ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –17

                                  సంగీతం టీచర్ పద్మావతి గారు 

మేం ఉయ్యూరు వచ్చే సరికి (1951 )మా మామయ్య గుండు గంగయ్య గారి అమ్మాయి రాజ్య లక్ష్మి ఒక సంగీత టీచర్ దగ్గర సంగీతం నేర్చు కొంటోంది .ఆవిడ విష్ణాలయం దగ్గర ఇళ్ళల్లో ఎక్కడో అద్దెకు ఉండే  వారు .ఆమెకు ఒక అబ్బాయి కూడా వున్నట్లు గుర్తు .మా పెద్దక్కయ్య లోపా ముద్ర  ,చిన్నక్కయ్య దుర్గ అప్పటికే కొంత సంగీతాన్ని హిందూ పుర లో ఉండగానే నేర్చు కొన్నారు .చిన్నక్కయ్య కుఅక్కడి గరల్స్ స్కూల్ లో సంగీత విద్య బానే అబ్బింది .అందుకని ఆ సాధన కొన సాగించాలని , ఇక్కడ మళ్ళీ  ఆ టీచర్ గారి దగ్గర సంగీతం నేర్చు కోవాలనుకున్నారు .అమ్మా ,నాన్న ,అంగీకారం తో సాధన మొద లైంది .
సంగీతం టీచర్ గారి పేరు పద్మావతి .అప్పటికి సుమారు 45 ఏళ్ళ వయసు వుంటుంది .చామన చాయగా ,పొట్టిగా బొద్దు గా వుండే వారు .చీర కుచ్చెళ్ల దగ్గర హాండ్ కర్చీఫ్ పెట్టు కోని వచ్చే వారు .మామయ్య కూతుర్ని మేము ”దాచ్చి ”అనే వాళ్ళం .మా ఇద్దరు అక్కయ్యలు, దాచ్చి, మా వాకిటి వరండాలో సంగీతం నేర్చుకొనే వారు. టీ చర్  గారు సరిగ్గా అయిదింటికి వచ్చే వారు .ఒక గంట పైనే సంగీతం నేర్పే వారు .నేర్పిన దాన్ని వీళ్ళు మళ్ళీ సాధన చేసి ,మర్నాటికి రెడి గా తయారయే వారు .ముందుగా స,రి ,గ ,మలు నేర్పే వారు .తర్వాత స్వరాలు ,ఆ తర్వాత జంట స్వరాలు ,తర్వాత కృతులు వరుస గా నేర్పేవారు .మా వాళ్ళు రోజూ ”లంబోదర లకు మికరా -అంబా సుత అమర వినుత -లంబోదర లకు మికరా ‘అనేది నిత్య సాధన గా చేసే వాళ్ళు .అది మాకూ నోటికి వచ్చేసింది .వాళ్ల తో పాటు మేమూ పాడే వాళ్ళం .టీచర్ గారు తాళం వేయటం బాగా గుర్తుంది .చాలా తేలిగ్గా ,శబ్దం రాకుండా వేసే వారని జ్ఞాపకం .ఆమె గొంతు స్పష్టం గా వుండేది .స్వరాలు  ,కీర్తనలు బాగా పాడే వారు .ఆమె శిక్షణ చాలా నిర్దుష్టం గా ఉండేదని చిన్నక్కయ్య చెప్పింది . వారి నుంచి ,తాము ముగ్గురం ఎంతో నేర్చు కున్నానమని ,ఆమె ను మరువ లేమని చెప్పింది .కనీసం పది సంవత్స రాలు ఆ టీచర్ గారి వద్ద సంగీతం నేర్చారు .అప్పుడు ఇంటికి అచ్చి సంగీతం నేర్పటమే వుండేది .