సరస్వతీ పుత్రుని శివ తాండవం -5
ఒకప్పుడు శుక మహర్షి తన తండ్రివ్యాస భగ వానులను ,శివ కేశవులను గురించి ,లక్ష్మీ నారాయనులను గురించి కొన్ని ప్రశ్నలు అది గాడు .వాటికి సమాధానం గా ,సాక్షాత్తు పర మేశ్వరుడే శుక మహర్షికి వివ రాలు తెలి పాడు .”బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులు ఒక్కరే .వారి భార్య లైన సరస్వతి ,లక్ష్మి ,పార్వతులు ఒక్కరే .మన దృష్టి లోనే వేరుగా కని పిస్తారు .ఉన్నాత స్తానాల్లో వున్న వారికి అంతా ఒక్కారు గానే కని పిస్తారు .
”ఏ నమశ్యంతి గోవిందం ,తే నమశ్యంతి శంకరం -ఏ యర్చయింతి హరిం భక్త్యా ,తే అరచ యంతి వృష ధ్వజం
ఏ రుద్రం నాభి జాయంతి ,తేన జాయంతి కేశవం -రుద్రత్ప్రవర్తతే బీజం -బీజయోని ర్జనార్దనా
యో రుద్ర స్వయం బ్రహ్మా ,యో బ్రహ్మ సహుతాశానః -బ్రహ్మ ,విష్ణు ,మాయో రుద్రా
అగ్ని స్టోమా త్మకం జగత్ ”. అని చెపుతూ ,
”పుల్లింగ సర్వ మీశాన ,స్త్రీ లింగ భవత్సుమా –ఉమా రుద్రాత్మకా సర్వాఃప్రజా స్థావర జంగామాః
వ్యక్తం సర్వ ముమా రూపం -అవ్యక్తం తూ మహేశ్వరః
ఉమా శంకర యోర్యోగః సయోగో విష్ణు రుచ్యతే
యస్తు తస్మై నమస్కారం ,కుర్యాద్భక్తి సమన్వితః అని వివ రిస్తూ ,ఎవరు శివ భక్తులో ,వారు విష్ణు భక్తులు కూడా అని తెలియ జెప్పాడు వ్యాస ముని .
”అంత రాత్మా భవేత్ బ్రహ్మా -పరమాత్మా మహేశ్వరః
సర్వేషా మేవ భూతానాం -విష్ణు రాత్మా సనాతన
అస్య త్రైలోక్య వృక్షస్య -భూమౌ విటపి శాఖిననః
అగ్రం ,మద్యం ,తదా మూలం -బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరః
కార్యం విష్ణు హ్ ,క్రియా బ్రహ్మా – కారణం తు మహేశ్వరః
ధర్మో రుద్రో ,జగద్శ్ విష్ణు హ్ -సర్వం జ్ఞానం పితామహః
శ్రీ బ్రహ్మ ,రుద్రేతి -యంతం బ్రయా ద్విచ క్షణః
కీర్తి నా త్సర్వ దేవస్య -సర్వ పాపైహ్ ప్రముచ్యతే ” అని వివరిస్తూ
”రుద్రో నర-ఉమా నారీ -తస్మై తస్మై నమో నమః
రుద్రో బ్రహ్మా ,ఉమా వాణీ తస్మై తస్మై నమో నమః
రుద్రో విష్ణు ,ఉమా లక్ష్మీ తస్మై తస్మై నమో నమః ”
ఈ రక మైన అద్వైతాన్ని ,సర్వ దేవతా సమ భావాన్ని ,ఆచార్యుల వారు తమ శివ తాండవం లో ఎంత గొప్ప గా చూపించారో గమనించాం . వారు త్రికాలాలకు ,త్రిమతాలకు ,అతీతం గా ఆలో చించి ,అందించిన సందేశం సందేశం అది .ధన్య జీవి ,పుణ్య మూర్తి పుట్ట పర్తి వారు .
శివా శివులు
” నమశివాభయం ,నవ యౌవనాభాం -పరస్పరా క్లిష్ట ,వపుర్ధరాభ్యాం
నాగేంద్ర కన్యా ,వృష కేత నాభ్యాం –నమో నమః శంకర పార్వ తీభ్యాం
అని ఆది శంకరా చార్యులు ప్రార్ధించారు .దీనికి దీటుగా భీమ ఖండం లో శ్రీ నాద మహా కవి సార్వ భౌముడు ,ఎంత అద్భుతం గా వర్ణించాడో చూడండి .ఇది వ్యాస భగ వానునికి కాశీ లో కని పించిన విశ్వనాదాన్న పూర్ణ ల ఆకృతి .
”చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి –నీల కుంతల ఫాల -నీల గళుడు
ధవళా యతేక్షణ ,-ధవళా ఖిలాంగుడు -మదన సంజీవని -మదన హరుడు
నాగేంద్ర నిభయాన -నాగ కుండల ధారి -భువన మోహన గాత్ర -భువన కర్త
గిరి రాజ కన్యకా ,గిరి రాజ నిలయుండు ,సర్వాంగ సుందరి సర్వ గురుడు
గౌరి ,శ్రీ విశ్వ నాధుండు -కనక రత్న మెట్టి చట్టలు బట్టు కొనుచు
యేగు దెంచిరి వొయ్యార మెసగ ,మెసగ -విహరణ క్రీడ ,మా యున్న వేది కపుడు ”
అద్వైత మాతా చార్యులు ఆది శంకరులు ”శివ -శివా ”ద్వంద్వానికి చేర్చి ”సాంబ సదా శివుని ”అంటే అంబ తో కూడిన శివుని ఆరాధించారు .దాని పై ”సౌందర్య లహరి ”చెప్పారు .మొదటి శ్లోకం లోనే ”శివా శివులు ”కు నమస్కారం చేస్తూ ఇలా అంటారు .”కలాభ్యాం చూడాలంకృత శశి కలాభ్యాం నిజ తపః -ఫలాభ్యాం -భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవ తుమే
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భావాభ్యాం -ఆనంద స్ఫూర దనుభావాభ్యాం నతి రియం ”
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ –09 -02 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

