సరస్వతీ పుత్రుని శివ తాండవం –3
రంగ వైభోగం
ఆధునికాంధ్ర కవిత్వం పలు పోకడలు పోయే సందర్భం లో సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల వారు భారతీయతను ప్రతి బిమ్బించే ”పద ఛందస్సు ”ను స్వీకరించి ,తెలుగు జిగిని వెలయించి ,”శివ తాండవం ”చేశారు .ఆ తాండవం శరీరం గగుర్పొడిచే విధం గా ,వివిధ గతుల నడకల తో ,పోకడల తో ,సాహితీ రంగ స్థలాన అభినయించి చూపారు .
పరమశివుని తాండవం అత్యాశ్చర్యం గా చూపిస్తూ ,అది అలౌకికానన్దమని తెలియ జేశారు .
”ఏమానందము -భూమీ తలమున -శివ తండ వ మట -శివ లాశ్యం బట ” అని రంగాన్ని సిద్ధం చేసి ,ఆ రంగ వైభవాన్ని వర్ణిస్తున్నారు .”అలలై బంగరు కలలై -పగడపు బులుగుల వలె-మబ్బులు విరిసినయవి ”.ఈ ఆనందం మానవులకే కాదు ,పక్షులు ,పుష్పాలు కూడా ఆనందా బ్ది లో ఓల లాడు తున్నాయి .”పలికెడు నవే ప-క్షులు ప్రా బలుకులో -కల హైమవతీ -విలసన్నూపుర –నినాదములకు -న్నను కరణం బులో ” రాలిన ప్రతి పుష్పం హైమవతీ కుసుమా లంకారం లో తాను కూడా ఒకటి అని సంబర పడిందట .”రాలిన ప్రతి సుమా -మేలా నవ్వును -హైమవతీ కుసు -మాలంకారము -లందున దానొక – టౌదు నటంచునో ”
లలిత మైన హైమవతీ శరీరం పూవులు ,కాయల తాకిడికి వసి వాడునని ”లలితా మృదు -మంజుల మగు కాయము -బూవుల తాకుల -బో వసి వాడేదో?అని అతి సున్నితం గా అంటారు .
పార్వతీ దేవికి గీర్వాణి ,వాణి అయిన భారతి అలంకారం చేస్తోంది .శివునికి చతురాననుడు అయిన బ్రహ్మ ,సర్వ భూష నాలు సవ ద రిస్తున్నాడు .
”తకజ్హం ,తకజ్హం ,తక దిరి కిట నాదమ్ము లతో ”లోకేశుడైన శివుడు నాట్యం చేసే సందర్భం లో ,”భ్రుమ్గంములు గొంతులు సవ ద రించును -సెల కన్నెలు కుచ్చులు లెల్లా విచ్చల విడి గా ,దుసికిల్లాడగా బరుగుడును ”.
”ఓహో ,హాహా -యూహా తీతం –బీ యానందం -బిలా తలంబున ”అంటూ
”ఆడునట నా –ర్యా ప్రాణే శ్వరు -డో ,దిన మణి నిలు -రా ,దిన మంతయు -బడమటి దేశపు -వారల కీ కధ -నేరిగించుటకై -బరి వేత్తేదవో ”?అని సూర్య గమనపు తొందరను ప్రశ్నించాడు కవి ,పడమటి దేశ వాసులకు శివ తాండవ విశేషాలను తెలియ జెప్ప టానికో అన్నట్లుగా సూర్యుడు పశ్చిమాన మునిగి పోతున్నాడట .
విశ్వేశ్వరుని అడుగులు కడగ టానికి ,సమర్పించే పాద్యమో అన్నట్లు గా ,ఆవుల మంద కన్నుల నుండి బాష్పాలు విడుస్తున్నాయి .ఈ భావా లన్ని ,అపూర్వ మైన ఆనంద చిహ్నాలు .ప్రకృతి అంతా శివ తండ వాన్ని ఆలోకిస్తూ ,మై మరచి ,వుండే తీరు మనకు కళ్ళ ముందు దృశ్యమానం చేశారు పుట్ట పర్తి వారు .ఈ విధం గా నాట్య రంగం సిద్ధ మైంది .నందీశ్వరుని తో ,నాందీ వాచా కాన్ని నాగర భాష లో ఔచితీ యుతం గా పకికిస్తారు ఆచార్యులు .భాష పై వారికున్న సాది కారత తెలుస్తుంది. చివరలో తెలుగు ను చొప్పించి ,శివుని తో నందీశ్వరుడు ఇలా అంటాడు –
”నీ నృత్తంములో ,నఖిల వాజ్మయము -తానము మరియు ,గానము గాగను -తాండ వింప గా దరుణం బైనది –
ఖండెన్ దు ధరా ,గదలుము నెమ్మది ”అని ఆహ్వానిస్తున్నాడు .