ఒకటి రెండు సార్లు ఆమె ,వైఖానస ఉత్స వాలాలో  విష్ణాలయం,అవతలి వైపు మెట్ల కింద ఖాళీ స్థలం లో పందిరి కింద కచేరీ చేసి ,అందర్నీ మెప్పించారని చిన్నక్క దుర్గ అన్నది .భేషజం లేకుండా ,చాలా సామాన్యం గా ,ఎంతో బీడిం గా వుండే వారామే .తల వంచుకొని నడి చే వారు .గర్వం లేదు .మ ఇంటిలోనే కాక ,మా బంధువు లైన సూరి శ్రీ రామ మూర్తి గారింటికి కూడా వెళ్లి వారి అమ్మ్మాయి కమల కు కూడా సంగీతం నేర్పేవారు .వీరి తో పాటు ,ఆది రాజు నరసింహా రావు గారింట్లో వారమ్మాయి సుందరికి ,చోడ వరపు చంద్ర శేఖర రావు గారింట్లో వారి కూతురు తేజ  కు ఇళ్ళకు వెళ్లి నేర్పే వారు  .అంతే– ఇంకేవరింటికి వెళ్లినేర్పి నట్లు చూడ లేదు .ఆ రోజుల్లో ఒక్కొక్కరికి నెల కు  పది రూపాయల కంటే ఎక్కువ ఇచ్చే వారు కాదను కొంటాను .ఆ డబ్బుతో మరి సంసారం ఎలా గడిపే వారో ఆశ్చర్యమే .అదీ చాలా గుంభన గా వుండే ఆ టీచర్ .ఇప్పటికి అరవై ఏళ్ళు దాటినా ఇంకా మనసు లో మెదులుతూ  వున్నారు .మా చిన్నక్కయ్య కు బానే వచ్చేది సంగీతం .పెద్దక్కకు ఎక్కువ సాధన చేస్తే కాని వచ్చేది కాదు .మా మామయ్య గారి అమ్మాయి” దాచ్చికి” అసలు సాధన సాగేది కాదు .అయినా ,విసుక్కో కుండా అందర్నీ సమానం గా చూసే వారు ఆమె .మా ఇళ్ళల్ల లో పెళ్ళీ ,పేరంటాలకు ఈ ముగ్గురి సంగీతమే హై లైట్ .మంగళ హారతి పాటలు వీళ్ళే పాడే వారు .మా ఇంట్లోనే కాదు ఎవరింట్లో నైనా వీరిదే పెద్దరికం .
ఇంతకీ సంగీతం టీచర్ గారి భర్త వున్నారా ,లేదా అని ప్రశ్న గా వుండేది .ఎప్పుడు ఆయన్ను చూసినట్లు లేదు .బహుశా కారణాంత రాల వల్ల వేరు గా వుండే వారని తెలిసింది.అబ్బాయి తో మాత్రం మాకు బాగా పరిచయం వుంది .టీచర్ గారు ఎప్పుడు వారి తండ్రి గారు” గరిక పర్తి  కోటయ్య’ ‘ గారిని జ్ఞాపకం చేసు కొనే వారు .తండ్రి గొప్ప సంగీత విద్వాంసులని చెప్పే వారు .అప్పుడు కోటయ్య దేవర గారి గురించి ,నాకు ఏమీ తెలీదు .ఆ తర్వాత వారి కీర్తి సంపద గురించి బాగా తెలిసింది .అంతటి మహా విద్వాంసుడి కుమార్తె కు ,సంగీత సరస్వతికి ,ఈ బాధ లేమిటో ఆ భగ వంతునికే తెలియాలి .ఇప్పుడు తలచు కొంటె జాలి వేస్తుంది .ఇన్ని బాధలను భరిస్తూ ,సంగీతం నేర్పుతూ ,తండ్రి వారసత్వాన్ని కొన సాగించిన ఆ సంగీతమ్మ కు నివాళులు అర్పిస్తున్నాను .ఒక్క సారి గరిక పర్తి  కోటయ్య దేవర గారి సంగీత వైభవాన్ని ఫ్లాష్ బాక్ లోకి వెళ్లి చూద్దాం . .

