ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర -2
ఆత్మ విశ్వాసం
చాణక్యుడు మహా పండితుడు,రాజా నీతిజ్ఞుడే .కాని ,నివాసం వుండే ఆ ఇంటిని చూస్తే కడుపు చెరువు అవుతుంది .అదో పూరి గుడిసె .పిడకలు చేసే వారు లేక ఆవు పేడ ఉండలు ఉండలుగా అలానే వుండి పోయింది .వాటిని పగుల కొట్టి ,యజ్న విధులు నిర్వ హించ టానికి ,రాతి ముక్కలున్నాయి .శిష్యులు తెచ్చిన దర్భ మోపు అక్కడే అలానే ఉప్పురుసినాయి .చూరు కుంగి ఉంది . దాని పై సమిధలు ఆర పెట్టి వుండటం తో భారం మోపైంది .ఇదంతా చూస్తుంటే భవిష్యత్ మహా మంత్రి యెంత నిర్భాగ్యుడో ,యెంత సామాన్య జీవితం గడుపు తున్నాడో తెలుస్తుంది .కన్ను చెమరుస్తుంది .
ఆ పడ చిత్రం మనసు లో నిలిచి పోతుంది .అయితె ,చాణక్య ప్రతిజ్న ,అతని ,లోకజ్ఞత ,,కార్య సాధన అప్రతి హతం .ఈ సందర్భం లో నే కంచుకి ప్రవేశించి ,ఆ మహా మహుని వ్యక్తిత్వాన్ని అంచనా వేసి చూపుతున్నాడు .పేరాస వల్ల మాట మీద నిల బడే వారు సత్య భాశానులు కోడా ,పేదరికం వల మాట కారులై ,రాజును ,నోటికి వచ్చి నట్లు పొగిడి ,పబ్బం గడుపు కుంటారు .కాని చాణక్యుని వంటి ,కోరికలు లేని వారికి ,రాజు -గడ్డి పరక తో సమానం .అని ఆయన ఔన్నత్యాన్ని ప్రశంశించి ,మహోన్నత ఆదర్శ మూర్తి గా మన ముందు నిల బెడ తాడు .ఆత్మ విశ్వాసం ,వ్యక్తిత్వమే మనిషికి బలం ,ధైర్యం ,సాహసం అని పిస్తాడు .
గుణ శ్రేష్టత
రాజ్యాన్ని కంటికి రెప్ప లాగా కాపాడు కొనే రాజు వుంటే ప్రజలకు సుఖ ,శాంతులకు కొదవ వుండదు .నంద రాజ్య నిర్మూలనం జరిగి ,చంద్ర గుప్తుడు రాజ్యాభిషిక్తు డైనాడు .తాను చేసిన ప్రయత్నాలన్నీ ఫలించి ,రాజ్యం సువ్యవశ్తితమిందని ప్రతిజ్న నెర వేరిందని చాణక్య మంత్రి మహాదానందం పొందాడు .మహాత్ములకు ”బహుజన హితాయ ,బహు జన సుఖాయ ”అనేదే కదా ధ్యేయం !అ ఆనందాతి రేకం లో మహా మంత్రి ఇలా అనుకోని ఆనందిస్తున్నాడు —
”నందైర్వియుక్క్త మనపెక్షిత రాజ రాజై–రాధ్యాసి తం చ వృష లేన వృషేన రాజ్ఞాం
సింహాసనం సదృశ పార్ధివ సంగతం చ –ప్రీతిం పరం ప్రగుణ యంతి గుణా మమైతే ”
ధన మదాంధులు కుబేరుని కూడా లెక్క చేయని నందులు పోయి ,రాజ శ్రేష్టుడు రాజు అయినాడు .సింహాసనానికి తగిన వారసుడు లభించాడు .ఈ మూడూ ,నా నీతి ఫలితాలే .నాకు చాలా ఆనందం గా ఉంది అని సంబర పడ్డాడు చాణక్య మంత్రి మహోదయుడు .
