యజ్న నృత్య సృష్టి కర్త నృత్య ప్రపూర్ణ
శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ –4 (చివరి భాగం )
1995 లో హైదరాబాద్ లో నట రాజు గారు ”నవ దుర్గా ఆంద్ర నాట్య యజ్ఞం ”ను తొమ్మిది రోజులు అద్భుతం గా నిర్వ హించగా ,ప్రసాద్ గారు కూడా శిష్యులతో పాల్గొన్నారు .
శివ పంచారామ నృత్యోత్సవం
ప్రతి శివ రాత్రి పర్వ దినం నాడు నియమ నిష్టలతో ప్రశిద్ధ శివాలయాలలో నృత్యోత్సవం జరపటం ప్రసాద్ గారికి అలవాటు .1992 లో ”శివ పంచా రామ నృత్యోత్సవం ”ను ప్రత్యేకం గా నిర్వ హించారు .గురువు గారితో పాటు అందరు అమితాశ్చర్య పడ్డారు .700KI .మీ .పరిధిలి లో ఉన్న పంచారామా లైన ద్రాక్షారామ భీమేశ్వర ,కుమారారామ రాజేశ్వర ,భీమా రామ భీమేశ్వర, క్షీరారామ రామ లింగేశ్వర ,అమరా రామ రామ లింగేశ్వర దివ్యాలయాలలో మహా శివ రాత్రి నాడు 24 గంటల్లో అంటే ఒకే ఒక్క రోజున నృత్యోత్సవం జరి పారు .ప్రపంచ నాట్య కళా చరిత్ర లో ఎవరు చేయని సాహసం ఇది .దీన్ని అవలీల గా సాధించిన ఘనత సప్పా దుర్గా ప్రసాద్ గారిదే .”70 ఏళ్ళ వయసు లో ,నాకు మనసు లో కోరిక వున్నా ,అయిదు క్షేత్రాలలో నృత్యం చేయ లేక పోయాను . నీకెలా సాధ్యం అయింది ?ఓపిక ఎలా వచ్చింది ”?అని ఆశ్చర్య పోతూ ,ఆప్యాయం గా వెన్ను తట్టారు గురుబ్రహ్మ నట రాజు .
మరి రెండు నృత్య రూప కాలు
”భక్త అన్న మాచార్య ”నృత్య రూప కాన్ని కేరళ తదితర ప్రాంతాలలో నర్తింప జేశారు ప్రసాద్ గారు .గురువు రామ కృష్ణ గారు ”కృష్ణ తాండవం ”ను అతి క్లిష్ట గతులతో సృష్టించారు .దీన్ని దుర్గా ప్రసాద్ గారు నాగేంద్ర రెడ్డి ఎనిమిది జతులతో నలభై నిమిషాలు ఏక ధాటిగా ప్రదర్శించారు .ఇంత కాలమ్ చూసే ఓపిక ప్రేక్షకులకు ఉండదని గ్రహించి ,మరెవ్వరికి దీన్ని నేర్ప లేదు .”నట రాజజ రామ కృష్ణ గారి శిష్యుల కంటే దుర్గా ప్రసాద్ గారి శిష్యులే బాగా నర్తిస్తున్నారు ”అనే పేరు వచ్చింది .ఇది గురువుకే కాదు శిష్యునిక్కీ గర్వ కారణమే .
గ్రంధ రచన
సిరి సిరి మువ్వలు ,ఆంధ్రులు -నృత్య కళ ,ఆలయ నృత్యం అనే గ్రంధాలు ,పుష్పాంజలి ,ప్రేమాంజలి అనే రెండు నవలలు ,పర్యటన అనే పర్యాటక రచన,నా వంశ చరిత్ర ,నా జీవిత చరిత్ర ను మూడు తరాల కళా సౌరభం గా రచించి గురు దేవునికి అంకిత మిచ్చి గురు భక్తీ ని ప్రదర్శించారు .నట రాజ నృత్య నికేతన్ ముద్రించిన ప్రత్యెక సంచికలు ,పంచమ వార్షికోత్సవ సంచిక ,తొలి నర్తన యజ్ఞం ,తృతీయ నర్తన యజ్న నృత్య ఆరాధన సంచికలను వెలువరించారు .సుమాంజలి u,హృదయం అనే కవితా సంపుటి సుమాంజలి చారిత్రక నవల ,అమర వసంతం నాట్య కళ -వ్యాస మాలిక ,నాట్య రంగ నవ రత్నాలు త్వరలో రాబోయే రచనలు .
