాత్ముడైన ఆ మహర్షికి నా నమో వాకాలు .,
వేద కల్ప వృక్ష విగలితమై ,శుక –ముఖ ,సుదాద్రవమున మొనసి యున్న
భాగవత పురాణ ఫలా రసాస్వాదన –పదవి గనుడు ,రసిక భావ విదులు ”
”వేదోపనిషదాం ,సారా జ్ఞాతా ,భాగవతీ కధా –అత్యుత్తమా తలోభాతి ప్రుధగ్భూతా ఫలోన్నతి ”
”అ,ఉ ,అం అనే మూడు మాత్రలతో ఆవిర్భావిన్చిందే ఓంకార ప్రణవ మంత్రం .అలాగే రామాయణ భారత ,భాగవతములు మూడు, ఆంద్ర వాగ్మయానికి మూల స్తంభాలు ”అని కొనియాడిన సహృదయులకు నా క్రుతజ్ఞాతాన్జలు తెలియ జేయటం కంటే నేనేమి చేయ గలను ?
మా బావ గారు శ్రీ నాద కవి సార్వ భౌములు
ఇదంతా విని మా బావ శ్రీ నాద కవి సార్వ భౌములు చిరు నవ్వు నవ్వు తున్నారు .వారి కవిత్వం లో ప్రౌధిమ ,గాంభీర్యం ,శృంగారం త్రివేణీ సంగమం లా పవిత్రత సంపాదించు కొన్నాయి .వారి కవితా వేశము ,సీస పద్య నిర్వహణ ఎవరికి అబ్బుతాయి ?”సరస్వతీ వర ప్రసాద లబ్దులు ”మా బావ గారు .కారణ జన్ములు ..కనకాభి షేకం జరిపించుకొన్న కవి రాజులు .ఆ నాటి కవులన్దర్నీ ,తన పాండిత్య ప్రకర్ష చేత ఓడించి ,కంచు దక్కను పగుల గొట్టిన ఉద్దండ కవి సార్వ భౌములు .పరమేశ్వర వర ప్రసాద లబ్దులు వారు .పురాణాలను అనువదించి ,శ్రీ హర్షనైషధాన్ని ఆంద్ర సరస్వతికి ”కన్తాభరణం ”గా సమర్పించిన పుంభావ సరస్వతులు .ప్రజల భాష లోకూడా కవిత్వం చెప్పి ,ప్రజా కవి గా గుర్తింపు పొందారు .తెలుగు సాహిత్యం లో ఒక కొత్త మార్గాన్ని ,ప్రపంచానికి చూపిన మార్గ దర్శి .నాకు గురు తుల్యులు .మిత్రులు ,సహచరులు కూడా .”శ్రీ నాద యుగ ”కర్తలని పించుకొన్న మహా కవి .వారి ప్రజ్ఞా ,పాటవాలు వారికే సరి ,వారొక కవితా కేసరి .ఆంద్ర సాహిత్యం లో విశృంఖల వీర విహారం చేసిన విశిష్ట కవి శ్రేస్టులు .”పండితా ఖండలులు ”అని పండిత ప్రపంచం లో వన్నె కెక్కిన వారు .అద్వితీయ శృంగార కవి చక్ర వర్తి .వారి అశేష పాండితీ వైభవానికి సదా నమస్కరిస్తాను .