గురు భక్తి
చంద్ర గుప్తుని తో తనకు విరోధం వచ్చినట్లు ఎత్తు గడ పన్ని ,దాన్ని చంద్ర గుప్తు నితో తన కోపాన్ని అతి గొప్ప గా అభినయిస్తాడు .మళ్ళీ సిగను విప్ప టానికి చేయి సిద్ధం గా ఉంది .మళ్ళీ ప్రతిజ్న చేయ టానికి సై .నందుల నాశనం తో చలారిన కోపాగ్నిని ,నీకు చావు మూడి ,నీ వినాశనానికి మళ్ళీ రగిలిస్తున్నావు .జాగ్రత్త .అని అందరి ముందు ,క్రోధ రూక్షిత నేత్రాల తో భయంకరం గా గర్జిస్తాడు .తాను లయ కాల రుద్రుడిని అయానని ,.ఆ తాండవానికి భూమి కంపిస్తోందని అన్నాడు .పాపం భయ పది పోయాడు శిష్య ప్రభువు చంద్ర గుప్తుడు .ఆ! అదేమీ లేదు .ఇద్దరు కూడ బలుక్కొని కుదుర్చుకొన్న ఒడంబడికే ఇది .అందుకే చంద్రుడు అను కొంటాడు చాణక్య గురువు ఆజ్న వల్లనే ,ఆయన మీద గౌరవం లేకుండా ప్రవర్తించి నట్లు నటించాల్సి వచ్చిందని .అయినా సిగ్గు పడు తున్నాడట .ఎక్కడైనా దాక్కొని ముఖం చాటేయాలి అని పిస్తోందట .యెంత నటన ?నటనా సార్వభౌముడు ఒకరైతే, అద్భుత నటనా మాత్యుడు ఇంకొరు ..రెండు రెండే .యెంత గొప్ప వ్యూహమో ఆ తర్వాత కాని మనకు తెలీదు .అవతలి వాళ్ల పునాదుల్ని కది లించే ఎత్తు గడ .మానవ మనస్థితికి అద్దం పట్టే సంఘటన .ఇద్దరు మహా నటుల హావ భావ చేష్టా వ్యాపారం .అంత రంగ మధనం .హాశ్యానికైనా మర్యాదకు లోపం రాకూడదు .గురు విరోధం కూడదు అన్న సత్య వేదం ,గౌరవ భంగం జరగ రాదనీ లోకానికి హెచ్చరిక .
చింత -వంత
చాణక్యుడు రాక్షస మంత్రి గుండెల్లో నిద్ర పోతున్నాడు .రాక్షసునికి కంటి మీద కునుకు లేదు .యెంత ప్రయత్నించినా కౌటిల్యుని ఎట్టు గడ తెలుసు కో లేక పోతున్నాడు .ప్రయత్నాలన్నీ చిత్తూ అయి పోయాయి .చింత -చింత కర్ర లా దహించి వేసి నిద్ర రానీయటం లేదని బాధ పడుతున్నాడు .మలయ కేతుడూ భంగ పడ్డాడు .తన తల్లి కున్న రత్నాల గాజులు కూడాపగిలి పోయాయి .పట్టు పైటలు చెది రాయి .జాలి అరుపులు రేగాయి .జుట్టు ధూళి ధూసరిత మైంది .తండ్రి చని పోవటం కౌటిల్యమే .ఆ ప్రతీ కారాన్ని తీర్చు కొని ,తండ్రి పర్వత రాజుకు ఆత్మ శాంతి చే కూర్చాలి అను కొన్నాడు మలయ కేతుడు .ఇక్కడ తల్లి శోకం . అక్కడ తండ్రి మృత్యువు కు చలించిన కుమారుడి శోక తప్తత ,గుండె గాయం కని పిస్తుంది .ఒదార్చా లన్న తపన తో భీకర ప్రతిజ్ఞా విన్పిస్తుంది .మానవ హృదయం ప్రతీ కారం తోనే శాంతిస్తుంది అనే లోక సహజ గుణం మలయ కేతు మాటల్లో ప్రతిధ్వ నిస్తుంది .చాణక్య లౌక్యానికి విల విల లాది పోతున్నాడు .తట్టు కోలేక గింగిర్లు తిరుగు తున్నాడు .ఎటు చేరాలో తెలీని సందిగ్ధ స్థితిలో అతలా కుతలమై పోతున్నాడు .
