యజ్న నృత్య సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ
శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ —3
ప్రముఖుల సమక్షం లో పేరిణి
భారత రాష్ట్ర పతి జ్ఞానీ జైలు సింగ్ గారి సమక్షం లో దుర్గా ప్రసాద్ గారి శిష్యులైన ఆచంట చంద్రశేఖర్ ,మాధవి లతో ఆంద్ర నాట్యాన్ని ,తన తమ్ముళ్ళు మోహన్ కుమార్,యశోదా కృష్ణ ,అజిత్ లతో పేరిణి శివ తాండవం ప్రదర్శింప జేశారు .ఉప రాష్ట్ర పతి ,ఆధ్యాత్మిక విషయ పరి పూర్ణులు శ్రీ శంకర్ ద్సయాల్ శర్మ గారిఎదుట పేరిణి ప్రదర్శించిన ఘనత సప్పా వారిదే .
విశాఖ పట్నం సాగర తీరాన నట రాజు గారు మొదట్లో నృత్య శిక్షణా తర గతులు కొంత కాలమ్ నిర్వ హించారు .1985 లో మహా రాష్ట్ర గవర్నర్ కొన ప్రభాకర రావు గారి చేతుల మీదుగా ,వర్ధమాన పేరిణి నాట్యాచార్యులైన దుర్గా ప్రసాద్ ,కాకినాడ వర ప్రసాద్ ,విశాఖలో నికేతన్ స్థాపించిన పరమేశ్వర్ లకు సన్మానం జరిగింది .ఆ సందర్భం గా జరిగిన పత్రికా ప్రతినిధులతో తన వారసుడు సప్పా దుర్గా ప్రసాదే నని ,నిర్ద్వంద్వం గా ప్రకటించారు .దానికి సరైన కారణం కూడా తెలియ జేశారు ..”నాలా పరిశోధనా దృష్టి ,నాలా ఉపన్యశించే శక్తి ,నాలా రచనలు చేసే సత్తా వున్న వాడు మా దుర్గా ప్రసాద్ ఒక్కడే ”అని ప్రసాద్ లోని ప్రతిభను ఎంతో దూర దృష్టి తో అంచనా వేశారు .దాన్ని అనంతర కాలమ్ లో అక్షర సత్యం చేసి నిరూపించుకొన్నారు ప్రసాద్ .
ప్రసాద్ గారి బహుముఖ ప్రజ్న
”సిరి మువ్వలు”అనే తొలి నాట్య గ్రంధాన్ని బాలల కోసం రాశారు .అందులో రేఖా చిత్రాలను వారే స్వయం గా చిత్రించారు .నట రాజు గారు తొలి పలుకులు పలుకుతూ చిన్నారు ల కోసం ,తన తర్వాత మళ్ళీ ప్రసాద్ రాయటం ముదా వాహం అన్నారు .1987 లో విజయ వాడ లో నట రాజు గారు ”ఆంద్ర నాట్య పీఠం” నెల కోల్పారు .నట రాజు గారు శిక్షణ నిచ్చి ,ఇప్పించిన నాట్యా చార్యులందరికి అర్హత సరి ఫికెట్లు ,తగిన బిరుదులూ ఇవ్వ మని చాలా కాలమ్ నుంచి నుంచి నటరాజు చెవిలో జోరీగ లాగా పోరుతూనే వున్నారు ప్రసాద్ గారు .దీన్ని అమలు లోకి తెచ్చారిప్పుడు .ఆంద్ర నాట్య ,పేరిణి శివ తాండవం ప్రచారం చేస్తున్న వారిలో అర్హులను ఎంపిక చేసి ,ఆంద్ర నాట్య పీఠం తరఫున ,..”నృత్య చూడామణి” ”బిరుదును ,”పేరిణి రుద్ర ”బిరుదును ప్రదానం చేశారు .ప్రసాద్ గారికి రెండు బిరుదులూ ఇచ్చినా స్వర్ణ పతకం ఇవ్వ లేదు .అవసర మైతే నట రాజునైనా ఎదిరించే ముక్కు సూటి మనిషి ప్రసాద్ .”నాకు గోల్డ్ మెడల్ రా కుండాఅడ్డు పడిన పెద్ద లందరికివందనాలు ”అనేసి దిగి పోయారు . .
కోస్తా జిల్లాలలో ఆగమ నర్తనం ,లాస్య ప్రదర్శనం ,కేళిక, దాసీ భరతం ,దర్బారు ఆట ,కర్నాటకం ,నట్టువ మేళం ,మేజు వాణి వంటి వివిధ నాట్య రీతులున్నాయి .నట రాజు సూచన మేరకు ప్రభుత్వం రాజమండ్రి లో ”ఆంద్ర నాట్యం ”అనే నామ కరణ మహోత్స వాన్ని ఘనం గా నిర్వహించింది .గోదావరి జిల్లాలో ”నవ జనార్దన పారిజాతం ”సహస్ర దళ పద్మం లా వికశించింది .తొమ్మిది మంది జనార్దన స్వాములేర్పడ్డారు .తొమ్మిది జనార్దన ఆలయాలలో ,అభినవ ప్రియుడైన జనార్దన స్వామి యుగ యుగాలు గా పూజ లందు కొంటున్నాడు . .ధవళేశ్వరం లో ”బ్రహ్మ చారి యోగి జనార్దనుడు ”గా ,మడికి లో ”సుదర్శన ముద్ర ”తో ,జొన్నాడ ,ఆలమూరు లలో ”అభయ ముద్ర ”తో ,మండపేట లో ”భోగ ముద్ర ”తో ,కపిలేశ్వర పురం లో ”పద్మాసన ముద్ర ”తో ,మాచర లో ”జ్వాలా ముద్ర”తో ,కోరుమిల్లి లో ”సాధక ముద్ర”తో ,కోటి పల్లి లో ”సిద్దేశ్వరముద్ర ”తో జనార్దన స్వామి పూజలు అన్డుకొంటున్నాడు ..తొమ్మిది రాత్రులు సూర్యాస్తమయంనుండి సూర్యోదయం దాకా ప్రత్యెక బాణీ లో స్త్రీ కళా మూర్తులు నృత్యం తో ఆరాధించే సంప్రదాయం ఇది .ఇందులో శ్రీమతి పెండేల సత్యభామ గారు నిష్ణాతులు .వీరి వద్ద నట రాజు ఈ విద్యను దీక్ష గా నేర్చి పునఃసృష్టి చేసి ఆంద్ర లోకానికి అందించారు .”నవ జనార్దన పారిజాతం ”అనే అత్యుత్తమ గ్రంధాన్ని రాశారు .ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొంటూ ప్రసాద్ గారు ”ప్రపంచం లో ఇంత విస్తృత మైన నర్తనం ,ఇంత విశాల మైన గ్రంధం లేదు ”అని పరిశోదనాత్మకం గా తెలిపారు .