 గరిక పర్తి  కోటయ్య దేవర 

రస జగత్తును ‘ఊయల’ ఊపిన గరికపర్తి కోటయ్య దేవర – తనికెళ్ళ భరణి

ఆంధ్ర గాయక పితామహులు గా కీర్తి పొందిన గరిక పర్తి కోటయ్య దేవర ,చల్ల పల్లి ఆస్థాన సంగీత విద్వాంసులు .వీరి చిన్న తనం గురించి ఒక కధ వుంది .1864 బందరు ఉప్పెన లో పసి పిల్లాడు గా వున్న కోటయ్య ,ఉయ్యాల తో సహా ,నీటిలో కొట్టుకు పోయి ,ఒక కుంకుడు చెట్టు కు చిక్కు కున్నాడు .పిల్లాడు క్షేమం .తర్వాత ,చిన్న తనం లోనే ,”కొబ్బరి చిప్పకు గుర్రపు వెంట్రుక కట్టి ,కమాను తో సంగీతం   వాయించే వాడు .ఏ గురువు అవసరం లేకుండా సంగీతం అబ్బిన ధన్య జీవి .తండ్రి శిక్షణ లో ,విద్వాంసులై ,వాయులీనం లో ప్రతిభ సంపాదించారు కోటయ్య దేవర .ఒక సారి హైదరా బాద లో తన్మయుడై గానం చేస్తూ ,వాయులీనం తో సాధన చేస్తుంటే ,అప్పటి ప్రభువు’ ‘సాలార్   జంగ్ బహద్దర్ ”గమనించి ,ముచ్చట పడి ,”చిన్నన్న ”అనే సంగీత   విద్వాంసుని కి అప్ప గించి సంగీతం నేర్పించాడు .ఆయన ప్రతిభా పాటవాలకు అబ్బుర పడి ,  తన” సంస్థాన సంగీత విద్వాంసుని” గా ,నియమించాడు .తన ప్రతిభ ను గుర్తించిన ”రాజ గోపాలా చారి ”అనే వారిపై వర్ణం రాసి ,భక్తి చాటు కొన్నారు .మంచి సంగీత  విద్వాంసుని గా ,ప్రఖ్యాతి వచ్చింది .తంజావూరు మహా రాజు ”ఆస్తాన  సంగీత విద్వాంస పదవి ”కి ఆహ్వానిస్తే ,మర్యాదగా తిరస్కరించారు కోటయ్య దేవర .
బందరు చేరు కోని సంగీత పాథ(paatha ) శాల ఏర్పరిచి ,ఉచితం గా భోజనం పెట్టి ,విద్యార్ధులకు నేర్పించి నట్లు  ప్రముఖ రచయిత ,నటుడు శ్రీ తనికెళ్ళ భరణి తమ ”ఎందరో మహాను భావులు ”గ్రంధం లో రాశారు.ఆ కాలమ్ లో వీరిని అందరు ”జంగం కోటయ్య ”అనే పిలిచే వారు .ఆ పేరు తోనే వారు సుపరిచితు లయారు .గీతాలు ,వర్ణాలు ,స్వర జతులు ,కీర్తనలు రాసిన” వాగ్గేయ కారులు ” కోటయ్య దేవర .తోటల వల్లూరు సంస్థాన జమీందారు ”భాష్య కార్లు నాయుడు ”గారి పట్టాభి షేకానికి ,తిరుపతి కవులను ఆహ్వానించి సత్కరిస్తే,ఆ తర్వాత వచ్చిన జమీందార్ సత్య నారాయణ ప్రసాద్ గోపాల స్వామి ఉత్స వాలు ఘనం గా నిర్వ హించే వారు .శాస్త్ర చర్చలు ,అవధానాలు ,నాటక ప్రదర్శనలు నిర్వహించారు .నాట్యోత్స వాలను ,సంగీత సభలను నిర్వ హించారు .గరిక పాటి కోటయ్య దేవర గారిని”వల్లూరు సంస్థాన సంగీత విద్వాంసుని” గా చేసి ,సంగీత సరస్వతీ సమార్చనం చేశారు .
ఇంతటి మహా విద్వాంసుని కూతురు జీవిక కోసం  సంగీత పాఠాలు చెప్పటం బాధా కరమే .విధి వ్రాత ఎవరు తప్పించ లేరు . సంగీతం టీచర్   పద్మావతి గారు ,సంగీతాన్నే నమ్ముకొని దానినే తండ్రి లాగా అందరి కి బోధిస్తూ ,గౌరవం గా జీవించారు .అది చాలు వారిది ధన్య జీవనం అని తెలప టానికి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -02 -12

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

3 Responses to ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

  1. Gopala Myneni's avatar Gopala Myneni says:

    Sree Durgaprasad gariki: Namaste. I very vividly remember the music teacher you mentioned. Both my younger sisters, my niece, and sister of Sri Surapaneni Ramakrishna gari(ex-correspondent of S.G.&A.G. college) all were taught music lessons by her. In addition to vocal, she gave lessons in Veena & Fidale too. Your detailed description of her exactly fits my recollection, i.e., a very humble lady in her attire, demeanor and punctuality. She charged, as you recalled exactly Rs.10 per month for each student. My memories are from middle 50s. Thanks for bringing back my late teen/early 20s memories.–With kind regards, Gopalakrishna.
    (P.S.: I just double checked with my sister who very fondly remembers her. I am forwarding your Voosulu-17 to her. Can I ask your secret for such a clear and vivid memory?)

    Like

  2. శ్రీ కృష్ణ's avatar శ్రీ కృష్ణ says:

    కోటయ్య దొర గారి గురించి తనికెళ్ళ భరణి గారు వ్రాసిన వ్యాసం ,, దయచేసి చదువగలరు..

    http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct11/emdaromahanubhavulu.html

    Like

  3. సరసభారతి's avatar సరసభారతి says:

    శ్రీ కృష్ణ గారికి ధన్యవాదాలు

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.