సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి –2
త్యాగయ్య గారి 14 వ ఏటే తండ్రి గారు కాలం చేశారు .త్యాగ రాజు గారి అన్న జపేశం కుటిల స్వభావం కల వాడు .తమ్ముడితో తగాదా పడ్డాడు .డబ్బు మీద ఆశ అన్న గారిది .”అమర గానం -రామార్పణం ”అనే భావం ఈ తమ్మయ్య త్యాగయ్యది .18 వ ఏట నే ”పార్వతమ్మ ”తో త్యాగ రాజు వివాహం జరిగింది .త్యాగయ్య గారి తల్లి త్యాగయ్య వద్దే వుండేది .రాజాశ్రయానికి రమ్మని శరభోజ మహా రాజు కబురు పంపాడు విలువైన కానుకలను పంపుతూ .అప్పుడు ఆయనకు ఒక విచికిత్చ వచ్చింది ”నిధి చాల సుఖమా ?రాముని సన్నిధి చాల సుఖమా ?అని వితర్కిన్చుకొని ,”ధర్మ కోపం ”చూపించాడు . సహజం గానే రాజుకు కోపం వచ్చింది .త్యాగయ్యను ”కట్టి తెండి ”అని ఆజ్ఞాపించి ,సైనికులను పంపాడు .అంతే రాజు గారికి విప రీట మైన కడుపు నొప్పి వచ్చి తట్టు కో లేక దొర్లుతున్నాడు .త్యాగయ్యకు జరిగిన పరాభవం పుట్టించిన ”అనలమే ‘తన నొప్పి అని అర్ధం చేసు కున్నాడు .వెంటనే త్యాగయ్య కట్లను విప్పించే శాడు .. నొప్పి మటుమాయం అయింది .ఇద్దరు మంచి మిత్రులైనారు .త్యాగ రాజు ప్రతిభకు మహా రాజ ఆమోద ముద్ర లభించింది ..
అన్న జపేశం ,తమ్ముడి మీద కోపం తో ,”రామ పంచాయతనం ”ను దొంగతనం గా ఎత్తు కోని పోయి కావేరి నదిలో పడేశాడు .దాని కోసం వెదకని చోటు లేదు .రామ విరహం తో పాటలూ ,పరిగెత్తాయి ”ఎందు డాగి నాడో -ఈడకు రానెన్నడు దయ వచ్చునో మనసా ?”అని ఆవేదనతో ,కరుణ రస తరంగితం గా కీర్తించాడు .భక్తుని పరి వేదన ”జీవన రూపమై పారింది ”.కావేరి నీటి పాయ ,విగ్రహాన్ని ,తనలో వుంచుకోలేక బయట పడేశింది .ఆనంద పారవశ్యం తో ”కను గొంటిని శ్రీ రాముని నేడు ”అంటూ ఆనంద బాష్పాలు కీర్తనలో జాలు వార్చాడు .”రారా ,మా యింటి దాక ,సుకుమార ,మ్రొక్కేరా”అని వినయ పూర్వక స్వాగతాంజలి ఘటిస్తూ ,ఊరేగింపు గా ఇంటికి తెచ్చుకొన్నాడు .అప్పటికే త్యాగయ్యకు శిష్య గణం ఏర్పడింది .
” ఉంచ వ్రుత్తి” అంటే ఇంటింటికీ తిరిగి అన్నం అడుక్కోవటం చేస్తూ ,తన గాన సుధను వారికి పంచి పెడుతూ ,భక్తి మార్గం లో జీవించాడు .నగలు ,నాణాలు ఏవ రైనా వేస్తె పట్టే వాడు కాదు .వారానికి ఒకగ్రామం వంతున శిష్యులతో సంచారం చేసే వాడు .త్య్గాయ గారికి ఈ రకమైన ఆతిధ్యం ఇచ్చి ఆ గ్రామాల పౌరులు ధన్యమయారు .త్యాగయ్య దృష్టిలో ఇలా ఇంటింటికీ తిరిగి యాచించటం వల్ల మనసు లో ఏమూలైనా అహంకారం వుంటే అది పటా పంచలై పోతుంది .శుద్ధ నిష్కల్మషమనసు ఏర్పడుతుంది .వీత రాగులకు మన దేశం లో మొదటి నుంచి ఇది పరమ తృప్తి ని ఇచ్చింది .త్యాగయ్య అలానే పరమ సంతృప్తి పొందాడు .ఉంచ వ్రుత్తి తో జీవించినా ,ప్రపంచానికి ”సంగీత ,సాహిత్య భిక్ష ”ప్రసాదించిన వాడు త్యాగ రాజ పరబ్రహ్మ .
