సరస్వతీ పుత్రుని శివ తాండవం —6
శివా శివులు –2
భగవద్గీత లో కూడా ,గీతా చార్యుడు శ్రీ కృష్ణుడు ‘అనన్యాస్చింత యంతోమాం ,ఏ జనాః పర్యు పాసతే –తేషాం నిత్యాభి యుక్తానాం -యోగ క్షేమం వహామ్యహం ‘.శివా నంద లహరి లో భగవత్పాదులు శ్రీ శైల మళ్లి కార్జున ,భ్రమ రాంబా లను ఎలా దర్శించారో చూడండి .
”సంధ్యా రంభ విజ్రుమ్భితం శృతి శిర స్తానానంత రాదిష్టితాం
సప్రేమ భ్రమ రాభి రామ ,మసక్రుత్ సద్వాసనా శోభితం
భోగీన్ద్రాభరణం -సమస్త సుమనః పూజ్యం గుణా విష్క్రుతం
సేవే శ్రీ గిరి మళ్లి కార్జున మహా లింగం శివా లింగితం .”
నల్లని మేఘాన్ని చూస్తె ,నెమలి నాట్యం చేస్తుంది .అలాగే ఉమా దేవి ని చూసిన శివుడు నాట్యం చేస్తున్నాడని శ్రీ శంకరులు –
”ఆకాశేన శిఖీ ,సమస్త ఫణి నాం,నేతా కలాపీ నతా
నుగ్రహే ప్రనవోప దేశ నినదైహ్ కేకీతి యోగీయతే
శ్యామం శైల సముద్భువాం ,ఘన రుచిం ,దృష్ట్యా నటంతం ,ముదా వేదాన్తోప వనే విహార రసికం తం నీల కంఠం భజే ”
తాండవం చేసే శివా శివులగు సాంబ సదా శివుని నేను సేవిస్తాను అంటూ ,శివానంద లహరి లో
”సంధ్యా ఘర్మ దివాత్యయో హరి కరా ఘాత ప్రభూ తానక
ధ్వానో వారిద గర్జితం ,దివిషదాం ,దృష్టి చ్చటా చంచలా
భక్తానాం ,పరి తోష బాష్ప వితతి ,ర్వ్యుష్టి ర్మయూరీ శివా
యస్మిన్నుజ్వల ,తాండవం ,విజయతే ,తం నీల కంఠం భజే ”
విష్ణువు ”ఆనకం ”అనే తప్పెట వాయిస్తున్నాడు .దేవతలు భక్తి పార వశ్యం తో వున్నారు .సాంబ శివుని తాండవం ,లోకోత్తర మైనది .శివ ప్రదమే కాదు మంగళ ప్రదం .మయూరి అంటే ఆడ నెమలి .అది నాట్యం చేయదు .మయూరమే అంటే మగ నెమలి మాత్రమే నాట్యం ఆడు తుంది ..శివా శివులు మయూరీ మయూరాల వలె నాట్యమాడు తున్నారు .
హిమ పర్వతపు శిలల పై శివ తాండవం జరుగు తోంది .ఆయన పాదాలు కంది పోతాయేమో నని ,భగవత్పాదులు భావిస్తూ ,మెత్త నైన తన హృదయం పై నాట్యం చేయమని అర్ధిస్తున్నారు .
”ఎష్యత్సేషజనిం ,మనోస్య కఠినం ,తస్మిన్నతా నీతి మ
ద్రాక్షాయై ,గిరి శీమ్ని ,కోమల పద న్యాసః పురాభ్యాసితః
నోచే ద్దివ్య గృహాంత రేషు ,సుమస్తల్పేషు ,వెద్యాదిశుహ్
ప్రాయస్సత్సు శిలా తలేషు ,నటనం ,శంభో కిమర్దం తవః ”
విష్ణువుకి ,శివునికి ఎంత దగ్గర సంబంధం వుందో ,శ్రీ శంకరులు చెప్పారు .త్రిపురా సుర సంహారం లో ,విష్ణువు ,శివుని వింటికి బాణం అయాడు .నంది రూపాన్ని పొంది ,వాహనం అయాడు .అంబ రూపం భార్య అయాడు .శివ పాద సేవ కోసం వరాహ రూపం పొందాడు .(కిరాతార్జు నీయం ).జగన్మోహినీ రూపం పొంది శివునికి ప్రీతి కల్గించాడు .తాండవ సమయం లో విష్ణువు మృదంగం వాయిస్తాడు .హివుడిని సహస్ర కమ లాలతో అర్చించేందుకు తక్కు వైన ఒక్క కమ లాన్ని తన నయన కమలం తో ,అర్చించాడు (కన్నప్ప ).అందుకే శివ కేశవు లకు భేదం లేదు .
”బాణత్వం ,వ్రుషభాత్వ మర్ధ వపుషా ,భార్యాత్వ మార్యా పతే
ఘోణిత్వం ,సఖితా ,మృదంగ వాహతా చేత్యా ది టాపం దధే
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ ,త్వద్దేహ భాగో హరిహ్
పూజ్యా త్పూజ్య తరస్య ,ఏవ ,హిన చేత్కోవా త దన్యోదికః ”
ఈ శివ విష్ణు అభేదాన్ని తన శివ తాండవం లో చూపిన తర్వాత ,శ్రీ పుట్ట పర్తి వారు ,ముగింపు ను కడు రమ్యం గా చూపించారు .శోకం ,సంతోషం ,ఏకం అయి నాయట .నర ,నాకములు ,అనంతా కాశం ,పరిమిత భూమి ,కలిసి పోయాయి ఆ ఆనంద లహరి లో .పరమ ఋషులు ,అజ్ఞానులు ,తరులు ,బీజములు ,విరులు ,మొగ్గలు అద్వైతం , అద్వైతం అని ”అద్వయం ”గా అఖిల లోకాలు యెలు గెత్తి చాటి , నట్లు ,ఒత్తి పలికారట .ఆ భావం ,ఆ అనుభూతి ,అలోకిక ఆనందాన్ని కల్గించటం మనం ప్రత్యక్షం గా చూస్తున్నాం .ఒడలు పులక రిస్తాయి .రస సాక్షాత్కారం కల్గింది .అమోఘ కవితా సృష్టి కి నీరాజన పుష్ప వృష్టి .
నాట్యావ సాన కాలమ్ లో ,హరుడు కూడా హరిని ,స్తుతిస్తాడు .తాండవ కేళి విరమిస్తాడు .ఇది పరమ పావనమై ,సకల లోక వాసు లకు భక్తి పార వశ్యాన్ని కల్గించిన అమోఘ రచనా పాటవం .ఏవేవో ఊహా లోకాల్లో విహారం చేస్తాం .
”పద్మ మనోజ ,యావక పుష్ప శరీర –పద్మ సుందర నేత్ర బావాంబరా తీత
మాయా సతీ భుజా ,మధు పరి రంభా -విషయ వివేక ,వ్రుషీక ,సంచయోది ష్టాత
శౌరి ,నీ తేజమే ,సంక్ర మించెను నన్ను -బూరించే ,దాన్డవము బూర్ణ చిత్కళల తోడ
నని ,నిటలము నందు ,హస్తములు మొగిచి –వినతుడై శంకరుడు ,విష్ణువును నుతించి
ఆడే నమ్మా శివుడు -ఆడే నమ్మా భవుడు ”
ఇప్పటి దాకా ” శివ తాండవం” చూశాం కదా ,ఇక” శివా లాస్యం” చూద్దాం -అయితె తర్వాత మాత్రమే .