తాండవ కేళీ విలాసం
శివుని తాండవ నృత్యాన్ని ,తన ప్రజ్ఞా వైభవం తో శ్రీ పుట్ట పర్తి భావ స్ఫూర్తి కల్గించే విధం గా ఇలా వర్ణిస్తారు .
”తలపైని జదలేటి యలలు తాండవ మాడ –నలల త్రోపుదుల గ్రోన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలము పైన ,ముంగురులు చేర లాడ -గను బొమ్మ లో మధుర గమనములు నడ యాడ
గను పాప లో గౌరి ,కసి నవ్వు చిందింప ,–గను చూపులను తరుణ కౌతుకము జుమ్బింప
గడగి మూడవ కంట ,కటి నిప్పులు రాల -గడు నేర్చి పెదవి పై ,గటిక నవ్వులు వ్రేల
ధిమి ధిమి ధ్వని సరి ద్గిరి గర్భములు తూగ -నమిత సంరంభ హాహా కారములు రేగ
ఆడే నమ్మా శివుడు -పాడే నమ్మా భవుడు ”
ఈ విధం గా మొద లైన తాండవం క్రమంగా వేగాన్ని పుంజు కొంది .”కిసలయ జటా చ్చటలు ముసురు కోని వ్రేలగా ,బుసలు కోని తల చుట్టూ భుజగములు బారాడగా ,మకర కుండల ,చకా చకలు చెక్కుల బాయగా ,నకళంక కంత(kantha ) హారాళి ,నృత్యము సేయ ”శివుడు నాట్యం చేస్తున్నాడు .మొత్తం దృశ్యం అంతా మన కళ్ళ ముందు కనిపించేట్లు చేశారు .మనం కైలాసం లో శివుని సమీ పం లో వుండి చూస్తున్న అనుభూతి కలిగించారు .ఒడలు గగుర్పొడుస్తుంది .ఆచార్యుల వారి ఊహా పద సంచారం తాండ వాన్నిప్రత్యక్ష అనుభవం చేశారు .తాను అనుభూతి పొంది ,మనకూ ,ఆ అనుభవాన్ని అందించారు .రచించి వారు ,చదివి మనము తరిస్తున్నాం .
”మొలక మీసపు గట్టు –ముందు చందురు బొట్టు
పులి తోలు హోమ్బట్టు -జిలుగు వెన్నెల పట్టు
నేన్నడుమునకు చుట్టు -క్రోన్నాగు మొల కట్టు
గురియు మంటల రట్టు -సిక పైన నల్ప కల్పకపు పుష్ప జాతి
కల్పపు పుష్ప జాతి బెర్లాడు మధుర వాసనలు
బింబా రుణము కదలించు దాంబూలము
తాంబూల వాసనల దగులు భ్రుంగ గణంబు
గనుల పండువు సేయ ,మనసు నిండుగ బూయ
ధన ధన ధ్వని దిశా తతి పిచ్చ లింపంగా
ఆడే నమ్మా శివుడు -పాడే నమ్మా భవుడు ”
పులి తోలు హోమ్బట్టు -జిలుగు వెన్నెల పట్టు
నేన్నడుమునకు చుట్టు -క్రోన్నాగు మొల కట్టు
గురియు మంటల రట్టు -సిక పైన నల్ప కల్పకపు పుష్ప జాతి
కల్పపు పుష్ప జాతి బెర్లాడు మధుర వాసనలు
బింబా రుణము కదలించు దాంబూలము
తాంబూల వాసనల దగులు భ్రుంగ గణంబు
గనుల పండువు సేయ ,మనసు నిండుగ బూయ
ధన ధన ధ్వని దిశా తతి పిచ్చ లింపంగా
ఆడే నమ్మా శివుడు -పాడే నమ్మా భవుడు ”
నాట్య విధానాన్ని విపులంగా వివ రించారు ఆచార్యుల వారు .”సకల భువనములు ఆంగికం గా సకల వాజ్మయం వాచికం గా సకల నక్షత్రాలు కలాపముగా సర్వము తన ఎడద ,సాత్వికం గా ,చతుర్విదాభినయ రతితో ,నాట్య గరిమాన్ని ,తన లోనే తాను వలచి నృత్య ,నృత్త ,భేదాలుచూపే ,లాస్య ,తాండవ భేదాన్ని చూపుతూ ,సకల దిక్పాలకులకు పార వశ్యం కలిగిస్తూ పరమ శివుడు తాండవ కేళీ విలోలుడై నట్లు వర్ణించటం” ఆచార్యుల వారి వైదుష్యానికి ఆన వాలు .
తాండవ విశేషాలు మరో సారి –
సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -02 -12 .
తాండవ విశేషాలు మరో సారి –
సశేషం మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -02 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