ఈ సందర్భం గానే మలయ కేతువు తన మనసు లోని ద్వైవీ భావాన్ని ,సందేహ స్థితిని చక్కగా విశ్లేషించి వివ రిస్తాడు .తనకు నంద వంశం మీద మొదటి నుంచి గౌరవం వుంది .తండ్రి పర్వత రాజు ,ఆ వంశానికి చేదోడు వాదోడు గా మసిలిన వాడే .అయితే -చాణక్యుని తో దెబ్బ తిన్న చంద్రుని చేరాలా ?వాళ్ళిద్దరి మధ్యా స్నేహం భక్తీ చాలా గొప్పవి .చంద్రుడు ప్రతిజ్న తప్పే వాడు కాదు .తనకు ఆశ్రయం ఇచ్చి ,ఆద రిస్తాడు .ఎటు ఉండాలో ఏమి చేయాలో తేల్చు కో లేక అతని మనసు కుమ్మరి సారే ఎక్కి నట్లుగా చాలా సేపు అటు ,ఇటూ ,తిరుగు తోందట .విపత్కర పరిస్థితి వస్తే ,మాన వ హృదయం పొందే ,ఆరాట పోరాటాలకు ఈ సన్ని వేశం చక్కని ఉదాహరణం .బలహీన మైన క్షణం లోను ,క్షణిక ఉద్రేకం లో ను తీసుకొనే నిర్ణయాలు ప్రమాద ఘంటికలను మోగిస్తాయి .అలానే వుంది -మలయ కేతు పరిస్థితి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -02 -12 .
చాణక్యుడు మహా పండితుడు,రాజా నీతిజ్ఞుడే .కాని ,నివాసం వుండే ఆ ఇంటిని చూస్తే కడుపు చెరువు అవుతుంది .అదో పూరి గుడిసె .పిడకలు చేసే వారు లేక ఆవు పేడ ఉండలు ఉండలుగా అలానే వుండి పోయింది .వాటిని పగుల కొట్టి ,యజ్న విధులు నిర్వ హించ టానికి ,రాతి ముక్కలున్నాయి .శిష్యులు తెచ్చిన దర్భ మోపు అక్కడే అలానే ఉప్పురుసినాయి .చూరు కుంగి ఉంది . దాని పై సమిధలు ఆర పెట్టి వుండటం తో భారం మోపైంది .ఇదంతా చూస్తుంటే భవిష్యత్ మహా మంత్రి యెంత నిర్భాగ్యుడో ,యెంత సామాన్య జీవితం గడుపు తున్నాడో తెలుస్తుంది .కన్ను చెమరుస్తుంది .
ఆ పడ చిత్రం మనసు లో నిలిచి పోతుంది .అయితె ,చాణక్య ప్రతిజ్న ,అతని ,లోకజ్ఞత ,,కార్య సాధన అప్రతి హతం .ఈ సందర్భం లో నే కంచుకి ప్రవేశించి ,ఆ మహా మహుని వ్యక్తిత్వాన్ని అంచనా వేసి చూపుతున్నాడు .పేరాస వల్ల మాట మీద నిల బడే వారు సత్య భాశానులు కోడా ,పేదరికం వల మాట కారులై ,రాజును ,నోటికి వచ్చి నట్లు పొగిడి ,పబ్బం గడుపు కుంటారు .కాని చాణక్యుని వంటి ,కోరికలు లేని వారికి ,రాజు -గడ్డి పరక తో సమానం .అని ఆయన ఔన్నత్యాన్ని ప్రశంశించి ,మహోన్నత ఆదర్శ మూర్తి గా మన ముందు నిల బెడ తాడు .ఆత్మ విశ్వాసం ,వ్యక్తిత్వమే మనిషికి బలం ,ధైర్యం ,సాహసం అని పిస్తాడు .గుణ శ్రేష్టత