ముద్రా రాక్షస నాటకం లో మానవతా ముద్ర –3
భయం -జయం
అక్కడ రాక్షస మంత్రీ మనసు లో మధన పడ్డాడు .ఆపదలు ఒక్క సారిగా అతన్ని చుట్టు ముట్టాయి .తేరు కో లేని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు చాణక్యుడు .అయిన వారంతా దూరమవుతున్నారు .ఆపద లో వున్న వాడికి భయం యొక్క విశ్వ రూపం ఎలా వుంటుందో రాక్షస మంత్రి చెబుతున్నాడు .
భయం తావత్ సేవ్యా దాభి నివి సహతే సేవక జనం –తతః ప్రత్యా సన్నా ద్భావతి హృదయే చైన నిహితం
తతోధ్యారూదానాం పడ మనుజ ద్వేష జననం -గథిహ్ సోచ్చ్రాయానాం పతన మనుకూలం కలయతి ”
భయం అనేది సేవకుడి నుండి మంత్రి దాకా పూను తుంది .రాజు తో పండితుని వల్ల భయం .బాగా ఎదిగిన వాడికి పది పోతానేమో నని భయం ..పదవి లో వుంటే ,దిచేస్తారని ,కాళ్ళు లాగేస్తారని భయం .తాను వేసే ఎత్తులు ఎలాంటి ఫలితాలిస్తాయో నని విప రీత భయం .భయానికి ఇంత నేపధ్యం చూపాడు విశాఖ దత్త కవి .తన్ను అన్ని రకాల ఆదరించి ,గౌరవించి ,మంత్రిత్వం ఇచ్చిన నందులకు ఏమీ చేయ లేక పోయానని నిర్వేదం చెందు తాడు .తాను చేసిన ప్రయత్నా శాతం లో ,వీసా మైనా ఫలితం లభించా లేదు అని కన్నీరు మున్నీరు గా రాక్షసుడు విల పించాడు .తనతో విధి ఆడు కొంటోందని ,వైరాగ్య బావం లో పడి పోయాడు .బాధ లన్ని ఒక్క సారి సూది గాలి లా చుట్టేసి నపుడు ,అయిన వారంతా ,విధి కి లొంగి చని పోయినపుడు ,ప్రతి మానవుడు పాడే వేదనను ,మహా మంత్రీ పొందాడు .దుఖం తో మనసు లోని మాలిన్యాన్ని కడి గేసుకొన్నాడు .ఏదీ పాలు పోని స్థితి లో వుడి ,అంతర్ముఖుడవ టానికి ఆయత్త మౌతున్నాడు .ఆలో చిస్తున్నాడు ,విచారిస్తున్నాడు ,వివేకం తో విషయం పరిశీలన చేస్తున్నాడు .తపో వనానికి వెళ్దాము అంటే ,మనసు పగ తో రగిలి పోతోంది .తపస్సు అసాధ్యం. శాంతి రాదు .నందులు చని పోయి నట్లు ,తానూ ఆ దారి న పొతే ? శత్రువు బ్రతికి ఉండ గా చావటం ఆడది చేసే పని లాగా వుంటుంది .పోనీ శత్రువు పై దాడి చేస్తే ?కుదరదు .తన హితుడు చందన దాసు ప్రాణా పాయం లో వున్నాడు .అతన్ని విడి పించ కుండా ఏమీ చేయ కూడదు .లేక పొతే కృతఘ్నుడు గా చరిత్ర లో మిగిలి పోతాడు .అని విచిత్స లో పడ్డాడు రాక్షసుడు .ఇవన్నీ మాన వీయ కోణాలే .మనిషికి ,మనిషికి మధ్యవి బంధాలే , ,అను బంధాలే. ఆ ఋణం ఎలాగో అలా ,తీర్చు కోవాలి . .స్నేహానికి విలువ తెలియ జేయాలి .
స్నేహం
మరి ఇక్కడే స్నేహం అంటే ఏమిటి ?మిత్రుని గొప్ప దనం ఎలా వుంటుందో ,కవి – సిద్దార్ధకుని తో చెప్పిస్తాడు .
”సంతాపే తారేశానాం గేహోత్సవే సుఖాయ మౌనానాం -హృదయ స్తితానాం ,విభవా ,విరహే ,మిత్రానాం దూన యంతి ”
మిత్రులు చంద్రు ని లా మనస్తాపం తీరుస్తారు .పండుగ లలో మన తో సుఖం పంచు కొంటారు .ఎప్పుడూ మనసు లో మేదుల్తుంటారు .ఇలాంటి స్నేహితుడే లేక పొతే ,సంపదలే దుఖాన్ని కల్గించేవి గా మారు తాయి .విధి బలీయం కా వటం తో
ప్రయత్నాలన్నీ ,విఫల మయాయి .ప్రయత్నించటం కూడా మర్చి ,చేష్ట లుడిగి పోయారు .అంతా తల లేని మొండాలు గా మిగిలి పోయారని ,రాక్షసుడు వాపోతాడు .లక్ష్మీ దేవి ,కూడా దొడ్డి దారి లో ,”బసివి ” లాగా మారి ,నందుని వది లేసి ,మౌర్యుని చేరింది .ఇప్పుడు ఇక్కడే స్థిరం గా వుంది .దేవుడు కూడా పగ బట్టి ,శత్రువు లా తన ప్రయత్నా లన్నీ నీరు కార్చేశాడు .దైవ బలం లేక పొతే ,సంకల్ప బలం యెంత వున్నా కార్య సాధనకు చాలదు అన్న లోక సత్యాన్ని ఇక్కడ వివ రించాడు . .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -02 -12 .

—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com