సరస్వతీ పుత్రుని శివ తాండవం –4

 సరస్వతీ పుత్రుని శివ తాండవం –4

                                         రంగ వైభోగం –2

— నాట్యానికి అవసర మైన సర్వ లక్షణా లను వివరిస్తూ ,అవి ఒక దానితో ఒకటి కలిసి యెట్లా రసోత్పత్తి చేస్తున్నాయో వివ తీస్తారు పుట్ట పర్తి  వారు .
”కర ముద్రికల తోనే -గనుల చూపులు దిరుగ
దిరుగు చూపుల తోనే ,బరువెత్త హృదయమ్ము
హృదయమ్ము వెనువెంట ,గదిసి కొన భావమ్ము
కుదిసి భావము తోనే ,కుదురు కోగ రసమ్ము
శిరము గ్రీవమ్ము ,పేరురము ,హస్త యుగమ్ము
సరిగాగ మలచి ,గండరువు నిల్పి న యట్లు
తారకలు జలియింప ,దారకలు నటియింప
గోరకములై ,గుబురు కొన్న జూటము నందు
నురగాలి ,నలి రేగి ,చొక్కి వీచిన యట్లు
పరపులై పడ గల్ప పాద పంబుల బూవు
లాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ”
ఘల్లు ఘల్లు న శివుని కాళ్ళ గజ్జెలు మ్రోగగా ,నాట్యాన్ని తిలకిస్తూ ,సకల భువనాలకు కల్గిన ఆనందాన్ని వర్ణిస్తూ ,ఆ ఆనందం ఎంత స్వచ్చ మైనదో తెలియ జేయ టానికి ,సృష్టి లోని తెల్లని వస్తువుల నన్నిటినీ వర్ణిస్తారు .
”తేలి బూదే తెట్టులు కట్టి నట్లు ,చలి కొండ మంచు కుప్పలు పేర్చి నట్లు ,ముత్తెపు సౌరులు   పోహళించిన యట్లు ,అమృతమును ఆమతించి నట్లు ,ఘన సారాన్ని ,కల్లాపి చల్లి నట్లు ,మనసు లోని సంతోషం కనుల కని పించి నట్లు ”ఆనందం తాండ వించింది ఎల్లెడలా” .ఇందులో తెలుపు స్వచ్చత వినిర్మలత ,చల్లదనం అన్నీ కల గలిపి వున్నాయి .
పైన చెప్పిన దానికి పూర్తిగా   విభిన్న మైన విషయం తో ”,నీల గళుని ”నాట్యం చే కల్పింప బడిన నీలిమ వ్యాప్తి చెంద టాన్ని ,కడు చమత్కారం గా వర్ణిస్తారు .
”మబ్బుగములు లుబ్బి కోని ప్రబ్బి కొన్న విధాన
నబ్బురపు నీలిములు  లిబ్బి సేరు విధాన
నల్ల గలువలు దిక్కు లేల్లె విచ్చు విధాన
వగలు కాటుక కొండ పగిలి చెదరు విధాన
దగిలి చీకటులు గొప్పగా గప్పెడు విధాన
దన లోని తామసము కనుల జారు విధాన
గులుకు నీలపు గండ్ల ,దళుకు చూపులు బూయ
ఘల్లు ఘల్లు మని కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ
ఆడేనమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ”
నాట్య వేగాన్ని ఉధృత గతిలో వ్యక్త పరుస్తూ ,విన్యాస ,విలాసాలను చక్కగా చూపించారు ,శివ కవి శ్రేస్తులు  ఆచార్యుల వారు .
”హంసాస్యమును హంసభాగానికి ఆనించి ,కలికి చూపుల చంపకములు పై జల్లి ,పక్కకు కాంతాన్ని మెలకువ గా నాడించి    ,గ్రుడ్లు చక్రాల్లా తిప్పి ,కను బొమలను ధనువుల్లా వంచి ,భూమిపై నొక కాలు ,దివి పై నొక కాలు వుంచి ,శివుడు నాట్యం చేస్తుంటే ,ఇలలో చెలువు (సౌందర్యం )రూపై నిల్చి నట్లున్నాడట .దేవతలు భక్తీ తో స్తోత్రాలు చేస్తున్నారు కనులు భావాలు ఏ విధం గా  ఎగ  జిమ్మాయో వివరిస్తున్నారు .
”ఒక సారి దిరములై ,యుండి కాంతులు
ఒక్క సారి గంట వేసి కోని ఫూత్క్రుతి జిమ్ము
నొక్క సారి మను బిళ్ళ యోజ చెంగుల దాటు
నొక సారి వ్రేలు వాడిన పూల రేకులై
యొక సారి దుసికిళ్ళు వోవు చిరు చేపలై
యొక సారి ధనువు లై యుబ్బు కన్నుల బొమ్మలు ”
హస్త విన్యాసం అమోఘం గా సాగింది .అవి స్థంభ యుగమో ,నీప శాఖా ద్వయమో ,తెలియటం లేదు .కుంభి కర కాండములలో గోన బైన తీగలో అర్ధం కావటం లేదు .సుమ దామమా ?శిరీషములే నిల్చెనా ,అన్నట్లున్నవి .ఇవేవీ కాక తటిత్ ప్రభా తాండవమా ?అని పిస్తోంది .మంద గతి లో కది లేటప్పుడు ,చేతులు కంపిస్తున్నాయి .శీఘ్ర గతి లో ,కాన రావటం లేదు .ఎంత అనుభవ సారం  రంగ రించారో తెలుస్తుంది .
మయూరా లాపన శివ తాండవం లో ,షడ్జమం గా వుంది .చికిలి గొంతుకతో కూసే కపి స్వరం సకలేశ్వ రుని ,శృతి స్థాయికి ,పంచమం వాయు పూరిత  వేణు వర్గం తాండ వానికి ,తార షడ్జ మాన్ని అందు కొంది .సహజ సిద్ధ మైన ,వాణిని ,సరిగ్గా ,నాట్య విధానాలకు ,జత చేసి ,చూపిన అద్భుత సన్ని వేశం .
 శాస్త్ర విధానం -స్వేచ్చ
  ఈ విధం గా సాగిన శివ తాండ వాన్ని ,తిల కించిన వారి లో కలిగిన మార్పులను ,పుట్ట పర్తి వారు చక్క గా చూపారు .
”సరి గాగ ,రూపించి షడ్జమ ము పట్టంగ
శర జన్ము తేజీ పించము విప్పి నర్తింప
ఋషభ స్వరంబు కుల్కించి పాడిన నంది
వృష భంబు చేల రేగి నియతి మై లంఘింప
నందంబు గా దైవతా లాప నము సేయ
గంధర్వ లోకంపు గనుల బూవులు బూయ
బని బూనుచు నిషాద స్వరము రక్తి కి దేగ
వెనకయ్య బృంహితము   ,వెనుక దరుము క రాగ ”
నాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ”
ఇందులో ,జంతువులకు వానికి ఇష్టమైన  రాగాలను జత కూర్చటం లో కవి నేర్పు కనిపిస్తుంది .భరత శాస్త్ర విధానాన్ని అనుసరించి ,నాట్యము సాగు తున్నా ,కళ కు స్వేచ్చ కావాలని కోరు తారు ఆచార్యుల వారు .
”శాస్త్రములను దాటి ,తన స్వాతంత్ర్యమును బూని
శాస్త్ర కారుల యూహ సాగు మార్గము  జూపి
భావ రాగ మూల సంబంధంబు ,రాగ లీ
లా విశేషంబు నుల్లాసంబు గది యింప
భావమే శివుడు గా బ్రమరి చుట్టెడి భంగి
తానే తాండవ మౌనో ,!తాండవమే తానౌనో
ఏ నిర్ణయము దనకే బూని చేయగ రాక

