ప్రాచీన కాశీ నగరం –1
గంగా నది ఒడ్డున నివశించిన ”కాస్య ,కాస ,ఖాసా ”అని పిలువ బడే ”కాశీ ”లని పిలువ బడే వారు నగరం కాశి .ఋగ్వేదం లో ”శున హోత్రుని ”మనుమడు ”కాశి ”అనే వాణి చేత నిర్మించ బడిన నగరం కనుక కాశీ అనే పేరు వచ్చి నట్లు వుంది .”హావెల్ ”పండితుడు క్రీ.పూ.1400 -1000 ప్రాంతం లో కాశీలు ఇక్కడే వుండే వారని రాశాడు .ఎన్ సైక్లో పీడియా లో దీన్ని ”బెనారస్ ”అన్నారు .
హిందూ రాజ్యం ఇది .క్రీ.పూ.1200 లో కాశీ రాజు నగరాన్ని నిర్మించాడు .ఆ తర్వాత ”కనోజ్ ”లో భాగమై పోయింది .ధిల్లీ రాజ్య పథనం తర్వాత ”ఔద్ నవాబు ”సఫ్దర్ జంగ్ దీన్ని ఆక్ర మించాడు .అతడి మనుమడు ,దీన్ని ఈస్ట్ ఇండియా కంపెని కి 1775 ఒప్పందం ప్రకారం స్వాధీనం చేశాడు .రాష్ట్ర ,దీర్ఘ తపస ,ధన్య ,ధన్వంతరి మొద లైన వారంతా కాశీయులే .వెద వ్యాస మహర్షి కాశి లోనే వెద విభజన చేసి నట్లుంది .కాశీ రాజు అజాత శత్రువు కాలమ్ లో , విదేహ రాజు జనకుడు ,గొప్ప విద్వాంసులను పోషించారు ”.జనకుడే మా పోషకుడు ”అని అజాత శత్రువు చెప్పాడు .ఇతడు ”బాలాకీ ”అనే రుషి ని ఓడించి అతనికి తత్వ శాస్త్రం బోధించి నట్లు ఉపనిషత్తుల్లో వుంది .కర్మ జ్ఞాన ,కాండలకు సంబంధించిన వేద పండితులకు ,ఉపనిషత్తు లకు కాశీ నగరం పేరు పొందింది .వేదావిర్భావ మైన దివ్య నగరం కాశీ .ఇక్కడే మత ,తత్వ శాస్త్ర చర్చలు బాగా జరిగేవని బౌద్ధ గ్రంధాలలో వుంది .
పుణ్య క్షేత్రం
హిందువుల పుణ్య క్షేత్రాలలో కాశి మొదటిది .ఇక్కడున్న 2000 పైగా వున్న దేవాలయాలలో శివాలయాలే ఎక్కువ .

వరుణ ,అసి అనే నదుల సంగమ స్థానం కనుక వార ణాసి అయింది .బుద్ధ జాతక కధల్లో దీన్ని ”పుష్పా వతి ”అని పిలిచే వారు .బ్రహ్మ పట్టణం అనే పేరు కూడా వుంది .కాశీ ని బాబిలాన్ తోనూ ,రోం నగరం తోనూ పోలుస్తారు .రోం కంటే బాబిలాన్ ప్రాచీన మైనది .అతి పవిత్ర నగరం గా ,హిందువులు కాశీ ని భావిస్తారు .కాశి లో మరణిస్తే ముక్తి కల్గుతుందని నమ్ము తారు .8000 బ్రాహ్మణ గ్రుహాలుండే వని౮౦ సంస్కృత పాథ శాలలున్నాయని , ,

