కృష్ణా జిల్లాలో చిన్న సంస్థానాలు –1
1700 -1846 కాలమ్ లో బెజవాడ జమీన్దారులుండే వారు .దీన్ని వేలం లో మూడు వేల రూపాయలకు బ్రిటిష్ వారు స్వంతం చేసు కొన్నారు .నాగుల కాలమ్ నుంచి ,నిజాం నవాబు వరకు బెజవాడను అంతకు ముందు నుంచి పాలిస్తున్నారు .బజ్జ మహా దేవి జైనుల దేవత పరం గా ఈ పేరు వచ్చిందని భావన .తెలివాహానది అంటే కృష్ణా నది అనీ ,దాని ఒడ్డున వున్న నగరం బెజవాడే నని ,అందుకే తొలి రాజధాని నగరం అని రాయ్ చౌదరి అనే పరిశోధకుడు వివ రించాడు .వేంగి సామ్రాజ్య రాజధాని కూడా బెజవాడే .అసలు పేరు పెచ్చ వాడ .అని ,క్రమంగా వెచ్చవాడ ,బజ్జ వాడ ,విజ్జ వాడ విజయ వాడ గా మారిందని అంటారు .చాళుక్యులకు ఇది రాజ దాని అయింది .1201 లోకాకతి గణపతి దేవుడు విజయ వాడ ను జయించాడు .1672 లోఅబుల్ హసన్ తానీషా మంత్రులైన అక్కన్న ,మాదన్నలు బెజవాడను పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని గా చేసుకొన్నారు .కొండ పల్లి ,విజయ వాడ ఆతర్వాత ఆసఫ్ జాహీల ,ఫ్రెంచ్ వారి వశం అయాయి .మొదటి నుంచి ,విజయ వాడ రాజకీయ .వాణిజ్య వ్యాపార ,సాహితీ కేంద్రం గా వుంది .
గుడివాడ
1757 లో కమదన సోదరులు నూజి వీడు జమీందారుకు చేసిన సహాయానికి మారుగా గుడివాడ ,కలిదిండి ,విన్న కోట ,బాహుర్జల్లి ,పరగణాలను బహుమతి గా ఇచ్చారు .వీటినే” చార్ మహల్ హవేలీ” అంటారు .కొల్లేటి బయటి ప్రాంతమే బాహుర్జల్లి .రాజా వెంకటాద్రి అపా రావు 1759 లో ఫ్రెంచ్ వారు దక్కన్ సర్దార్ సలాబత్ జంగులు కూడా ”కమదన ”వంశీకులకే ఖాయం చేశారు .1773 -79 ప్రాంతం లో జమీందారీ వారసులు అంతా చని పోయిన తరువాత ,కాండ్రేగుల వెంకట్రాయులనే దుబాసి కి ,బ్రిటిష్ ప్రభుత్వం అధికారం అప్ప గించింది .అంతకు ముందు మొగల్తుర్రు జమీందారు కలిదిండి తిరుపతి రాజు హవేలికి మధ్య వర్తి గా ,హామీ వుండి ,80 వేలు నష్ట పొతే ,దాన్ని పాలించా టానికి తిరుపతి రాజు కే అధికారం అప్ప గించారు .1813 లో బెజావాడ జమీందార్లు కలిదిన్డిని మైలవరం జమీందార్లు భట్రాజు పల్లి ని ,కొనుక్కొన్నారు .చివరికి మిగిలింది గుడివాడ ,కలిదిండి మాత్రమే .తర్వాత ఈ రెండిటినీ కమదన పాపయ్య పాలించాడు .అతని తర్వాత పూర్తిగా అంతరించింది .ఒక వంద రూపాయల భరణం తో కంపెనీ ఈ రెండిటినీ లాగేసుకొని ,గుడివాడ జమీ కి స్వస్తి పలికిది .1860 లో ఎత్తి పోతల ద్వారా కొల్లేటి నీటి తో భూములను బ్రిటిష్ వారు సాగు చేయించారు .దానితో గుడివాడ అభి వృద్ధి చెందింది .రాజ కీయ ,విద్యా కేంద్రం గా ఒక వెలుగు వెలిగింది .గుడులు ఎక్కువ గా వుండటం తో గుడుల వాడ అయి చివరికి గుడి వాడ గా నిలిచింది .1921 లో గాంధీ గారు వచ్చినపుడు ఇక్కడ కాంగ్రెస్ కార్య వర్గ సమావేశం నిర్వ హించారు .అస్పృశ్యతా నిర్మూలనకు ఇది నాంది పలికింది .గూడూరు రామ చంద్రుడు ,ఇక్కడి తొలిస్వాతంత్ర్య సమర యోధుడు .యెర్నేని సుబ్రహ్మణ్యం దుగ్గి రాల బల రామ క్రిష్నయ్య ,త్రిపుర నేని రామస్వామి చౌదరి ఇక్కడ గొప్ప విద్యా వంతులు .”మానవుని వెలి బెట్టిన -దేవుని వెలి బెట్టి నట్లే”అన్న నినాదం తో హరిజనులకు దేవాలయ ప్రవేశం కలిగించింది గుడి వాడే .ఇక్కడ సాంస్కృతిక చైతన్యం బాగా ఎక్కువ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21 -02 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

