శ్రీ పాద వారి అనుభవాల జుంటి తేనెలు –
జ్ఞాపకాల దొంతర మల్లెలు –2
పెద్దన్న గరూ !పెద్దన్న కవి ప్రబంధాలకు ఒరవడి పెడితే ,తమరు ,జాతీయ మైన వచనానికి నడవడి నేర్పారు .వచనాన్ని వాచో విదేయం చేసి ,పద్యాల్లా ,జనం నాలుక పై నర్తింప జేశారు .అందుకే పెద్దన్న అన్నాను .”నిఝాం ‘ గా అంతే నండీ .
ఎంతటి భక్తీ ప్రపత్తులండీ మీకు .?మీ మాతామహ ,పితామహ వంశోద్ధారకు లందరినీ పేరు పేరు నా స్మరించారు .వారి వృత్తినీ ,ప్రవృత్తినీ ,ప్రతిభా పాటవాలను ,ఎరిగించారు .కాదు ఊరేగించారు .వారికి మీఅక్షరాలూ ”తిలాంజలి ”అయింది .అలా పిత్రూణం తీర్చుకొని ,ధన్యులైనారు .అంతేనా ?ఎరిగిన ప్రతి కుటుంబాన్ని ,సంబంధం వున్నప్రతి ఆత్మీయుడినీ ,సహకరించిన ప్రతి యోగ్యున్నీ ,మనసా ,వాచా ,కర్మణా మీరు శ్లాఘించి ,క్రుతజ్ఞాతాంజలి ఘటించారు .మీ పెద్ద మనసు త్యాగయ్య గారు అన్నట్లు మీ ”దినుసే ”.మీ అక్షర సేవనం వారికిచ్చిన ” ధర్మోదకం ”.ఇలా ఆత్మ జ్ఞాతు లైన వారందరికీ మీరు ఋణం తీర్చు కున్నారు .రుణ బంధ విమోచనులు అయారు .ఎంత ధన్యులండీ అన్న గారూ !
మీరు ఆడి ,పాడి ,కూడిన గ్రామాలన్నిటిని గుర్తుంచుకొని ,నివేదించారు . ఆ అనుబంధాలను వీలైనప్పు డల్లా విష్పస్టం చేశారు .మీ జీవిత చరిత్ర పటం లో ,వాటికి సముచిత స్థానం ఏర్పర చారు .ఆ గ్రామాల నామాలు మీ వల్ల భగవత్ సేవ లో విని పించే అష్టోత్తర ,శత నామాల పావిత్ర్యం కల్పించారు .ఇక్కడ అవి ధన్య మైనాయి మీ స్మరణ వల్లా ,సంపర్కం వల్లా ,..ఇలా చరా చరాలన్నిటికి ,మీరు అక్షరాభి షేకం చేశారు ,అర్చించారు ,అక్షర నైవేద్యం చూపి ,నీరాజనాలు అందించారు .సర్వ ప్రపంచం తోనూ ,విశ్వ కర్త వ్యాప్తుడై వున్నా డన్న వేదోప నిశాత్తుల రహశ్యాలను శోధించి ,తెలుసు కోని ,చూసి ,ఆచరించి ,తరించారు . .”సో-హం ”,”అహం బ్రహ్మాస్మి ”లకు అనుష్టాన ప్రాక్రియత తో ,తాదాత్మ్యం చెందారు .ధన్యత చెందారు .శ్లాఘనీయం మీ వర్ధనం , ,ప్రవర్తనం .
దీపావళి టపాకాయల తయారీ విశేషాలు ,ఆ కళ లోనిష్ణాతుడ నైన నాకు బాగా నచ్చాయి .మేమూ అవ్వాయి చువ్వాయిల్తో వీధుల్లో” లడాయి” కి దిగే వాళ్ళం .ఆ ఆనందం వర్ణ నా తీతం .గోగు దీపాలు ,జిల్లీలు ,కూరినచిచ్చు బుడ్డ్లుకట్టిన మతాబులు ,తయారు చేయటం లో కష్టం గా వున్నా ,అవి కాలుతూ వెలుగులు జిమ్ముతూ ,పెద్ద ధ్వనులతో పేలుతూ వుంటే సంతృప్తి గా వుండేది .ఒక నెల అంతా సరదాయే .దసరా వెళ్ళ గానే ఈ సరదా ప్రారంభం .
సంస్కృత ,తెలుగు కావ్యాలపై తమకు ఎంత శ్రద్ధా ఆసక్తీ అండీ అన్న గారూ !”వాసు ”అంతే మీకు నిజం గా బంగారమే .ఆ పసిడి వెలుగులు చూసిన వారందరికీ ,అంతే నండి .భట్టు కవి ప్రతిభా పెటికే కదండీ వసు చరిత్ర .”సాహిత్య వేత్తలకు అవి నిషకాలు ”అన్న మీ మాటలు అక్షర సత్యాలే .మునిగితే కదా లోతు,ఆంతర్యం తెలి సేది ?ఒడ్డున కూర్చుంటే వినోదం ఎక్కడిది /కవిత్వం ,పాండిత్యం భిన్న శక్తులు అని ,ఆ రెండునిండు వున్న వాడు రామ రాజ భూషణుడు అని మీరు చెప్పారు .కాదు అనేందుకు ఏమి వుందండి ?అనుభవ సారం .