యజ్న నర్తనం
1997 లో 108 మంది నృత్య కళా కారులతో తొలి నర్తన యజ్ఞం నిర్వ హించారు .ప్రభుత్వం కోరడం తో 118 మంది కళా కారులతో రెండ వ యజ్ఞం నిర్వ హించారు .మూడో సారి 136 మంది నృత్య కళా కారులతో నిర్వహంచి సేభాష ని పించుకొన్నారు .ఈ మూడిటికీ గురువు గార్ని ఆహ్వానించినా వారు రానందుకు బాధ పడ్డారు .ఈ యజ్ఞాల వల్ల వర్షాలు విపరీతం గా కురవటం తో ప్రసాద్ గారి కీర్తి మిన్ను ముట్టింది .ఆ వర్షాలు వర్షాకాలం లో కురిసినవి కాదు .సమయం కాని సమయం లో కురిపించారు ప్రసాద్ గారు .అదీ ఇందులో విశేషం .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం బహుదా ప్రశంశించింది .తాను యజ్న నృత్యాలకు రాక పోవటం ,ఆక్రుషి ,ఫలితం ,దుర్గా ప్రసాద్ కే స్వంతం అవాలన్న ఆరాటం మాత్రమే నని ఇంకా గురువు చాటు శిష్యుడి గా వుండటం బాగుండదని నట రాజు గారు శిష్యుణ్ణి ఊర డించారు .”బాబూ !నేను పేరిణి ని పునః సృష్టి చేస్తే ,నీవు యజ్న నర్తనం పునః సృష్టి చేసి ప్రచారానికి అహో రాత్రులు శ్రమిస్తున్నావు .”అని శిష్యుణ్ణి ఆశీర్వ దించారు .
గురు స్మృతి
2007 లో వరంగల్ కోటలో తెలుగు విశ్వ విద్యాలయం పేరిణి ఆంద్ర నాత్యోత్సవాలను మూడు రోజుల పాటు ,ఘనం గా నిర్వ హించింది .దుర్గా ప్రసాద్ అందులో ఒక రోజూ సిద్ధాంత కర్త గా ,మూడవ రోజూ సాయంత్రం నాట్యాచార్యులు గా వ్యవహరించారు .నడవ లేని స్థితిలో వున్నా ,నట రాజా రామ కృష్ణ గారు మూడు రోజులు పాల్గొని శిష్యలకు ఆనందాన్ని సంతృప్తి ని కలి గించారు .”ఇదే నా ఆఖరి ఉత్సవం ”అన్నారు గురువు శిష్యుని తో .అలానే జరిగింది .
ప్రసాద్ గారు నృత్యనికేతన్ రజతోత్సవాలను ఘనం గా నిర్వ హించారు .”విజయ విహారం ”అనే ప్రదర్శన ను ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టారు .దాదాపు ముప్ఫై ఏళ్ళుగా ఎన్నో సన్మానాలు బిరుదులూ పొందారు .విదేశీ పర్యటనలు చేసి అక్కడా ఆంద్ర నాట్య పేరిణి లకు ఆదరణ కల్గించారు .వీరికి ”నట రాజు ”బిరుదు ను ఇస్తామని చాలా మంది బలవంత పెట్టారు .”నట రాజ బిరుదు నా గురువు కే స్వంతం .దాన్ని నేను స్వీక రించను ”అని నిర్మోహ మాటం గా చెప్పి తిరస్కరించిన సంస్కారి అసలైన శిష్యులు ప్రసాద్ గారు .గురువు గారితో పాటు వీరికీ బౌద్ధమతము ,గాంధార శిల్పం అంటే అభిమానం .
నట రాజ రామ కృష్ణ గారు 2011 లో శివైక్యం చెందారు .ప్రసాద్ గారు కళాకృష్ణ దగ్గ రుండి అంతిమ సంస్కారం జరి పించి గురు ఋణం తీర్చుకొన్నారు .12 -06 -2011 న నటరాజ కళా మందిరం లో ”కారణ జన్ముడు నట రాజ రామ కృష్ణ ”సంతాప సభ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయిదు గంటల పాటు ఏక ధాటిగా సప్పా దుర్గా ప్రసాద్ నిర్వహించారు .ప్రముఖులెందరో పాల్గొని నట రాజు కు నీరాజ నాలు అంద జేశారు . గురువు గారి జీవిత విశేషాతో ,వారితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ”స్మ్రుతి పరిమళం ”అనే పుస్తకాన్ని రచించి రామ కృష్ణ గారికి అంకితమిచ్చారు .
” నృత్య ప్రపూర్ణ ”అనే బిరుదు వారి నృత్య కళా సేవకు అర్హమైంది .జీవితాన్ని ఆంద్ర నృత్య ,పేరిణి శివతాండ వాలతో ,యజ్న నర్తనం తో ధన్యత చెసుకొన్ననృత్య ప్రపూర్ణ డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు ,మరిన్ని విజయాలను సాధించాలని కోరుకొంటున్నాను .
ఈ వ్యాస పరంపర నట రాజ రామ కృష్ణ గారికి వినయ పూర్వకం గా సభక్తికం గా అంకితం చేస్తున్నాను .
ఈ రచన కు ఆధారం –డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ గారు రచించిన ”స్మ్రుతి పరిమళం ”అనే గ్రంధం .
సంపూర్ణం మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com