1986 లో ”ఆంద్ర నాట్యాభ్యుదయం ”అనే సదస్సును ,1994 లో ఏలూరు లో ”ఆంధ్రుల నాట్య కళా వైభవం ”సదస్సులను ప్రసాద్ నిర్వ హించి శిష్యులచే ”ఆంద్ర నాట్యం ”నర్తింప జేశారు .నట రాజు ప్రధాన వక్త గా విచ్చేశారు .ప్రసాద్ సిద్ధాంత కర్త గా ,కళో పాన్యాసకులు గా ద్విపాత్రాభినయం చేసి శభాష్ అనిపించుకొని సత్కారాలను అందు కొన్నారు . .
ఆంద్ర నాట్యం తమదే నని శ్రీమతి మద్దుల లక్ష్మీ నారాయణ ,శ్రీమతి స్వప్న సుందరి ఉద్యమం లేవదీసి ఆరుద్ర గారి తోడ్పాటుతో బాగా ప్రచారం చేసుకొన్నారు .ఒక సారి ఒక వేదిక పై ఈ విషయం లో ఆరుద్ర తో విభేదించి ,సాహిత్యం సంగతి చూసుకోమని కళల జోలికి వెళ్లి కళాకారులకు ఇబ్బంది కల్గించ వద్దని గట్టిగా చెప్పారు .ఎక్కడైనా ,ఎప్పుడైనా చర్చకు సిద్ధం అని సవాలు చేశారు ప్రసాద్ .వీరి ధైర్యానికి కళాకారు లందరి అభినందనలు లభించాయి .ఆ తర్వాతా ఆ స్త్ర్రీ మూర్తులిద్దరు ”విలాసిని నృత్యం ”పేర దేవదాసి నృత్యాన్ని ప్రదర్శించటం ప్రారంభించారు . .
పూర్వం రక రకాల పేర్లతో పిలువ బడిన ఆంధ్రుల లాస్యనర్తన ,సంప్రదాయ నృత్య కల కు ‘ఆంద్ర నాట్యం ”గా నామ కరణం చేసి అకాడెమి ద్వారా సిలబస్ తయారు చేసి సర్టి ఫికెట్లు ,డిప్లోమో స్థాయి పరీక్షల నిర్వహణ కై చేసిన కృషి లో నట రాజు గారి తో పాటు దుర్గా ప్రసాద్ గారికి సమాన ప్రాతినిధ్యం వుంది .ఆంద్ర నాట్యం మొదటి పరీక్షలు నిర్వ హించ టానికి ,ప్రభుత్వం తో అంగీకరింప జేశారు .పరీక్షలు నిర్వహించటం కుదరదు అని తెలుగు విశ్వ విద్యాలయం మొకాలడ్డింది .కోర్టు లో వ్యాజ్యం వేసి గెలిచి కళా కారులందరికి న్యాయం కలుగ జేశారు .ప్రభుత్వానికి ఎదురు తిరిగి నందున పసాద్ గారికి ప్రభుత్వ ప్రయోజనాలను గుర్తింపు ను దక్క కుండా పక్ష పాత ద్రుష్టి తో వ్యవ హరించింది .సూర్య తేజాన్ని అర చేతి తో అడ్డు కోవటం అసాధ్యం అని గుడ్డి ప్రభుత్వానికి తెలియ లేదు పాపం .
ఆంద్ర నాట్యా చార్యులలో ప్రధములు గా దుర్గా ప్రసాద్ గుర్తింపు పొందారు .అసలు సీస లైన నట రాజు గారి వారసులు వీరే .అందుకే వారి నికేతన్ లో కేవలం ఆంద్ర నాట్యం ,ఆలయ సాంప్రదాయ నృత్యం ,పేరిణి శివ తానడవం మాత్రమే ,అప్పటి నిండి ఇప్పటి వరకు నేర్పు తున్నారు .
నట రాజ నృత్య నికేతన్ ప్రారంభించిన 12 ఏళ్ళకు 1995 లో స్వంతభవనం లో అడుగు పెట్టింది ఆంద్ర నాట్య కళా సరస్వతి .”మా దుర్గా ప్రసాద్ పట్టుదలకు ప్రతి రూపం ”అని నట రాజు గారు అందరితో చెప్పుకొని మురిసి పోయే వారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20 -02 -12

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com