”మదన కామ రాజు ”కధల పుస్తకం బామ్మ గారిచ్చి చదవమన్నప్పుడు మీరు పొందిన ఆనందం ,సీతాదేవి లంకలో చూసిన హనుమ ఆనందం లా వుంది అని పించారు .”కధలు చెబుతున్నా ,వింటున్నా ,అల్లుతున్నా ,అలాంటి పుస్తకం ఓటి వుంది అని మొత్త మొదటి సారిగా చూసిన మీ ఆశ్చర్యం ,ఆనందం మీకే అనుభవైక వేద్యం .”ఈ కధల మాధుర్యాల ముందు పటిక బెల్లం తీపి ,ఏమూలకి ?”అనుకోని ,ఎంత సంబర పడ్డా రండీ మీరు ?దాని వల్లే ”కదాభిరుచి ”కలిగిందని ఎంత నిజాయితీ గా చెప్పారు ?
మీ ”పలమూరు ”దగ్గర వున్న” తుల్యా సాగర సంగమం ”తీరు మీరు వర్ణిస్తూంటే ,ఎప్పుడు వెళ్లి అక్కడ మునిగి ,పవిత్ర వంతం అవుదామా అని పిస్తుంది .”సంతాన కాంక్ష కల వారికి సప్త సాగర యాత్ర ,పౌష్య బహుళ అమా వాస్య నాడు ”అక్కడే ప్రారంభం అవుతుందా ?మీ తీర వాసులు ధన్యులు అండీ .”ఉత్తర వాహినీ -పశ్చిమ లింగము ”వున్న స్థలం గొప్ప క్షేత్రం అవుతుందని తెలియ జేశారు .అందుకే కాశీ కి సమాన మైంది మీ ”పోల మూరు ”.అది పొలమూరు కాదేమో అన్న గారూ !”పుణ్యములు- ఊరు ”స్థల మేమో నండీ.
బ్రాహ్మణ అగ్రహారాలు ,వాటి తీరు తెన్నులు ,బ్రహ్మణ్యు లైన,విప్రోత్తముల జీవన సరళీ ,వైదిక ధార్మిక శాస్త్ర ,వ్యాకరణ ,జ్యోతిశాలన్ని ఆపోసన పట్టిన అపర అగస్త్యులు అయిన రుషి జీవితం గడిపిన వారి ప్రవర్తనా విధానం ,వర్ణించి మీరు చెబుతుంటే ,”భూ-సుర ”’లోకం లో ఉన్నామేమో నని పిస్తుంది .వాళ్ళ ఆవేశ కావేశాలు ,బంధు ప్రీతి ,మీరు ఏంటో మెచ్చారు .వాళ్ళ మూర్ఖపు పోకడలు ,ఛందో బద్ధ మైన చాందసం , ,కట్టు బాట్లు ,అవి ఎలా ప్రగతికి ప్రతి బంధకాలు అవుతున్నాయో కూడా కళ్ళకు కట్టించారు .రాగ ద్వేషాలు లేని మీ సమవర్తిత్వం బహుదా ప్రశంస నీయం . మీకు పరకాయ ప్రవేశ విద్య చిన్న నాడే అబ్బిందా అన్న గారు !లేక పొతే ఎలా చెప్ప గల రండీ /అందర్లోనూ మీరే కన్పిస్తారు నాకు . అందర్నీ” అంత్హ ”.ఎత్తున నిల బెడ తారు .వారి తప్పులనీ మన్నిస్తారు .సానుభూతి మీకు నిత్య విభూతి ధారణా ?మనుషుల పోకడల్ని ఫోటో తీసి చూపిస్తారు .ఎలా అబ్బింది చిన్నబ్బాయి గారూ !నిసర్గ రమణీయం ఆ చిత్రాలు .కలర్ ఫోటో ఆ నాడే తీసే నేర్పు అలవడి నట్లుంది .ఎంత నిశిత పరి శీలనా శీలురండీ మీరు ?చీకట్లో కూడా వెలుగు నింపే ,ఫ్లాష్ లైట్లు మీ కళ్ళు .అవి ,కలల లోగిళ్ళే కాదు ,కాంతి ప్రసరణ సాద నాలు .దివ్య చంద్రికలు .రవి ,చంద్రులు నిజం గా ,మీ కళ్ళల్లో కాపురం వున్నారు అంటాను .”ఒత్హిది ”అంటారు మీరు .కాదంటాను నేను .,
సశేషం -మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12 -01 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com