ఉపదేశం-సంతానం -సాధన
కాంచీ పుర నివాసి ,శ్రీ రామ కృష్ణానంద యతీంద్రులు ”రామ షడ క్షరీ మంత్రం ”ఉపదేశించారు .ఆ నామాన్ని 21 సంవత్సరాల పదిహేను రోజుల్లో ,రోజుకు ఒక లక్షా ఇరవై యైదు వేలచొప్పున 96 కోట్ల ”రామ జపం చేసిన ధన్యాత్ముడు త్యాగ రాజ భక్త శిఖామణి . ఇంత తీవ్రం గా ఇని సార్లు జపించిన వారు చరిత్రలో ఎవరు లేరు .అది త్యాగయ్య గారి రికార్డు.దాని వల్ల బ్రాహ్మీ భూతుడై ,అలౌకిక మహా శక్తి సంపన్ను లైనారు త్యాగయ్య గారు . అందుకే ఆయన వాణి ,సంగీత ,సాహిత్య పరం గా ”ఆనంద సాగరాన్ని ”సృష్టించింది .నారద మహర్షి స్వయం గా వచ్చి ,ఇచ్చిన ”స్వరార్నవం ”అనే సంగీత మహా గ్రంధాన్నిమధించారు త్యాగయ్య గారు .దానినే ”రజత గిరీశుదు ,నగ జాత కు ,తెల్పు స్వరార్నవ మర్మములు ,విజయము గల్గు ,త్యాగ రాజు ఎరుగు -విశ్వశించి తెలుసుకో ”అని ”స్వర రాగ సుధా ”అనే కీర్తన లో స్తుతించారు .నారద మహర్షికి కృతజ్ఞత తెలుపు కొంటు ”శ్రీ నారద ,నాద సరసీ రుహ భ్రున్గా ,శుభాంగ ,వేద జనిత ,వర వీణా ,వాదన తత్వజ్ఞా ”అంటూ కీర్తించారు .
త్యాగయ్య గారి భార్య పార్వతమ్మ అయిదేళ్ళు కాపురం చేసి మరణించింది .ఆమె చెల్లెలు ”కమల”ను ద్వితీయ వివాహం చేసుకున్నాడు త్యాగయ్య .సీతా లక్ష్మి అనే కుమార్తె జన్మించింది వీరికి .ఆమెను అఖిలాండ పురం కుప్పుసామయ్యర్ కు ఇచ్చి వివాహం చేశారు .ఆమెకు ఒక కొడుకు .అతనే ”పంచాప కేశయ్య ”.ఇతడు గొప్ప సంగీత విద్వాంసుడు గా పేరు పొందాడు .అయితె సంతానం లేకుండా అకాల మరణంపొందాడు . .ఇతని భార్య ”గురవమ్మ ”త్యాగయ్య గారి ”రామ పంచాయతనం ”ను తన పుట్టిల్లు తంజా వూర్ తీసుకొని వెళ్ళింది .వారసులు లేకుండానే త్యాగయ్య జీవితం గడిచి పోయింది .అయితే సంగీత విద్వాల్లోకం అంతా ,త్యాగరాజ వారసత్వాన్ని ,అవిచ్చిన్నం గా ,అనుభవిస్తున్నారు .వారందరి త్యాగ ఫలమే ఆ దివ్య గానామృతం .యావత్ భారత దేశం ,,ప్రపంచం త్యాగయ్య గారి కీర్తనల తో మురిసి పోతోంది .ఇంతకంటే ”సంతాన లక్ష్మి ”ఎక్కడుంది ?
72 మేళ కర్తలలో 52 మేళ కర్తలను ప్రయోగించిన వాడు త్యాగయ్య .205 రాగాలను ప్రస్తావించాడు .7111 కృతులు రాశారు . 100 కొత్త రాగాలను సృష్టించారు .బహుదారి ,నళినీ కాంతి ,జయంతశ్రీ ,బిందు మాలిని ,రాగాలు త్యాగ బ్రహ్మ సృష్టించినవే .ఆయన ముఖ్య శిష్యుడు ”వాలాజ పేట వెంకట రమణ భాగవతార్ ”సంస్క్రుతాన్ద్రాల్లో గట్టి పండితుడు .త్యాగయ్య కీర్తనలను చేతితో రాసి పెట్టి ,భావి తరానికి అంద జేసిన మహనీయుడు .త్యాగయ్య ,ఇతరులలో వున్న ప్రతిభను గుర్తించి గౌరవించిన మహా మతి .”బోద్ధలగు వారు -మత్సర పూర్ణులు ”అనే అపవాదం త్యాగయ్యకు లేదు .