మా బావ గారి మార్గాన్ని ,నా మార్గాని బేరీజు వేశారు కొందరు విశ్లేషకులు .మా బావ గారిలో ”ఆడంబరం ,అహంభావం ,వున్నాయని ,నేను ఆత్మాభి మాని నని ,నిరాడంబరుడిని ”అన్నారు .బావ గారు పండితులై ,కవియై ,సుఖ దుఖాల ద్వంద్వం లో చిక్కు కొన్నారట .నేను ద్వంద్వా తీతం గా ప్రవర్తిస్తూ ,జనన ,మరణ రహితమైన కైవల్యం పొందినానాట . శ్రీనాధ బావ గారు శృంగారి గా ఎంత పేరు తెచ్చుకొన్నా ,”ఈశ్వరార్చన కళా శీలుండ”అని తానే చెప్పుకొన్నారు .మరి ,నేను భోగినీ దండకం వంటి ,పరమ శృంగార కృతి రచించినా ,”భక్తుని ”గానే చలా మణీ పొందాను .కాశీ ఖండ ,భీమ ఖండ ,హర విలాస ,శివ రాత్రి మా హాత్మ్యం లో భక్తీ భావాన్ని రంగరించి ,కుమ్మరించి పోసినా ,శృంగార నైషధం లో రక్తినీ ,చాటువు లలోని ,శృంగార ప్రసక్తి వల్ల ,”శృంగార శ్రీ నాధుడు ”గానే ముద్ర పడ్డారు .రుక్మిణీ కల్యాణం ,రాస క్రీడలలో శృంగారం కొంత మోతాదు మించినా ,నన్ను ”తెలుగుల పుణ్య పేటిక ”అనే అన్నారు .కారణం ఒకటే అనుకొంటున్నాను .బావ గారి కృతులన్నీ నరాంకితాలు .వారి ఉజ్వల ఘట్టాలన్నీ రాచ కొలువుకే సమర్పితాలు .పట్టెడు వారి మెతుకులు ,గుక్కెడు మంచినీళ్ళు ,పుట్టని దుర్దశ లో కూడా ,ఆ రాజస మూర్తి ,కృష్ణుడి నో ,శివుడి నో ,దుయ్య బట్టారు .”మత్యహన్క్రుతి ”వారిది అన్నారు .అయినా అవసాన దశ లో ‘దివిజ కవి వరుల గుండియల్ దిగ్గు రనగ ,అరుగు చున్నాడు శ్రీ నాదుడమర పురికి ”అని తొడ గొట్టిన ధీర కవి .వారిది ప్రౌఢ వ్యక్తిత్వం .
నన్ను అంచనా వేస్తూ ”నరాదిపుల కొలువు చేయ లేదని ,సిరులకోసం వేమ్పర్లాడ లేదని ,అధికారానికి ఆశించ లేదని ,అహంకారాన్ని ప్రకటించ లేదని ,అంటూ ,పూర్వ కవులను ,భావి కవులను ,కొనియాడాను అని అన్నారు .నిజమేనని నేను అనవలసి వస్తోంది .సమకాలీనులు ఎవరు మెచ్చారు ?.మరి నా అంత రంగం లో అందరు” విష్ణు చిత్తులే ”.పుట్టని కవులకు జేకోట్టటం నేను అలవరచుకొన్న సహన శీలం .,అలవడిన సంస్కారం .హాలికుడనై కవితా కేదారాన్ని పండించ టానికి కృషి చేశాను .
”ఇమ్మను జేశ్వ రాధముల కిచ్చి ,పురంబులు ,వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని ,సొక్కి ,శరీరము బాసి ,కాలు చే
సమ్మెట వాటులం బడక ,సమ్మతి శ్రీ హరి కిచ్చి ,చెప్పే ,నీ
బమ్మెర పోత రాజొకడు ,భాగవతంబు ,జగద్ధితంబుగన్ ”.
బావ గారికీ నాకు తెచ్చిన పోలిక చరిత్రకే పరిమిత మైతే చాలు .వారి అంతస్తు తో నన్ను చేర్చ వద్దు .నేను భాగవత పద సేవా తత్పరుడను -అంతే .
మరిన్ని వివరాలు మళ్ళీ చెప్తాను
సశేషం —————మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —05 -01 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


పెద్దలు, మహానుభావులు, పూజ్యులు, భాగవతోత్తములు గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి ప్రణామములు,
మాన్యా తమ ఈ వ్యాస త్రయం బాగా నచ్చింది. ధన్యవాదములు.
మన తెలుగుభాగవతం.ఆర్గ్ ద్వారా వీటిని మీకు అభ్యంతరం ఉండదనే ఉద్దేశ్యం అందరికీ పంచుదాము అనుకుంటున్నాను మహాత్మా!
LikeLike