 డా మరచి ,మర పించి ,తన్ను జేరిన వారి
గామునిని ,దన మూడు ,గన్ను లను సృష్టించి ”
ఆడి ,పాడాడు శివుడు .కామునికి పునర్జన్మ కల్పించి ,అతనికి ఆనందాన్ని కల్పింప జేశాడు శివుడు .అపూర్వ కవితా సృష్టి .
”ఒక యడుగు జననంబు ,నొక యడుగు మరణంబు
నొక భాగమున సృస్ష్టి ,,యొక వైపు బ్రళ యంబు
గను పింప దిగ కన్ను గొనలు మిన్నుల నంట
ముని జననంబుల హృదయములు ,దత్పదంబంత
యాడే నమ్మా శివుడు బాడే నమ్మా భవుడు
నాట్యం పరా కాష్ట కు వచ్చింది .ఇక్కడే కవి ,నేర్పుగా ,అద్వైతాన్ని మేళ వించి ,అద్భుత రస సృష్టి చేసి ధన్యులై నారు .పరిణత చెందిన వారి మేధస్సు కిది మంచి ఉదాహరణ.
”హరియే హరుడై ,లచ్చి యగ జాత యై ,సరికి
సరి ,దాన్డవము లాడ ,సమ్మోద రూషితులు
హరుని లో హరి జూసి ,హరి యందు హరు జూచి
నేర వేగ దేవతలు విస్మితులు ,మును లెల్ల
రది గతానంద భావా వేశ చేతస్కు
లేద విచ్చి ,ఉప్పొంగి ,యెగిరి స్తోత్రము సేయ
భేద వాదము లెల్ల బ్రదలి పోవగ
మేదినియు ,నద్వైతమే బ్రతి ధ్వను లీన
నాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ”
ఈ అద్వైత సిద్ధాంత ప్రతి పాదన కు మెచ్చి కదా జగద్గురు శంకరులు కంచి కామ కోటి పీతాదిపతులు ”శివ తాండవం ”ను తమ నిత్య పారాయణ లో భాగం గా చేశారు .నిజం గా శివ కేశవులకు భేదమే లేదు కదా ..దీనికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి .వాటి విషయం తరు వాత తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -02 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.