త్యాగయ్య రచనలలో ,1-దివ్య నామ సంకీర్తనలు 2-ఉత్సవ సంప్రదాయ కీర్తనలు అంటే సీతా కల్యాణం ,గౌరీ కల్యాణం అప్పుడు పాడేవి –27 .ఊరేగింపు ,పవళింపు ,మేలు కొలుపు ,హారతి లకు అనుగుణం గా రచించినవి .ఉదాహరణకు –”కొలువై యున్నాడే కోదండ పాణి ”,-”హెచ్చరిక గా రారా ”.నగుమోము గల వాని-నా మనోహరునీ ”,”సీతా కళ్యాణ వైభోగమే ‘మొదలైనవి .3-కృతులు 4-ప్రహ్లాద భక్తి విజయం 5-నౌకా చరిత్రం ,యక్ష గాన గేయ నాటికలు –వున్నాయి
ఆనంద భైరవి రాగం లో త్యాగరాజు కీర్తన రాయలేదు .దీనికి ఒక కధ వుంది .ఆ రోజుల్లో ”త్రిభువనం స్వామి నాదయ్యర్ ”అనే మహా గాయకుడు వుండే వాడు .ఆయన ఆనంద భైరవి రాగం లో సాటి లేని మేటి గా నిరూపించుకొన్నాడు .తోలుబొమ్మలాటలు లో ఆయన పాడే వాడు .ఒక సారి తిరువైయుర్ లో ఆ ఆట జరుగు తోంది .”మధురా నగరిలో ”అనే పాటను ఆనంద భైరవి రాగం లో అద్భుతం గా ఆలా పించి పాడాడు .ఆ దారినే వెళ్తున్న త్యాగయ్య విని ,పార వశ్యం తో పులకించి పోయాడట .అయ్యర్ ను మెచ్చి కౌగాలిన్చుకోన్నాదట .అంటే ”గుణ గౌరవం ”చూపాడన్న మాట త్యాగయ్య .ఈ అద్భుత సన్ని వేశాన్ని చూసిన ప్రేక్షకులు మురిసి పోయారట .అప్పుడు అయ్యరు ,త్యాగ రాజు గారితో ”అయ్యా !మీరు ఇక నున్చిఆనంద భైరవి రాగం జోలికి దయ చేసి పోవద్దు .నాకున్నఖ్యాతిని నిల బెట్టండి ”అని చేతులు పట్టుకొని వేడుకోన్నాదట .త్యాగి అయిన త్యాగయ్య ,మాట ఇచ్చి ”బాస ”తప్పలేదు .ఇలా ఆ రాగం త్యాగయ్య గారి త్యాగానికి గురి అయింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13 -01 -12 .
..
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


ప్రసాదుగారూ, ”మధురా నగరిలో ” పాట నిజసంగా అర్వాచీనం. త్యాగరాజస్వాములవారు ఆనందభైరవిని వర్జించారనటానకి కారణంగాప్రచారమైన మీరు ప్రస్తావించి యీ కథ బహుళప్రచారంలో ఉంది. నాకు పేరు సరిగా గుర్తులేదు. కాని ”మధురా నగరిలో ” పాట కర్తగారి గురించి చాలాకాలం (పదేళ్ళు కావచ్చేమో) క్రిందట పత్రికలో సాధికారిక వ్యాసంచదివాను. బహుశః ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో కావచ్చును. నాకు బాగా గుర్తున్న అంశం, ఆ ”మధురా నగరిలో ”కృతికర్తగారి కుమార్తెగారు సంగీతం లెక్చరర్ గానో ప్రొఫెసర్ గానో పనిచేసారు – ప్రసిధ్ధనామమే కాని నాకా పేరుకూడా గుర్తు లేదండీ.
LikeLike
guruvu garuu… svami vari gurimchi naku tochina mukkalu naa bloglo pettanu. oka sari chusi, doshalumte savarimchagalaru.
LikeLike
త్యాగరాజు గారి రామాయణం దొరికేది ఎక్కడో ఎవరైనా చెప్పగలరా దయచేసి. రేపు సాయంకాలం టి.టి,డి. వారి ఛానల్లో నాద నీరాజనం కార్యక్రమంలో ప్రసారమౌతుందని తెలిసింది.
LikeLike