సరస్వతీ పుత్రుని శివ తాండవం –7 (చివరి భాగం )
శివా లాస్యం
శివ తాండవం పూర్తి అయింది .పార్వతీ దేవి చెలి కత్తె ”విజయ ”ప్రార్ధన గీతం పాడు తుంది .ఇది సంస్కృత రచన ..లల్తంలలితం గా సాగి ,శివా లాస్యానికి మార్గం సుగమం చేస్తుంది .గిరి కన్నె లాస్యం ,లలిత లలత పదాలతో ,మనోహరం గా వర్ణించారు సరస్వతీ పుత్రులు .శివ తాండవం తిలకించిన పార్వతి ఎంత చక్కగా నవ్విందో చూడండి .
”ఫక్కు మని నవ్వినది జక్కవల పెక్కు వల -జక్కడుచు ,చను దోయి ,నిక్క బార్వతి యపుడు
నిక్కు చను దోయితో ,నిబిడ రోమోద్గరము -దిక్కు దిక్కుల నెల్ల ,నేత్రోత్సవము ”
గిరికన్నే పార్వతి అలస మారుతం లాగా ఆడింది .సెలకన్నె ఫకాలున నవ్వి నట్లు పాడినది .శరదబ్జ ధూళి పింజరితముల చక్రముల సరి దూగు ,లావణ్య భరిత కుచయుగమ్ములు చను కట్టు నెగ మీటి ,మిను దాకునో యనగా పైపైని వ్రుక్షమ్ము విరియించి ఆడినదట పార్వతి దేవి .
”ప్రతి పదము లో శివుడు పరవశత దూగంగా -సతి చంద్ర మకుటంబు ,సారెకు జలిమ్పంగా
ప్రతతి దూగాడి నట్లు వాత దూతం బౌను -శత పత్రమది ముక్తసరి విచ్చి కొన్నట్లు -ఆడినది గిరి కన్నె”
గగన వనం లో విచ్చి కొన్న జలదం వలె ,వనం లో పారాడే వాత పొతం వలె గిరి కన్నె సంచలించింది ,సంచలనం కల్గించింది .
శివా లాస్యానికి శివుడు ఆనంద పరవశు డైనాడు .చేతులు కలిపి నాట్యం చేయ ప్రారంభించాడు ప్రకృతి ,పురుషుల విలాసం జరిగింది .అర్ధనారీత్వం సార్ధకత చెందింది .
”తన లాస్యమును మెచ్చి ,తరుణ చంద్రా భరణుడు –అను మోదమున జేతులను కలిపి యాడంగ
శివ శక్తు లొక్కటి గ జేరి నంతనే -మౌను లవి క్రుతేన్ద్రియు తోమ్మటంచు జాటిమ్పంగా -గిరి కన్నె ఆడినది .”
అప్పుడు దేవత లు అందరు, చరిత కంత(kantha )ములతో శివ శక్తులు మంగళ గీత ములతో ,గీతా లాపన చేశారు .సర్వ మంగళ ప్రదమై ,శివమై ,సౌభాగ్య వంత మై ,సమాప్తం చెందింది .
ఇంత గొప్ప కావ్యాన్ని ,”మధుర మనోహరం ”గా రచించిన సరస్వతీ పుత్రులు శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ధన్యులు .చదివిన మనము ధన్యులం అవటానికే వారీ ప్రయత్నం చేశారు .
”జయన్తితే రస సిద్ధాః కవీశ్వరాః -నాస్తి తేషాం-యశః కాయే –జరా మరణజం భయం ”
సంపూర్ణం
”సరస్వతీ పుత్రుని శివ తాండవం ”అన శీర్షికతో దీన్ని 1973 మే నెలలో రాశాను .ఇది అదే నెలలో ”ఆంద్ర ప్రభ -సాహితీ గవాక్షం ” లో ప్రచురిత మైంది .అంటే సుమారు 39 సంవత్స రాల నాటిది అన్న మాట .దీన్ని మార్పులు చేర్పులు చేసి 29 -09 -1990 న ఉయ్యూరు కు సమీపం లోని గరిక పర్రు శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం లో విజయ దశమి పర్వ దినాన ఉపన్యాసం చేశాను .అదీ ఇరవై ఏళ్ళ కిందటి మాట .ఇప్పుడు మీ కోసం అందించాను .
ఈ వ్యాస పరంపరను సరస్వతీ పుత్రులు స్వర్గీయ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారికే సభక్తి కంగా అంకితమిస్తున్నాను .
”ఆప్యాయంతు మమాన్గాని ,వాక్ ప్రాణ శ్చ చక్శుహ్ శ్రోత్ర మధో బల మిన్ద్రియాని ,సర్వం బ్రహ్మో పనిష దం ,మాహం బ్రహ్మా ,నిరాకుర్యా మామా బ్రహ్మ నిరాకరో ,దనిరాకరణ మస్తు ,అనిరాకరణ మస్తు ,తదాత్మ నిరతే ,య ఉపనిషత్సు ధర్మాస్తే -మనంతుతే మయి సమ ”
ఓం శాంతి శాంతి శాన్థిహ్
సర్వం సంపూర్ణం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -02 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