12000 ఇళ్ళు రాతి తో,16000 ఇళ్ళు మట్టి తో కట్ట బడి వున్నాయని డేనియల్ ,రసెల్ అనే చరిత్ర కారులు రాశారు .కాశీ విశ్వ నాధుడు కాశీ లో చని పోయిన వారి చెవి లో ”తారక మంత్రం ”ఉపదేశిస్తాడని నమ్మకం .మణి కర్ణికా ఘట్టం లో మరణం ముక్తి దాయకం .ఇక్కడే గంగా నది ఉత్తరం నుంచి దక్షిణానికి ఆరు కి.మీ.పొడవున అర్ధ చంద్ర కారం గా ప్రవ హిస్తూ ,అద్భుత దృశ్యం గా కని పిస్తుంది .ప్రపంచం లో ఏ నదికీ ఇలాంటి శోభ లేదు .గంగా స్నానం ,విశ్వ నాద దర్శనం తో జనం పులకరిస్తారు .అన్నపూర్ణ అమ్మ వారు అభయ ప్రదాయిని .,వ్యాసుడు ,బుద్ధుడు ఆది శంకరా చార్యులు ,తులసీ దాసు ,వల్లభా చార్యులు వంటి మహాను భావులు దర్శించిన పుణ్య నగరం .,
”ప్రభావాదద్భుతాథ్ భుమెహ్ సలి లస్య చ తేజసా -పరిగ్రహాన్మునీ నాంచ తీర్దానాం పుణ్యతా స్మృతా” అని కాశీ ఖండం లో వుంది .”ఈ భూమికి అద్భుత ప్రభావం వుంది .నీళ్ళకు తేజస్సు వుంది .అందుకే మహర్షులు ఇక్కడ నివశించి దీన్ని తీర్ధ స్థలాన్ని ,పుణ్య స్థలాన్ని చేశారు ”అని శ్లోకం అర్ధం . 
సర్వ మత నిలయం
అతి ప్రాచీన కాలమ్ నుంచి ,విద్వాంసులకు ,పండితులకు నిలయం .వేద శాస్త్రాలకు పుట్టి నిల్లు .పూర్వపు కాశి ,ఇప్పటి కాశీ కి కొంచెం ఉత్తరం గా వుంది .దివోదాసుడు దీన్ని నిర్మించాడు .ప్రస్తుత కాశి రైల్వే స్టేషన్ కు ఉత్త రాణ పాథ కాశి వుందని అందరు అంగీక రిస్తారు .కాశీ నగరం నీటి మట్టానికి 100 అడుగుల ఎత్తు లో వుంది .శంకరాచార్యులు అద్వైత మత ప్రచారాన్ని కాశీ నుంచే ప్రారంభించారు .హరిజనుడి తో వాదన జరిగిన స్థలం ఇదే .క్రీ.పూ.522 లో బుద్ధుడుమొదటి ధర్మ బోధ ను ఇక్కడి నుంచే ప్రారంభించాడు .కాశి దగ్గర వున్న సారనాద్ లో చాలా కాలమ్ వుంది ,చాతుర్మాస్య దీక్ష చేశాడు .బుద్ధుడు ఇక్కడే 500 మంది బౌద్ధ యతులకు ”ధర్మ చక్ర ప్రవర్తనం ” చెప్పాడు .అందుకే వార ణాసి బౌద్ధులకు కూడా పుణ్య క్షేత్రం అయింది
.ఇరవై ఏళ్ళ కు పైగా ,బుద్ధుడు సంయుక్త పర గణాలు ,సార నాద్ ,కాశీ ల లోనే వుంది ధర్మ ప్రచారం చేశాడు .అశోకుడు సార నాద్ లో స్థూపం నిర్మించి ,ధర్మ చక్రం ,నాలుగు సిమ్హాలున్న ప్రతిమ లను శిలా స్థంభం పై చెక్కించాడు .
ఇదే మన జాతీయ చిహ్నం అయింది .జాతీయ జండా లో చక్రం చోటు చేసు కొంది .
జైన మతస్తులకు కూడా క్స్షీ పుణ్య క్షేత్రమే .23 వ తీర్ధంకరుడు ”పార్శ్వ నాధుడు ”కాశీ లోనే క్రీ .పూ.817 లోజన్మించాడని చరిత్ర కారుడు ”జాకోబి ”చెప్పాడు .అతని తండ్రి అశ్వ సేనుడు కాశీ రాజు గా వుండే వాడు .జైనాలయాలు కాశీ లో బాగానే వున్నాయి .ముస్లిములు కూడా ఇక్కడ ఎక్కువే .వీరు కూడా గంగను ,కాశి విశ్వ నాదుడిని గౌర్వవిస్తారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -02 -12 .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


చాలా చాల చాల క్రుతజ్ఞులమండీ మీరు ఇలా అత్యున్నమైన విషయాలను మాకు తెలియపరుస్తూ విస్త్రుతమైన రీతిలో సేవ చేస్తున్నట్లుగా భావిస్తున్నాను, మీ కార్యక్రమం లో భాగస్తుదనవ్వాలనే భావన కలుగుతోంది
Many Many So many thanks
?!
LikeLike